'లేసిడీ లా రోనా' కు డిమాండ్ తగ్గింది! | No buyer for Lucara’s giant gem | Sakshi
Sakshi News home page

'లేసిడీ లా రోనా' కు డిమాండ్ తగ్గింది!

Published Thu, Jun 30 2016 4:21 PM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

'లేసిడీ లా రోనా' కు డిమాండ్ తగ్గింది!

'లేసిడీ లా రోనా' కు డిమాండ్ తగ్గింది!

న్యూయార్క్ః అన్ కట్ డైమండ్స్ అంటే మనసు పారేసుకోని వారుండరు. ముఖ్యంగా బడా వ్యాపారులు అటువంటివి ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయా? ఎప్పుడు కొందామా అని ఎదురు చూస్తుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత విలువైన, శతాబ్ద కాలంనాటి ముడి వజ్రం.. 'లేసిడీ లా రోనా' కు మాత్రం ఇప్పుడు ఆ డిమాండ్ లేకుండా పోయింది. లండన్ లోని ప్రముఖ వేలం సంస్థ సౌత్ బే.. లుకారా డైమండ్ కార్పొరేషన్ కు చెందిన అతిపెద్ద 1,109 క్యారెట్ల వజ్రాన్ని అమ్మకానికి పెట్టగా.. కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో  వేలాన్నే నిలిపివేయాల్సి వచ్చింది.

సుమారు వందేళ్ళు దాటిన 'లేసిడీ లా రోనా' వజ్రాన్ని కొనేవారే కరువయ్యారు. అతిపెద్ద అన్ కట్ డైమండ్ కు మార్కెట్లో డిమాండ్ లేకుండా పోవడం ప్రస్తుత ప్రపంచ ఆర్థిక స్థితిగతులకు అద్దంపట్టింది. లుకారా డైమండ్ ను వజ్రాల వ్యాపారులు కొనేందుకు ఆసక్తి చూపక పోవడం మార్కెట్లో సంచలనమే రేపింది. 1,109 క్యారెట్ల ఆ అన్ కట్ డైమండ్ రిజర్వ్ ధర సుమారు రూ. 470 కోట్లుగా నిర్ణయించి, వేలానికి పెట్టిన సౌత్ బే సంస్థ... అంతకన్నా ఎక్కువ ఎవ్వరూ చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో ఏకంగా వేలాన్నే ఆపేయాల్సి వచ్చినట్లు తెలిపింది.

రూ. 470 కోట్ల విలువైన వజ్రాన్ని వేలానికి పెడితే.. ఓ వ్యక్తి రూ. 410 కోట్ల వరకూ ఆఫర్ చేశారని, అసలు ధరకన్నా తక్కువకు అడగడంతోనే వజ్రం వేలం ఆపాల్సి వచ్చిందని లుకారా కంపెనీ సీఈవో విలియం లాంబ్ తెలిపారు.  నిజానికి ఆ వజ్రానికి ఎంతో డిమాండ్ ఉందని.. అది అమ్ముడుపోకపోవడం తమను ఎంతో నిరాశ పరిచిందని లాంబ్ తెలిపారు. కొన్నాళ్ళ తర్వాత మరోసారి వజ్రాన్ని వేలానికి పెడతామన్న ఆయన.. ఆ తేదీని మరోసారి వెల్లడిస్తామన్నారు.  వాంకోవర్ ఆధారిత లుకారా షేర్ల విలువ తగ్గిపోవడంతోనే ఈపరిస్థితి వచ్చినట్లు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement