gem
-
‘జెమ్’పై రూ.2 లక్షల కోట్ల కొనుగోళ్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అయిన ‘జెమ్’పై వస్తు, సేవల కొనుగోళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించాయి. వివిధ శాఖలు, విభాగాల నుంచి కొనుగోళ్ల కార్యకలాపాలు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్లో (ఎక్స్) పేర్కొన్నారు. జెమ్‌ను కేంద్ర సర్కారు 2016 ఆగస్ట్ 9న ప్రారంభించడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విభాగాల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి జెమ్‌పై కొనుగోళ్ల విలువ రూ.1.06 లక్షల కోట్లుగా ఉంటే, గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.2 లక్షల కోట్లను అధిగమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొనుగోళ్ల విలువ రూ.3 లక్షల కోట్లకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెమ్‌పై 62 లక్షల విక్రేతలు, సరీ్వస్ ప్రొవైడర్లు నమోదై ఉన్నారు. 63,000 ప్రభుత్వ కొనుగోళ్ల విభాగాలు కూడా నమోదై ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పారా మిలటరీ దళాలు కొనుగోలుదారుల జాబితాలో ఉన్నాయి. స్టేషనరీ నుంచి వాహనాలు, కంప్యూటర్, ఫర్నిచర్ వరకు అన్ని రకాల విక్రేతలు దీనిపై నమోదై ఉన్నారు. సేవల విభాగంలో రవాణా, లాజిస్టిక్స్, వ్యర్థాల నిర్వహణ, వెబ్‌కాస్టింగ్‌కు సంబంధించిన సంస్థలు ఉన్నాయి. మొత్తం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ సంస్థల వాటా 83 శాతంగా ఉన్నట్టు వాణిజ్య శాఖ తెలిపింది. మొత్తం 312 రకాల సేవలు, 11,800 ఉత్పత్తులు జెమ్‌పై విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. జెమ్ ఆరంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.5.93 లక్షల కోట్ల కొనుగోళ్లు జరిగాయి. -
ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ నుంచి రూ.60 కోట్ల జెండాలు
న్యూఢిల్లీ: గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ (జెమ్) ద్వారా జూలై 1 నుంచి ఆగస్ట్ 15 మధ్య 2.36 కోట్ల జెండాలను వివిధ ప్రభుత్వ విభాగాలు, రాష్ట్రాలు కొనుగోలు చేశాయి. వీటి విలువ రూ.60 కోట్లు. ప్రభుత్వ సంస్థలు 4,159 మంది విక్రేతల నుంచి ఈ జెండాలను అందుకున్నాయి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ స్థాయిలో కొనుగోళ్లు జరిగాయి. ప్రభుత్వ సంస్థల కోసం పారదర్శక ప్రొక్యూర్మెంట్ వ్యవస్థ ఉండాలన్న లక్ష్యంతో జెమ్ వేదికను 2016 ఆగస్ట్ 9న కేంద్ర వాణిజ్య శాఖ ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్త, స్థానిక సంస్థలు తమకు కావాల్సిన ఉత్పత్తులను జెమ్ ద్వారా పొందవచ్చు. -
సీఎం జగన్‌ను కలిసిన జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహాయనిధికి చెన్నైకి చెందిన ఇంపీరియల్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ) భారీ విరాళాన్ని అందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం కంపెనీ ప్రతినిధులు కలిసి రూ.కోటి ఐదు లక్షల డీడీని అందించారు. కోవిడ్ సమయంలో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న సమర్థవంతమైన చర్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని ఈ సందర్భంగా జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఛైర్మన్ ఆర్.వీరమణి సీఎంకు వివరించారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ ఆర్.గుణశేఖరన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి చెన్నైకి చెందిన ఇంపీరియల్ గ్రానైట్స్ ప్రెవేట్ లిమిటెడ్ (జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ) రూ. 1,05,00,000 విరాళం. కోవిడ్ – 19 నివారణకు తీసుకున్న సమర్ధవంతమైన చర్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని సీఎంకి వివరించిన కంపెనీ చైర్మన్ ఆర్. వీరమణి. pic.twitter.com/V5kW0YADcc — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 16, 2022 చదవండి: (3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమే: సీఎం జగన్) -
