సాక్షి, అమరావతి: చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రంలో వైద్య రంగాన్ని, వైద్య విద్యని బలోపేతం చేస్తూ అటు విద్యార్థులకు, ఇటు ప్రజలకు మేలు చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రామోజీరావు మరో ఏడుపుగొట్టు కథనాన్ని ప్రచురించారు. రాష్ట్రంలో కొత్తగా 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తూ మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంచుతూ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది.
ఇది భరించలేని రామోజీరావు వైద్య కళాశాలల ఏర్పాటుపై గోబెల్స్ ప్రచారానికి తెరలేపారు. గత నెల 20న పలు వక్రీకరణలు, అవాస్తవాలతో ఈనాడులో కథనం ప్రచురించారు. నెల తిరక్కుండానే మరోసారి ‘వైద్య విద్యనూ అమ్మేశారు!’ అంటూ బుధవారం కథనం రాసుకొచ్చారు.
ప్రభుత్వ రంగంలో వైద్యవిద్యను బలోపేతం చేయడంపై రామోజీరావు కడపుమంటను బయటపెట్టుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ప్రైవేటు వైద్య కళాశాలలను ప్రోత్సహించి వైద్య విద్యను అమ్మేసి తన వాళ్ల జేబులు నింపుతున్నప్పుడు రామోజీరావు నిస్సిగ్గుగా ఎందుకు ఊరకుండిపోయారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
పేద విద్యార్థులకు తీరని నష్టం చేసింది మీ బాబే
1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో (ఉమ్మడి, ప్రత్యేక రాష్ట్రంలో) ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు 12 (11+1 పద్మావతి వైద్య కళాశాల) మాత్రమే ఉన్నాయి. 2014–19 మధ్య ఐదేళ్లలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికీ, ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా నెలకొల్పలేదు. పైగా, తన అనుంగులతో ప్రైవేటు వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రతిభ ఉన్నప్పటికీ అందుబాటులో తగినన్ని సీట్లు లేక బడుగుబలహీన వర్గాల విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యారు.
ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నష్టం చేయడం కాదా రామోజీ? చంద్రబాబు చేసిన నష్టంపై ఏ రోజైనా చిన్న వార్త అయినా రాశారా? వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వ రంగంలోనే 17 కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సీట్లు పెరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకూ మేలు జరుగుతోంది. 2019 వరకు 12 ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు 2,360 మాత్రమే. కొత్తగా 17 కళాశాలల ఏర్పాటుతో మరో 2,550 సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి.
ఈ విద్యా సంవత్సరంలోనే విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలు ప్రారంభమవుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం మరో ఐదు, 2025–26లో మిగిలిన ఏడు అందుబాటులోకి వస్తాయి. దీంతో ప్రభుత్వ రంగంలో 29 మెడికల్ కాలేజీలు ఉంటాయి. వీటిలో ఎంబీబీఎస్ సీట్లు ఏకంగా 4,,910కి పెరుగుతాయి. ఇది విద్యార్థులకు మంచి చేసినట్టే కదా?
ఇంత దుర్మార్గపు రాతలా?
ఈ విద్యా సంవత్సరం ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కొత్తగా ప్రారంభమవుతున్నాయి. వీటి ద్వారా ఏకంగా 319 కన్వీనర్ కోటా సీట్లు సమకూరాయి. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకూ సీట్లు పెరుగుతాయి. కొత్త కళాశాలల్లో ఆల్ ఇండియా కోటా పోను మిగిలిన సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా కింద ప్రభుత్వం భర్తీ చేసింది. 35 శాతం సెల్ఫ్ ఫైనాన్స్, 15 శాతం ఎన్నారై కోటాకు కేటాయించారు. ఐదు కాలేజీల్లో 750 సీట్లు ఉండగా 113 సీట్లు ఆల్ ఇండియా కోటాకు వెళ్తాయి.
మిగిలిన 637 సీట్లలో 319 సీట్లు కన్వీనర్ కోటాకే ఇచ్చారు. దీంతో పాత 12 కళాశాలల్లోని 2,360 కన్వీనర్ కోటా సీట్లకు 319 అదనంగా చేరాయి. ప్రభుత్వ రంగంలోని పాత వైద్య కళాశాలలు, కొత్తగా వచ్చిన ఐదు కళాశాలల్లో, ప్రైవేట్‌లోని కన్వీనర్ కోటా సీట్లలో 2022–23, 2023–24 ప్రవేశాలను పరిశీలిస్తే విద్యార్థులకు ఎటువంటి నష్టం లేదని అర్థం అవుతుంది.
ప్రపంచ స్థాయి ప్రమాణాల కల్పన కోసమే
కొత్తగా ఏర్పాటు చేస్తున్న కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్నారై కోటా కింద వచ్చే డబ్బేమీ నారాయణ, ఇతర వైద్య విద్యతో వ్యాపారాలు చేసే ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్లదు. వాటితో సంబంధిత మెడికల్ కాలేజీలో సౌకర్యాలు, నిర్వహణను మెరుగు పరుస్తూ సమర్థంగా నిర్వహిస్తారు. మన విద్యార్థులకు మంచి వాతావరణం, సదుపాయాలు కలిగిన అత్యున్నత స్థాయి వైద్య కళాశాలలు అందుబాటులోకి వస్తాయి.
తద్వారా ఉత్తమ బోధన, ఉన్నత ప్రమాణాలతో పోటీ ప్రపంచంలో మనగలుగుతాయి. అక్కడకు వచ్చే పేద రోగులపై ఎలాంటి భారమూ ఉండదు. అంతిమంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఒక్కటీ తగ్గకపోగా అదనంగా మరిన్ని అందుబాటులోకి వస్తాయి. వ్యవస్థలు సజావుగా నడిచేందుకు పారదర్శక విధానాన్ని తెస్తుంటే రామోజీకి నచ్చదు. ఆయన జేబులో మనిషి చంద్రబాబులా అన్నీ అనుంగులకు కట్టబెట్టడమే కావాల్సింది. సీఎం వైఎస్ జగన్ ప్రజలకు మేలు చేయడమే రామోజీ కడుపు మంటకు కారణం.
ప్రభుత్వ వైద్యం బలోపేతం ఇలా
♦ నాలుగేళ్లలో 53 వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి సీఎం జగన్ ఆదేశాలు. పోస్టుల భర్తీ కోసమే ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఏర్పాటు.
♦ గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు. 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే వైద్య సేవలు.
♦ దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు. ఇప్పటివరకూ 1.70 కోట్ల మందికి సొంత ఊళ్లలోనే వైద్యం.
♦ వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి 3,257కి పెంపు. రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి. 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం.
♦ 108, 104 సేవలు బలోపేతం. కొత్తగా 768 అంబులెన్స్‌లు.
♦ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా అందించేలా ప్రభుత్వం చర్యలు.
Comments
Please login to add a commentAdd a comment