species
-
సరికొత్త తూనీగ జాతి.. భలే వెరైటీగా ఉంది!
సన్నని వెదురు గొట్టం మాదిరిగా ఉండే సరికొత్త తూనీగ జాతిని కేరళలో పశ్చిమ కనుమల ప్రాంతంలో తాజాగా గుర్తించారు. దీని పొట్ట భాగం పొడవైన స్థూపాకృతిలో అచ్చం సన్నటి వెదురు గొట్టాన్ని తలపించేలా ఉంటుంది. అందుకే దీనికి అగస్త్యమలై బాంబూటెయిల్ (వెదురుతోక) అని పేరు పెట్టారు. దీని శాస్త్రీయనామం మెలనోనౌరా అగస్త్యమలైకా. ఇది మెలనోనౌరా జెనస్ కుటుంబానికి చెందినది. ఆ కుటుంబంలో వెలుగులోకి వచ్చిన రెండో జాతి ఇదని సైంటిస్టులు చెబుతున్నారు.ఈ తూనీగలు కేరళలో తిరువనంతపురం జిల్లాలో పెప్పర వణ్యప్రాణి సంరక్షణ కేంద్రంలో మంజడినిన్నవిల ప్రాంత పరిధిలో పుణెలోని ఎంఐటీ వరల్డ్ పీస్ వర్సిటీ, కేరళ క్రైస్ట్ కాలేజీ సైంటిస్టుల బృందం కంటబడ్డాయి. అనంతరం పొన్ముడి కొండల్లో కూడా వీటి ఉనికిని గుర్తించారు. మెలనోనౌరా కుటుంబంలో తొలి తూనీగ జాతిగా మలబార్ బాంబూటెయిల్ గుర్తింపు పొందింది. దాన్ని కూర్గ్–వయనాడ్ ప్రాంతంలో తొలుత గుర్తించారు.చదవండి: అడవిలో అమ్మప్రేమ.. జంతువులు, పక్షుల్లో అరుదైన మమకారం!వాటితో పోలిస్తే అగస్త్యమలై తూనీగ (Agasthyamalai Damselfly) జాతిలో దాదాపు 7 శాతం దాకా జన్యూపరమైన తేడాలున్నట్టు తేలింది. పొడవాటి నల్లని శరీరం, నీలిరంగు చారికలు దీని సొంతం. ఇంతటి జీవ వైవిధ్యానికి నిలయమైన పశ్చిమ కనుమలను మరింతగా సంరక్షించాల్సిన అవసరం ఎంతో ఉందని ఎంఐటీ వర్సిటీకి చెందిన డాక్టర్ పంకజ్ కోర్పడే అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Tree frog శాపం గురించి ఎపుడైనా విన్నారా?! ఆసక్తికర సంగతులు
మా తోటలోని అధ్బుతమైన మర్రివృక్షం కింద కట్టుకున్న రెండంతస్తుల ఇల్లు.. మన మనుషుల కోసం అనుకుని ఎంతో పొరబడ్డాను. మొదటి వేసవికాలంలో, కొన్ని చెట్టుకప్ప(Tree Frog) లు వచ్చి చక్కగా నివసిస్తుంటే, అది చూసి నేను ఎంతో ముచ్చటపడ్డాను. వాటి శరీరం కింద పొందికగా పెట్టిన వాటి నాజూకైన పాదాలతో, పెద్ద జాలిగొన్న కళ్ళతో చూసే వాటికి నేను ఇంత చోటు ఇవ్వడానికి వెనకాడలేదు. కానీ ఈ విషయం స్పష్టంగా మిగిలిన కప్ప వంశానికి తెలిసిపోయి, ముని ముని మనవలు, ముని ముని మేనల్లుళ్లు, మేనకోడలు మరియు అవ్వలూ, అందరూ వచ్చి చేరారు. అతి త్వరలో ప్రతీ చూరు, పుస్తకము, కప్పు, ఇంకా పటములు వాటితో నిండిపోయాయి. కొన్నయితే వాషింగ్ మెషీన్ సబ్బు పెట్టెలో కూడా దూరాయి; కొన్ని వాషబేసిన్ నుంచి బయటకి వెళ్లే పైపులలో, మరికొన్నైతే సుఖంగా ఫ్లష్ ట్యాంక్ గోతిలో, ఇక చాలా అయితే గోడకీ బీరువాకి మధ్యనున్న చిన్న చోటిలో దూరి పడుక్కున్నాయి. ఒక దయ నిండిన ఉద్వేగ క్షణంలో, మా బతుకు మేము బతకటానికి మాకు ఇంత చోటు వదిలాయి.అర దశాబ్దం క్రితం, ఒక ఏడాది నగరంలో గడిపినప్పుడు, నేను ఒక పిల్లిని కానీ, కుక్కని కానీ పెంచుకునే స్థోమత లేకపోయింది. వాటికి బదులుగా నేను ఒక చిన్న చెట్టు కప్పను పెంచుకున్నాను. తను ఉన్న చిన్న గదిలో నిత్యకృత్యాల కోసం ఒక చిన్న బేసిన్ పెట్టి, ఆహారం కోసం పురుగులను ఆకర్షించడానికి లైటు వేసి ఉంచాను. ఇది ఒక బాధ్యతారహిత బంధం: నేను నడిపించడానికి తీసుకువెళ్లాలని కానీ, భోజనం పెట్టాలని కానీ, విద్యలు నేర్పాలని కానీ నా పెంపుడు కప్ప ఆశించలేదు. తన మనుగడ మొత్తం ఆ ఒక చిన్న తేమ నిండిన గదిలో సాగించింది. కిటికీ బయట తనకి బ్రతికి బట్ట కట్టే అవకాశం ఆట్టే లేని ఒక గందరగోళ కాంక్రీట్ అడవి ఉంది. చెప్పడానికి మేము ఒకరినొకరు హత్తుకుని గడపకపోయినా, ఆ కప్ప అక్కడ ఉండడం వల్ల నేను కొంత సేద తీరాను. అంత బాగానే సాగుతున్నంతలో, ఒక పుస్తకం పడి కప్ప ప్రాణం పోయింది. ఈ విపత్తును ఊహించనందుకు నాకు తీరని ఆవేదన కలిగింది.కానీ ఇప్పుడు దాని ఖర్మ ఫలంగా, పురాతన ఈజిప్టు మమ్మీ శాపమంత ఖచ్చితంగా ఈ చెట్టు కప్ప శాపం నాకు చుట్టుకుంది. మా కొత్త ఇంట్లో ఆ కప్పలు కేవలం కాస్త చోటే ఆశిస్తే, నేను శాంతి వహించి ఉండేదాన్ని. కానీ అవి వాటి కింది భాగం ఎంతో వ్యూహాత్మక కోణంలో బయటికి తిప్పి, విచక్షణ లేకుండా వంటగది అరుగులనూ, బల్లలనూ, తువ్వాళ్లనూ, కంచాలనూ ఆక్రమించాయి. కొన్ని గదుల్లో ఎండిపోయిన కప్ప మూత్రం చారలు కట్టాయి. టాయిలెట్ పై కూర్చోవడం ఒక పెద్ద ప్రహసనంగా మారింది. టాయిలెట్ మూత కింద మరిన్ని కప్పలు నక్కి ఉండి, అప్రమత్తంగా లేని అతిధులను అతి సున్నితమైన శరీర భాగాలపై తట్టి ‘భౌ’ మని దాగుడుమూతలు ఆడేవి. ఒక పెద్ద తల్లి కప్ప, బాత్రూంలో లైట్ వేసే దురదృష్టవంతులు ఎవరిపైనైనా సరే మూత్ర జల్లు కురిపించేది. చీకటి బాత్రూములూ, కప్ప మూత్రపు వాసనగొట్టే తువ్వాళ్ళు వాడవలసి వచ్చినందుకూ, పలుమార్లు ప్లేట్లు కడుక్కోవలసి వచినందుకూ అలసి, విసిగి, ఆ గెంతే దౌర్భాగ్యులపై సున్నితమైన యుద్ధం ప్రకటించాము.మొత్తం 289 కప్పలను పట్టి, పొరుగునున్న నూతుల్లో వదలడంలో ఒక ఆదివారం గడిపాము. కానీ అదంతా వ్యర్ధ ప్రయాసే. అవి చిన్న జంతువులే కానీ వాటికి పరిసర జ్ఞానాం ఖచ్చితంగా ఉంది. మేము ఆఖరి కప్పను తొలంగించేలోపే, వాటి ఆరితేరిన ఇంటితోవ తెలుసుకునే నైజం వాటిని ఇంటికి చేర్చింది. అంతేకాదు, ఇరవై నాలుగు గంటలు గడిచేలోపు అవన్నీ వాటికి ఇంట్లో ప్రీతి అయినా స్థలాల్లోకి వచ్చేశాయి; అసల అవి వెళ్లనేలేదు అన్నట్టు. నేను వాటి అత్యుత్తమ ప్రతిభకు వంగి నమస్కరించాను.చాలా కప్పలు వంటగదిలోని మూల బీరువా తలుపు కింద దూరి, బూరెలమూకుళ్లపై, ప్రెషర్ కుక్కర్ పై, ఇంకా మిక్సీ జార్ల పై యాజమాన్యాన్ని ప్రకటించాయి. నిన్న నేను వెల్లుల్లిపాయలు వేయిస్తుండగా మూకుడి నుంచి ఒక ఘాటైన దుర్గంధం వచ్చింది….అది…కాదు… అయి ఉండదు... చెట్టు కప్ప మూత్రం! కాసిన్ని వెల్లుల్లి రెబ్బలు ఒలవడానికే నాకు కొన్ని యుగాలు పట్టింది. మరి కాసిన్ని వలవడానికి మిగిలి ఉన్న జీవితాన్ని వృధా చేయదలచలేదు. అంచేత ఆ వాసన మాపడానికి మరిన్ని మసాలా దినుసులు వేశాను. కానీ తర్వాత వచ్చిన పొగడ్తలు, నా అద్భుతమైన వంట నైపుణ్యానికి వచ్చాయో, లేదా దాగిఉన్న ఆ…. వంటవారి రహస్య దినుసు అందామా … దానివల్ల వచ్చాయో, నేను ఖచ్చితంగా చెప్పలేను.రచయిత : జానకి లెనిన్ఫోటోలు : సచిన్ రాయ్ -
అస్తిత్వాన్ని వెలికి తీద్దాం
మనం పై పైన చూసే ఎన్నో విషయాలు మూలాల్లో ఉన్న అస్తిత్వానికి గొడ్డలిపెట్టుగా ఉండవచ్చు. అది మొక్కలకు సంబంధించినవైనా సరే...ప్రపంచంలో తెల్లజాతీయుల ఆధిపత్య వలసవాదులు పెట్టిన వృక్ష జాతుల శాస్త్రీయనామాల మూలాలను శోధించి తిరిగి వాటికి పూర్వపు పేర్లు ఉండేలా కృషి చేస్తోంది భాను సుబ్రమణ్యం. అమెరికాలోని వెల్లెస్లీ కాలేజీలో ఉమెన్ అండ్ జెండర్ స్టడీస్ ప్రోఫెసర్‌గా ఉన్న భారతీయురాలు.తెల్లజాతీయుల ఆధిపత్య వలసవాదులు పెట్టిన 126 వృక్ష జాతుల మూలాలను శోధించి, తిరిగి వాటి పూర్వపు పేర్లతోనే పిలిచేలా కృషి చేశారు.దీంతో ఆ వృక్షజాతుల పేర్ల గురించి ఎవరు చర్చించినా భాను సుబ్రమణ్యాన్ని గుర్తుంచు కుంటారు. ‘దీనిని అత్యంత క్లిష్టమైన సమస్యగా ఎవరూ గుర్తించరు. అధికారంలో ఉన్నవారు దీనికి అనేక కారణాలు చూపుతారు’ అంటారామె.మొక్కల పేర్ల నుండి స్థానిక జాతుల వరకు ప్రంచంలోని అనేక అంశాలు వలస సామ్రాజ్యాల ద్వారా రూపొందించబడ్డాయి. మనం ఈ వలసరాజ్యాల ఆధిపత్యాన్ని తొలగించాలి’ అంటారు వృక్షశాస్త్రంలో ఎంపరర్‌గా పేరొందిన భాను సుబ్రమణ్యం. తన కొత్త పుస్తకమైన ‘బోటనీ ఆఫ్ ఎంపైర్’లో వలసవాదం సృష్టించే సమస్యలు ఎప్పటికీ అంతం కావని, దాని వెనక తీవ్రమైన ప్రయత్నం ఎలా ఉండాలో తను రాసిన పుస్తకం ద్వారా సమాజం దృష్టికి తీసుకువచ్చింది. జాతుల వర్గీకరణ, మొక్కల పునరుత్పత్తి, దండయాత్రల ద్వారా ప్రవేశపెట్టబడిన జాతుల వ్యాప్తికి సంబంధించిన శాస్త్రంగా ఈ పుస్తకం మనకు వివరిస్తుంది. ‘నేను పరిణామాత్మక జీవశాస్త్రవేత్త, మొక్కల శాస్త్రవేత్తగా పేరొందాను. స్త్రీవాద, సాంకేతిక రంగాలలో మానవీయ, సామాజిక శాస్త్రాలను కూడా అధ్యయనం చేశాను. జెండర్, జాతి, కులానికి సంబంధించిన శాస్త్రాలు, వైద్యం, తత్వశాస్త్రం, చరిత్ర, సంస్కృతులను అన్వేషిస్తాను. నా ఇటీవల పరిశోధన వలసవాదం, జీనోఫోబియా చరిత్రలకు సంబంధించిన వృక్షశాస్త్రం వీటన్నింటినీ పునరాలోచింపజేస్తుంది. వలస, ఆక్రమణ జాతులకు సంబంధించి శాస్త్రీయ సిద్ధాంతాలు, ఆలోచనలు, విస్తృత ప్రయాణాలను అన్వేషిస్తుంది.భారతదేశంలో సైన్స్, హిందూ జాతీయవాదం సంబంధంపై కూడా పని చేస్తున్నాను. ఇప్పటివరకు మూడు పుస్తకాలను తీసుకువచ్చాను. వీటిలో ΄్లాంట్ వరల్డ్స్ అండ్ ది సైంటిఫిక్ లెగసీస్ ఆఫ్ కలోనియలిజం ఈ యేడాది తీసుకువచ్చాను. ది బయోపాలిటిక్స్ ఆఫ్ హిందూ నేషనలిజం సొసైటీ ఫర్ లిటరేచర్ బుక్ ప్రైజ్‌ను గెలుచుకుంది. ఈ పుస్తకం భారతదేశంలో పుట్టుకువస్తున్న జాతీయవాద రాజకీయాలు, ఆధునికత, సైన్స్, మతం ఒకదానికి ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో తెలియజేస్తుంది’ అని వివరిస్తుంది. భాను సుబ్రమణ్యం స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో పెరిగారు. దీంతో బ్రిటిషర్లు దేశంలో మూలాంశాలను ఎలా మార్చేశారో తెలుసుకున్నారు. ఫెమినిస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యయనాల కోసం అమెరికాలో పరిణామాత్మక జీవశాస్త్రంలో పీహెచ్‌డి చేశారు. తన రచనల ద్వారా జీవశాస్త్ర పండితురాలిగా పేరొందారు. ఈ ఏడాది జూలైలో జరిగే అంతర్జాతీయ బొటానికల్ కాంగ్రెస్‌లో పాల్గొని, అనేక సవరణలపై చర్చించబోతున్నారు.మొక్కల శాస్త్రీయ నామకరణాన్ని నియంత్రించే అంతర్జాతీయ కోడ్‌కు బాధ్యత వహించే నామకరణ విభాగం, వర్గీకరణ, శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన అనేక సవరణలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ఈ ప్రోఫెసర్ సమావేశంలో ΄ాల్గొన బోతున్నారు. ఏడేళ్ల క్రితం జరిగిన సమావేశంలో తీసుకున్న కోడ్ మెకానిజంలో అనుచితమైనవిగా పరిగణించబడే మరెన్నో మొక్కల పేర్లను ఈ సమావేశం తిరస్కరించవచ్చు. దీని వెనకాల ఈ సీనియర్ ప్రోఫెసర్ చేస్తున్న కృషి మనల్ని ఆలోచింపజేస్తుంది. వలసవాదం సుసంపన్నమైన వృక్ష ప్రపంచాలను జీవశాస్త్ర జ్ఞానంగా ఎలా మార్చింది అనే క్లిష్టమైన చరిత్రను అన్వేషించడానికి బాను సుబ్రమణ్యం దేశీయ అధ్యయనాలను శోధించారు. లాటిన్-ఆధారిత నామకరణ వ్యవస్థ, మొక్కల లైంగికతను వివరించడానికి యూరోపియన్ ఉన్నత వర్గాల ఊహాజనిత విధానాలను ‘బాటనీ ఆఫ్ ఎంపైర్’ పుస్తకం ద్వారా వివరించారు. వలసవాదులు మొక్కల కాలపు లోతైన చరిత్రను ఎలా నిర్మూలించారో మనం ఇందులో చూస్తాం. జాత్యాహంకారం, బానిసత్వం, వలసవాద చరిత్రలలోని దాని మూలల నుండి కేంద్రీకృతమైన వృక్షశాస్త్రానికి సంబంధించిన మరింత సమగ్రమైన, సామర్థ్యం గల రంగాన్ని ఊహించడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. -
అంతరించిన పక్షికి మళ్లీ ప్రాణం..!
భూమ్మీద పుట్టిన జీవరాశుల్లో అనేక జీవులు అంతరించిపోయాయి. ఇప్పటికే అంతరించిపోయిన జీవులను తిరిగి పుట్టించడం సాధ్యంకాదనే ఇంతవరకు అనుకుంటూ వచ్చారు. అయితే, అది సాధ్యమేనని రుజువు చేయడానికి శాస్త్రవేత్తలు నడుంబిగించారు. నాలుగు శతాబ్దాల కిందట అంతరించిపోయిన ‘డోడో’ పక్షులను తిరిగి పుట్టించడానికి అమెరికన్ బయోసైన్సెస్–జెనెటిక్ ఇంజినీరింగ్ కంపెనీ ‘కలోసల్ బయోసైన్సెస్’ శాస్త్రవేత్తలు ప్రయత్నాలను ప్రారంభించారు. డోడో పక్షులు భారీగా ఉండేవి. ఇవి ఎగరగలిగేవి కాదు. ఒకప్పుడు మారిషస్‌లో విరివిగా తిరిగేవి. ఈ జాతిలోని చివరి పక్షి 1681లో చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ పక్షులకు చెందిన పురాతన డీఎన్ఏ నమూనాలను సేకరించామని, వాటి ఆధారంగా మారిషన్ వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ సహకారంతో డోడో పక్షులకు పునర్జీవం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కలోసల్ బయోసైన్సెస్ వ్యవస్థాపకుడు బెన్ లామ్ వెల్లడించారు. డోడో తరహాలోనే ఇప్పటికే అంతరించిన గులాబి పావురానికి కూడా పునర్జీవం కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇవి చదవండి: ‘హషిమా’ దీవి.. ఈ చీకటి చరిత్రను తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది! -
నేలమీది తారక: పువ్వు కాదు.. పుట్టగొడుగు!
ఫొటోలో వింత పువ్వులా కనిపిస్తున్నది నిజానికి పువ్వు కాదు, పుట్టగొడుగు. చూడటానికి నక్షత్రాకారంలో కనిపించడం వల్ల దీనిని ‘రౌండెడ్ ఎర్త్స్టార్’ అంటారు. దీని శాస్త్రీయనామం ‘గీస్ట్రమ్ సాకేటమ్’. ఈ రకం పుట్టగొడుగులు ఎక్కువగా ఎండకు ఎండి, వానకు నాని పుచ్చిపోతున్న కలప దుంగలపై వేసవి చివరి భాగంలో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. హవాయి పొడి అడవుల్లో ఇవి విరివిగా కనిపిస్తాయి. అమెరికా, కెనడా, చైనా, ఉరుగ్వే, కాంగో, క్యూబా, మెక్సికో, పనామా, దక్షిణాఫ్రికా, టాంజానియా, టొబాగో, భారత దేశాలలో కొంత అరుదుగా కనిపిస్తాయి. పుచ్చిపోయే దశలో ఉన్న కలప దుంగల్లోని క్యాల్షియంను ఆహారంగా చేసుకుని ఈ పుట్టగొడుగులు పెరుగుతాయి. ఇవి మాసిపోయిన తెలుపు, లేతగోధుమ రంగు నుంచి ముదురు గోధుమ రంగు వరకు వివిధ ఛాయల్లో కనిపిస్తాయి.అయితే, ఇవి తినడానికి పనికిరావు. -
ఆధునిక మానవుని పుట్టుకపై అధ్యయనం..మనది ఒకే మూలం కాదట
ఆధునిక మానవుని మూలాలు ఎక్కడున్నాయి? ఆఫ్రికా అన్నది అందరూ చెప్పే సమాధానం. తొలి మానవులు అక్కడే పుట్టి, అక్కణ్నుంచే ప్రపంచమంతా వ్యాపించారని దశాబ్దాలుగా వింటూ వస్తున్నాం కూడా. అంతవరకూ నిజమే అయినా మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామన్న సిద్ధాంతం మాత్రం తప్పంటోంది ఓ తాజా అధ్యయనం. మన మూలాలు ఆఫ్రికాలోని కనీసం రెండు విభిన్న జాతుల్లో ఉన్నాయని చెబుతోంది. కనుక ఆధునిక మానవుని జన్మస్థలం ఫలానా అంటూ ఇదమిత్థంగా తేల్చి చెప్పలేమన్నది దాని సారాంశం.. మన ఆవిర్భావానికి ఒకే మూలమంటూ లేదని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. 10 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికావ్యాప్తంగా ఉనికిలో ఉన్న పలు ఆదిమ మానవ జాతులు హోమోసెపియన్గా పిలిచే ఆధునిక మానవుని పుట్టుకకు కారణమని అంటోంది. ‘‘ఆ కాలంలో ఆఫ్రికాలో నివసించి, క్రమంగా ఆ ఖండమంతటా వ్యాపించి పరస్పరం కలిసిపోయిన కనీసం రెండు ఆదిమ జాతులు మన ఆవిర్భావానికి మూలం. ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారి జన్యు డేటాను లోతుగా పరిశోధించిన మీదట ఈ నిర్ణయానికి వచ్చాం’’ అని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు చెబుతున్నారు. దీని వివరాలను జర్నల్ నేచర్‌లో ప్రచురించారు. ‘‘మన ఆవిర్భావానికి కారకుడైన ఆదిమ మానవులు ఒకే జాతికి చెందిన వారని మానవ వికాసంపై దశాబ్దాలుగా జరిగిన పరిశోధనల్లో చాలావరకు చెప్పుకొచ్చాయి. వారు ఆఫ్రికాలో తొలుత చెట్లపై నివసించి, అనంతరం క్రమంగా నేల మీదికి దిగారన్నది వాటి సారాంశం. కానీ ఆఫ్రికావ్యాప్తంగా మానవ ఆవాసాలకు సంబంధించిన శిలాజ, పురాతత్వ రికార్డులు ఈ వాదనతో సరిపోలడం లేదు. ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో సంచరించిన ఒకటికి మించిన ఆదిమ జాతులు వేలాది ఏళ్లపాటు పరస్పర వలసలు తదితరాల ద్వారా కలగలిసిపోయి క్రమంగా ఆధునిక మానవుని ఆవిర్భావానికి దారితీశాయన్నది మా పరిశోధనలో తేలింది. హేతుబద్ధంగా ఆలోచించినా ‘ఒకే మూలం’ సిద్ధాంతం కంటే ఇదే సమంజసంగా తోస్తోంది కూడా’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా జెనెటిసిస్ట్ డాక్టర్ బ్రెన్నా హెన్ వివరించారు. ఆ ఆధారాలే ఉంటేనా...! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరి మూలాలూ కచ్చితంగా 10 లక్షల ఏళ్ల నాటి ఈ రెండు ఆదిమ జాతుల్లోనే ఉన్నట్టు కచ్చితంగా చెప్పగలమని బృందం సభ్యుడైన విస్కాన్సిన్–మాడిసన్ వర్సిటీ పాపులేషన్ జెనెటిసిస్ట్ ఆరన్ రాగ్స్డేల్ అంటున్నారు. ఎలా చూసినా మనందరి జన్మస్థానం ఆఫ్రికా లోని ఒకే ప్రాంతమన్న వాదనకు కాలం చెల్లినట్టేనని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘కాకపోతే 10 లక్షల ఏళ్ల నాటి మానవ శిలాజ తదితర జన్యు ఆధారాలేవీ ఇప్పటిదాకా మనకు దొరకలేదు. లేదంటే ఆధునిక మానవుని (హోమోసెపియన్) ఆవిర్భావం, విస్తరణ తదితరాలపై ఈ పాటికే మరింత స్పష్టత వచ్చేది’’ అన్నారాయన. ఇలా చేశారు... డాక్టర్ హెన్ సారథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశల్లోని ప్రఖ్యాత సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. ఆఫ్రికాలోని పలు ప్రాంతాలకు చెందిన 290 మంది జన్యు అమరికను వారు లోతుగా విశ్లేషించారు. దాంతోపాటు ఆఫ్రికాలో ఉన్న భిన్న జాతుల వారి డీఎన్ఏను ఇందుకు ఎంచుకున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో సియెరా లియోన్‌లో నివసించే మెండే రైతు జాతి, ఇథియోపియాలో ఆదిమ వేటగాళ్ల నుంచి రూపాంతరం చెందిన గుముజ్ జాతి, అమ్హరాగా పిలిచే అక్కడి రైతులతో పాటు నమా అనే దక్షిణాఫ్రికాలోని వేటగాళ్ల సంతతి నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించారు. వాటిలోని వైవిధ్యాన్ని బట్టి లక్షల ఏళ్ల క్రితం ఆ డీఎన్ఏలు ఎలా ఉండేవో, ఇన్నేళ్ల పరిణామక్రమంలో ఏ విధంగా మారుతూ వచ్చాయో అత్యాధునిక సాఫ్ట్వేర్ ఆధారంగా సిమ్యులేషన్ విధానంలో ఆవిష్కరిస్తూ వచ్చారు. ఇప్పటిదాకా లభించిన అతి పురాతన మానవ శిలాజం (3 లక్షల ఏళ్ల నాటిది) ఆఫ్రికాకు చెందినదే. అంతేగాక అతి పురాతన రాతి పనిముట్లు కూడా అక్కడే దొరికాయి. ప్రధానంగా ఈ రెండింటి ఆధారంగానే ఆఫ్రికానే మన జన్మస్థానమని గత అధ్యయనాల్లో చాలావరకు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆఫ్రికావాసుల డీఎన్ఏను బ్రిటిష్ వారి డీఎన్ఏతోనూ, క్రొయేషియాలో దొరికిన దాదాపు 50 వేల ఏళ్ల నాటి మన పూర్వీకుడైన నియాండర్తల్ మానవుని డీఎన్ఏతోనూ పోల్చి చూశారు. ఆఫ్రికావ్యాప్తంగా ఒకటికి మించిన ఆదిమ జాతులు వేల ఏళ్ల క్రమంలో తమలో తాము కలిసిపోయిన ఫలితంగానే మనం పుట్టుకొచ్చామని తేల్చారు. కనీసం రెండు ప్రధాన ఆదిమ జాతులు మన ఆవిర్భావానికి మూల కారకులని డాక్టర్ హెన్ సూత్రీకరించారు. వాటికి స్టెమ్1, స్టెమ్2గా పేరు పెట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రమాదంలో తేనెటీగలు.. మానవాళి మనుగడకే ముప్పు!
సాక్షి, అమరావతి: తేనెటీగలు.. సృష్టిలోనే ఓ గొప్ప సహజసిద్ధ ఇంజనీర్లు. షడ్భుజాలతో ఆరు వేల గదుల ఇళ్లను పక్కపక్కనే నిరి్మంచుకోగల సామర్థ్యం వీటి సొంతం. సమైక్య జీవనానికి ప్రతీకలైన మధుమక్షికలు వేలాది కిలోమీటర్ల మేర ప్రయాణించి.. పూలలోని మకరందాన్ని సేకరించుకొస్తాయి. వీటి నిరంతర శ్రమ వల్లే భూలోకంలోని చెట్లు, మొక్కలు మనగలుగుతున్నాయి. ఎన్నో పంటలు వీటివల్లే పండుతున్నాయి. ఈ చిరు ప్రాణులు జీవకోటికి చేస్తున్న మేలు ఎంతంటే.. తేనెటీగలు మొత్తం అంతరించిపోతే కేవలం 30 రోజుల్లో భూమండలంపై ప్రాణికోటి కూడా అంతరించిపోతుంది. అంతటి విశిష్టత గల తేనెటీగలకు మానవాళి వల్ల పెద్ద కష్టమే వచి్చపడింది. 180 రకాల తేనెటీగల జాతులు అత్యంత ప్రమాదంలో చిక్కుకున్నాయని ఐక్యరాజ్య సమితి తేల్చింది. వీటిని సంరక్షించేందుకు రంగంలోకి దిగింది. భూమండలాన్ని పచ్చగా ఉంచేందుకు మట్టి, నీరు, సూర్యరశ్మి ఎంత అవసరమో తేనెటీగలు (మధుమక్షికలు) కూడా అంతే అవసరం. నేలపై ఉన్న వృక్ష జాతులతోపాటు 90 శాతానికి పైగా పంటలు తేనెటీగల వల్లే అభివృద్ధి చెందుతున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. మానవాళి జీవితం మొత్తం ఇతర జీవులతో ముడిపడి ఉంది. వాటిలో అత్యంత ముఖ్యమైన ప్రాణి తేనెటీగ. ప్రకృతికి ఎంతో మేలు చేస్తున్న తేనెటీగలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. కేవలం పూల మకరందంపై ఆధారపడి జీవించే తేనెటీగలు పంటలపై మితిమీరి వినియోగిస్తున్న పురుగు మందులు, కాలుష్యం కారణంగా మరణిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి సైతం తేనెటీగల రక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని అన్ని దేశాలను కోరుతోందంటే వీటి అవసరం ప్రపంచానికి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. తేనెటీగలు జీవ వైవిధ్యంలో భాగం. మానవ మనుగడ అంతా వాటిపైనే ఆధారపడి ఉంది. పంటలు సకాలంలో పండడంలో కీలకమైన పరపరాగ సంపర్కానికి అత్యంత వేగవంతమైన వాçßæకాలుగా ఇవి సేవలు అందిస్తున్నాయి. ఇది నాణేనికి ఒకవైపు అయితే, ప్రజలకు అత్యంత నాణ్యమైన ఆహారమైన తేనె, రాయల్ జెల్లీ, మైనం వంటి వాటిని అందించడంతో పాటు తేనెటీగల విషాన్ని సేకరించి ఇతర ఉత్పత్తులకు వినియోగిస్తున్నారు. పురుగు మందుల వాడకంతో.. పంటల రక్షణ కోసం పురుగు మందులను మితిమీరి వినియోగిస్తుండటంతో తేనెటీగల జాతి తగ్గిపోతోందని జీవవైవిధ్య శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా తేనెటీగలు పూల సువాసనను గుర్తించలేకపోతున్నాయని పరిశోధనల్లో తేలింది. ఈ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల జాతులు అంతరించిపోతున్నట్టు యూకే అగ్రికల్చరల్ విభాగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ దేశంలో గత పదేళ్లలో 13 జాతులు అంతరించిపోగా.. మరో 35 జాతులు ప్రమాదంలో ఉన్నాయని గుర్తించింది. అందుకు పంటలకు వాడుతున్న నికోటినాయిడ్స్ కారణమని వెల్లడించింది. వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 18 జాతులు పూర్తిగా కనుమరుగైపోయాయని, మరో 180 జాతులు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ క్యూరేట్ (ఐయూసీఎన్) ప్రకటించింది. యుద్ధప్రాతిపదికన తేనెటీగల సంతతిని పెంచకపోతే సమీప భవిష్యత్‌లో ప్రపంచం ఆహార కొరతను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. రక్షణకు తక్షణ చర్యలు అవసరం మొక్కలు, పూల పరాగ సంపర్కానికి తేనెటీగల అవసరాన్ని గుర్తించిన యూరోపియన్ యూనియన్ 2018 మేలో నియోనికోటినాయిడ్స్ అని పిలిచే మూడు రకాల పురుగుమందులపై నిషేధాన్ని విధించింది. అయితే, అంతకు ముందే 2011లో స్లోవేనియా దేశం తేనెటీగలకు హానికరమైన చాలా పురుగు మందులను నిషేధించిన తొలి దేశంగా గుర్తింపు పొందింది. కాగా, 2019 చైనాలోని కుని్మంగ్లో జరిగిన ఐక్యరాజ్యసమితి బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ (కాప్–15)లో 2030 నాటికి పంటలపై పురుగు మందుల వాడకాన్ని మూడింట రెండొంతులు తగ్గించాలని నిర్ణయించింది. ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహార ధాన్యాల కొరతను తగ్గించాలంటే తేనెటీగల సంఖ్య పెరగాలని.. ఆ ప్రాణులు బతకాలంటే రసాయన పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం ఒక్కటే పరిష్కారమని ఆ సదస్సులో ప్రతినిధులు పేర్కొన్నారు. తేనెటీగల ఆవాసాలను రక్షించడానికి, ప్రభుత్వాలు, సంస్థలు, పౌర సమాజాన్ని చైతన్యం చేసి ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి ఏటా మే 20న ప్రపంచ తేనెటీగల దినోత్సవం నిర్వహించాలని ప్రకటించింది. మూడో వంతు ఆహారోత్పత్తి వీటివల్లే.. ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్‌ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకో సిస్టం సరీ్వస్ (ఐపీబీఈఎస్) పేర్కొంటున్న ప్రకారం దాదాపు 80 మిలియన్ల సంవత్సరాలుగా తేనెటీగల ప్రపంచంలో అత్యంత పరాగ సంపర్కం చేసి నేరుగా ఆహార భద్రతకు దోహదం చేస్తున్నాయి. ఏటా 1.77 మిలియన్ మెట్రిక్ టన్నుల తేనెను మనకు అందిస్తున్నాయి. ప్రపంచంలోని ఆహార ఉత్పత్తిలో మూడోవంతు తేనెటీగల పైనే ఆధారపడి ఉందని ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) ప్రకటించిందంటే వీటి ప్రాధాన్యం ఎంతో అర్థం చేసుకోవచ్చు. తుమ్మెదలు, సీతాకోక చిలుకలు, పక్షులు, కొన్ని జంతువులు, కీటకాలు పరాగ సంపర్కానికి, మొక్కల పునరుత్పత్తికి దోహదం చేస్తున్నా.. అత్యంత సాధారణ పరాగ సంపర్కాలలో తేనెటీగలు ముందున్నాయి. చదవండి: ఉన్నట్టుండి ఉద్యోగం ఊడిందని పిచ్చెక్కుతోందా? ప్రేయసి హ్యాండ్ ఇచ్చిందని తెగ ఫీలవుతున్నారా? -
