
న్యూఢిల్లీ: షిప్పింగ్ కార్పొరేషన్ సెపె్టంబర్ త్రైమాసికంలో పనితీరు పరంగా ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 42 శాతానికి పైగా క్షీణించి రూ.66 కోట్లకు పరిమితమైంది.
క్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.114 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,458 కోట్ల నుంచి రూ.1,662 కోట్లకు వృద్ధి చెందింది. వ్యయాలు రూ.1,331 కోట్ల నుంచి రూ.1,113 కోట్లకు క్షీణించాయి. ప్రతీ షేరుకు 40 పైసల చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment