discovered
-
సరికొత్త తూనీగ జాతి.. భలే వెరైటీగా ఉంది!
సన్నని వెదురు గొట్టం మాదిరిగా ఉండే సరికొత్త తూనీగ జాతిని కేరళలో పశ్చిమ కనుమల ప్రాంతంలో తాజాగా గుర్తించారు. దీని పొట్ట భాగం పొడవైన స్థూపాకృతిలో అచ్చం సన్నటి వెదురు గొట్టాన్ని తలపించేలా ఉంటుంది. అందుకే దీనికి అగస్త్యమలై బాంబూటెయిల్ (వెదురుతోక) అని పేరు పెట్టారు. దీని శాస్త్రీయనామం మెలనోనౌరా అగస్త్యమలైకా. ఇది మెలనోనౌరా జెనస్ కుటుంబానికి చెందినది. ఆ కుటుంబంలో వెలుగులోకి వచ్చిన రెండో జాతి ఇదని సైంటిస్టులు చెబుతున్నారు.ఈ తూనీగలు కేరళలో తిరువనంతపురం జిల్లాలో పెప్పర వణ్యప్రాణి సంరక్షణ కేంద్రంలో మంజడినిన్నవిల ప్రాంత పరిధిలో పుణెలోని ఎంఐటీ వరల్డ్ పీస్ వర్సిటీ, కేరళ క్రైస్ట్ కాలేజీ సైంటిస్టుల బృందం కంటబడ్డాయి. అనంతరం పొన్ముడి కొండల్లో కూడా వీటి ఉనికిని గుర్తించారు. మెలనోనౌరా కుటుంబంలో తొలి తూనీగ జాతిగా మలబార్ బాంబూటెయిల్ గుర్తింపు పొందింది. దాన్ని కూర్గ్–వయనాడ్ ప్రాంతంలో తొలుత గుర్తించారు.చదవండి: అడవిలో అమ్మప్రేమ.. జంతువులు, పక్షుల్లో అరుదైన మమకారం!వాటితో పోలిస్తే అగస్త్యమలై తూనీగ (Agasthyamalai Damselfly) జాతిలో దాదాపు 7 శాతం దాకా జన్యూపరమైన తేడాలున్నట్టు తేలింది. పొడవాటి నల్లని శరీరం, నీలిరంగు చారికలు దీని సొంతం. ఇంతటి జీవ వైవిధ్యానికి నిలయమైన పశ్చిమ కనుమలను మరింతగా సంరక్షించాల్సిన అవసరం ఎంతో ఉందని ఎంఐటీ వర్సిటీకి చెందిన డాక్టర్ పంకజ్ కోర్పడే అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారతదేశం రెండు ముక్కలు కానుందా?
హిమాలయ పర్వత శ్రేణికి దిగువన భారత, యురేషియా ఖండాంతర టెక్టోనిక్ ప్లేట్లు పరస్పరం ఢీకొంటున్న కారణంగా హిమాలయాలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు ఏనాడో గుర్తించారు. అయితే ఇండియన్ ప్లేట్లోని కొంత భాగం యురేషియన్ ప్లేట్ కింద జారిపోతున్నందున అది ‘డీలామినేట్’ అవుతున్నదని పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. ఈ ప్రక్రియ భారత్‌ను బౌగోళికంగా విభజించే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సాధారణంగా రెండు టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్నప్పుడు, ఒకదాని కిందకు మరొకటి కిందకి జారిపోతుంది. ఈ ప్రక్రియను సబ్డక్షన్ అంటారు. రెండు ఖండాంతర పలకలు సమానంగా ఉన్నందున, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలకు ఏ ప్లేట్ మరొకదానిపై అతివ్యాప్తి చెందుతుందో ఖచ్చితంగా గుర్తించలేరు. ఇండియన్ ప్లేట్లోని దట్టమైన దిగువ భాగం పై భాగానికి దూరంగా ఉంటుంది. వీటిమధ్య నిలువుగా ఏర్పడిన పగులును శాస్త్రవేత్తలు గుర్తించారు. భారత- యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య 60 మిలియన్ సంవత్సరాలకు పైగా జరుగుతున్న ఘర్షణ హిమాలయాలకు ఇప్పుడు మనం చూస్తున్న ఆకృతినిచ్చింది. సముద్రపు పలకల వలె కాకుండా, ఖండాంతర పలకలు మందంగా, తేలికగా ఉంటాయి, అవి భూమిలోని మాంటిల్లోకి సులభంగా ఇమిడిపోవు. భౌగోళిక భౌతిక శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఇటీవల టిబెట్ భాభూగం కింది భూకంప తరంగాలను విశ్లేషించింది. ఈ నేపధ్యంలో యురేషియన్ ప్లేట్ దాని కింద జారిపోతున్నందున భారత ప్లేట్ విచ్ఛిన్నమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపింది. ఈ బృదం యురేషియన్ ప్లేట్ మధ్య సరిహద్దు వద్ద పగుళ్లను కూడా కనుగొంది. భూకంప తరంగాలు, హీలియం వాయువులు ఉపరితలంపైకి చొచ్చుకు రావడం ఈ డీలామినేషన్ ప్రక్రియకు సాక్ష్యంగా నిలుస్తున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నూతన పరిశోధనా ఫలితాలు మునుపటి పరికల్పనలను సవాలు చేస్తున్నాయి. భౌగోళిక ప్రక్రియలను మరింతగా గుర్తించేలా చేస్తున్నాయి. ఇన్నాళ్లూ పరిశోధకులు ఖండాలు ఏర్పడటం వెనుక ఇటువంటి ప్రక్రియ ఉంటుందనే దానిపై పరిశోధనలు సాగించలేదు. అయితే ఈ కొత్త అధ్యయనం మరిన్ని నూతన ఆవిష్కరణలకు నాంది పలకనుంది. ఈ పరిశోధన అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ వార్షిక సమావేశంలో సమర్పించారు. ఇది హిమాలయాల ఆవిర్భావాన్ని మరింతగా అర్థం చేసుకోవడంలో సహాయపడనుంది.అలాగే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో భూకంప ప్రమాదాలను పసిగట్టేందుకు సహాయకారిగానూ ఉండవచ్చు. -
కాఫీ రుచి బెటర్‌గా ఉండేందుకు ట్రిక్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు!
ఒక కప్పు కాఫీ ఉదయాన్నే సిప్ చేస్తే ఆ ఆనందమే వేరు. అలాంటి కాఫీ స్ట్రాంగ్‌గా రుచిగా తయారు చేసుకోవాలంటే చాల పద్ధతులు ఉన్నాయి. కానీ అవేమీ అవసరం లేకుండా ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయితే ఈజీగా స్ట్రాంగ్ కాఫీ తయారు చేసుకోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. అలాంటి కాఫీ ప్రిపరేషన్‌కి పరిశ్రమలకు మాత్రం కోట్లలో ఖర్చు అవుతుందట!. చాలామంది స్ట్రాంగ్‌గా ఉండే కాఫీనే ఇష్టపడతారు. మంచి రంగు రుచి సువాసన ఉండాలను కుంటారు. అందుకని కాఫీ గింజలను గ్రైండ్ చేసుకుని మరీ తయారు చేసుకుంటారు. అయితే ఈ డ్రై కాఫీ గింజలు గ్రైండ్ చేసటప్పుడు స్టాటిక్ ఎనర్జీకి గురవ్వుతాయి. దీంతో సరిగా డ్రైండ్ అవ్వవు. అందువల్ల వేస్ట్ కూడా తెలియకుండా వెళ్లిపోతుంది. అంటే కొన్ని సరిగా నలగకపోవడంతో వేస్ట్ రూపంలో వడకట్టినప్పుడు కాఫీ కొంత వేస్ట్‌గా పోయి రుచి తగ్గుతుందట. అలా కాకుండా పూర్తిస్థాయిలో గ్రైండ్ అయ్యి రుచిగా ఉండాలంటే కాస్త నీటిని జోడిస్తే మరింత రుచిగా కాఫీ తయారవ్వుతుందట. దీని వల్ల కాఫీ వేస్టేజ్ కూడా తగ్గుతుంది. మనకు కావాల్సిన రుచి, రంగు సువాసన ఉంటాయని చెబుతున్నారు. ఇలాంటి స్ట్రాంగ్ డ్రై కాఫీ తయారు చేయాలంటే కాఫీ పరిశ్రమలకు మాత్రం భారీ ఆర్థిక సమస్యలు ఎదురవ్వుతాయని అన్నారు. ఈ స్రాంగ్ డ్రైనెస్ కాఫీ తయారీ నాణ్యతను మెగుపరచడం అనేది కాఫీ పరిశ్రమలకు మాములు నష్టాలను తెచ్చి పెట్టదని కూడా అంచనా వేసి మరీ పరిశోధకులు వెల్లడించారు. (చదవండి: ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ దందా! జస్ట్ ప్రెగ్నెంట్ చేస్తే చాలు..ఏకంగా లక్షలు ..!) -
దీర్ఘాయుష్షు అంటే ఎంత?
