government sector
-
అందుబాటులోకి ఆధునిక వైద్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో గుండె జబ్బులకు అత్యాధునిక చికిత్సలు అందించేందుకు సీఎం జగన్ ప్రభుత్వం సదుపాయాలు కలి్పస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు, కాకినాడ జీజీహెచ్‌లలో క్యాథ్‌ల్యాబ్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఒక్కోచోట రూ.6 కోట్ల చొప్పున నిధులను వెచ్చిస్తోంది. కర్నూలు జీజీహెచ్‌లో ఇప్పటికే క్యాథ్ ల్యాబ్ యంత్రాలు అమర్చడం పూర్తయింది. ఈ వారంలోనే ట్రయల్ రన్‌ను ప్రారంభించబోతున్నారు. కాకినాడ జీజీహెచ్‌లో యంత్రాలు అమర్చే ప్రక్రియ రెండు వారాల్లో పూర్తి కానుంది. గుండె వైద్య సేవల విస్తరణ మారిన జీవన విధానాలు, ఆహార అలవాట్ల కారణంగా చిన్న వయసు వారు సైతం గుండె జబ్బుల బారినపడుతున్నారు. గుండెపోటు బాధితులకు అత్యంత వేగంగా చికిత్స అందించడం ద్వారా మరణాల నియంత్రణపై సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీనికోసం ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్ (ఈసీసీ) కార్యక్రమాన్ని కర్నూలు, గుంటూరు, తిరుపతి, విశాఖ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తోంది. మరోవైపు పాత 11 జీజీహెచ్‌లలో అన్నిచోట్ల కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ వాసు్కలర్ సర్జరీ (సీటీవీఎస్) సేవలు విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. 11 పాత వైద్య కళాశాలలు ఉండగా.. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, అనంతపురం, కర్నూలు కళాశాలలకు అనుబంధంగా పనిచేస్తున్న జీజీహెచ్‌లలో కార్డియాక్, సీటీవీఎస్ విభాగాలు సేవలందిస్తున్నాయి. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప జీజీహెచ్‌లలో కార్డియాలజీ, సీటీవీఎస్ విభాగాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఆయా విభాగాల ఏర్పాటు, సేవలు అందుబాటులోకి తేవడానికి వీలుగా 9 ఫ్రొఫెసర్, 9 అసోసియేట్, 7 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కలిపి.. పర్ఫ్యూజనిస్ట్, క్యాథల్యాబ్, ఈసీజీ టెక్నీషియన్ ఇలా 94 పోస్టులను ఇప్పటికే మంజూరు చేశారు. ఈ ఐదు చోట్ల క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటుకు ఇప్పటికే డీఎంఈ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సమస్య నిర్ధారణ.. చికిత్సలో కీలకం రక్తనాళాలు, హృదయ సంబంధిత సమస్యలను నిర్ధారించి.. చికిత్స నిర్వహించడంలో క్యాథ్ ల్యాబ్‌లదే ముఖ్య పాత్ర. గుండెపోటు సంబంధిత లక్షణాలున్న వారికి యాంజియోగ్రామ్ పరీక్షచేసి స్టెంట్ వేయడం, గుండె కొట్టుకోవడంలో సమస్యలున్న వారికి పేస్‌మేకర్ అమర్చడం క్యాథ్ ల్యాబ్ ద్వారానే చేపడతారు. ప్రభుత్వం హబ్ అండ్ స్పోక్ విధానంలో అమలు చేస్తున్న ఈసీసీ కార్యక్రమంలో క్యాథ్ ల్యాబ్ సౌకర్యం ఉన్న బోధనాస్పత్రులు హబ్‌లుగా వ్యవహరిస్తున్నాయి. వీటికి ఏపీవీవీపీ ఆస్పత్రులను అనుసంధానం చేసి గుండెపోటు లక్షణాలతో వచ్చే వారికి గోల్డెన్ అవర్‌లో చికిత్సలు అందిస్తున్నారు. పూర్తిస్థాయిలో కార్డియాక్ కేర్ క్యాథ్ ల్యాబ్ ఏర్పాటుతో పూర్తిస్థాయి ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్ ఆస్పత్రిగా కర్నూలు జీజీహెచ్ రూపాంతరం చెందింది. గుండెకు సంబంధించిన అన్నిరకాల వైద్య సేవలు ఇక్కడ అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. రాయలసీమ వాసులకు వైద్యపరంగా పెద్దన్నగా వ్యవహరిస్తున్న ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో క్యాథ్‌ల్యాబ్ కూడా అందుబాటులోకి రావడం శుభపరిణామం. ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుంది. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, సీటీవీఎస్ విభాగాధిపతి, కర్నూలు జీజీహెచ్ -
రామోజీ ‘కడుపు మంట కథ’
సాక్షి, అమరావతి: చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రంలో వైద్య రంగాన్ని, వైద్య విద్యని బలోపేతం చేస్తూ అటు విద్యార్థులకు, ఇటు ప్రజలకు మేలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రామోజీరావు మరో ఏడుపుగొట్టు కథనాన్ని ప్రచురించారు. రాష్ట్రంలో కొత్తగా 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తూ మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంచుతూ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. ఇది భరించలేని రామోజీరావు వైద్య కళాశాలల ఏర్పాటుపై గోబెల్స్ ప్రచారానికి తెరలేపారు. గత నెల 20న పలు వక్రీకరణలు, అవాస్తవాలతో ఈనాడులో కథనం ప్రచురించారు. నెల తిరక్కుండానే మరోసారి ‘వైద్య విద్యనూ అమ్మేశారు!’ అంటూ బుధవారం కథనం రాసుకొచ్చారు. ప్రభుత్వ రంగంలో వైద్యవిద్యను బలోపేతం చేయడంపై రామోజీరావు కడపుమంటను బయటపెట్టుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ప్రైవేటు వైద్య కళాశాలలను ప్రోత్సహించి వైద్య విద్యను అమ్మేసి తన వాళ్ల జేబులు నింపుతున్నప్పుడు రామోజీరావు నిస్సిగ్గుగా ఎందుకు ఊరకుండిపోయారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పేద విద్యార్థులకు తీరని నష్టం చేసింది మీ బాబే 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో (ఉమ్మడి, ప్రత్యేక రాష్ట్రంలో) ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు 12 (11+1 పద్మావతి వైద్య కళాశాల) మాత్రమే ఉన్నాయి. 2014–19 మధ్య ఐదేళ్లలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికీ, ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా నెలకొల్పలేదు. పైగా, తన అనుంగులతో ప్రైవేటు వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రతిభ ఉన్నప్పటికీ అందుబాటులో తగినన్ని సీట్లు లేక బడుగుబలహీన వర్గాల విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యారు. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నష్టం చేయడం కాదా రామోజీ? చంద్రబాబు చేసిన నష్టంపై ఏ రోజైనా చిన్న వార్త అయినా రాశారా? వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వ రంగంలోనే 17 కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సీట్లు పెరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకూ మేలు జరుగుతోంది. 2019 వరకు 12 ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు 2,360 మాత్రమే. కొత్తగా 17 కళాశాలల ఏర్పాటుతో మరో 2,550 సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరంలోనే విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలు ప్రారంభమవుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం మరో ఐదు, 2025–26లో మిగిలిన ఏడు అందుబాటులోకి వస్తాయి. దీంతో ప్రభుత్వ రంగంలో 29 మెడికల్ కాలేజీలు ఉంటాయి. వీటిలో ఎంబీబీఎస్ సీట్లు ఏకంగా 4,,910కి పెరుగుతాయి. ఇది విద్యార్థులకు మంచి చేసినట్టే కదా? ఇంత దుర్మార్గపు రాతలా? ఈ విద్యా సంవత్సరం ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కొత్తగా ప్రారంభమవుతున్నాయి. వీటి ద్వారా ఏకంగా 319 కన్వీనర్ కోటా సీట్లు సమకూరాయి. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకూ సీట్లు పెరుగుతాయి. కొత్త కళాశాలల్లో ఆల్ ఇండియా కోటా పోను మిగిలిన సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా కింద ప్రభుత్వం భర్తీ చేసింది. 35 శాతం సెల్ఫ్ ఫైనాన్స్, 15 శాతం ఎన్నారై కోటాకు కేటాయించారు. ఐదు కాలేజీల్లో 750 సీట్లు ఉండగా 113 సీట్లు ఆల్ ఇండియా కోటాకు వెళ్తాయి. మిగిలిన 637 సీట్లలో 319 సీట్లు కన్వీనర్ కోటాకే ఇచ్చారు. దీంతో పాత 12 కళాశాలల్లోని 2,360 కన్వీనర్ కోటా సీట్లకు 319 అదనంగా చేరాయి. ప్రభుత్వ రంగంలోని పాత వైద్య కళాశాలలు, కొత్తగా వచ్చిన ఐదు కళాశాలల్లో, ప్రైవేట్‌లోని కన్వీనర్ కోటా సీట్లలో 2022–23, 2023–24 ప్రవేశాలను పరిశీలిస్తే విద్యార్థులకు ఎటువంటి నష్టం లేదని అర్థం అవుతుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాల కల్పన కోసమే కొత్తగా ఏర్పాటు చేస్తున్న కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్నారై కోటా కింద వచ్చే డబ్బేమీ నారాయణ, ఇతర వైద్య విద్యతో వ్యాపారాలు చేసే ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్లదు. వాటితో సంబంధిత మెడికల్ కాలేజీలో సౌకర్యాలు, నిర్వహణను మెరుగు పరుస్తూ సమర్థంగా నిర్వహిస్తారు. మన విద్యార్థులకు మంచి వాతావరణం, సదుపాయాలు కలిగిన అత్యున్నత స్థాయి వైద్య కళాశాలలు అందుబాటులోకి వస్తాయి. తద్వారా ఉత్తమ బోధన, ఉన్నత ప్రమాణాలతో పోటీ ప్రపంచంలో మనగలుగుతాయి. అక్కడకు వచ్చే పేద రోగులపై ఎలాంటి భారమూ ఉండదు. అంతిమంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఒక్కటీ తగ్గకపోగా అదనంగా మరిన్ని అందుబాటులోకి వస్తాయి. వ్యవస్థలు సజావుగా నడిచేందుకు పారదర్శక విధానాన్ని తెస్తుంటే రామోజీకి నచ్చదు. ఆయన జేబులో మనిషి చంద్రబాబులా అన్నీ అనుంగులకు కట్టబెట్టడమే కావాల్సింది. సీఎం వైఎస్ జగన్ ప్రజలకు మేలు చేయడమే రామోజీ కడుపు మంటకు కారణం. ప్రభుత్వ వైద్యం బలోపేతం ఇలా ♦ నాలుగేళ్లలో 53 వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి సీఎం జగన్ ఆదేశాలు. పోస్టుల భర్తీ కోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు. ♦ గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు. 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే వైద్య సేవలు. ♦ దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు. ఇప్పటివరకూ 1.70 కోట్ల మందికి సొంత ఊళ్లలోనే వైద్యం. ♦ వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి 3,257కి పెంపు. రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి. 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం. ♦ 108, 104 సేవలు బలోపేతం. కొత్తగా 768 అంబులెన్స్‌లు. ♦ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా అందించేలా ప్రభుత్వం చర్యలు. -
చార్జింగ్ స్టేషన్లకు రూ.800 కోట్లు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఫాస్ట్ చార్జింగ్ ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వ రంగంలోని మూడు చమురు కంపెనీలకు రూ.800 కోట్లు మంజూరు చేసినట్టు భారీ పరిశ్రమల శాఖ వెల్లడించింది. ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేజ్–2 కింద ఈ మొత్తాన్ని సమకూరుస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీలు దేశవ్యాప్తంగా ఫిల్లింగ్ సెంటర్లలో 7,432 చార్జింగ్ కేంద్రాలను 2024 మార్చి నాటికి ఏర్పాటు చేస్తాయి. ఈ స్టేషన్స్‌లో ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్లు, తేలికపాటి వాణిజ్య వాహనాలు, చిన్న బస్‌లకు చార్జింగ్ సౌకర్యాలు ఉంటాయి. ఈ మూడు కంపెనీలకు తొలి విడతగా రూ.560 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,586 చార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. కొత్తగా జోడించనున్న కేంద్రాలతో ఎలక్ట్రిక్ వాహన రంగానికి మంచి బూస్ట్‌నిస్తుందని భారీ పరిశ్రమల శాఖ తెలిపింది. -
