
న్యూఢిల్లీ: గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ (జెమ్) ద్వారా జూలై 1 నుంచి ఆగస్ట్ 15 మధ్య 2.36 కోట్ల జెండాలను వివిధ ప్రభుత్వ విభాగాలు, రాష్ట్రాలు కొనుగోలు చేశాయి. వీటి విలువ రూ.60 కోట్లు.
ప్రభుత్వ సంస్థలు 4,159 మంది విక్రేతల నుంచి ఈ జెండాలను అందుకున్నాయి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ స్థాయిలో కొనుగోళ్లు జరిగాయి. ప్రభుత్వ సంస్థల కోసం పారదర్శక ప్రొక్యూర్‌మెంట్ వ్యవస్థ ఉండాలన్న లక్ష్యంతో జెమ్ వేదికను 2016 ఆగస్ట్ 9న కేంద్ర వాణిజ్య శాఖ ప్రారంభించింది.
కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్త, స్థానిక సంస్థలు తమకు కావాల్సిన ఉత్పత్తులను జెమ్ ద్వారా పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment