న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎస్‌సీఐ నుంచి విడదీసిన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ల్యాండ్ అండ్ అసెట్స్ (ఎస్‌సీఐఎల్‌ఏఎల్) సంస్థ ఈ నెలలో స్టాక్ ఎక్స్చెంజీలలో లిస్ట్ కానుంది. విభజన ప్రక్రియ కింద ఎస్‌సీఐ (షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) షేర్‌హోల్డర్లకు ఎస్‌సీఐఎల్‌ఏఎల్ షేర్లు లభించనున్నాయి.
సంస్థ లిస్టింగ్ తర్వాత ఎస్‌సీఐ ప్రైవేటీకరణపై స్పష్టత వస్తుందని, అటుపైన ఫైనాన్షియల్ బిడ్లను ప్రభుత్వం ఆహ్వానించే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. 2020 నవంబర్‌లో షిప్పింగ్ కార్పొరేషన్‌లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా ప్రధాన వ్యాపారయేతర అసెట్స్‌ను ఎస్‌సీఐఎల్‌ఏఎల్ కింద విడగొట్టారు. గతేడాది మార్చి 31 నాటికి దీని విలువ రూ. 2,392 కోట్లు. ప్రస్తుతం ఎస్‌సీఐలో కేంద్రానికి 63.75 శాతం వాటాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment