giant
-
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన వృక్షాలివే!
చెట్లు మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వృక్షం ఏదో తెలుసా? అది ఎక్కడ ఉంది? ఈ జాబితాలో ఇంకేమి వృక్షాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైపెరియన్, కోస్ట్ రెడ్‌వుడ్ కాలిఫోర్నియాలోని రెడ్‌వుడ్ నేషనల్ పార్క్‌లో ఉన్న హైపెరియన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టు. దీని సగటు ఎత్తు 360 అడుగులు. ఈ చెట్టు 16 అడుగులు (4.94 మీటర్లు) కంటే అధిక వ్యాసాన్ని కలిగి ఉంటుంది. హైపెరియన్ రెడ్వుడ్కు 600 నుంచి 800 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని అంచనా. హైపెరియన్ కోస్ట్ రెడ్వుడ్లు 2,000 సంవత్సరాలకు పైగా భూమిపై ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 2006లో క్రిస్ అట్కిన్స్ , మైఖేల్ టేలర్ అనే ప్రకృతి శాస్త్రవేత్తలు హైపెరియన్ను కనుగొన్నారు. మేనరా, ఎల్లో మెరంటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఉష్ణమండల వృక్షం మేనరా. ఇది మలేషియా బోర్నియోలోని సబాలోని డానుమ్ వ్యాలీ పరిరక్షణ ప్రాంతంలో ఉంది. దాని ఖచ్చితమైన ఎత్తుపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే ఈ వృక్షం ఎత్తును 331 అడుగులు (100.8 మీటర్లు)అని గుర్తించారు. మేనరా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యాంజియోస్పెర్మ్ లేదా పుష్పించే మొక్కగా ప్రసిద్ధి చెందింది. సెంచూరియన్, మౌంటైన్ యాష్ సెంచూరియన్ అనేది 330 అడుగుల (100.5 మీటర్లు) ఎత్తులో 13 అడుగుల (4.05 మీటర్లు) ట్రంక్ వ్యాసంతో కూడి ఉంటుంది. ఆస్ట్రేలియాలోని టాస్మానియాలోని ఆర్వ్ లోయలో ఈ వృక్షాల కారణంగా చెలరేగిన టాస్మానియన్ బుష్ఫైర్ల వల్ల ఈ ద్వీప భూభాగంలో దాదాపు మూడు శాతం అంటే 494,210 ఎకరాలు (200,000 హెక్టార్లు) కాలిపోయింది. డోర్నర్ ఫిర్, కోస్ట్ డగ్లస్ ఫిర్ డోర్నర్ ఫిర్ను ఒరెగాన్ కోస్ట్ రేంజ్‌లోని బ్యూరో ఆఫ్ ల్యాండ్ మేనేజ్మెంట్ సంరక్షిస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన డగ్లస్ ఫిర్. భూమిపై ఉన్న అత్యంత ఎత్తయిన నాన్ రెడ్‌వుడ్ వృక్షం. 327 అడుగుల (99.7 మీటర్లు) ఎత్తుతో, 11.5 అడుగుల (3.5 మీటర్లు) వ్యాసంతో ఇది చూపరులను ఆకట్టుకుంటుంది. 1989లో ఈ భారీ వృక్షాన్ని కనుగొన్నారు. రావెన్స్ టవర్, సిట్కా స్ప్రూస్ రావెన్స్ టవర్ అనేది 317 అడుగుల (96.7 మీటర్లు)ఎత్తు కలిగివుంటుంది. సిట్కా స్ప్రూస్ 2001లో దీనిని కనుగొన్నారు. అతను హైపెరియన్, హీలియోస్, ఐకారస్ లాంటి ఇతర పొడవైన చెట్లను కూడా కనుగొన్నాడు. రావెన్స్ టవర్ ఉత్తర కాలిఫోర్నియాలోని ప్రైరీ క్రీక్ రెడ్‌వుడ్స్ స్టేట్ పార్క్‌లో ఉంది. జెయింట్ సీక్వోయా కాలిఫోర్నియాలోని జెయింట్ సీక్వోయాస్ పొడవైన వృక్షాలుగా పేరొందాయి. సీక్వోయా నేషనల్ ఫారెస్ట్‌లో 314-అడుగుల (95.7 మీటర్లు) ఎత్తుతో ఈ వృక్షం ఉంది. జెయింట్ సీక్వోయాస్ 25 అడుగుల (7.7 మీటర్లు) వ్యాసంతో దృఢమైన ట్రంక్‌ను కలిగి ఉంటుంది. వైట్ నైట్, మన్నా గమ్ టాస్మానియాలోని ఎవర్క్రీచ్ ఫారెస్ట్ రిజర్వ్‌లోని మన్నా గమ్ (యూకలిప్టస్ విమినాలిస్) వృక్షం కనిపిస్తుంది. దీని ఎత్తు 299 అడుగులు (91 మీటర్లు). ఈ చెట్లు కలిగిన ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. కాగా ఆఫ్రికాలో పొడవైన చెట్ల జాతులు లేవు అయితే మౌంట్ కిలిమంజారో నేషనల్ పార్క్‌లో 267 అడుగుల (81.5 మీటర్లు) ఎత్తు కలిగిన ఎంటాండ్రోఫ్రాగ్మా ఎక్సెల్సమ్ వృక్షం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. -
రక్తం కారుతున్నా లెక్క చేయకుండా విమానాన్ని నడిపిన పైలెట్
ఈక్వెడార్: లాస్ రోస్ ప్రాంతంలో ఓ విమానం పైలెట్ కు వింత అనుభవం ఎదురైంది. విధి నిర్వహణలో విమానాన్ని నడుపుతున్న పైలెట్ కాక్ పిట్ లోకి ఒక పెద్ద పక్షి విండ్ షీల్డుని పగులగొట్టుకుని పొరపాటున లోపలి వచ్చింది. కాక్ పిట్ లో ఇరుక్కున్న ఆ పక్షి తన కాళ్లతో పొడుస్తున్నా, మొహమంతా రక్తం కారుతున్నా ఏమాత్రం లెక్కచేయని పైలెట్ అలాగే విమానాన్ని నడిపాడు. మొహమంతా రక్తం.. లాస్ రోస్ ప్రాంతంలో ఆకాశంలో సుమారు 10 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఒక విమానం పైలెట్ క్యాబిన్లోకి భారీ పక్షి ఒకటి విండ్ షీల్డ్ ను బద్దలుగొట్టుకుని మరీ లోపలికి చొచ్చుకుని వచ్చింది. అద్దంలో ఇరుక్కుపోయిన ఆ పక్షి సగభాగం లోపల వేలాడుతూ ప్రాణాలు కాపాడుకోవటానికి విశ్వప్రయత్నాలు చేసి చివరికి రక్తమోడుతూ గాల్లోనే ప్రాణాలు విడిచింది. దీంతో పైలెట్ ఏరియల్ వాలియంట్ రక్తమోడుతున్న తన ముఖాన్ని, కాక్ పిట్ లోకి వచ్చిన ఆ భారీ పక్షిని వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. రాబందు జాతి పక్షి.. అంత ఎత్తులో ఎగిరే ఈ పక్షిని ఆండియాన్ కాండోర్ పక్షిగా గుర్తించారు. ఇది దక్షిణ అమెరికా కాథర్టిడ్ రాబందు జాతికి చెందినదని గుర్తించారు. దీని రెక్కలు సుమారుగా పది అడుగుల వెడల్పు ఉంటాయని ఇవి భూమికి 21 వేల అడుగుల ఎత్తులో ఎగురుతుంటాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. Pilot safely lands his plane after a huge bird struck his windshield in the Los Ríos Province, Ecuador. Ariel Valiente was not injured during the incident. pic.twitter.com/Rl3Esonmtp — Breaking Aviation News & Videos (@aviationbrk) June 15, 2023 ఇది కూడా చదవండి: ఆ నరమాంస భక్షకిని భద్రపరుస్తారట! -
నైట్ షోలో అగ్ని ప్రమాదం..ఎగిసిపడ్డ అగ్నికీలలు
యూఎస్‌లోని ఓ నైట్ షోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా షోని నిలపేసి ప్రేక్షకులకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు తెలిపింది నిర్వాహణ సంస్థ. ఈ ఘటన కాలిపోర్నియాలోని చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని డిస్నీల్యాండ్‌లో జరిగిన నైట్ షోలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో టామ్ సాయర్ ద్వీపం సమీపంలోని థీమ్ పార్క్ వద్ద జరిగే ఫ్యాంటాస్మిక్ ప్రదర్శనను అకస్మాత్తుగా నిలిపేశారు. ఈ అసౌకర్యానికి క్షమాపణలు తెలుపుతూ ప్రేక్షకుల కోసం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది నిర్వాహక సంస్థ. శనివారం సాయంత్రం డిస్నీల్యాండ్ పార్క్‌లో ఫ్యాంటాస్మిక్ చివరి ప్రదర్శన సమయంలో ఈ అనుహ్య ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఆకర్షణగా ఉండే 24 అడుగుల జెయింట్ డ్రాగన్ మంటల్లో చిక్కుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ అనుహ్య ఘటనతో నిర్వాహకులు ప్రదర్శనను నిలిపేసి ప్రదర్శనలిచ్చే నటీనటులందర్నీ సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఆ ద్వీపం అంతా హుటాహుటినా ఖాళీ చేయించారు. ఐతే ఈ ఘటనలో ఎవరూ ఎలాంటి గాయాల బారిన పడలేదు కానీ ఎంతమేర అగ్నిప్రమాదం సంభవించింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం కారణంగా అక్కడ ప్రదేశం అంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఈ సంఘటనకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఫ్యాంటాస్మిక్ అనేది 27 నిమిషాల ప్రత్యక్ష ప్రదర్శన. దీన్ని 1992 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బాణసంచా, రంగురంగుల నీటి ప్రదర్శన తోపాటు లైవ్లోన నటులు పైరోటెక్నిక్‌లు, లేజర్లు, సంగీతం వంటి ప్రదర్శనలిస్తారు. Fantastic Fantasmic fail - wow! #fantasmic #disneyland pic.twitter.com/MZhNJhEXrB — JessicaT (@Ms_JessicaT) April 23, 2023 (చదవండి: సూడాన్‌లో చిక్కుకున్న వారిని ఆ మార్గంలో తరలించేందుకు సన్నాహాలు!) -
Beast Snake: భయానకం.. యాభై అడుగుల భారీ పాము!
అనకొండ, కొండ చిలువలు.. పాముల్లో ఒకరకంగా భారీవి, భయంకరమైనవి అని చెప్పుకుంటాం. కానీ, దక్షిణ, దక్షిణి తూర్పు ఆసియా దేశాల్లో కనిపించే రెట్రిక్యూలేటెడ్ పైథాన్ ఇప్పటిదాకా ప్రపంచంలో అధికారిక అతిపెద్ద పాము. ఆరున్నర మీటర్ల పొడవు పెరిగే ఈ పైథాన్.. 75 కేజీల దాకా బరువు ఉంటుంది. అయితే ఇంతకు మించిన భారీతనం ఉన్న పాము గురించి ఎప్పుడైనా విన్నారా?.. టైటానోబోవా.. ఈ భూమ్మీద ఇప్పటిదాకా అత్యంత పెద్ద పాముగా పేరుగాంచింది. 1,200 కేజీలకు పైగా బరువు, 48 అడుగులకు పైగా పొడవు ఉండే ఈ పాములు.. డైనోసార్ల కంటే ముందు కాలంలో ఈ భూమ్మీద జీవించేవని, సుమారు 60 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం వర్షారణ్యాల్లో వీటి ఉనికి ఎక్కువగా ఉండేదని అమెరికాకు చెందిన స్మిత్సోనియన్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు చెప్తున్నారు. అంతేకాదు కొలంబియా కెర్రెజోన్ కోల్ మైన్ గర్భంలో ఇందుకు సంబంధించిన శిలాజాలను సైతం సేకరించినట్లు వాళ్లు వెల్లడించారు. సుమారు 50 అడుగులకు పైగా పొడవుండే టైటానోబోవా Titanoboa.. ఒక స్కూల్‌బస్సు కంటే సైజులో పెద్దదిగా ఉంటుంది. అంతేకాదు ఒకవేళ ఆహారపు గొలుసులో గనుక దీనిని చేరిస్తే.. ఇదే టాప్‌లో ఉంటుంది కూడా. పరిశోధకులు ఈ మెగాస్నేక్కు బీస్ట్‌గా అభివర్ణిస్తుంటారు. అంతేకాదు ఆ కాలంలో బతికిన.. భారీ మోసళ్లను, తాబేళ్లను ఇవి చుట్టేసి పచ్చడిగా చేసి మరీ తినేసేదట. 2012లో టైటానోబోవా మీద ‘టైటానోబోవా: మాంస్టర్ స్నేక్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ కూడా తీశారు. దానిని స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో ప్రదర్శించారు కూడా. మరి ఈ మెగా స్నేక్ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటారా? తాజాగా సోషల్ మీడియాలో.. ఒక భారీ పాము అస్థిపంజరం వైరల్ అయ్యింది. ఫ్రాన్స్ తీరంలో గూగుల్ మ్యాప్ ద్వారా ఇది అసలైన పాము అస్థిపంజరమే అని, అదీ టైటానోబోవాదే అని చర్చించుకున్నారు కూడా. అయితే.. అది ఒక భారీ ఆర్ట్ వర్క్ అని తర్వాతే తేలింది. Le Serpent d'océan est une immense sculpture (130m) de l'artiste Huang Yong Ping, principalement composée d'aluminium. A découvrir à Saint-Brevin-les-Pins en France.#PaysDeLaLoire #SaintNazaireRenversante #ErenJaeger 👇Full YouTube video #widerfocushttps://t.co/U61apdbEk4 pic.twitter.com/0nHGPmhhvR — Wider Focus (@WiderFocus) February 28, 2022 -
యుటిలిటీ దిగ్గజం మారుతీ!
న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘మారుతీ సుజుకీ’ తాజాగా దేశీ యుటిలిటీ వాహన విభాగంలో మార్కెట్ లీడర్‌గా అవతరించింది. 2017–18లో 27.5 శాతానికిపైగా వాటాను ఆక్రమించామని మారుతీ సుజుకీ ప్రకటించింది. వితారా బ్రెజా, ఎర్టిగా, ఎస్–క్రాస్ మోడళ్లలోని బలమైన విక్రయాలు ఈ మైలురాయిని చేరుకోవడానికి ప్రధాన కారణమని పేర్కొంది. కాగా 2017–18లో కంపెనీ యుటిలిటీ వాహన అమ్మకాలు 2,53,759 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదివరకటి సంవత్సరంలోని 1,95,741 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 29.6 శాతం వృద్ధి కనిపించింది. యుటిలిటీ వాహన పోర్ట్‌ఫోలియోను క్రమంగా విస్తరించుకుంటూ వస్తున్నామని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్.కల్సి తెలిపారు. ‘ప్రతి ప్రొడక్టు ప్రత్యేకమైనదే. వీటి ద్వారా కస్టమర్ల డబ్బులకు విలువ చేకూర్చుతున్నాం’ అని పేర్కొన్నారు. 2017–18లో వితారా బ్రెజా విక్రయాల్లో 36.7 శాతం, ఎస్–క్రాస్ అమ్మకాల్లో 44.4 శాతం, ఎర్టిగా విక్రయాల్లో 4.1 శాతం వృద్ధి నమోదయ్యిందని తెలిపారు. -
వామ్మో.. గాడ్జిల్లా మళ్లీ పుట్టిందా?
ఫ్లోరిడా : రాక్షస బల్లుల జాతికి చెందిన గాడ్జిలా గురించి హాలీవుడ్ చిత్రాల్లో చూసుంటారు. అయితే పరిమాణంలో ఆ సైజులో కాకపోయినా.. కాస్త భయానకంగా ఉన్న మొసలి ఒకటి గోల్ఫ్ కోర్టులో చక్కర్లు కొట్టింది. ఫ్లోరిడాలో చోటు చేసుకున్న ఘటన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పోప్ గోల్ఫ్ మైదానంలో ఈ మధ్య బఫెల్లో క్రీక్ గోల్ఫ్ కోర్స్ పోటీలు జరిగాయి. ఫిబ్రవరి 14న గేమ్ ప్రారంభానికి ముందు అక్కడే ఓ కొలనులో ఉన్న భారీ మొసలి ఒకటి హఠాత్తుగా బయటకు వచ్చింది. ఆ సమయంలో మైదానంలో పని చేసే వ్యక్తి ఒకతను తన మొబైల్ తో వీడియో తీయటం ఆరంభించాడు. అది కాస్త అధికారుల దృష్టికి వెళ్లటంతో వారు స్పందించారు. సుమారు పాతికేళ్ల క్రితం ఓ మొసలి ఇదే ప్రాంతంలో కనిపించిందని.. బహుశా ఇప్పుడు కనిపించింది కూడా అదే అయి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. 2016లో కూడా ఇది ఓసారి కనిపించగా.. దానికి ‘చబ్స్’ అని పేరు పెట్టినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటిదాకా అది ఎవరి మీద దాడి చేసిన సందర్భాలు లేవనే వారంటున్నారు. మైదానంలో అది ఠీవిగా వెళ్తుంటే.. పక్షులు దాని వెనకాలే వెళ్లటం ఆసక్తికరంగా ఉంది. ఫ్లోరిడాలో ఈ పరిణామంలో ఉన్న మొసలి ఇదేనని జంతు సంరక్షణ అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వారంతా గాడ్జిల్లా మళ్లీ పుట్టిందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఆటగాళ్లు ఈ వీడియోతో మైదానంలో అడుగుపెట్టేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. -
వామ్మో.. గాడ్జిల్లా మళ్లీ పుట్టిందా?
-
కోతిని మింగిన కొండచిలువ
జగిత్యాలక్రైం: మానవజాతి ఆకారంతోనే వికృతచేష్టలు చేసే కోతి హఠాత్తుగా కొండచిలువ కంటపడటంతో అది కోతిని మింగేసిన సంఘటన జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వెల్దుర్తి గ్రామ శివారులోని జాబితాపూర్ ఊర చెరువు పక్కన ఓ భారీ కొండచిలువ కోతిని మింగి అస్వస్థతతో రోడ్డు పక్కన ఉండటం గ్రామస్తుల కంట పడింది. ఆందోళన చెందిన వారు కొండచిలువను చంపగా దాని కడుపులోంచి కోతి బయటపడటంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. -
'లేసిడీ లా రోనా' కు డిమాండ్ తగ్గింది!
న్యూయార్క్ః అన్ కట్ డైమండ్స్ అంటే మనసు పారేసుకోని వారుండరు. ముఖ్యంగా బడా వ్యాపారులు అటువంటివి ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయా? ఎప్పుడు కొందామా అని ఎదురు చూస్తుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత విలువైన, శతాబ్ద కాలంనాటి ముడి వజ్రం.. 'లేసిడీ లా రోనా' కు మాత్రం ఇప్పుడు ఆ డిమాండ్ లేకుండా పోయింది. లండన్ లోని ప్రముఖ వేలం సంస్థ సౌత్ బే.. లుకారా డైమండ్ కార్పొరేషన్ కు చెందిన అతిపెద్ద 1,109 క్యారెట్ల వజ్రాన్ని అమ్మకానికి పెట్టగా.. కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో వేలాన్నే నిలిపివేయాల్సి వచ్చింది. సుమారు వందేళ్ళు దాటిన 'లేసిడీ లా రోనా' వజ్రాన్ని కొనేవారే కరువయ్యారు. అతిపెద్ద అన్ కట్ డైమండ్ కు మార్కెట్లో డిమాండ్ లేకుండా పోవడం ప్రస్తుత ప్రపంచ ఆర్థిక స్థితిగతులకు అద్దంపట్టింది. లుకారా డైమండ్ ను వజ్రాల వ్యాపారులు కొనేందుకు ఆసక్తి చూపక పోవడం మార్కెట్లో సంచలనమే రేపింది. 1,109 క్యారెట్ల ఆ అన్ కట్ డైమండ్ రిజర్వ్ ధర సుమారు రూ. 470 కోట్లుగా నిర్ణయించి, వేలానికి పెట్టిన సౌత్ బే సంస్థ... అంతకన్నా ఎక్కువ ఎవ్వరూ చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో ఏకంగా వేలాన్నే ఆపేయాల్సి వచ్చినట్లు తెలిపింది. రూ. 470 కోట్ల విలువైన వజ్రాన్ని వేలానికి పెడితే.. ఓ వ్యక్తి రూ. 410 కోట్ల వరకూ ఆఫర్ చేశారని, అసలు ధరకన్నా తక్కువకు అడగడంతోనే వజ్రం వేలం ఆపాల్సి వచ్చిందని లుకారా కంపెనీ సీఈవో విలియం లాంబ్ తెలిపారు. నిజానికి ఆ వజ్రానికి ఎంతో డిమాండ్ ఉందని.. అది అమ్ముడుపోకపోవడం తమను ఎంతో నిరాశ పరిచిందని లాంబ్ తెలిపారు. కొన్నాళ్ళ తర్వాత మరోసారి వజ్రాన్ని వేలానికి పెడతామన్న ఆయన.. ఆ తేదీని మరోసారి వెల్లడిస్తామన్నారు. వాంకోవర్ ఆధారిత లుకారా షేర్ల విలువ తగ్గిపోవడంతోనే ఈపరిస్థితి వచ్చినట్లు భావిస్తున్నారు. -
జెయింట్ పాండాకు కవలపిల్లలు పుట్టాయ్!
మకావుః చైనాలోని మకావులో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తొలిసారిగా ఓ పాండా కవలపిల్లలకు జన్మనివ్వడం ఇప్పుడక్కడ హాట్ టాపిక్ గా మారింది. మకావు కు చెందిన జిన్ జిన్ అనే పాండాకు దాని పెవిలియన్ లో రెండు మగ పాండా పిల్లలు పుట్టాయి. దీంతో మకావు ప్రాంతంలో పిల్లలు పెట్టిన మొదటి పాండాగా జిన్ జిన్ ను అధికారులు గుర్తించారు. పాండాకు పుట్టిన రెండు పిల్లల్లో ఒకటి పూర్తి ఆరోగ్యంగా ఉండగా, మరోటి కాస్త అనారోగ్యంతోనూ, బరువు తక్కువగా ఉండటంతో దాన్ని ఇంటెన్సివ్ కేర్ లో పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. పాండాల జాతి అంతరించిపోతున్న తరుణంలో మకావులోని జెయింట్ పాండా జిన్ జిన్ కు కవల పిల్లలు పుట్టడం అక్కడివారికి అపురూపంగా మారింది. అందుకే వాటి సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జ్యూ లో నివసించే పాండాల్లో గర్భధారణ సహజంగా జరగకపోవడంతో కృత్రిమ గర్భధారణ పద్ధతులను కూడ చేపట్టి పాండాల సంతతి పెంచేందుకు అధికారులు చర్యలు కృషి చేస్తున్నారు. సాధారణంగా కవల పిల్లలు ఒకరు ఆరోగ్యంగా ఉంటే, మరొకరు కాస్త బలహీనంగా ఉండటం చూస్తుంటాం. అలాగే ప్రస్తుతం జెయింట్ పాండాకు పుట్టిన రెండు పిల్లల్లో ఒకటి పూర్తి ఆరోగ్యంగా ఉండగా, మరొకటి కాస్త బలహీనంగా ఉండి, బరువు తక్కువగా ఉండటంతో దాని ఆరోగ్య రక్షణ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతన్నారు. ఇంటెన్సివ్ కేర్ లో పెట్టి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. జిన్ జిన్.. కై కై.. జంటను గత ఏడాది చైనా మెయిన్ ల్యాండ్.. మకావుకు బహుమతిగా ఇచ్చింది. అదే జంటకు ప్రస్తుతం కవల పిల్లలు పుట్టడంతో మకావు అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జెయింట్ పాండాకు పుట్టిన పిల్లల్లో ఒకటి 138 గ్రాముల బరువు ఉండగా, మరోటి మాత్రం కేవలం 53.8 గ్రాములే ఉండటంతో దాన్ని ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి, వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిన్ జిన్ ప్రసవం కోసం మకావు అధికారులు జూన్ 14 నుంచే పెవిలియన్ ను కూడ మూసి ఉంచారు. -
అతిథిని చూసి పరుగులు తీశారు!
సిడ్నీ: అనుకోని అతిథి ఇంటికి వస్తే ఎంతో సర్ ప్రైజింగ్ గా ఫీలవుతాం. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు అంటూ ఆనందంగా ఆహ్వానిస్తాం. పైగా ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరికి పడితే వారికి కనిపించని అరుదైన అతిథి వస్తే... ఇక ఆనందానికి అవధులే ఉండవు. కానీ ఓ ఆస్ట్రేలియన్ దంపతులు వారింటికి అరుదుగా వచ్చిన అతిథిని చూసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని భయంతో పరుగులు తీశారట. చుట్టుపక్కల వారి సహాయంతో పట్టుకొని బంధించేందుకు ప్రయత్నించారట. ఇంతకూ ఆ భయంకర అతిథి వివరాలేమిటో ఓసారి చూద్దామా...? ఆస్ట్రేలియాలో నార్త్ క్వీన్స్ ల్యాండ్ స్టేట్ లోని వాంగలింగ్ బీచ్ ప్రాంతంలో నివసించే పీటర్, సూ లీచ్ దంపతులు తమ ఇంటికి వచ్చిన జెయింట్ ఫ్లైట్లెస్ కాసోవరీ పక్షిని చూసి పరుగులు తీశారట. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షులుగా జెయింట్ ఫ్లైట్లెస్ కాసోవరీ జాతి పక్షులను చెప్తారు. అటువంటి పక్షి అనుకోకుండా ఆ దంపతుల ఇంటికి అరుచుకుంటూ రావడంతో ముందు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అదో ప్రమాదకర పక్షి అని గుర్తించి పరుగులు తీశారు. రెండు మీటర్ల పొడవు.. సుమారు 70 కిలోల బరువుండే ఆ పక్షి.. నల్లని రెక్కలు, పొడవైన ముక్కు, మెడవద్ద నీలిరంగు, తలపై చిన్నపాటి పించంతో చూసేందుకు మాత్రం పెద్ద సైజు నెమలిని పోలి ఉంటుంది. ముందుగా పక్షిని చూసిన తన భర్త... ఇంటికి ఎవరొచ్చారో చూడు.. అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడని, తీరా అది ప్రమాదకర కాసోవరీస్ పక్షి అని గుర్తించి అతడు డైనింగ్ టేబుల్ వెనక దాక్కున్నాడని, తాను మాత్రం బయటకు పరుగు తీశానని సూలీచ్ తెలిపింది. విషయం తెలసిన పొరుగువారు ఆ పక్షి అత్యంత ప్రమాదకరమైన పక్షి అని, దగ్గరలోని రైన్ ఫారెస్ట్ నుంచి వచ్చి ఉంటుందని, ఇంతకుముందెప్పుడూ ఎవరింటికీ రాలేదని తెలిపారని సూలీచ్ అంటోంది. ఆ ప్రమాదకరమైన, అరుదైన కాసోవరీ పక్షి జాతి.. ఆస్ట్రేలియా ఈశాన్య క్వీన్స్ ల్యాండ్ ప్రాంతంలోని రైన్ ఫారెస్టుల్లోనూ, కొన్ని ఐస్ ల్యాండ్ ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. అత్యంత బరువైన, పొడవైన ఆపక్షిని ప్రపంచంలోనే ప్రమాదకరమైన పక్షిగా గుర్తించారు. అది దాని పొడవైన కాళ్ళతో మనుషులు, పెంపుడు జంతువులపై దాడి చేస్తుంటుంది. 2003 లెక్కల ప్రకారం క్వీన్స్ ల్యాండ్ ప్రాంతంలో ఈ కాసోవరీ పక్షి దాడికి ఎనిమిదిమంది గురైనట్లు, 1926-1999 మధ్య ప్రాంతంలో తీవ్ర గాయాలైన ఒకరు మృతి చెందినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఆస్ట్రేలియాలో ఈ జాతి పక్షులు సుమారు 2 వేల వరకూ ఉండొచ్చని పదహారేళ్ళ క్రితంనాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తోంది. -
గలాపగస్ లో మరో భారీ తాబేలు!
తాబేళ్లలో ఇంచుమించుగా అన్నింటి జీవితకాలం వంద ఏళ్లకు పైనే ఉంటుంది. అయితే వాటిల్లో జెయింట్ టార్టాయిస్లు అయితే ఏకంగా రెండు వందల ఏభై ఏళ్లు కూడా బతుకుతాయి. తాజాగా సైంటిస్టులు ఫసిఫిక్ మహా సముద్రంలోని గాలాపగస్ దీవుల్లో ఓ భారీ తాబేలు జాతి ఉన్నట్లుగా గుర్తించారు. నెమ్మదిగా కదిలే సరీసృపాల సమూహాల్లో మరొక రకమైన ఈ తాబేలు.. శాంటా క్రజ్ ద్వీపంలో ఇంతకు ముందున్న తాబేళ్ళ జాతికి భిన్నంగా, వైవిధ్యంగా ఉన్నట్లు గుర్తించారు. వీటి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు జన్యు సమాచారాన్ని సేకరిస్తన్నారు. ఈ ద్వీప సమూహంలో ఉన్న మొత్తం 15 తాబేళ్ళ జాతుల్లో నాలుగు అంతరించిపోగా ఇది 15 వ జాతిగా సైంటిస్టులు చెప్తున్నారు. గాలాపగస్ రిటైర్డ్ పార్క్ రేంజర్... చెలోనాయిడిస్ డాన్ ఫాస్టియో అని ఈ కొత్త జాతికి పేరు పెట్టారు. గాలాపగస్ లో నివసించే భారీ తాబేళ్ళు 250 కేజీల వరకు బరువుండి, వందేళ్ళకంటే ఎక్కువకాలం బతుకుతాయి. అయితే శాంటా క్రూజ్ ద్వీపంలో ఉన్న రెండు అతిపెద్ద తాబేళ్ళు ఒకే జాతికి చెందినవిగా ఉన్నప్పటికీ, అవి జన్యు పరీక్షల్లో తేడాలు ఉన్నట్లు తేలిందని ఈ క్వెడార్ పర్యావరణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్తగా కనుగొన్న జాతులను తూర్పు శాంటా క్రుజ్ తాబేళ్ళుగా పిలుస్తారని, ఇవి ద్వీపంలోని తూర్పువైపు నివపిస్తాయని, అయితే ఇతర ద్వీపాల్లోని అతిపెద్ద తాబేళ్ళతో పోలిస్తే వీటిలో విభిన్నమైన జన్యువులు ఉన్నట్లు గుర్తంచారు. ఈ అతిపెద్ద తాబేలు యొక్క షెల్ ఆకారం మాత్రం ఇతర జాతులకంటే మరింత కుదించినట్లుగా ఉందని, యేల్ విశ్వవిద్యాలయం జీవశాస్త్రవేత్త గిసెల్లా కాక్సియాన్ అన్నారు. 250 దాకా ఉన్న ఈ భారీ తాబేళ్ళ జాతుల పరిరక్షకులు, వీటి జాతులు అంతరించిపోకుండా, వీటికి హాని కలగకుండా పునరుద్ధరించడానికి సహాయపడగలరని వీరు ఆశతో ఉన్నారు. ఇతర తాబేళ్ళకంటే ఎక్కువగా.. రెండువేలకు పైగా అతిపెద్ద తాబేళ్ళ జాతులు ఈద్వీపంలో నివసిస్తున్నట్లు వీరు చెప్తున్నారు. గాలాపగస్ ద్వీపంలో 1830 నాటికే జెయింట్ టార్టాయిస్ ఉన్నట్లు ప్రముఖ బ్రిటిష్ అధ్యయన వేత్త ఛార్లెస్ డార్విన్ అధ్యయనాల వల్ల తెలుస్తోంది. 16వ శతాబ్దం కన్నా ముందు గాలాపాగస్లో తాబేళ్ల సంఖ్య రెండున్నర లక్షల వరకు ఉండేదిట. అయితే 17వ శతాబ్దం నుంచి వీటిని వేటాడి తినే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అంతేకాదు, ఈ దీవుల్లో ఉండే ఒక జాతి ఎలుకలు తాబేళ్ల గుడ్లను తినేస్తుండేవట. ఇటువంటి అనేక కారణాలతో 1970 కల్లా ఈ భారీ తాబేళ్ల సంఖ్య కేవలం 3000కు చేరింది. -
శామ్ సంగ్ జెయింట్ టాబ్లెట్ టీజర్ లీక్!