‘చీరమీను’ రుచి అదిరేను.. ఏడాదిలో మూడు వారాలే లభ్యం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఇండో పసిఫిక్ ప్రాంతంలో లభించే అరుదైన చేప జాతి చీరమీను. రొయ్య పిల్లలను పోలి ఉన్నా అది చేప జాతి. గోదావరికి ప్రత్యేకం. పులస తర్వాత స్థానం దీనిదే. ఏడాదిలో సీజనల్‌గా మూడు వారాలు మించి దొరకదు. అంగుళమే ఉన్నా రుచిలో అదరగొడుతుంది. ధరలో బంగారంతో పోటీపడుతుంది. చీరమీను అక్టోబర్‌లోనే గోదావరి ఒడ్డున దొరుకుతుంది. దసరా నుంచి దీపావళి మధ్య లభించే చీరమ మహా అయితే నాగులచవితి వరకూ మాత్రమే లభిస్తుంది. మత్స్యకారులు గోదావరి ఒడ్డున చీరలతో పట్టుకుంటారు. అందుకే ఈ చేపను గోదారోళ్లు చీరమీనుగా పిలుస్తారు. సముద్రనీరు, గోదావరి కలిసే చోట.. శాస్త్రీయంగా సారిడా గ్రాసిలిస్, టంబిల్, ఆండో స్క్వామిస్ జాతులకు చెందిన పిల్ల చేపల్నే చీరమీను అంటారు. సముద్రనీరు, గోదావరి కలిసే బురదనీటి మడుగుల్లో ఎక్కువగా లభిస్తాయి. మడ అడవులు ఎక్కువగా పెరిగే ప్రాంతాల్లోని నీళ్లలో ఆక్సిజన్ శాతం అధికంగా ఉండటంతో ఆ జాతి చేపలు ఆ ప్రాంతానికి వెళ్లి గుడ్లు పెడతాయి. గుడ్లు పిల్లలుగా మారి ఒకేసారి సమూహంగా గోదావరి ఒడ్డున ఈదుతుంటాయి. ఇవి పాండిచ్చేరి కేంద్రపాలిత యానాం, కోనసీమలోని భైరవపాలెం, ఎదుర్లంక, గుత్తెనదీవి, జి.వేమవరం, జి.మూలపొలం, అంతర్వేది ప్రాంతాల్లో లభిస్తాయి. గౌతమీ గోదావరి యానాం వద్ద బంగాళాఖాతంలో భైరవపాలెం సమీపంలో కలుస్తుంటుంది. ఈ ప్రాంతంలో చీరమీను ఎక్కువగా లభిస్తుంది. పులస మాదిరిగానే రూ.వేలకు వేలు పెట్టినా సీజన్లో చీరమీను తినాల్సిందేనంటారు. అరుదుగా దొరికే ఈ చీరమీనును ఇటీవల బకెట్లు, బిందెల్లో విశాఖపట్నం, హైదరాబాద్‌తో పాటు ఫ్రాన్స్ దేశానికి కూడా పంపిస్తున్నారు. వీటిని తవ్వ, సేరు, కుంచం, బిందెలతో కొలిచి అమ్ముతున్నారు. ప్రస్తుతం సేరు(కిలో) చీరమీను రూ.1500 నుంచి రూ.2000 పలుకుతోంది. బిందె రూ.30వేలు పైమాటే. చింతచిగురు–చీరమీను, చీరమీను–మామిడికాయ, చీరమీను–గోంగూర ఇలా కలగలుపు వంటల్లో వినియోగిస్తారు. గోదావరికే ప్రత్యేకం.. సముద్రం వైపు నుంచి వీచే తూర్పు గాలులకు నది ఒడ్డున చీరమీను లభ్యమవుతుంది. ఇది గోదావరిలో మాత్రమే యానాం పరిసర ప్రాంతాల్లో అరుదుగా లభిస్తుంది. వీటిని ఆకాశంలో ఎగిరే పక్షులు చూసి తింటుంటాయి. చీరల్లో మాత్రమే లభిస్తాయి. శాస్త్రీయంగా సారిడా గ్రాసిలిస్, టంబిల్, ఆండో స్క్వామిస్ జాతులకు చెందిన పిల్ల చేపలే ఇవి. –డాక్టర్ చంద్రశేఖర్, బయోలజీ హెడ్, ఎస్ఆర్కె డిగ్రీ కళాశాల, యానాం -
మాకు బతకాలని ఉండదా!.. కనపడితే ఖతం చేస్తున్నారు
సాక్షి ,భామిని(పార్వతిపురం మన్యం): సరీసృపాల్లో సర్పజాతిపై అవగాహన లోపంతో అవి అంతరించి పోయే దుస్థితి ఏర్పడింది. హైందవ సంప్రదాయంలో పవిత్ర స్థానం గల సర్పాలకు పూజలు, నోములు చేస్తున్న చోటే అవగాహన లోపంతో వాటిని అంతం చేసే సంస్కృతి సాగుతోంది. దెబ్బ తిన్న పాము పగ పడుతుందనే అభూత కల్పన, పాము కాటు వేస్తే విష ప్రభావంతో మరణిస్తామనే భయంతో వాటిని హతమారుస్తున్నారు. గ్రామస్తుల చేతిలో హతమైన భారీ కొండచిలువ పంట కాపాడే పాములు రైతు పండించే పంటలో నలభై శాతం స్వాహా చేస్తున్న ఎలు కలు, పందికొక్కుల నివారణ లో కీలక పాత్ర ధారి పాముకు మనుగడ కష్టమైపోతోంది. పర్యావరణ పరిరక్షణలో కీలకంగా, భూ సారాన్ని కాపాడే ముఖ్యమైన జీవిగా గుర్తింపు పొందినా వాటికి తగిన రక్షణ కరువవుతోందని పర్యావరణ హితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రిమి సంహారక మందుల ప్రభావం ప్రధానంగా వ్యవసాయ రంగంలో వినియోగించే క్రిమి సంహారక మందుల ప్రభావం, ఆదునిక యంత్రాల వాడకంలో పుట్టలు, తుప్పలు, దిబ్బలు లేకుండా, భూమిలో బొరియలు లేకుండా చేయడంతో పాముల సంచారం కష్టమైంది. విష సర్పాలు తక్కువ.. మన చుట్టూ తిరుగుతున్న పాములలో 80 శాతం విషంలేని సాధారణ సర్పాలే ఉన్నాయి. విçషపూరితమైనవి, ప్రాణాంతకం కలిగించేవి కొద్దిగానే ఉన్నాయి. నాలుగు రకాలైన తాచుపాము(నాగుపాము),రక్తపింజర,కట్లపాము, పొడపాములను విషసర్పా లుగా గుర్తించారు. పాము కాటుకు గురైన వ్యక్తుల్లో అత్యధికంగా భయంతోనే ఎక్కువ మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పాములపై అవగాహన అవసరం విద్యార్థి స్థాయి నుంచి పాములపై అవగాహన కల్పించాలి. అన్ని పాములు ప్రమాదరం కావని తెలియజేయాలి. పాము పగ పడుతుందనే మూఢ నమ్మకాలు విడిచి పెట్టేలా చైతన్యం కల్పించాలి. స్నేక్స్ ఫ్రెండ్లీ సొసైటీలు ఏర్పాటు కావాలి. అన్ని పాములను హరించడం తగదు. కొట్టి చంపకుండా, పట్టి దూరంగా విడిచిపెట్టాలి. అవి అంతరించకుండా చూడాలి. పాములన్నీ విషసర్పాలు కావు పాములన్నీ విషసర్పాలు కావు. అన్ని పాములకు విషం ఉండదు. పాము కాటు వేస్తే చనిపోతామనే భయం వీడాలి. ప్రమాదవశాత్తు పాముకాటుకు గురైనా భయపడవద్దు. అందుబాటులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకురండి. విషాన్ని నివారించే ఏంటీస్నేక్ వీనమ్(ఏఎస్వీ) మందులు అందుబాటులో ఉన్నాయి. పాముకాటు పడిన తరువాత గాయాన్ని కడగవద్దు. పాము వేసిన గాట్లు గుర్తించి విషప్రభావం లెక్కించి ఏఎస్‌వీలు వేస్తాం. – డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు,డిప్యూటీ డీఎంహెచ్ఓ,సీతంపేట పాము కనిపిస్తే సమాచారం ఇవ్వండి పాములు కనిపిస్తే సమాచారం ఇవ్వండి. సర్ప జాతుల సంరక్షణకు స్నేక్ రెస్క్యూ టీం తరలి వస్తుంది. ప్రాణాపాయం లేకుండా పట్టుకుని అడవుల్లో విడిచి పెడతాం.అటవీశాఖాధికారుల సహకారంతో గ్రీన్ మెర్సీ సంస్థ ఉచితంగా సేవలు అందిస్తుంది.సర్పజాతులను చంపవద్దు. ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది.హెల్ప్‌లైన్ నంబర్ 9848414658కు తెలియ పర్చండి. పాములను చంపడం చట్టరీత్యానేరం.1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం మేరకు కఠిన శిక్షలు తప్పవు. – కేవీ రమణమూర్తి, సీఈఓ, గ్రీన్‌మెర్సీ వన్యప్రాణ సంరక్షణ గస్తీ బృందం చదవండి: Gujarat Riots: గుజరాత్ అల్లర్ల వెనుక షాకింగ్ నిజాలు.. మోదీని గద్దె దింపేందుకే కాంగ్రెస్ ప్లాన్! -
అన్ని జీవుల జన్యుగుట్టు తేల్చే ప్రాజెక్ట్!
మెల్బోర్న్: ప్రపంచంలోని ప్రతి సంక్లిష్ట జాతి జన్యువుల లోగుట్టును విశదీకరించే భారీ ప్రాజెక్టు పూర్తైతే జీవశాస్త్రంలో సంచలనాలు చూడవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పదేళ్లలో దాదాపు 18 లక్షల స్పీసిస్ (ప్రజాతులు) జీనోమ్ సీక్వెన్సింగ్ చేసే ద ఎర్త్ బయోజీనోమ్ ప్రాజెక్ట్ (ఈబీపీ)కు 2018లో శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు లక్ష్యాలు, పురోగతి తదితర వివరాలను మంగళవారం సైన్స్ జర్నల్స్‌లో ప్రచురించారు. ఈ ప్రాజెక్టు పూరై్తతే ఇంతవరకు జరిగిన బయోలాజికల్ రీసెర్చ్ రూపురేఖలు మారతాయి. విశేషాలు.. ► ఈ ప్రాజెక్టులో 22 దేశాలకు చెందిన 44 సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. సుమారు 5వేల మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు. ► ప్రాజెక్టుకు దాదాపు 470 కోట్ల డాలర్ల వ్యయమవుతుందని అంచనా. ► సంక్లిష్ట జీవులు ఎలా ఉద్భవించాయి? జీవ వైవిధ్యత ఎలా మనుగడ సాగిస్తోంది? తదితర ప్రశ్నలకు సమాధానాలు ఈ ప్రాజెక్టుతో లభిస్తాయని అంచనా. ► హ్యూమన్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ ప్రేరణతో 2016లో ఈబీపీని ప్రతిపాదించారు, 2018 నవంబర్‌లో అధికారికంగా ప్రారంభించారు. ► ప్రతి కుటుంబం (టాక్జానమీలో ఫ్యామిలీ) నుంచి కనీస ఒక్క జీనోమ్ సీక్వెన్సింగ్‌ను తొలిదశలో పూర్తి చేయాలని సంకల్పించారు. ► రెండోదశలో సుమారు 1.8లక్షల జాతుల సీక్వెన్సింగ్ చేస్తారు, మూడోదశలో అన్ని జీవుల సీక్వెన్సింగ్ పూర్తవుతుంది. ► ఏకకణ జీవుల నుంచి మానవుల వరకు భూమిపై ఉన్న అన్ని జీవుల జీనోమ్ సీక్వెన్సింగ్ ఈ ప్రాజెక్టులో పూర్తి చేస్తారు. అంటే దాదాపు ప్రతి ప్రాణి జన్యు గుట్టును ఈ ప్రాజెక్టు బహిర్గతం చేస్తుంది. ► దీనివల్ల భవిష్యత్‌లో వైద్య, ఫార్మా రంగాల్లో ఊహించని పురోగతి సాధించవచ్చని పరిశోధకుల అంచనా. -
వలలో వరాలు.. అదృష్టం అంటే ఇదే!
సాక్షి,అరసవల్లి( శ్రీకాకుళం): ఉద్దానం మత్స్యకారుల వలలో వరాలు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అరుదుగా దొరికే ట్యూనా చేపలు నాలుగు రోజులుగా ఇక్కడి గంగపుత్రులకు దండిగా దొరుకుతున్నాయి. టన్నుల కొద్దీ చేపలను ఇతర రాష్ట్రాలకు తరలించి వారు సంబరపడుతున్నారు. జిల్లాలో అక్టోబర్–డిసెంబర్ మధ్యకాలంలో ఉద్దానం తీరాల్లో తక్కువ మొత్తంలోనే ట్యూనా దొరికేది. ఎవరికో గానీ ఆ అదృష్టం వరించేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం దాదాపుగా వేటకు వెళ్లిన అన్ని వలలకు ట్యూనా చేపలు పడటం విశేషం. నాలుగు రోజుల్లో 200 టన్నులు.. జిల్లాలో సోంపేట, కవిటి మండలాల పరిధిలోనే ట్యూనా చేపలు లభ్యమవుతున్నాయని స్థానిక మత్స్యకారులు, అధికారులు చెబుతున్నారు. బారువ, ఇసుకలపాలెం, ఉప్పలాం, గొల్లగండి తదితర తీర ప్రాంతాల్లో గత నాలుగైదు రోజుల నుంచి భారీగా ట్యూనా చేపలు లభ్యమయ్యాయి. ఈ చేపల లభ్యత సమాచారాన్ని తెలుసుకున్న చేపల వ్యాపారస్తులు స్థానికులతో ఫోన్లలో బేరాసారాలు చేసుకుని రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గత నాలుగు రోజుల్లో సుమారు 200 టన్నుల ట్యూనా చేపలు కేరళ, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాలకు తరలించారు. తొలి రెండు రోజుల్లో కిలో చేపల ధర రూ.30 వరకు ఉంటే, ఇప్పుడు రూ.38 నుంచి రూ.45కి చేరింది. ఇదే ధరలతో కేరళకు భారీగా చేపలు విక్రయాలు జరిగినట్లుగా మత్స్యశాఖాధికారులు చెబుతున్నారు. ఇక ఈ చేపలకు జపాన్ తదితర నార్త్ ఈస్ట్ దేశాల్లో గిరాకీ అధికంగా ఉండడంతో ఇక్కడి నుంచి చేపలను ఎగుమతి చేసేందుకు వ్యాపారులు సన్నాహాలు చేస్తున్నారు. విదేశాల్లో డిమాండ్ ఉంది ట్యూనా చేపలను స్థానికంగా సూరలని పిలుస్తుంటారు. ఇక్కడి వారి కంటే ఇతర దేశస్తులు అధికంగా ఆహారంగా తీసుకుంటారు. గతంలో పోల్చితే ఈసారి అధికంగా చేపల సంతతి బయటపడటంతో అక్కడి వలలకు చిక్కాయి. దేశంలోనే చేపల అభివృద్ధిలో ప్రథమ స్థానంలో మన రాష్ట్రం నిలిచింది. అలాగే ఇందులో మన జిల్లా కూడా ప్రాధాన్యతను పొందడం విశేషం. – పీవీ శ్రీనివాసరావు, మత్స్యశాఖ, జేడీ ఇన్ని ఎప్పుడూ దొరకలేదు ట్యూనా చేపలు అప్పుడప్పుడూ దొరుకుతాయి. అయితే ఇంత ఎక్కువ ఎప్పుడూ చూడలేదు. కేజి రూ.38 చొప్పున సుమారు 60 టన్నుల వరకు కేరళ రాష్ట్రానికి పంపించాం. ముందు రోజుల్లో ధర కాస్తా తగ్గించి ఇచ్చాం. ట్యూనా చేపలతో లాభం బాగుంది. – చిడిపల్లి గురుమూర్తి, మత్స్యకారుడు వచ్చే నెల వరకు చిక్కుతాయి ట్యూనా చేపలకు డిమాండ్ ఉంది. మరో నెల రోజుల వరకు కూడా చేపలు వలలకు చిక్కుతాయనే అనుకుంటున్నాం. అందుకే మళ్లీ వేటకు వెళ్తాం. ఇతర దేశాలకు ఉద్దాన తీర ప్రాంత చేపల రుచి చేరనుంది. వాతావరణం అనుకూలిస్తే మరిన్ని రోజులు వేట కొనసాగిస్తాం. – సవధాల ఢిల్లేసు, మత్స్యకారుడు చదవండి: విదేశీ అతిథులు రా..రమ్మంటున్నాయి.. -
ఇంతకీ ఈ వింత జంతువు పేరేంటి!
అవును.. ఇదేంటి? ఒక్కొక్కరూ ఒక్కోటి చెప్తారు.. చూడ్డానికి నక్కలా ఉందని కొందరు.. కుక్కలా ఉందని మరికొందరు.. ఇవన్నీ కాదహే.. అని ఇంకొందరు.. ఇది తిమింగళం అని మేమంటాం? మీరేమంటారు? ఎర్రగడ్డ నుంచి డిశ్చార్జి అయి ఎన్ని రోజులైంది అని అనేగా.. అచ్చంగా ఇది తిమింగళమే.. అవును.. అవి ఒకప్పుడు నాలుగు కాళ్లపై నడిచేవట. మనిషి కోతి నుంచి పుట్టాడు అంటారు.. ఒక్కో జంతువు.. ఒక్కో జంతువు నుంచి పరిణామం చెందాయనేది కూడా తెలిసిందే. తాజాగా వేల్స్ విషయం చూసుకుంటే.. అవి ఎలా పరిణామం చెందాయనే దానిపై పరిశోధనలు జరిగాయి. ఈ జలచరాలు.. జింకల మాదిరిగా చెంగుచెంగున భూమిపై గంతులు వేసేవనే విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. అమెరికాలోని నార్త్ ఒహియో మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. లిటిల్ డీర్స్ అనే ఇండోహయస్ జంతువుల నుంచి ఈ వేల్స్ పరిణామం చెందాయని వివరించారు. సీటేషియన్స్ జాతికి చెందిన జంతువుల (హిప్పోపోటమస్, వేల్స్ వంటివి) జీవ పరిణామం గురించి అధ్యయనం చేస్తుండగా, పాకిస్తాన్లో 4.7 కోట్ల సంవత్సరాల కిందటి లిటిల్ డీర్‌కు సంబంధించిన శిలాజం లభించింది. ఇది ఓ నక్క పరిమాణంలో ఉండి, పొడవాటి శరీరం, తోక కలిగి ఉన్నట్లు వారు గుర్తించారు. ఈ జీవిలోని పలు ఎముకల నిర్మాణం వేల్స్ ఎముకలతో పోలి ఉన్నాయని తెలుసుకున్నారు. ఈ జంతువులు ఆహారం కోసం వెతుకుతూ.. శత్రువుల బారి నుంచి తప్పించుకునేందుకు సముద్రం దగ్గరికి వెళ్లి దాచుకునేవని, అలా కాలక్రమేణా నీటిలో జీవించే జీవనాన్ని అలవరుచుకున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. కాస్త లోతుగా అధ్యయనం చేస్తే.. ఇండోహయస్, వేల్స్ రెండింటి కపాలం, చెవుల నిర్మాణాలు ఒకేలా ఉన్నాయని తెలిసింది. మొసళ్ల మాదిరిగా ఆహారం కోసం ఒడ్డున ఎదురుచూసేవని, చివరికి ఆ నీళ్లలోనే జీవనం అలవాటు చేసుకున్నాయని చెబుతున్నారు. -
నల్లమలలో గుర్తించిన కొత్త జీవరాశులివే..
సాక్షి, పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యంలో జీవ వైవిధ్యంపై శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. సున్నిపెంటలోని బయోడైవర్సిటీ డివిజన్ కార్యాలయం కేంద్రంగా సాగుతున్న జీవవైవిధ్య పరిశోధనలు సత్ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా అంతరించిపోతున్న పులుల సంతతిపై శాస్త్రవేత్తలు దృష్టిసారించడంతోపాటు అరుదైన కొత్త జీవులను సైతం గుర్తిస్తున్నారు. నాగర్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు వేలాది జీవరాశులకు నిలయంగా ఉంది. అటవీశాఖ చేపడుతున్న విప్లవాత్మక చర్యలతో నల్లమలలో గత పదేళ్లుగా వన్యప్రాణుల సంతతి పెరగడమేకాదు దట్టమైన అడవులు విస్తరిస్తున్నాయి. నల్లమలలో ఉన్న జీవజాతులు మరో చోట కనిపించడం అరుదు. నల్లమలలో 55 జాతుల క్షీరదాలు, 200 రకాల పక్షులు, 18 రకాల ఉభయచరాలు, 54 రకాల సరీసృపాలు, 55 జాతుల చేపలు ఉన్నాయి. ఇక వీటికి అదనంగా వివిధ జాతుల కీటకాలెన్నో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ పరిధిలో బయోడైవర్సిటీ ఏర్పాటయ్యాక నల్లమల అటవీ ప్రాంతంలో కొన్ని కొత్తరకం జీవరాశులను కనుగొన్నారు. ఎస్టీఆర్ పరిధిలో ఉండే ల్యాబ్‌లో వన్యప్రాణులు, సరీసృపాలు, క్షీరదాలు, కీటకాలు, వృక్షజాతుల ఫొటో లైబ్రరినీ ఏర్పాటు చేశారు. 2001 డిసెంబర్లో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీలో ఆయా జాతులకు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరిచారు. నల్లమల అభయారణ్యంలో శాస్త్రవేత్తలు కనుగొన్న గద్ద 2014–15లో నల్లమల అభయారణ్యంలో కనుగొన్న జీవరాసులను పరిశీలిస్తే.. మెటోక్రొమాస్‌టిస్ నైగ్రోఫి యొరేటో, మారస్ శ్రీశైల యెన్సిస్(సాలీడు), నాగార్జునసాగర్ రేజర్(పాము), స్లెండర్ కోరల్ స్నేక్ (పాము), ఫ్రీనికస్ ఆంధ్రాయెన్సిస్(సాలీడు), పోయిసిలోథీరియా నల్లమలైయెన్సిస్(సాలీడు), సిరాప్టిరస్ లాటిప్స్(కీటకాలు), డారిస్తీన్స్ రోస్ట్రాటస్(గొల్లభామ), శ్రీలంకన్ ఫ్లైయింగ్ స్నేక్, స్యాండ్ స్నేక్, వీటితో పాటు కృష్ణానది జలాల్లో టు స్పాటెడ్‌బార్బ్ అనే అరుదైన చేపను కూడా కనుగొన్నారు. వర్షాకాలంలోనూ, వరదలు వచ్చే సమయాన మాత్రమే కృష్ణా జలాల్లో కనిపించే నీటిì æపిల్లులపై కూడా పరిశోధన చేస్తున్నారు. ఆ సమయం వాటి సంతానోత్పత్తికి సంబంధించినదిగా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. జింకలకు ప్రసిద్ధి నల్లమలలో వివిధ రకాల జింకలు ఉన్నాయి. జింకల్లో అతి చిన్నది మూషిక జింక. దీనిని బుర్ర జింకగా, మౌస్ డీర్‌గా అభివరి్ణస్తారు. నల్లమలలో అతి పెద్ద జింక కణితి. దీనిని సాంబార్ డీర్‌గా పిలుస్తారు. కొమ్మలుగా విస్తరించిన భారీ కొమ్ములతో ఉండే కణితులు సుమారు 150 కేజీల బరువు తూగుతాయి. పొడ దుప్పులు.. అందానికి ఇవి ప్రతి రూపాలు. బంగారు వర్ణంలో ఉన్న చర్మంపై నల్లమచ్చలతో ఉండే ఈ జింకలు నల్లమలలో విస్తారంగా ఉన్నాయి. పెద్ద పులి ఆహార మెనూలో ఇవి ప్రధానమైనవి. నిటారు కొమ్ములు కలిగిన జింకల్లో మనిమేగం(నీల్గాయ్) భారీ జంతువు. శ్రీలంకన్ ఫ్లైయింగ్ స్నేక్ పురి తిరిగిన కొమ్ములతో కాల్లలో స్ప్రింగ్‌లున్నాయా అన్నట్లుగా గెంతుతూ స్వేచ్ఛకు ప్రతిరూపంగా కనిపించే కృష్ణజింకలకూ నల్లమలలో కొదవలేదు. ఉత్తర భారతదేశంలో చౌసింగా పేరుతో పిలుచుకునే కొండ గొర్రె(బార్కింగ్ డీర్) అడవి సాంద్రతను కొలిచే జింకగా చెప్పుకుంటారు. కొండ గొర్రె ఏ అటవీ ప్రాంతంలో కనిపించిందంటే ఆ ప్రాంతంలో అడవి దట్టంగా ఉందని అర్థం. నల్లమల అడవుల్లో లోతట్టు అటవీ ప్రాంతంలో కనిపించే కొండ గొర్రె ఈ మధ్య కాలంలో అటవీ ప్రాంత సరిహద్దుల్లో కూడా దర్శనమివ్వడం విశేషం. జీవ వైవిధ్యంతోనే మానవుల మనుగడ జీవ వైవిధ్యంతోనే మానవుల మనుగడ కొనసాగుతోంది. మనిషి తన ప్రతి అవసరానికి ప్రకృతి మీద ఆధారపడుతున్నాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ప్రకృతిలో ప్రతి జీవరాశి ఒక దాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. వీటిలో ఎక్కడ లోపం కనిపించినా జీవ వైవిధ్యం దెబ్బతిని మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి. – మందా రమేశ్, సీనియర్ రీసెర్చి అసిస్టెంట్, బయోడైవర్సిటీ సెంటర్ -
ట్విటర్లో కొత్త జీవిని కనుగొన్న ప్రొఫెసర్
కోపెన్హాగన్ : సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ కొత్తరకం జీవి ఫొటో వైరల్ అవుతోంది. ఇది పరాన్న జీవి ఫంగస్‌లోని కొత్త రకం జీవిగా.. దీని పేరు ‘ట్రోగ్లోమైసెస్’ అని సోఫియా రెబొలైరా అనే జీవ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఓ పత్రికలో పేర్కొన్నారు. కోపెన్హాగన్ యూనివర్శిటీకి చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ డెన్మార్క్‌లో జీవశాస్త్రవేత్త విభాగంలో అసోసియేట్ ప్రోఫెసర్‌గా పని చేస్తున్న సోఫియా రెబొలైరా ట్విటర్లో కనుగొన్న ఆ జీవికి ఆ పేరు వచ్చేలా ట్రోగ్లమైసెస్ ట్విట్టరీ అని నామకరణం చేశారు. ఈ ఫొటోను వర్జీనియా టెక్‌లోని ప్రస్తుతం పీహెచ్డీ విద్యార్థిని కీటక శాస్త్రవేత్త డెరెక్ హెన్నెన్ 2018లో పోస్టు చేసినట్లు ఆమె తెలిపారు. రెబొలైరా ‘దీనిని పరీక్షించి చూస్తే దానిపై కొన్ని చిన్న రంధ్రాలతో కూడిన ఫంగస్‌ను చూశాను. దాని ఉపరితలంపై శిలీంధ్రాల మాదిరి ఉండటం గమనించాను. అయితే ఇంతవరకు ఈ పరాన్న జీవిని అమెరికన్ మిల్లిపేడ్స్లో ఇంతవరకు చూడలేదు’ అని ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రకం ఫంగస్‌కు సంబంధించిన వివరాలు ఇది వరకు ఎక్కడా నమోదు కాలేదు. దీంతో పారిస్‌కు చెందిన ఓ నేచురల్ హిస్టరీ మ్యూజియం.. రెబొలైరా కొత్త జీవిని కనుగొన్నట్లు ధ్రువీకరించింది. ట్విటర్లో కనుగొన్న కారణంగా దానికి ట్రోగ్లమైసెస్ ట్విట్టరీ అని పేరుపెట్టారు. ఈ ట్విట్టరీ గురించి ఆమె మాట్లాడుతూ.. ‘కొద్దిరోజుల కిత్రం బహుపాది మీద ఓ ఫంగీని పోలిన జీవులు ఉండటం చూశాను. అప్పటివరకు ఈ ఫంగి అమెరికన్ బహుపాదుల మీద కనిపించలేద’ని ఆమె చెప్పారు. ఇది ఎలా ఉంటుంది: ట్రోగ్లోమైసెస్ ట్విట్టర్ ట్రోగ్లోమైసెస్ ట్విట్టర్ లాబౌల్బెనియల్స్ అనే ఆర్డర్‌కు చెందినది. ఇది కీటకాలు, మిల్లిపెడెస్పై దాడి చేసే చిన్న శిలీంధ్రపు పరాన్నజీవులు. ఇవి అతి చిన్న లార్వాలా ఉండి.. పునరుత్పత్తి అవయవాలనైనా హోస్ట్ జీవుల వెలుపల నివసిస్తాయి. లాబౌల్బెనియల్స్ మొట్టమొదట 19వ శతాబ్దం మధ్యలో కనుగొనబడ్డాయి.1890 నుంచి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో రోలాండ్ థాక్స్టర్ చేసిన వివరణాత్మక అధ్యయనం పుస్తకంలో వాటి వర్గీకరణ స్థానం గుర్తించబడింది. ఈ శిలీధ్రాలలో సుమారు 1260 జాతులు ఉంటాయని థాక్స్టర్ వివరించారు. -
మెక్సికన్ గల్ఫ్‌లో అరుదైన షార్క్ చేప..
అమెరికాలోని గల్ఫ్ మెక్సికోలో ఓ కొత్త షార్క్ చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కేవలం 5.5 అంగుళాలు మాత్రమే ఉండి చాలా ప్రకాశవంతంగా కనిపిస్తోంది. గత కొన్నెళ్లుగా షార్క్ చేపలపై, సముద్రాలలోని ప్లాస్టిక్‌పై అధ్యయనం చేస్తున్న తులనే విశ్వవిద్యాలయం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 1979 అనంతరం తొలిసారి అతి చిన్న షార్క్ చేపను గుర్తించినట్టు తెలిపారు. గతంలో 2010, 2013లలో దీనిని గుర్తించామని కానీ తమకు చిక్కలేదన్నారు. ఈ షార్క్ చేప దాని శరీరం నుంచి వచ్చే కాంతితో ఎదుగుతుందని స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ తెలుపుతోంది. దీంతో పాటు ఇతర జీవులను ఆకర్షించడానికి, వీటిపై దాడి చేసేవారిని దూరంగా ఉండమని హెచ్చరిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2010 లో గల్ఫ్ ప్రాంతంలో తిమింగలాలపై అధ్యయనం చేస్తున్నప్పుడు శాస్త్రవేత్తలు కాంతిని ప్రసరించే మగ కైట్ఫిన్ షార్క్ కనుగొన్నారు. ఆ తర్వాత నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ పరిశోధకుడు మార్క్ గ్రేస్ కాంతితో మెరిసే షార్క్ చేపను కనుగొన్నారు. ఎక్కువగా లోతు ఉండే సముద్ర జీవులపై పరిశోధనలు చాలా తక్కువగా జరుగుతున్నాయంటూ.. సముద్ర పైభాగంలోని నీటిలో నివసించే జంతువుల్లో 90 శాతం కాంతిని ప్రసరిస్తాయని ఎన్ఓఏఏ అంచనా వేసింది. -
70 ఏళ్లకు కనిపించిన సర్పం
ఈటానగర్: అదో అత్యంత అరుదైన విషసర్పం. ఎప్పుడో సుమారు 70 ఏళ్ల క్రితం అంటే దేశానికి స్వాతంత్య్రం సిద్ధిస్తున్న సమయంలో దేశంలో కనిపించింది. మళ్లీ ఇన్నాళ్లకి అలాంటి అరుదైన జాతి సర్పాన్ని అరుణాచల్‌ప్రదేశ్ అడవుల్లో పరిశోధకులు గుర్తించారు. స్వాతంత్య్రం సమయంలో కనిపించినవి 4 పాములు కాగా.. తాజాగా గుర్తింపుతో వీటి సంఖ్య ఐదుకి చేరింది. ఇంతకీ అంతటి అరుదైన పాము ఏంటా అనుకుంటున్నారా..? దాని పేరే పిట్ వైపర్. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్ జిల్లా ఈగల్నెస్ట్లోని అడవుల్లో సరీసృపాలపై నిర్వహించిన పరిశోధనల్లో ఓ పామును కనుగొన్నారు. చెట్ల మధ్యన దాక్కుని.. చెట్ల ఆకుల్లో కలిసిపోయేలా ఉన్న దీని డీఎన్ఏపై పరిశోధనలు జరిపి.. పిట్ వైపర్ జాతికి చెందినదిగా గుర్తించారు. అయితే ఇది కొత్త రకం పిట్ వైపర్ అని కనుగొన్నారు. ఈ పాముకు అరుణాచల్ ప్రదేశ్ పేరు మీదుగా ‘అరుణాచల్ పిట్ వైపర్’(ట్రైమెరెసురస్ అరుణాచలెనిస్) అని నామకరణం చేశారు. ఇలా ఓ సర్పానికి రాష్ట్రంపేరు కలుపుతూ పేరు పెట్టడం దేశంలో ఇదే తొలిసారి. మరో కొత్త రకం.. ప్రస్తుతం కనుగొన్న సర్పం పిట్ వైపర్ జాతికే చెందినప్పటికీ.. ఈ జాతిలో ఇది కొత్త రకం అని వారు చెబుతున్నారు. ఇది ముదురు ఎరుపు, గోధుమ రంగుల కలయికతో స్థానిక చెట్ల రంగులతో కలిసిపోయిందని తెలిపారు. ఈ సర్పాలకు తల భాగంలో రెండు వైపులా పిట్స్ (చిన్న రంధ్రాలు) ఉంటాయి. ఈ పాములకు మాత్రమే ఇలాంటి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. అందుకే వీటికి పిట్ వైపర్ అంటారు. తమ ఎదుట ఉన్న జీవుల శరీరంలోని వేడి ద్వారా అది ఏ తరహా జీవో అంచనా వేయడంతోపాటు వాటి ఆధారంగా వేట సాగించడం వీటి ప్రత్యేకత. సంతానోత్పత్తిపై ప్రయోగాలు.. ‘అరుణాచల్ పిట్ వైపర్‌కు సంబంధించి ప్రస్తుతం మాకు ఏమీ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మాకు దొరికింది ఒక మగజాతి పిట్ వైపర్ మాత్రమే. మరిన్ని పరిశోధనలు జరపడం ద్వారా దీని సహజ లక్షణాలను తెలుసుకోగలం. ఇవి ఏం ఆహారం తీసుకుంటాయి.. రోజువారీ అలవాట్లు, సంతానోత్పత్తి క్రమంలో గుడ్లు పెడతాయా? లేక నేరుగా పిల్లలకు జన్మనిస్తాయా? అనే విషయంపై పరిశోధనలు సాగించాలి’అని ఈ పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన హెర్పటాలజిస్ట్ అశోక్ కెప్టెన్ తెలిపారు. మిగతా నాలుగు ఇవే.. మలబార్ పిట్ వైపర్, హార్స్‌షూ పిట్ వైపర్, హంప్ నోస్డ్ పిట్ వైపర్, హిమాలయన్ పిట్ వైపర్లను సుమారు 70 ఏళ్ల కింద దేశంలో కనుగొన్నట్లు అశోక్ చెప్పారు. ఈ బృందంలో వి.దీపక్, రోహన్ పండిట్, భరత్ భట్, రమణ ఆత్రేయ సభ్యులుగా ఉన్నారు. ఈ పరిశోధన వివరాలు రష్యన్ జర్నల్ ఆఫ్ హెర్పటాలజీ, మార్చి–ఏప్రిల్ సంచికలో ప్రచురితమయ్యాయి. -
ఈ చేపకు ఈత రాదు!
టాస్మానియా : పక్షులకు ఎగరడం, చేపలకు ఈదడం ఎవరైనా నేర్పుతారా? అయితే పక్షుల్లో అన్నిరకాల పక్షులూ ఎగరలేవనే విషయం మనకు తెలిసిందే. మరి చేపల్లో ఈదడం రాని చేపగురించి ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న చేపను ఓసారి చూడండి.. నిజంగానే ఈ చేపకు ఈదడం రాదు. మనిషిలా రెండు కాళ్లతో నడుస్తూ గమ్యాన్ని చేరుకుంటుంది. అలాగని ఇది చేపజాతి కాదని చెప్పలేం. ఈ విషయమై శాస్త్రవేత్త డాక్టర్ లిమ్ లిండ్ మాట్లాడుతూ.. ‘కోళ్లు కూడా పక్షులే. అయినా అవి ఎక్కువ దూరం ఎగరలేవు, ఎక్కువ ఎత్తుకూ ఎగరలేవు. అలాగే ఇవి కూడా ఓ రకం చేపలే అయినా వీటికి ఈదడం రాదు. అందుకే ఇవి ఎక్కువగా కదలవు. అలా ఓచోట కూర్చొని ఉన్నట్లుగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతాయి. 1980కు ముందు టాస్మానియా ఆగ్నేయ తీరప్రాంతంలో ఇవి ఎక్కడ పడితే అక్కడ విరివిగా కనబడేవి. కానీ రానురాను వీటి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు అరుదుగా, చాలా తక్కువ ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. అందుకే ప్రయోగశాలలో పునరుత్పత్తి చేసి... ఈ నడిచే చేపల జాతిని రక్షించే దిశగా పరిశోధనలు చేస్తున్నార’ని చెప్పారు. -
ప్రకృతి మూలుగ పీల్చేస్తున్నాం..
జీవవైవిధ్యంతో కూడిన ప్రకృతి నుంచి మనం పొందే సేవలు ఎంతో అమూల్యమైనవి. ముఖ్యంగా, మనం తినే ఆహారం, శుద్ధమైన నీరు, ఇంధనం.. వీటన్నిటికీ జీవవైవిధ్యం, ప్రకృతే మూలాధారం. మన మనుగడకు మాత్రమే కాదు మన సంస్కృతులకు, మన అస్తిత్వానికి, మన జీవన ఆనందాలకు కూడా ఇవి ప్రాణాధారాలు. అయినప్పటికీ, మనం పట్టించుకోవడం లేదు. ఆధునిక మానవుల దైనందిన జీవితం ప్రకృతి నుంచి విడివడి పోవడమే ఇందుకు కారణం. మన ఆర్థిక కలాపాలన్నీ అంతిమంగా ప్రకృతిపైనే ఆధారపడి ఉంటాయి. ప్రకృతి మనకు అందించే వివిధ రకాల సేవల విలువ నిజానికి అమూల్యం. అయితే, ఆర్థికవేత్తల లెక్కల ప్రకారం ప్రకృతి సేవల విలువ ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా 125 ట్రిలియన్ డాలర్ల మేరకు ఉంటుంది. ప్రకృతిని స్థిమితంగా ఉంచగలిగేంత మేరకు వనరుల వినియోగం జరిగే పర్వాలేదు. కానీ, మనం విచ్చలవిడిగా వాడేస్తున్నాం. ఎంతగానంటే, ప్రకృతి తిరిగి తెప్పరిల్ల లేనంతగా ఏకంగా 70% అధికంగా వాడేస్తున్నాం. ఈ వత్తిడి వల్ల ప్రపంచవ్యాప్తంగా భూమి పైన, నేల లోపల ప్రాణప్రదమైన జీవ జాతులు, జీవరాశి చాలా వేగంగా అంతరించిపోతోందని లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ –2018 చెబుతోంది. వెన్నెముక లేని జీవులు 1970–2014 మధ్యకాలంలో 60% అంతరించిపోయాయి. దక్షిణ, మధ్య అమెరికాలోని ఉష్ణమండలాల్లో జంతువుల సంతతి మరీ ఎక్కువగా 89% నశించాయి. మంచినీటిలో పెరిగే జంతువులు కూడా 1970తో పోల్చితే 83% నశించాయి. ప్లాస్టిక్ కాలుష్యం సముద్రాలు, నదులను నాశనం చేసింది. విశ్వవిఖ్యాత నిపుణులు మనకు ఇస్తున్న సందేశపు సారాంశం ఏమిటంటే.. పొదుగు కోసి పాలు తాగటం మానాలి. ప్రకృతికి తీరని హాని చేసేలా ప్రవర్తించడం మనం ఇప్పటికిప్పుడు ఆపెయ్యాలి. లేదంటే, మన భవిష్యత్తు మాత్రమే కాదు వర్తమానం కూడా మరింత దుర్భరంగా మారిపోతుంది. అయితే, అదృష్టం ఏమిటంటే.. ప్రాణప్రదమైన ప్రాకృతిక సంపదను పాక్షికంగానైనా పునరుద్ధరించుకునే దారులు మనకు రూఢిగా తెలుసు. ప్రకృతిలో జీవజాతులు, జంతుజాలంపై, అడవులపై వత్తిడిని తగ్గించేలా వ్యవసాయ పద్ధతులను, విలాసాలను, ఆహార విహారాలను మార్చుకోవటం అత్యవసరం. -
అండమాన్‌లో బయటపడ్డ.. అరుదైన చీమలు
సాక్షి, న్యూఢిల్లీ : అండమాన్ దీవుల్లో చీమ జాతికి చెందిన అత్యంత అరుదైన రెండు రకాల చీమలను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. అండమాన్ ద్వీప సముదాయంలోని హావ్లాక్ ప్రాంతంలో పరిశోధనలు చేస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (బెంగళూరు), జపాన్‌కు చెందిన ఒకినోవా సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వీటిని గుర్తించారు. కొత్తగా గుర్తించిన ఈ జీవులకు ప్రముఖ శాస్త్రవేత్తలైన కేఎస్, కృష్ణన్, జార్వాల పేర్లు వచ్చేలా.. టెట్రానియం క్రిష్ణాని, టెట్రానియం జార్వా అని నామకరణం చేశారు. అండమాన్ దీవుల్లోని మొక్కలు, అక్కడ పెరిగే ఆకుకూరల మీద పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తొలిసారిగా చీమ జాతులకు చెందిన జీవులను గుర్తించారు. ఇవే కాకుండా ఇప్పటివరకే 50 రకాల చీమల జాతులను ఉనికిని గుర్తించినట్లు శాస్త్రవేత్తల బృందం సభ్యుడు గౌరవ్ అగ్వేకర్ చెప్పారు. భవిష్యత్తులో దేశంలోని అన్ని రకాల చీమ జాతుల సమాచారాన్ని నిక్షిప్తం చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. చీమ జాతుల్లో చాలావాటి గురించిన సమాచారం అందుబాటులో లేదన్నారు. వీటి గురించి సమాచారం నిక్షిప్తం చేస్తే భవిష్యత్‌లో పర్యావరణ, పరిణామ మార్పులకు సంబంధించిన పలు అంశాలకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. -
జీవరాశుల ఉనికి ప్రశ్నార్థకం
⇔ మీడియా వర్క్‌షాప్‌లో నిపుణుల హెచ్చరిక ⇔ 30 ఏళ్లల్లో 30 శాతం జీవరాశులు నశించిపోయే ప్రమాదం ⇔ వాతావరణ మార్పులతో వ్యవసాయానికి గడ్డు పరిస్థితి ⇔ 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే కొన్ని దేశాలు మునిగిపోతాయి సాక్షి, హైదరాబాద్: రానున్న ఇరవై ముప్పై ఏళ్లల్లో 30 శాతం జీవరాశులు నశించిపోయే ప్రమాదముందని పర్యావరణ పరిరక్షణ, శిక్షణ సంస్థ(ఈఎఫ్‌టీఆర్‌ఐ) డైరెక్టర్ జనరల్, పర్యావరణ అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి బి.కల్యాణచక్రవర్తి ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహకారంతో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్(సీఎంఎస్) ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన మీడియా వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. వాతావరణంలో వస్తున్న మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మీడియా కీలకపాత్ర పోషించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. వాతావరణం చాలావరకు పాడైపోయిన విషయాన్ని మీడియా గుర్తించాలని, అనేక విధానపరమైన అంశాలను ప్రభావితం చేసే శక్తి మీడియాకు ఉందన్నారు. వాతావరణ మార్పులకు సంబంధించి పారిస్ ప్రొటోకాల్‌పై మనదేశం సంతకం చేసిందన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే కోట్ల ప్రాణులు చనిపోతాయన్నారు. కార్బన్ డై ఆక్సైడ్ తగ్గకుంటే భవిష్యత్ తరాలు తీవ్రంగా ఇబ్బంది పడతాయన్నారు. ఉష్ణోగ్రతలు పెరిగితే మంచు కరిగి సముద్రమట్టం పెరిగి కొన్ని దేశాలు కనుమరుగు అవుతాయని కల్యాణచక్రవర్తి విశ్లేషించారు. వాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయానికి గడ్డు పరిస్థితి ఏర్పడనుందన్నారు. ఈ నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో వ్యవసాయ పంటలు పండించాలని సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో తాము ఈ మేరకు ప్రయోగాలు చేస్తున్నామన్నారు. అమరావతికి ముంపు భయం కృష్ణా నది వరదతో ఏపీ కొత్త రాజ ధాని అమరావతికి ముంపు భయం ఉందని సీనియర్ జర్నలిస్టు ఎస్.నగేశ్‌కుమార్ చెప్పారు. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కూడా హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కృష్ణానదికి తీవ్రమైన వరద వస్తే అమరావతి మునిగిపోతుందని, అయితే అక్కడి ప్రభుత్వం దీనిపై ఎన్జీటీకి ఏదో ఒకటి చెప్పి ఒప్పించిందని అన్నారు. డ్రైనేజీలు నిర్మిస్తామని.. తద్వారా వరద ముంపు నుంచి అమరావతిని కాపాడుతా మని చెప్పిందన్నారు. వాస్తవానికి కృష్ణాతీ రానికి 500 మీటర్లలోపు కట్టడాలు నిర్మించ కూడదని, కానీ ఇప్పుడు నిర్మిస్తున్నారని చెప్పారు. జర్మన్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్(జీఐజడ్) డైరెక్టర్ డాక్టర్ అశిశ్ చతుర్వేది, సీఎంఎస్ డైరెక్టర్ జనరల్ పి.ఎన్.వాసంతి తదితరులు పాల్గొన్నారు. -
పపంచంలోలక్ష కోట్ల జీవ జాతులు!
న్యూయార్క్: ప్రపంచంలో లక్ష కోట్ల జీవజాతులు ఉన్నాయి. అయితే వీటిలో మనం కనుగొన్నది చాలా తక్కువ. ఇంకా 99.999% జాతులను కనుగొనాల్సి ఉంది. ప్రభుత్వాలు, సంస్థలు, ప్రజల నుంచి సేకరించిన అనేక సూక్ష్మజీవ, వృక్ష, జంతు జీవజాలాల సమాచారాన్ని విశ్లేషించి ఈ విషయాన్ని జీవశాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఒక్క అంటార్కిటికా మినహా ప్రపంచంలోని 35 వేల ప్రాంతాల నుంచి 56 లక్షల సూక్ష్మజీవులు, ఇతర జీవజాతుల సమాచారాన్ని క్రోడీకరించి ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఇండియానా వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. -
గలాపగస్ లో మరో భారీ తాబేలు!
తాబేళ్లలో ఇంచుమించుగా అన్నింటి జీవితకాలం వంద ఏళ్లకు పైనే ఉంటుంది. అయితే వాటిల్లో జెయింట్ టార్టాయిస్లు అయితే ఏకంగా రెండు వందల ఏభై ఏళ్లు కూడా బతుకుతాయి. తాజాగా సైంటిస్టులు ఫసిఫిక్ మహా సముద్రంలోని గాలాపగస్ దీవుల్లో ఓ భారీ తాబేలు జాతి ఉన్నట్లుగా గుర్తించారు. నెమ్మదిగా కదిలే సరీసృపాల సమూహాల్లో మరొక రకమైన ఈ తాబేలు.. శాంటా క్రజ్ ద్వీపంలో ఇంతకు ముందున్న తాబేళ్ళ జాతికి భిన్నంగా, వైవిధ్యంగా ఉన్నట్లు గుర్తించారు. వీటి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు జన్యు సమాచారాన్ని సేకరిస్తన్నారు. ఈ ద్వీప సమూహంలో ఉన్న మొత్తం 15 తాబేళ్ళ జాతుల్లో నాలుగు అంతరించిపోగా ఇది 15 వ జాతిగా సైంటిస్టులు చెప్తున్నారు. గాలాపగస్ రిటైర్డ్ పార్క్ రేంజర్... చెలోనాయిడిస్ డాన్ ఫాస్టియో అని ఈ కొత్త జాతికి పేరు పెట్టారు. గాలాపగస్ లో నివసించే భారీ తాబేళ్ళు 250 కేజీల వరకు బరువుండి, వందేళ్ళకంటే ఎక్కువకాలం బతుకుతాయి. అయితే శాంటా క్రూజ్ ద్వీపంలో ఉన్న రెండు అతిపెద్ద తాబేళ్ళు ఒకే జాతికి చెందినవిగా ఉన్నప్పటికీ, అవి జన్యు పరీక్షల్లో తేడాలు ఉన్నట్లు తేలిందని ఈ క్వెడార్ పర్యావరణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్తగా కనుగొన్న జాతులను తూర్పు శాంటా క్రుజ్ తాబేళ్ళుగా పిలుస్తారని, ఇవి ద్వీపంలోని తూర్పువైపు నివపిస్తాయని, అయితే ఇతర ద్వీపాల్లోని అతిపెద్ద తాబేళ్ళతో పోలిస్తే వీటిలో విభిన్నమైన జన్యువులు ఉన్నట్లు గుర్తంచారు. ఈ అతిపెద్ద తాబేలు యొక్క షెల్ ఆకారం మాత్రం ఇతర జాతులకంటే మరింత కుదించినట్లుగా ఉందని, యేల్ విశ్వవిద్యాలయం జీవశాస్త్రవేత్త గిసెల్లా కాక్సియాన్ అన్నారు. 250 దాకా ఉన్న ఈ భారీ తాబేళ్ళ జాతుల పరిరక్షకులు, వీటి జాతులు అంతరించిపోకుండా, వీటికి హాని కలగకుండా పునరుద్ధరించడానికి సహాయపడగలరని వీరు ఆశతో ఉన్నారు. ఇతర తాబేళ్ళకంటే ఎక్కువగా.. రెండువేలకు పైగా అతిపెద్ద తాబేళ్ళ జాతులు ఈద్వీపంలో నివసిస్తున్నట్లు వీరు చెప్తున్నారు. గాలాపగస్ ద్వీపంలో 1830 నాటికే జెయింట్ టార్టాయిస్ ఉన్నట్లు ప్రముఖ బ్రిటిష్ అధ్యయన వేత్త ఛార్లెస్ డార్విన్ అధ్యయనాల వల్ల తెలుస్తోంది. 16వ శతాబ్దం కన్నా ముందు గాలాపాగస్లో తాబేళ్ల సంఖ్య రెండున్నర లక్షల వరకు ఉండేదిట. అయితే 17వ శతాబ్దం నుంచి వీటిని వేటాడి తినే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అంతేకాదు, ఈ దీవుల్లో ఉండే ఒక జాతి ఎలుకలు తాబేళ్ల గుడ్లను తినేస్తుండేవట. ఇటువంటి అనేక కారణాలతో 1970 కల్లా ఈ భారీ తాబేళ్ల సంఖ్య కేవలం 3000కు చేరింది. -
డాక్యుమెంటరీ కొత్త హంగులు
-
టూకీగా ప్రపంచ చరిత్ర - 61
జాతులు నుడికారాలు ‘‘వాళ్ళందరూ ఒకే ప్రజ. వాళ్ళందరిది ఒకే భాష. తూర్పుదిశ నుండి పడమరగా పయనిస్తూ వాళ్ళు ‘షినోర్’ పీఠభూమి చేరుకుని, ఆ ప్రదేశాన్ని నివాసం చేసుకునేదాకా వాళ్ళ ప్రయాణం కొనసాగింది. ‘పదండి. ఇటుకలు తయారుజేసి వాటిని బాగా తంపటం పెడదాం.’ అంటూ వాళ్ళు పరస్పరం మాట్లాడుకున్నారు. రాళ్ళకు బదులుగా ఇటుకలు సమకూర్చుకున్నారు. అడుసుకు బదులుగా జిగురును రూపొందించుకున్నారు. ‘పదండి. మనమొక నగరాన్ని నిర్మించుకుందాం. శిఖరం స్వర్గాన్ని తాకేలా ఒక గోపురం నిర్మిద్దాం. మనకు ఒక పేరు పెట్టుకుందాం. ఆనవాలు లేకపోతే మనం ఈ నేలమీద ఎక్కడెక్కడికో చెదిరిపోతాం’ అనుకున్నారు. మానవసంతానం నిర్మించిన నగరాన్నీ, గోపురాన్నీ చూసేందుకు దేవుడు దిగివచ్చాడు. ‘ఔరా! వీళ్ళంతా ఒకే ప్రజ. వీళ్ళందరికీ ఒకే భాష. కాబట్టే ఇంతటి కార్యానికి పూనుకున్నారు. తమ ఊహకు ఏది అందితే దాన్ని సాధించకుండా వీళ్ళను అడ్డుకోవడం ఎవ్వరికినీ సాధ్యంగాదు. పద. కిందికి దిగి వాళ్ళ భాషను అయోమయం చేద్దునుగాక. ఒకరు మాట్లాడింది మరొకరికి అర్థంగాకుండా చేద్దునుగాక’ అనుకున్నాడు. దరిమిలా దేవుడు వాళ్ళను నేల నాలుగు చెరగులకు వెదజల్లాడు. దాంతో వాళ్ళ నగర నిర్మాణం ఆగిపోయింది. ఆ కారణంగా దానికి ‘బేబెల్’ అనే పేరొచ్చింది. ఇది శాస్త్ర విజ్ఞానం పరిణతి చెందని కాలంలో ఏర్పడిన ఊహలకు ప్రతిబింబంగా నిలిచే కథ మాత్రమే. మానవులు జాతులుగా విడిపోయే ప్రక్రియ క్రీస్తుకు పూర్వమే జరిగిపోయిందనే సూచన మినహా, ఈ కథ వల్ల చరిత్రకు ఒనగూరే ఉపకారం పెద్దగా లేదు. దొరికిన ఆధారాలను బట్టి, క్రీ.పూ. 5000 సంవత్సరాల దరిదాపుల్లో కొంత జనసమూహం కొన్ని కొన్ని జాతులుగా ఏర్పడినట్టు చరిత్రకారులు నిర్ణయిస్తున్నారు. మధ్యధరా సముద్రం దక్షిణ కోస్తా - ఎర్ర సముద్రానికి తూర్పు భాగంలో నివసించిన వాళ్ళు సెమైట్లు, ఎర్రసముద్రానికి పడమరగా నివసించినవాళ్ళు ఇజిప్సియన్లు, వీళ్ళకు ఉత్తరంగా లిడియన్లూ హిట్టిటేట్లు, సెమైట్లుకు తూర్పున సుమేరియన్లూ అస్సీరియన్లు, మధ్యధరా సముద్రానికి ఉత్తరకోస్తా వెంట ఏజియన్లు - ఇలా వేరువేరు జాతులుగా వాళ్ళను గుర్తించారు. అయితే, తమ జాతిని తాము ఏ పేరుతో వాళ్ళు పిలుచుకున్నారో మనకు తెలీదు. ఇందాకా అనుకున్న పేర్లన్నీ వారివారి నివాస ప్రాంతాలనుబట్టో, ఆచార వ్యవహారాలనుబట్టో, అవశేషాల ఆధారంగా నిర్ణయించిన పోలికనుబట్టో చరిత్రకారులు ఏర్పాటుజేసుకున్న అనుకూలత మాత్రమే. చనిపోయినవాళ్ళను పాతిపెట్టడం కాకుండా, దహనం చేయడం ఆచారంగా అవలంభించడం వల్ల అవశేషాల రూపంలో ఆర్యులకు సంబంధించిన ఆధారాలే కరువయ్యాయి. దానికి తోడు, వాళ్ళు వినియోగించిన సామగ్రి మొత్తం కొయ్య, వెదులు వంటి శాఖాజనిత పరికరాలు కావడంతో, అనతికాలానికే అవి కాలగర్భంలో కలిసిపోయి, భౌతికమైన ఆధారాలు దొరికే ఆస్కారం లేకుండా చేశాయి. రచన: ఎం.వి.రమణారెడ్డి రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com