గృహ నిర్మాణ సంస్థలో పదోన్నతులకు రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ సంస్థలో పలువురికి పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జిల్లాల వారీగా సీనియారిటీ జాబితా ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులకు చేరింది. జాబితా సిద్ధం చేసినప్పటికీ గతంలో ఏదేని ఆరోపణలతో సస్పెండ్ అయ్యారా, ఏమైనా మెమోలు అందుకున్నారా, విధి నిర్వహణలో ప్రవర్తన వంటి అంశాలపై జిల్లాల వారీగా పూర్తి వివరాలను సేకరించారు. 13 జిల్లాల్లో 212 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించిన సీనియార్టీ జాబితా తయారు చేసి అర్హులైన వారికి పదోన్నతులు కల్పించనున్నారు. ఈ విషయమై వారంలోగా ఉన్నతాధికారులు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వివిధ ఆరోపణల కారణంగా ఉద్యోగాల నుంచి తొలగించిన ముగ్గురు అసిస్టెంట్ ఇంజనీర్లను తిరిగి చేర్చుకున్నారు. వీరికి సంబంధించిన వివరాలను కూడా జాబితాలో ప్రత్యేకంగా పొందుపరచారు. గృహ నిర్మాణ సంస్థలో ఖాళీ పోస్టులను గుర్తించి ఏఈలను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగాను, అసిస్టెంట్ మేనేజర్లకు మేనేజర్లుగా పదోన్నతులు లభించనున్నాయి. గత ప్రభుత్వం కొంతమందిని ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకుని సంస్థ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించకుండా కాలయాపన చేస్తూ వచ్చింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక సీనియార్టీ జాబితాను పంపాలని జిల్లా ప్రాజెక్టు మేనేజర్లకు ఆదేశాలు వెళ్ళాయి. ఆ మేరకు జిల్లాల వారీగా పూర్తి వివరాలు అందడంతో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మూసివేతకు కుట్ర
– బీఎస్ఎన్ఎల్ ఈయూ జిల్లా కార్యదర్శి డి.వెంకట్రామిరెడ్డి కర్నూలు (ఓల్డ్‌సిటీ): కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మూసివేతకు కుట్ర జరుగుతుందని బీఎస్ఎన్ఎల్ ఈయూ జిల్లా కార్యదర్శి డి.వెంకట్రామిరెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.యాకోబ్ ఆరోపించారు. సోమవారం స్థానిక పాతబస్టాండు సమీపంలోని సీటీవో కార్యాలయంలో యూనియన్ ప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2016–17 బడ్జెట్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ. 56,500 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణను ప్రతిపాదించిందన్నారు. నీతి అయోగ్ 74 సీపీఎస్ఈలను మొత్తంగా విక్రయించడానికి సమగ్ర ప్రతిపాదనను ప్రధానమంత్రికి ఇచ్చిందన్నారు. రక్షణ, బొగ్గు, చమురు, గనులు, విద్యుత్, టెలికాం, ఏవియేషన్ నిర్మాణం, ఇన్సూరెన్స్, పెన్షన్, బ్యాంకింగ్, రైల్వే, మల్టీబ్రాండ్ రిటైల్, ఫార్మా వంటి రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రభుత్వం పెంచిందని తెలిపారు. కీలకమైన రక్షణ, మందుల తయారీ రంగాల్లో వంద శాతం ఎఫ్‌డీఐల అనుమతులు దేశ ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. ప్రభుత్వం పెట్టుబడులను 51 శాతం కంటే తక్కువకు తగ్గించుకోవడం ప్రమాదకరమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, అధికారులు, కార్మికులు సంఘటితమై కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో బీఎస్ఎన్ఎల్ ఈయూ సహాయ కార్యదర్శి రామరాజు, ఓబీ రామకష్ణుడు, ఏఐబీడీపీఏ కోశాధికారి ఎం.రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