మొబైల్ ఫోన్ల విభాగంలో దుమ్ము రేపుతున్న శామ్ సంగ్ మార్కెట్లోకి మరో సరికొత్త ఉత్పత్తిని ఆవిష్కరించనుంది. యాపిల్ ప్రో ఐ-పాడ్ 12.9 ఇంచెస్ స్క్రీన్ కు దీటుగా.. శామ్ సంగ్ గెలాక్సీ 18.5 అంగుళాల జెయింట్ స్క్రీన్ తో టాబ్లెట్ ను ప్రవేశ పెట్టబోతున్నట్లు గత సంవత్సర కాలంగా రూమర్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆన్ లైన్ లో లీక్ అయిన ఓ టీజర్... ఆ విషయాన్ని రూఢి చేస్తూ.. స్మార్ట్ ఫోన్ అభిమానులను ఉవ్విళ్ళూరిస్తోంది. ఆన్ లైన్ లో ఇప్పటికే లీక్ అయిన వివరాలను బట్టి చూస్తే... 18.5 అంగుళాల జెయింట్ స్క్రీన్ తో గెలాక్సీ ట్యాబ్ అందర్నీ ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల యాపిల్ కంపెనీ విడుదల చేసిన లేటెస్ట్ మోడల్ అభిమానుల మనసు దోచుకుంటుండగా వారిని తనవైపు తిప్పుకొనేందుకు శామ్ సంగ్ కంపెనీ మార్కెట్లోకి అతి పెద్ద స్క్రీన్ తో జెయింట్ టాబ్లెట్ ను తెచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐఎఫ్ఏ బెర్లిన్ లో శామ్ సంగ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో టీజర్ లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆన్ లైన్ లో విడుదలైన టీజర్ ప్రకారం ఆ జెయింట్ టాబ్లెట్ కు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలిస్తే... సుమారుగా లాప్ టాప్ ను తలపిస్తున్న టాబ్లెట్.. ఆకట్టుకునే నల్లని రంగులో ఉంది. దీనికి ఫోల్డబుల్ స్టాండ్ ను కూడ అమర్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ టాబ్లెట్ పూర్తి వివరాలను అక్టోబర్ నెలలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు కొన్ని సంస్థలు కూడ చెప్తున్నాయి. ఆన్ లైన్ టీజర్ ప్రకారం 451.8 మి.మీ. వెడల్పు, 275.8 మి.మీ పొడవు తోపాటు 11.9 మందంగా ఈ బ్లాక్ టాబ్లెట్ ఉంది. 18.4 అంగుళాల టీఎఫ్ టి ఎల్సీడీ స్క్రీన్, 1920x1080 రిజల్యూషన్ తో 8 మెగా పిక్సెల్ కెమెరా కలిగిన ఈ పరికరంలో 2.1 మెగా పిక్సెల్ తో మరో కెమెరా ఉంది. ఆక్టాకోర్ శాంసంగ్ ఎక్జినోస్ 7 ప్రాసెసర్, 1.6 గిగాహెట్జ్ రన్నింగ్ కెపాసిటీ తోపాటు.. 2 జీబీ రాం కలిగి ఉంది. ఆ మెగా టాబ్లెట్ మార్కెట్లో నిజంగా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అంటూ సాంసంగ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.