Shipping Corporation of India
-
నిరాశపరిచిన షిప్పింగ్ కార్పొరేషన్
న్యూఢిల్లీ: షిప్పింగ్ కార్పొరేషన్ సెపె్టంబర్ త్రైమాసికంలో పనితీరు పరంగా ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 42 శాతానికి పైగా క్షీణించి రూ.66 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.114 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,458 కోట్ల నుంచి రూ.1,662 కోట్లకు వృద్ధి చెందింది. వ్యయాలు రూ.1,331 కోట్ల నుంచి రూ.1,113 కోట్లకు క్షీణించాయి. ప్రతీ షేరుకు 40 పైసల చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. -
ఆర్థిక, దౌత్యంలో నూతనాధ్యాయం
నాగపట్నం/న్యూఢిల్లీ: దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత భారత్, శ్రీలంక మధ్య మొదలైన పడవ ప్రయాణ సేవలు ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాన్ని సుధృడం చేస్తాయని ప్రధాని మోదీ అభిలíÙంచారు. శనివారం తమిళనాడులోని నాగపట్నం, జాఫా్నలోని కంకెసంథురై మధ్య ఫెర్రీ సేవలు మొదలవడం అనేది ఇరుదేశాల మైత్రీ బంధంలో కీలకమైన మైలురాయి అని మోదీ శ్లాఘించారు. షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ హైస్పీడ్ ఫెర్రీ సేవలు మొదలయ్యాయి. సముద్రమార్గంలో 110 కిలోమీటర్ల దూరాన్ని 3.5 గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. ఫెర్రీ సేవలను లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా చెరియాపని అనే పడవ 50 మంది ప్రయాణికులతో శ్రీలంకకు బయల్దేరింది. సాయంత్రం కల్లా భారత్‌కు తిరిగొచి్చంది. ‘ఇరుదేశాల మధ్య కనెక్టివిటీతోపాటు వాణిజ్యం, బంధాల బలోపేతానికి ఫెర్రీ సేవలు ఎంతో కీలకం’ అని ప్రధాని మోదీ తన వీడియో సందేశంలో వ్యాఖ్యానించారు. ‘ ఈ బంధం ఈనాటిదికాదు. ప్రాచీన తమిళ సాహిత్యంలోనూ దీని ప్రస్తావన ఉంది. సంగం కాలం నాటి పట్టినాప్పలై, మణిమేఖలై సాహిత్యంలోనూ భారత్, శ్రీలంక నౌకల రాకపోకల వివరణ ఉంది. ప్రఖ్యాత కవి సుబ్రమణ్యభారతి రాసిన పాట ‘సింధు నదియన్ మిసై’లోనూ రెండుదేశాల బంధాన్ని వివరించారు. చారిత్రక, సాంస్కృతిక బంధాల్లో ఈ పడవ ప్రయాణాల మధుర జ్ఞాపకాలు సజీవంగా ఉన్నాయి. ఇటీవల భారత్‌లో పర్యటించిన సందర్భంగా విక్రమసింఘే అనుసంధాన సంబంధిత విజన్ డాక్యుమెంట్‌ను భారత్‌తో పంచుకున్నారు. 2015లో శ్రీలంకలో నేను పర్యటించాకే ఢిల్లీ, కొలంబో మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి ’ అని మోదీ గుర్తుచేసుకున్నారు. మనసులనూ దగ్గర చేస్తోంది ‘ఈ అనుసంధానం రెండు పట్టణాలను మాత్రమే కాదు. రెండు దేశాలను, దేశాల ప్రజలను, వారి మనసులనూ దగ్గర చేస్తోంది. ‘పొరుగుదేశాలకు ప్రాధాన్యం’ అనే మోదీ సర్కార్ విధానాన్ని మరింత తీసుకెళ్తున్నాం’ అని ఈ సేవలను లాంఛనంగా పచ్చజెండా ఊపి ప్రారంభించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర నౌకలు, షిప్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య అనుసంధానం, వాణిజ్యం, పర్యాటకం, సాంస్కృతిక అనుబంధాలను మరింత మెరుగుపరిచేందుకు ఈ సేవలు దోహదపడతాయని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే వ్యాఖ్యానించారు. గతంలో చెన్నై, కొలంబోల మధ్య తూత్తుకుడి మీదుగా ఇండో–సియోల్ ఎక్స్‌ప్రెస్ ఆధ్వర్యంలో పడవ ప్రయాణలు కొనసాగేవి. అయితేశ్రీలంకలో పౌర సంక్షోభం తలెత్తాక 1982లో ఆ సేవలు నిలిచిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఇలా పడవ సేవలు పునఃప్రారంభమయ్యాయి. -
ఎస్‌సీఐఎల్‌ఏఎల్ లిస్టింగ్ ఈ నెలలోనే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎస్సీఐ నుంచి విడదీసిన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ల్యాండ్ అండ్ అసెట్స్ (ఎస్‌సీఐఎల్‌ఏఎల్) సంస్థ ఈ నెలలో స్టాక్ ఎక్స్చెంజీలలో లిస్ట్ కానుంది. విభజన ప్రక్రియ కింద ఎస్సీఐ (షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) షేర్హోల్డర్లకు ఎస్‌సీఐఎల్‌ఏఎల్ షేర్లు లభించనున్నాయి. సంస్థ లిస్టింగ్ తర్వాత ఎస్సీఐ ప్రైవేటీకరణపై స్పష్టత వస్తుందని, అటుపైన ఫైనాన్షియల్ బిడ్లను ప్రభుత్వం ఆహ్వానించే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. 2020 నవంబర్‌లో షిప్పింగ్ కార్పొరేషన్లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా ప్రధాన వ్యాపారయేతర అసెట్స్‌ను ఎస్‌సీఐఎల్‌ఏఎల్ కింద విడగొట్టారు. గతేడాది మార్చి 31 నాటికి దీని విలువ రూ. 2,392 కోట్లు. ప్రస్తుతం ఎస్‌సీఐలో కేంద్రానికి 63.75 శాతం వాటాలు ఉన్నాయి. -
షిప్పింగ్ కార్ప్ విక్రయానికి సిద్దమవుతున్న రంగం: త్వరలోనే బిడ్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్సీఐ) ప్రయివేటీకరణకు ఈ ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి త్రైమాసికంలో ఫైనాన్షియల్ బిడ్స్‌ను ఆహ్వానించే వీలుంది. ఇందుకు వీలుగా ప్రభుత్వం కంపెనీకి చెందిన కీలకంకాని, భూమి సంబంధ ఆస్తుల విడదీతను ప్రారంభించింది కూడా. ఈ ప్రక్రియ తుది దశకు చేరినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. రానున్న మూడు నెలల్లోగా పూర్తికావచ్చని అంచనా వేశారు. దీంతో జనవరి-మార్చి(క్యూ4)కల్లా అర్హతగల కంపెనీల నుంచి ఫైనాన్షియల్ బిడ్స్‌కు ఆహ్వానం పలికే వీలున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది మే నెలలో కీలకంకాని ఆస్తుల విడదీతకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా షిప్పింగ్ హౌస్, ముంబై, మ్యారిటైమ్ ట్రయినింగ్ ఇన్స్టిట్యూట్, పోవైసహా ఎస్సీఐ ల్యాండ్ అండ్ అసెట్స్ లిమిటెడ్(ఎస్‌సీఐఎల్‌ఏఎల్)ను విడదీయనుంది. తద్వారా ఎస్‌సీఐఎల్‌ఏఎల్ పేరుతో విడిగా కంపెనీ ఏర్పాటుకు తెరతీయనుంది. -
వచ్చే ఏడాదిలో మరింత స్పీడ్
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ను మరింత వేగవంతం చేయనుంది. పీఎస్‌యూ దిగ్గజాలు బీపీసీఎల్, బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్సీఐ)లలో వ్యూహాత్మక వాటాల విక్రయాన్ని చేపట్టనున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాజా బడ్జెట్లో ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 65,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రతిపాదించింది. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లో తొలుత పెట్టుకున్న లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లతో పోలిస్తే తాజా టార్గెట్‌లో భారీగా కోత పడింది. సవరించిన తాజా అంచనాల ప్రకారం మార్చితో ముగియనున్న ఈ ఏడాది రూ. 78,000 కోట్లు సమీకరించగలమని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. కాగా.. వచ్చే ఏడాది ఈసీజీసీసహా మూడు పీఎస్‌యూల పబ్లిక్ ఇష్యూలు చేపట్టనున్నట్లు పాండే తెలియజేశారు. మైనారిటీ వాటాలు వచ్చే ఏడాది లక్ష్యాలను చేరేందుకు కొన్ని సీపీఎస్ఈలలో మైనారిటీ వాటాలను సైతం విక్రయించనున్నట్లు పాండే వెల్లడించారు. పవన్ హంస్ కొనుగోలుకి పలు ఫైనాన్షియల్ బిడ్స్ దాఖలైనట్లు పేర్కొన్నారు. ఇక ఎస్సీఐ, బీపీసీఎల్, బీఈఎంఎల్.. ఫైనాన్షియల్ బిడ్స్ దశకు చేరినట్లు తెలియజేశారు. -
షిప్పింగ్ కార్పొరేషన్ వేటలో మేఘా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో (ఎస్సీఐ) ప్రభుత్వ వాటా కొనుగోలుకు శక్తి కలిగిన కంపెనీల జాబితాలో హైదరాబాద్‌కు చెందిన మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్టక్చర్ (ఎంఈఐఎల్) నిలిచింది. ఎంఈఐఎల్‌తోపాటు యూఎస్‌కు చెందిన సేఫ్సీ, ఎన్నారై రవి మెహరోత్రా నేతృత్వంలోని కన్సార్షియం షార్ట్ లిస్ట్ అయిన జాబితాలో ఉన్నాయి. ఎస్‌సీఐలో ప్రభుత్వ వాటా కొనుగోలుకు ఆసక్తి కనబరిచిన ఈ మూడు కంపెనీలు టెక్నికల్, ఫైనాన్షియల్ ప్రమాణాల విషయంలో అర్హత సాధించాయి. షిప్పింగ్ కార్పొరేషన్లో కేంద్ర ప్రభుత్వం తనకున్న 63.75% వాటాను విక్రయిస్తోంది. ఈ వాటాను దక్కించుకున్న సంస్థ సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం ఆ తర్వాత మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. 1961 అక్టోబరు 2న ఏర్పాటైన ఎస్సీఐ.. భారత్‌లో అతిపెద్ద షిప్పింగ్ కంపెనీగా ఎదిగింది. సరుకు, ప్రయాణికుల రవాణా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ పెద్ద ఎత్తున బల్క్ క్యారియర్లు, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, ప్రొడక్ట్ ట్యాంకర్స్, కంటైనర్ వెసెల్స్, ప్యాసింజర్/కార్గో వెసెల్స్, ఎల్పీజీ, అమోనియా క్యారియర్లను సొంతంగా కలిగి ఉంది. డిసెంబరు త్రైమాసికంలో షిప్పింగ్ కార్పొరేషన్ రూ.841 కోట్ల టర్నోవర్‌పై రూ.103 కోట్ల నికరలాభం ఆర్జించింది. కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.43 % ఎగసి రూ.115.75 వద్ద స్థిరపడింది. -
మొండికేసిన అండమాన్ నౌక
సాక్షి, విశాఖపట్నం: షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖ నుంచి అండమాన్ వెళ్లే నౌక సాంకేతిక సమస్యలతో శుక్రవారం మొండికేసింది. ఇంజన్లో సమస్య తలెత్తడంతో ఉదయం 11.30 గంటలకు వెళ్లాల్సిన నౌక సాయంత్రం 6గంటలకు బయలుదేరింది. దీంతో 2వేల మంది ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. విశాఖ పోర్టు నుంచి అండమాన్‌లోని పోర్టు బ్లెయిర్ వరకూ ప్రతి నెలా నౌకను షిప్పింగ్ కార్పొరేషన్ నుంచి అనుమతి పొందిన ప్రైవేట్ కాంట్రాక్టర్ నడుపుతున్నారు. 1100 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణానికి రూ.2,500 నుంచి రూ.9వేల వరకూ కేటగిరిల వారీగా టిక్కెట్టు వసూలు చేస్తున్నారు. యాభై ఆరు గంటల పాటు ప్రయాణించాల్సి ఉండటంతో ప్రయాణీకులు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటారు. చెన్నై, కోల్కత్తా పోర్టుల తర్వాత అండమాన్‌కు విశాఖ నుంచే నౌకాయానం అందుబాటులో ఉంది. చెన్నై, కోల్కత్తా నుంచి కంటే విశాఖ నుంచి వెళితే నాలుగు గంటలు ముందుగానే పోర్ట్‌బ్లెయిర్ చేరుకోవచ్చు. అయితే అండమాన్ నౌక ఆలస్యమవ్వడం కొత్తకాదు. గతంలోనూ అనేక సార్లు ఇదే విధంగా ఇబ్బందులు పెట్టింది. ఒక్కొసారి రెండు మూడు రోజుల పాటు నిలిచిపోయిన సందర్భాలున్నాయి.