క్లరికల్ కొలువుదీరే మార్గాలు
ప్రభుత్వ రంగంలోని అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి భారీగా కొలువుల భర్తీకి నగారా మోగింది.. ఐదు అనుబంధ బ్యాంకుల్లో క్లరికల్ కేడర్‌లో మొత్తం 6425 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదలైంది.. బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌కు తొలి మెట్టు అయిన క్లరికల్ ఉద్యోగాలను చేజిక్కించుకోవాలంటే మెరుగైన మార్కులను ఏవిధంగా సాధించాలి.. ఎటువంటి వ్యూహాలను అనుసరించాలో తెలుసుకుందాం.. జి. రమణ, డైరెక్టర్, సాయి మేధ విద్యా సంస్థలు, హైదరాబాద్ ఖాళీల వివరాలు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ 725 స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా 1200 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ 1300 స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ 1000 స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 2200 మెత్తం 6425 ఆంధ్రప్రదేశ్: 282 పోస్టులు (ఎస్బీహెచ్-240 పోస్టులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్-30, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్-12 పోస్టులు) తెలంగాణ: 1012 పోస్టులు (ఎస్బీహెచ్-1000 పోస్టులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్-12 పోస్టులు) ఎంపిక విధానం: రెండు దశలుగా ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశలో ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నిర్దేశించిన అర్హత సాధించిన అభ్యర్థులు రెండో దశ ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఈ రెండు దశల్లో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాన్ని ఖరారు చేస్తారు. రాత పరీక్ష ఇలా: ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే రాత పరీక్షలో ఐదు విభాగాలు ఉంటాయి. వీటికి రెండు గంటల 15 నిమిషాల్లో (135 నిమిషాలు) సమాధానాలను గుర్తించాలి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పుకు 1/4 మార్కు కోత విధిస్తారు. పరీక్ష వివరాలు.. విభాగం మార్కులు జనరల్ అవేర్నెస్ 40 జనరల్ ఇంగ్లిష్ 40 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 రీజనింగ్ ఎబిలిటీ 40 మార్కెటింగ్ ఆప్టిట్యూడ్/ కంప్యూటర్ నాలెడ్జ్ 40 మొత్తం 200 సిద్ధమవ్వండిలా... జనరల్ అవేర్నెస్: ఈ విభాగంలో స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. స్టాండర్డ్ జీకేకు సంబంధించి వివిధ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షుల పేర్లు; కరెన్సీలు; రాజధానులు వంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి. నోబెల్, ఆస్కార్లతోపాటు వివిధ అవార్డుల విజేతల గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు మారుతున్న అంతర్జాతీయ సంస్థల ఉన్నతాధికారుల వివరాలు, క్రీడల విజేతలు, విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన ప్రముఖులు, ముఖ్యమైన సంఘటనలను రోజూ పత్రికల ద్వారా తెలుసుకొని ఓ పుస్తకంలో నోట్ చేసుకోవాలి. అదే సమయంలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఆర్బీఐ గవర్నర్లు, ప్రైవేట్ బ్యాంకులకు లెసైన్స్‌లు, బ్యాంక్ రేట్లు, వివిధ బ్యాంకుల ముఖ్య అధికారులు సంబంధిత అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడం ప్రయోజనకరం. ముఖ్యంగా గత 6-8 నెలల కాలంలో చోటుచేసుకున్న సంఘటనలపై ప్రధానంగా దృష్టి సారించాలి. చదవడం కంటే గ్రూప్ డిస్కషన్ వంటి పద్ధతుల ద్వారా ఈ విభాగాన్ని మెరుగ్గా ప్రిపేర్ కావచ్చు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: పరీక్షలో ఈ విభాగం కీలకపాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. ఇందులో న్యూమరికల్ ఎబిలిటీ, అర్థమెటికల్ ఎబిలిటీ, డేటా అనాలసిస్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. న్యూమరికల్ ఎబిలిటీలో మంచి స్కోర్ సాధించాలంటే కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ వంటి ప్రక్రియల్లో పట్టు సాధించాలి. ఈ అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు రావ చ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అర్థమెటిక్ ఎబిలిటీలో దూరం, నిష్పత్తి, సరాసరి, వయసు వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇటువంటి ప్రశ్నలను త్వరగా సులువుగా సాధించాలంటే షార్ట్‌కట్ మెథడ్స్ నేర్చుకోవాలి. తద్వారా స్వల్ప కాలంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇవ్వొచ్చు. డేటా అనాలిసిస్లో బార్స్, వెన్‌డయాగ్రమ్స్, చార్ట్స్, టేబుల్స్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. వీటికోసం సూక్ష్మీకరణ, నిష్పత్తులు, శాతాలు, సరాసరి, అనుపాతం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. రీజనింగ్ ఎబిలిటీ: ఈ విభాగంలో అభ్యర్థులు కొంత అప్రమత్తతతో ఉండాలి. ఎందుకంటే ఇందులోని ప్రశ్నలు ఒక్కోసారి గందరగోళానికి గురి చేయవచ్చు. కాబట్టి సమాధానం ఇచ్చే ముందు ప్రశ్నను పూర్తిగా చదవడం మంచిది. ఈ విభాగం తార్కిక సామర్థ్యాన్ని, సమస్యను పరిష్కరించే నైపుణ్యాన్ని పరీక్షిస్తుంది. మిగిలిన విభాగాలతో పోలిస్తే రీజనింగ్ లో సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అయితే చిట్కాల ద్వారా సాధన చేస్తే త్వరగా సమాధానాలు గుర్తించవచ్చు. రీజనింగ్‌లో సిరీస్; అనాలజీ; క్లాసిఫికేషన్; కోడింగ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; రక్త సంబంధాలు; సీటింగ్ అరేంజ్మెంట్స్; ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, పజిల్స్ తదితర అంశాలుంటాయి. ఇందులో మెరుగైన స్కోర్‌ను సాధించాలంటే పజిల్స్, అనాలజీస్ను ఇన్పుట్- అవుట్‌పుట్, కోడింగ్-డికోడింగ్, లాజికల్ రీజనింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, డేటా సఫిషియన్సీ, డెరైక్షన్స్ తదితర అంశాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. జనరల్ ఇంగ్లిష్: ఇందులో కాంప్రెహెన్షన్, వొకాబ్యులరీ, గ్రామర్, క్లోజ్ టెస్ట్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులోని ప్రశ్నల క్లిష్టత ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉంటుంది. కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్‌లో దాదాపు 20 మార్కులు సాధించి ముందుగా కటాఫ్ నుంచి పైకి వెళ్లొచ్చు. దీనికోసం ఇంగ్లిష్ గ్రామర్, రూట్‌వర్డ్స్‌ను బాగా సాధన చేయాలి. మిగిలిన అంశాల్లో జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటివి ఉంటాయి. వీటితో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అందువల్ల అభ్యర్థులు ఈ అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాల సహాయంతో వొకాబ్యులరీని మెరుగుపరుచుకోవాలి. రోజుకు 10-15 వరకు యాంటోనిమ్స్, సినానిమ్స్ నేర్చుకోవాలి. ఈ విభాగంలో గ్రామర్ అంశం నుంచి 1/3 వంతు ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ప్రాథమిక గ్రామర్ అంశాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్; యాక్టివ్, పాసివ్ వాయిస్; డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్ తదితర అంశాలను సాధన చేయాలి. తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులు ఇంగ్లిష్‌పై పట్టుసాధించడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. ఈ విభాగంలో 25 మార్కులకు తగ్గకుండా స్కోర్ చేసే విధంగా సిద్ధం కావాలి. కంప్యూటర్ నాలెడ్జ్: ఇందులో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, కంప్యూటర్ ఉపయోగాలు, ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, పీసీ అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, కంప్యూటర్ నెట్వర్క్ తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఆయా అంశాలపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఇస్తారు. ఈ పేపర్లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశముంటుంది. అభ్యర్థులు తొలుత కంప్యూటర్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆ తర్వాత నమూనా ప్రశ్నలపై దృష్టిసారించాలి. మార్కెటింగ్ ఆప్టిట్యూడ్: ఈ విభాగం అధిక శాతం అభ్యర్థులకు కొత్తగా ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్లో తగినంత ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా డివిజన్ ఆఫ్ మార్కెటింగ్, సెల్లింగ్, మార్కెటింగ్, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్, కస్టమర్ వాల్యూ, స్టాఫ్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్, బ్రాండింగ్- కోబ్రాండింగ్, ట్యాగ్‌లైన్స్, క్వాలిటీ మేనేజ్మెంట్ సీఎంఆర్ కాన్సెప్ట్, 7పీస్ ఆఫ్ మార్కెటింగ్ ((7 P's of Marketing)తదితరాలను క్షుణ్నంగా అవగాహన చేసుకోవాలి. వేతనం-విధులు: క్లరికల్ ఉద్యోగులు ఫ్రంట్ ఆఫీస్ విధులు నిర్వహిస్తారు. బ్యాంకుల్లో ప్రతి పనీ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ ద్వారా జరుగుతుంది. అదే విధంగా మేకర్- చెకర్ విధానాన్ని పాటిస్తారు. క్లరికల్ స్థాయి ఉద్యోగులు మేకర్ పని చేస్తారు. వేతనం పనిచేస్తున్న ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది. ప్రస్తతం క్లరికల్ కేడర్ బేసిక్ పే రూ. 7,200. దీనికి డీఏ, హెచ్ఆర్ఏ, సిటీ అలవెన్స్ అదనం. అంటే ఏ ప్రాంతంలో ఉద్యోగంలో చేరినా నెలకు రూ. 20,000 వరకు వేతనం లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు ఆరు నెలలపాటు ప్రొబేషన్ పీరియడ్‌లో ఉంటారు. తర్వాత శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారు. నోటిఫికేషన్ సమాచారం: అర్హత: ఏదైనా డిగ్రీ/తత్సమానం (డిసెంబర్ 1, 2014 నాటికి) వయసు: 20-28 ఏళ్లు (డిసెంబర్ 1, 2014 నాటికి). ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: డిసెంబర్ 9, 2014 ఫీజు: రూ. 600 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రూ. 100) ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: డిసెంబర్ 9, 2014 ఆఫ్లెన్లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: డిసెంబర్ 11, 2014 రాత పరీక్ష: జనవరి/ఫిబ్రవరి, 2015 (స్పష్టమైన తేదీలు ప్రకటించలేదు). రాత పరీక్ష కేంద్రాలు: తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఆంధ్రప్రదేశ్: చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. వెబ్సైట్: www.sbi.co.in సూచనలు ఐబీపీఎస్ గత పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అంశాలను ప్రతి రోజూ ప్రిపేర్ కావాలి. అంతేకాకుండా వీటిని సమయ పరిమితి విధించుకుని సాధన చేయాలి. స్వల్ప కాలంలో ఎక్కువ ప్రశ్నలకు కచ్చితత్వంతో సమాధానం గుర్తించగలగాలి. సమస్య చూడగానే నోటితో చెప్పగలిగే స్థాయిలో ప్రిపరేషన్ సాగించాలి. పరీక్ష ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్లో మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం ప్రయోజనకరం. కటాఫ్ తప్పనిసరి మరో కీలకాంశం.. కటాఫ్ మార్కులు. ప్రతి విభాగంలోనూ బ్యాంకు నిర్దేశించిన కటాఫ్ మార్కులను సాధించాలి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు, ఆయా విభాగాల్లో సాధించిన మార్కులాధారంగా.. కటాఫ్ మార్కులను నిర్ణయిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఖాళీలు, అభ్యర్థులు చూపిన ప్రతిభ.. ఈ రెండు అంశాలతో కటాఫ్ మార్కులతో ముడిపడి ఉంటాయి. ఈ క్రమంలో పోస్టులు ఎక్కువగా ఉంటే కటాఫ్ మార్కులు తక్కువగా ఉండొచ్చు. పోస్టులు తక్కువగా ఉంటే కటాఫ్ మార్కులు పెరగొచ్చు. అంతేకాకుండా ప్రశ్నపత్రం సులువుగా ఉంటే కటాఫ్ మార్కులు పెరుగుతాయి. కఠినంగా ఉంటే కటాఫ్ మార్కులు తగ్గుతాయి. కాబట్టి ప్రిపరేషన్ సమయంలో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. అన్ని విభాగాలకు సమప్రాధాన్యతనివ్వాలి. ప్రతి విభాగంలోనూ 50 శాతం మార్కులు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. ఇంటర్వ్యూ ప్రతి కేటగిరీ నుంచి ఖాళీల ఆధారంగా మూడు రెట్ల సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో కూడా బ్యాంకు నిర్ణయించిన కనీస అర్హత మార్కులను సాధించాలి. ఈ మార్కుల విషయంలో రిజర్వ్డ్ అభ్యర్థులకు 5 శాతం సడలింపునిస్తారు. అంతేకాకుండా స్థానిక భాషలో ఉన్న ప్రావీణ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. దీనికి 10 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూ సాధారణంగా 10-25 నిమిషాలు ఉంటుంది. ఇందులో ప్రధానంగా రెజ్యూమె ఆధారంగా అభ్యర్థి వ్యక్తిగత విషయాలపై ఎక్కువగా ప్రశ్నలు వేస్తారు. అంటే కుటుంబ నేపథ్యం, స్వస్థలం, చదువు, అభిరుచులు, లక్ష్యాలు, ప్రాధాన్యతలు, ఈ ఉద్యోగాన్ని ఎంచుకోవడానికి కారణాలు, తదితరాలు. అంతేకాకుండా సమకాలీన అంశాలు, బ్యాంకింగ్, ఆర్థిక రంగం, క్రీడారంగం ఇలా ఏ రంగం నుంచైనా ప్రశ్నలు అడగొచ్చు. ప్రత్యేకించి ఎస్బీఐ-అనుబంధ బ్యాంకుల విధాన నిర్ణయాలు, పథకాలు సంబంధిత అంశాలపై దృష్టి సారించాలి. క్లరికల్ పరీక్షల్లో విజయం సాధించాలంటే నిరంతర ప్రాక్టీస్ తప్పనిసరి. ఆన్లైన్ విధానంపై అవగాహన ఏర్పడేందుకు వీలైనన్ని మాక్ టెస్ట్‌లు రాయాలి. అప్పుడే టైం మేనేజ్మెంట్పై పట్టు సాధించొచ్చు. అంతేకాకుండా కచ్చితత్వంతో కూడిన వేగం ప్రధానం. ఏ విభాగాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. ఇతర పరీక్షల్లో మాదిరి బ్యాంక్ పరీక్షల్లో ఓవరాల్ కటాఫ్ కాకుండా ప్రతి విభాగంలోనూ కటాఫ్ ఉంటుంది. కాబట్టి అన్ని విభాగాల్లో మంచి స్కోరు సాధించాలి. దినపత్రికలను రెగ్యులర్‌గా చదవడం వల్ల కరెంట్స్ అఫైర్స్ విభాగంలో మంచి మార్కులు సాధించొచ్చు. - ఆరేటి కేశవయ్య, క్లరికల్ విజేత, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (2013)