జీఈఎం ద్వారా రూ.1,500 కోట్లు: బీహెచ్ఈఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ దిగ్గజం బీహెచ్ఈఎల్ గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ.1,500 కోట్ల విలువైన వస్తు, సేవలను సేకరించినట్టు ఒక ప్రకటనలో ప్రకటించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.389 కోట్లు మాత్రమేనని కంపెనీ వెల్లడించింది. పోర్టల్ ద్వారా స్టీల్, సిమెంట్, కేబుల్స్, పలు విడిభాగాలను సేకరించినట్టు వివరించింది. ప్రభుత్వ ఈ–మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా వస్తు, సేవలను సేకరించిన టాప్–20 ప్రభుత్వ రంగ సంస్థల జాబితాలో తొలి స్థానంలో నిలిచినట్టు ప్రకటించింది. ఇదే పోర్టల్‌లో విక్రేతగా సైతం నమోదైనట్టు తెలిపింది. చదవండి: భెల్ రికార్డు.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో.. -
మరో కోహీనూర్: మన గోల్కొండ వజ్రం వేలానికి
నిజాం కాలంలో వజ్రాలు రాశులుగా పోసి మార్కెట్లో కూరగాయల మాదిరి అమ్ముకున్నారని చదువుకున్నాం. ఇప్పుడు అలాంటి వజ్రాలు ఎక్కడా కనిపించడం లేదు. ఉన్న కొన్నింటిలో కోహీనూర్ వజ్రం బ్రిటన్ రాణి కిరీటంలో ఉండగా.. మరికొన్ని వజ్రాలు విదేశాల్లో ఉన్నాయి. నిజాం వంశస్తులకు సంబంధించిన అరుదైన ఆభరణాలు, వజ్రాలు తదితర విలువైన వస్తువులు భారతదేశం నుంచి చేజారాయి. అలా చేజారిన వాటిలో ఉన్న ఒక వజ్రం ప్రస్తుతం వేలానికి పెట్టారు. గోల్కొండలో లభించిన అపురూపమైన, అరుదైన వజ్రం న్యూయార్క్‌లోని ఫార్చునా ఆక్షన్ హౌస్‌లో వేలం వేస్తున్నారు. 3.05 క్యారెట్ల వజ్రం రూ.కోటిన్నరకు విలువ చేస్తుందని అంచనా. వీటితో పాటు కుతుబ్ షాహీ కాలంలో గోల్కొండ నుంచి తవ్విన వజ్రాలు, అనేక విలువైన కళాఖండాలు ఇక్కడ వేలం వేయనున్నారు. గోల్కొండ డైమండ్స్ అని పిలువబడే వజ్రాలు మచ్చలేని విలువైన రాళ్లుగా పేరు పొందాయి. ళ్లను వేలంపాటదారుల కోసం ప్రదర్శిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. అయితే ఆ వజ్రంతో పాటు మిగతా వస్తువులను భారత ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిజాం వారసులు కోరుతున్నారు. ఇప్పటికే విలువైన వస్తువులను కోల్పోయినట్లు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం వేలానికి వచ్చిన వజ్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయంట. నైట్రోజన్ ఉనికి ఉండని వజ్రం అని తెలుస్తోంది. దీంతోపాటు పసుపు రంగులో మెరుస్తుందంట. మన దక్కన్ సాంప్రదాయానికి గర్వంగా చెప్పుకునే వజ్రాలు చాలా ఏళ్ల కిందటే హైదరాబాద్ దాటింది. అనంతరం విదేశాలకు చేరింది. దేశానికి చెందిన అపరూపమైన సంపద విదేశాలకు తరలిపోతోందని రాయల్టీ ఆఫ్ హైదరాబాద్ ఎస్టేట్స్ ప్రతినిధి నవాబ్ షఫాత్ అలీఖాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోల్కొండ వైభవాన్ని భావితరాలకు వివరించేందుకే భారతదేశం వేలంలొ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎలాగైనా ఆ వజ్రాన్ని మనం సొంత చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
యాక్షన్ జెమ్
నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా నటించిన తాజా చిత్రం ‘జెమ్’. రాశీ సింగ్, నక్షత్ర హీరోయిన్లుగా నటించారు. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో మహాలక్ష్మీ మూవీ మేకర్స్ పతాకంపై పత్తికొండ కుమారస్వామి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ని హీరో రవితేజ విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ రాజా మాట్లాడుతూ– ‘‘యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రమిది. రెండేళ్లు శ్రమించి సిద్ధం చేసిన కథను అంతే బాగా తెరకెక్కించారు సుబ్రహ్మణ్యంగారు’’ అన్నారు. ‘‘అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించాం’’ అన్నారు సుశీల సుబ్రహ్మణ్యం. ‘‘అవుట్‌పుట్ సంతృప్తికరంగా వచ్చింది’’ అన్నారు పత్తికొండ కుమారస్వామి. ‘‘తమిళ, కన్నడలో సినిమాలు చేసిన కుమారస్వామిగారు తెలుగులో మా అబ్బాయితో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు శివాజీ రాజా. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్. -
'లేసిడీ లా రోనా' కు డిమాండ్ తగ్గింది!
న్యూయార్క్ః అన్ కట్ డైమండ్స్ అంటే మనసు పారేసుకోని వారుండరు. ముఖ్యంగా బడా వ్యాపారులు అటువంటివి ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయా? ఎప్పుడు కొందామా అని ఎదురు చూస్తుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత విలువైన, శతాబ్ద కాలంనాటి ముడి వజ్రం.. 'లేసిడీ లా రోనా' కు మాత్రం ఇప్పుడు ఆ డిమాండ్ లేకుండా పోయింది. లండన్ లోని ప్రముఖ వేలం సంస్థ సౌత్ బే.. లుకారా డైమండ్ కార్పొరేషన్ కు చెందిన అతిపెద్ద 1,109 క్యారెట్ల వజ్రాన్ని అమ్మకానికి పెట్టగా.. కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో వేలాన్నే నిలిపివేయాల్సి వచ్చింది. సుమారు వందేళ్ళు దాటిన 'లేసిడీ లా రోనా' వజ్రాన్ని కొనేవారే కరువయ్యారు. అతిపెద్ద అన్ కట్ డైమండ్ కు మార్కెట్లో డిమాండ్ లేకుండా పోవడం ప్రస్తుత ప్రపంచ ఆర్థిక స్థితిగతులకు అద్దంపట్టింది. లుకారా డైమండ్ ను వజ్రాల వ్యాపారులు కొనేందుకు ఆసక్తి చూపక పోవడం మార్కెట్లో సంచలనమే రేపింది. 1,109 క్యారెట్ల ఆ అన్ కట్ డైమండ్ రిజర్వ్ ధర సుమారు రూ. 470 కోట్లుగా నిర్ణయించి, వేలానికి పెట్టిన సౌత్ బే సంస్థ... అంతకన్నా ఎక్కువ ఎవ్వరూ చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో ఏకంగా వేలాన్నే ఆపేయాల్సి వచ్చినట్లు తెలిపింది. రూ. 470 కోట్ల విలువైన వజ్రాన్ని వేలానికి పెడితే.. ఓ వ్యక్తి రూ. 410 కోట్ల వరకూ ఆఫర్ చేశారని, అసలు ధరకన్నా తక్కువకు అడగడంతోనే వజ్రం వేలం ఆపాల్సి వచ్చిందని లుకారా కంపెనీ సీఈవో విలియం లాంబ్ తెలిపారు. నిజానికి ఆ వజ్రానికి ఎంతో డిమాండ్ ఉందని.. అది అమ్ముడుపోకపోవడం తమను ఎంతో నిరాశ పరిచిందని లాంబ్ తెలిపారు. కొన్నాళ్ళ తర్వాత మరోసారి వజ్రాన్ని వేలానికి పెడతామన్న ఆయన.. ఆ తేదీని మరోసారి వెల్లడిస్తామన్నారు. వాంకోవర్ ఆధారిత లుకారా షేర్ల విలువ తగ్గిపోవడంతోనే ఈపరిస్థితి వచ్చినట్లు భావిస్తున్నారు.