సాక్షి, న్యూఢిల్లీ : అండమాన్ దీవుల్లో చీమ జాతికి చెందిన అత్యంత అరుదైన రెండు రకాల చీమలను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. అండమాన్ ద్వీప సముదాయంలోని హావ్‌లాక్ ప్రాంతంలో పరిశోధనలు చేస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (బెంగళూరు), జపాన్‌కు చెందిన ఒకినోవా సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వీటిని గుర్తించారు. కొత్తగా గుర్తించిన ఈ జీవులకు ప్రముఖ శాస్త్రవేత్తలైన కేఎస్, కృష్ణన్, జార్వాల పేర్లు వచ్చేలా.. టెట్రానియం క్రిష్ణాని, టెట్రానియం జార్వా అని నామకరణం చేశారు.
అండమాన్ దీవుల్లోని మొక్కలు, అక్కడ పెరిగే ఆకుకూరల మీద పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తొలిసారిగా చీమ జాతులకు చెందిన జీవులను గుర్తించారు. ఇవే కాకుండా ఇప్పటివరకే 50 రకాల చీమల జాతులను ఉనికిని గుర్తించినట్లు శాస్త్రవేత్తల బృందం సభ్యుడు గౌరవ్ అగ్వేకర్ చెప్పారు.
భవిష్యత్తులో దేశంలోని అన్ని రకాల చీమ జాతుల సమాచారాన్ని నిక్షిప్తం చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. చీమ జాతుల్లో చాలావాటి గురించిన సమాచారం అందుబాటులో లేదన్నారు. వీటి గురించి సమాచారం నిక్షిప్తం చేస్తే భవిష్యత్‌లో పర్యావరణ, పరిణామ మార్పులకు సంబంధించిన పలు అంశాలకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment