
44% తగ్గిపోయిన లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌సీఐ) డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బలహీన పనితీరు నమోదు చేసింది. ఈ కాలానికి రూ.75 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.134 కోట్లతో పోల్చి చూస్తే 44 శాతం తగ్గిపోయింది.
కార్యకలాపాల ద్వారా రూ.1,350 కోట్ల ఆదాయం సమకూరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలోనూ ఆదాయం రూ.1,363 కోట్లుగా ఉండడం గమనార్హం. వ్యయాలు రూ.1,214 కోట్ల నుంచి రూ.1,277 కోట్లకు ఎగిశాయి. వ్యయాలు గణనీయంగా పెరిగిపోవడం లాభాలకు చిల్లుపెట్టినట్టు తెలుస్తోంది.
శుక్రవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు 1%పైగా నష్టపోయి రూ.192 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment