గలాపగస్ లో మరో భారీ తాబేలు!
తాబేళ్లలో ఇంచుమించుగా అన్నింటి జీవితకాలం వంద ఏళ్లకు పైనే ఉంటుంది. అయితే వాటిల్లో జెయింట్ టార్టాయిస్‌లు అయితే ఏకంగా రెండు వందల ఏభై ఏళ్లు కూడా బతుకుతాయి. తాజాగా సైంటిస్టులు ఫసిఫిక్ మహా సముద్రంలోని గాలాపగస్ దీవుల్లో ఓ భారీ తాబేలు జాతి ఉన్నట్లుగా గుర్తించారు. నెమ్మదిగా కదిలే సరీసృపాల సమూహాల్లో మరొక రకమైన ఈ తాబేలు.. శాంటా క్రజ్ ద్వీపంలో ఇంతకు ముందున్న తాబేళ్ళ జాతికి భిన్నంగా, వైవిధ్యంగా ఉన్నట్లు గుర్తించారు. వీటి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు జన్యు సమాచారాన్ని సేకరిస్తన్నారు. ఈ ద్వీప సమూహంలో ఉన్న మొత్తం 15 తాబేళ్ళ జాతుల్లో నాలుగు అంతరించిపోగా ఇది 15 వ జాతిగా సైంటిస్టులు చెప్తున్నారు.
గాలాపగస్ రిటైర్డ్ పార్క్ రేంజర్... చెలోనాయిడిస్ డాన్ ఫాస్టియో అని ఈ కొత్త జాతికి పేరు పెట్టారు. గాలాపగస్ లో నివసించే భారీ తాబేళ్ళు 250 కేజీల వరకు బరువుండి, వందేళ్ళకంటే ఎక్కువకాలం బతుకుతాయి. అయితే శాంటా క్రూజ్ ద్వీపంలో ఉన్న రెండు అతిపెద్ద తాబేళ్ళు ఒకే జాతికి చెందినవిగా ఉన్నప్పటికీ, అవి జన్యు పరీక్షల్లో తేడాలు ఉన్నట్లు తేలిందని ఈ క్వెడార్ పర్యావరణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్తగా కనుగొన్న జాతులను తూర్పు శాంటా క్రుజ్ తాబేళ్ళుగా పిలుస్తారని, ఇవి ద్వీపంలోని తూర్పువైపు నివపిస్తాయని, అయితే ఇతర ద్వీపాల్లోని అతిపెద్ద తాబేళ్ళతో పోలిస్తే వీటిలో విభిన్నమైన జన్యువులు ఉన్నట్లు గుర్తంచారు.
ఈ అతిపెద్ద తాబేలు యొక్క షెల్ ఆకారం మాత్రం ఇతర జాతులకంటే మరింత కుదించినట్లుగా ఉందని, యేల్ విశ్వవిద్యాలయం జీవశాస్త్రవేత్త గిసెల్లా కాక్సియాన్ అన్నారు. 250 దాకా ఉన్న ఈ భారీ తాబేళ్ళ జాతుల పరిరక్షకులు, వీటి జాతులు అంతరించిపోకుండా, వీటికి హాని కలగకుండా పునరుద్ధరించడానికి సహాయపడగలరని వీరు ఆశతో ఉన్నారు. ఇతర తాబేళ్ళకంటే ఎక్కువగా.. రెండువేలకు పైగా అతిపెద్ద తాబేళ్ళ జాతులు ఈద్వీపంలో నివసిస్తున్నట్లు వీరు చెప్తున్నారు.
గాలాపగస్ ద్వీపంలో 1830 నాటికే జెయింట్ టార్టాయిస్ ఉన్నట్లు ప్రముఖ బ్రిటిష్ అధ్యయన వేత్త ఛార్లెస్ డార్విన్ అధ్యయనాల వల్ల తెలుస్తోంది. 16వ శతాబ్దం కన్నా ముందు గాలాపాగస్‌లో తాబేళ్ల సంఖ్య రెండున్నర లక్షల వరకు ఉండేదిట. అయితే 17వ శతాబ్దం నుంచి వీటిని వేటాడి తినే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అంతేకాదు, ఈ దీవుల్లో ఉండే ఒక జాతి ఎలుకలు తాబేళ్ల గుడ్లను తినేస్తుండేవట. ఇటువంటి అనేక కారణాలతో 1970 కల్లా ఈ భారీ తాబేళ్ల సంఖ్య కేవలం 3000కు చేరింది.