వివిధ దేశాల నుంచి దిగుమతికి ఏర్పాట్లు
జాబితాలో తెల్ల సింహం, జీబ్రా, కంగారూ, చింపాంజీలు
పలు దేశీయ జూల నుంచి పులులు, సింహాలు
జంతు మార్పిడిలో భాగమే అంటున్న అధికారులు
దత్తతకు ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థ
రానున్న రోజుల్లో అలరించనున్న అరుదైన జంతువులు
జూ.. ఈ పేరు చెబితేనే పిల్లల నుంచి పెద్దల వరకూ అదో వింత అనుభూతి కలుగుతుంది. ప్రకృతిలో మమేకమై సంచరించే వన్య ప్రాణులను చూస్తే ఒళ్లు పులకరిస్తుంది.. అలాంటి అనుభూతే నగరంలోని నెహ్రూ జూ పార్కులోనూ కనిపిస్తుంది. అయితే ఎప్పటి నుంచో ఉన్నదేగా! ఇప్పుడు ఆ సోదంతా ఎందుకు అనే సందేహం కలగక మానదు.. అదేనండి.. జంతు మారి్పడిలో భాగంగా నగరానికి కొత్త రకాల జాతులు, జంతువులు రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో నెహ్రూ జూపార్కు నగర వాసులకు కొత్త ఆకర్షణగా మారనుందని తెలుస్తోంది.. వీటిని దత్తత తీసుకునేందుకు ఇప్పటికే ఓ కార్పొరేట్ సంస్థ కూడా ముందుకొచి్చనట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే జూకు 16 దేశాల నుంచే కాకుండా దేశంలోని పలు జూల నుంచి కూడా కొత్త అతిథులు రానున్నాయి.
నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోకి ఈ వేసవిలో కొత్త జంతువులు రానున్నాయి. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా.. వాటి మనుగడకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆసే్ట్రలియాలో మాత్రమే కనిపించే కంగారూలు త్వరలోనే భాగ్యనగరంలో కనువిందు చేయనున్నాయి. జంతు మార్పిడిలో భాగంగా రెండు కంగారూలు, అదే విధంగా చెక్ రిపబ్లిక్ నుంచి తెల్ల సింహం, థాయిలాండ్ జీబ్రాలు, ఆఫ్రికా చింపాంజీలు రానున్నాయి. వీటి మనుగడకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే సంబంధిత జూ అధికారులు ఏర్పాట్లకు ప్రణాళికలు చేస్తున్నారు.
దేశీయ జూల నుంచి..
దీంతో పాటు దేశీయ జూ పార్కుల నుంచి కూడా జంతు మార్పిడి ప్రక్రియలో భాగంగా పులులు, సింహాలు, మొసళ్లతో పాటు ఇతర జంతవులు కూడా సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. కంగారూల సంరక్షణకు అయ్యే నిర్మాణ ఖర్చులను భరించేందుకు దుండిగల్‌లోని ఓ ఫార్మా కంపెనీ ముందుకొచి్చందని అధికారులు చెబుతున్నారు. జంతు మార్పిడి పథకంలో భాగంగా జపాన్‌లోని ఓక్లాహోమా జూపార్కు కంగారూ జంతువులు రెండు నెలల్లో రానున్నాయని తెలిపారు.
అనుమతి కోసం..
జపాన్‌లోని ఓక్లాహోమా గార్డెన్, హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్ మధ్య ఈ మేరకు ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయని, కేంద్ర, రాష్ట్రాల అటవీ, పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ, విదేశీ వాణిజ్య వ్యహారాల డైరెక్టర్ జనరల్ అనుమతి లభించిన వెంటనే తరలింపు ప్రక్రియ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే వేసవి సెలవులు ప్రారంభమయ్యే నాటికే కంగారు జంతువులు రంగప్రవేశం చేస్తాయని జూపార్క్ సంరక్షణాధికారి చెబుతున్నారు.
మారి్పడి ఇలా..
రాజ్‌కోట్ జంతు ప్రదర్శనశాలకు చెందిన ఆసియా జాతి సింహం గతేడాది ఆగస్టులో వచ్చింది. రెండు జతల అడవి కుక్కలు, కొండ చిలువలు 2, మంగళూరు బయోలాజికల్ పార్కు నుంచి తీసుకొచి్చ, వీటికి బదులుగా ఒకటి మగ, మూడు ఆడ మూషిక జింకలను జూ పార్కు నుంచి ఇచ్చారు. పెద్ద ఎగ్రెట్ 3 మగ, 3 ఆడ, గ్రే పెలికాన్, ఆడ మంగళూర్ పిలికుల జూకు అందజేశారు. త్రివేండ్రం జూ నుంచి సౌత్ అమెరికా వైట్ రియా 2 జతలు, బ్రౌన్ రియా 2 జతలకు ఎగరని పక్షి జాతి, జత ఎలుగుబంటి, తొండ జాతి ఇగ్వానా సెంట్రల్ అమెరికన్ జత వచ్చాయి. జపాన్‌లోని ఓక్లాహోమా జూ నుంచి జత మీర్ క్యాట్ వచ్చాయి.. బదులుగా ఒక ఆడ ఆసియా సింహాన్ని ఇచ్చారు.
కంగారూలు ఇక్కడ బతుకుతాయా?
ఆ్రస్టేలియాలో ఎక్కువగా కనిపించే కంగారూలు.. ఆఫ్రికాలోని కలహారి ఎడారిలో జీవించే మీర్కట్‌ల కోసం జూ అధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇతర విదేశీ జంతువుల కోసం కూడా అక్కడి వాతావరణ ఏర్పాట్లు కలి్పస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే జంతువులు భారత ఉపఖండం వాతావరణంలో బతకగలవా? లేదా? అనే విషయంపై జీవశాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున పరిశోధనలు చేశారు. మన దేశంలోనూ కంగారూలు సంచరించినట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు ఓ అవగాహనకు వచ్చారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల కిందట.. ఇదే జపాన్ నుంచి రెండు కంగారూలను కోల్‌కతాలోని కనజావా జూపార్కుకు తీసుకొచ్చారు. ప్రత్యేకంగా పెంచిన గడ్డిని, వాటికి అనువైన వాతావరణాన్ని కలి్పంచడంతో కంగారూలు మనుగడ సాగిస్తున్నాయి. నెహ్రూ జూపార్కులోనూ అదే తరహా ఏర్పాటు చేస్తున్నారు.
183 జాతులు.. 1,860 ప్రాణులు..
దాదాపు 380 ఎకరాల్లో విస్తరించిన నెహ్రూ జూపార్కులో ప్రస్తుతానికి 183 జాతులతో మొత్తం 1,860 జీవాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జంతు మారి్పడిలో భాగంగా నెహ్రూ జూపార్కుకు రెండు హిప్పోపొటమస్‌లు, సింహం లాంటి తోకలు ఉండే రెండు ముకాన్, బూడిద రంగు తోడేలు, జిరాఫీల జంట, నాలుగు కింగ్ కోబ్రాలను తీసుకొచ్చారు.
ప్రతిపాదనలు పంపించాం..
జంతు మారి్పడిలో భాగంగా ఈ ఏడాది జూకు కొత్త జంతువుల కోసం ప్రతిపాధనలు కేంద్ర కార్యాలయానికి పంపాము. ఇప్పటికే దేశీయ జూల నుంచి వివిధ రకాల జంతువులను తరలించాము. గత ప్రతిపాధనలతో పాటు కొత్త ప్రతిపాదనల్లో తెల్ల సింహాలు, జీబ్రా, చింపాంజీ, కంగారు జంతువులు తేనున్నాం. ప్రస్తుతం జూలో ఉన్న వన్యప్రాణుల ఆలనా పాలనా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వాతవరణ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాట్లు, ఆహారం అందజేస్తున్నాం.
– జె.వసంత, నెహ్రూ జూ పార్క్ క్యూరేటర్
Comments
Please login to add a commentAdd a comment