మనిషి ఆయుష్షుకు సంబంధించిన పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా డచ్ పరిశోధకులు మానవుని గరిష్ట వయస్సు ఎంతనే విషయంతో పాటు ఇలాంటి దీర్ఘాయువు వెనుకగల రహస్యాలను వెల్లడించారు. పోషకాహారం, మెరుగైన జీవన పరిస్థితులు, ఆధునిక వైద్య సంరక్షణ విధానాలతో ఆయుర్దాయం పెరుగుతుందని తమ పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వేర్వేరు కాలాల్లో మరణించిన సుమారు 75 వేల మంది డచ్ పౌరులు డేటా ఆధారంగా నిపుణులు ఈ విశ్లేషణ చేశారు. వారు మరణించే సమయంలో వారి వయసును పరిగణలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించారు. రోటర్‌డామ్‌లోని టిల్బర్గ్, ఎరాస్మస్ విశ్వవిద్యాలయాలకు చెందిన గణాంక నిపుణులు తమ పరిశోధనల ద్వారా మహిళల గరిష్ట వయోపరిమితి 115.7 ఏళ్లు అని కనుగొన్నారు. అలాగే పురుషుల గరిష్ట ఆయుర్దాయం 114.1 అని తెలియజెప్పారు. దీని ప్రకారం చూస్తే పురుషుల ఆయుష్షు కంటే మహిళల ఆయుష్షు కాస్త గట్టిదేనని చెప్పవచ్చు. మూడు దశాబ్దాల డేటా ఆధారంగా పరిశోధకులు మానవుని గరిష్ట ఆయుర్దాయాన్ని అంచనావేయగలిగారు. ఈ అధ్యయనాన్ని చేపట్టిన శాస్త్రవేత్తలలో ఒకరైన ప్రొఫెసర్ జాన్ ఐన్‌మహ్ల్ మాట్లాడుతూ ‘సాధారణంగా ప్రజలు దీర్ఘకాలమే జీవిస్తారు. గత 30 ఏళ్లలో మనిషి ఆయుష్షు పెరుగుతోంది. వృద్ధాప్యం దూరమయ్యింది. నెదర్లాండ్స్‌లో 95వ పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో దాదాపు మూడు రెట్లు పెరిగింది’ అని అన్నారు. మనిషి ఆయుర్దాయం అనేది సామాజిక శ్రేయస్సును సూచించే కొలబద్ద అని అంటారు. ఈ డచ్ పరిశోధనలు.. గత ఏడాది అమెరికా పరిశోధకుల పరిశోధనల నివేదికలను పోలివున్నాయి. అమెరికా శాస్త్రవేత్తలు కూడా ఇదే గరిష్ట వయో పరిమితిని గుర్తించారు. అయితే తమ దేశంలో ఇప్పుడున్న వృద్ధులు తమ పూర్వీకుల మాదిరిగా దీర్ఘ కాలం జీవించడం లేదని వారు పేర్కొన్నారు. డచ్ పరిశోధకుడు ఐన్‌మహ్ల్, అతని బృందం ‘ఎక్స్ట్రీమ్ వాల్యూ థియరీ’ అనే ప్రత్యేక గణాంక విధానాన్ని ఉపయోగించారు. ఇది డేటాను విశ్లేషించేందుకు, వివిధ సందేహాలను తీర్చేందుకు ఉపకరిస్తుంది. కాగా 122 సంవత్సరాల164 రోజులపాటు జీవించిన ఫ్రెంచ్ సూపర్ సెంటెనేరియన్ జీన్ కాల్మెంట్ ఆయుష్షుకు అడ్డుపడే అన్ని అడ్డంకులను దాటారని ఐన్‌మహ్ల్ ఉదహరించారు. ఇప్పటివరకూ జీన్ కాల్మెంట్ అత్యధిక కాలం జీవించిన మహిళగా చరిత్రలో నిలిచారు. ఐన్‌మహ్ల్ మార్గదర్శకత్వలో జరుగుతున్న ఈ పరిశోధనలకు సంబంధించిన వివరాలు త్వరలోనే సమగ్రంగా ప్రచురితం కానున్నాయి. ఇది కూడా చదవండి: ‘ప్లీజ్.. పెళ్లి చేసుకోండి’.. యువతులను వేడుకుంటున్న చైనా అధ్యక్షుడు -
200 ఏళ్లనాటి ఫార్మ్‌హౌస్‌లో రహస్య భూగృహం.. లోపల ఏముందో చూసేసరికి..
ఒక్కోసారి కొన్ని దశాబ్ధాల పురాతన గృహాలలో అనుకోని విధంగా ఏవైనా లభిస్తే మన ఆశ్చర్యానికి అవధులు ఉండవు. యూకేలోని ఒక టిక్‌టాకర్ తన తల్లిదండ్రులకు సంబంధించిన 200 ఏళ్ల క్రితం నాటి పురాతన ఫార్మ్‌హౌస్‌లోని ఫ్లోర్‌బోర్డ్ కింద కనిపించిన ఆనవాళ్లు చూసి తెగ ఆశ్చర్యపోయింది. ఇటువంటిది ఒకటి ఉందని ఆమెకు బాల్యంలో ఎప్పుడూ తెలియలేదు. ఇంటి రెనోవేషన్ సందర్భంగా ఆ ఇంటిలో ఒక భూగృహం ఉందని ఆమెకు తెలిసింది. దశాబ్ధాల తరబడి రహస్యంగా.. జెనిఫర్ మల్లాఘన్ ఇటీవల తమ చారిత్రాత్మక పురాతన ఇంటికి సంబంధించిన ఒక వీడియోను టిక్‌టాక్‌లో షేర్ చేసింది. ఈ ఇంటిలో తన తల్లిదండ్రులు 6 దశాబ్ధాల పాటు ఉన్నారని, అయితే తనకు ఈ ఇంటిలో భూగృహం ఉందన్న సంగతి ఇన్నాళ్లలో తెలియలేదన్నారు. జెనీఫర్ ఈ వీడియో కాప్షన్లో ‘ఈ భూగృహం ఏళ్ల తరబడి రహస్యంగానే ఉంది’ అని పేర్కొన్నారు. 44 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తవ్వకాల మధ్య నిలుచుని, చేతులతో ఒక పరికరం పట్టుకుని, కంపార్ట్మెంట్ను తెరిచే ప్రయత్నం చేస్తుంటాడు. లోపల చీకటిగా ఉంటూ, ఆ గది భయం గొలిపేదిగా కనిపిస్తుంది. గది తెరుచుకున్నా.. మల్లాఘన్ మాట్లాడుతూ భయపెడుతున్న ఆ గదిలో ఎటువంటి సామాను లేదని తెలిపింది. విలువైన ఖజానా అంతకన్నా లేదని పేర్కొంది. ఈ వీడియో చూసిన ఒక యూజర్ ఈ గదిని రెనోవేషన్ చేస్తారా? అని అడగగా, దానికి జవాబుగా ఆమె ఆ గది రెనోవేషన్ చేయబోమని, దానిలో ఏముందో చూడాలని అనుకున్నామని తెలిపింది. గతంలోనూ బయల్పడిన భూగృహాలు ఈ విధంగా భూగృహం బయటపడటం ఇదేమీ తొలిసారి కాదు. గత నెలలోనే ఒక రెడిట్ యూజర్ తమ కొత్త ఇంటిలో హిడెన్ రూమ్‌లో కొన్ని ప్రైవేట్ వస్తువులు లభ్యమయ్యాయని తెలిపారు. 1970-1980ల మధ్యకాలం నాటి ఈ గదిలో కొన్ని పురాతన వస్తువులతో పాటు ఒక బీరుబాటిల్ కూడా దొరికిందని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలోని ఆ ముగ్గురు పాస్‌పోర్టు లేకుండా ఎక్కడికైనా వెళ్లొచ్చు.. వారెవరో తెలిస్తే.. -
టెస్లా కారులో సీక్రెట్ ఫీచర్! ‘ఎలాన్ మోడ్’ అని పేరుపెట్టిన హ్యాకర్
టెస్లా కార్లలో ఒక రహస్య ఫీచర్ బయటపడింది. టెస్లా సాఫ్ట్వేర్ హ్యాకర్ కనుక్కున్న ఈ ఫీచర్‌కు ‘ఎలోన్ మోడ్’ అని పేరు పెట్టినట్లు ‘ది వెర్జ్’ వార్తా సంస్థ నివేదిక తెలిపింది. ఈ ఫీచర్ టెస్లా వాహనాల్లో హ్యాండ్స్ ఫ్రీ డ్రైవింగ్‌ను అనుమతిస్తుంది. @greentheonly అనే పేరుతో ట్విటర్లో ఈ రహస్య ఫీచర్ గురించి హాకర్ పేర్కొన్నారు. ‘ఎలాన్ మోడ్’ను కనుగొని, ఎనేబుల్ చేసి పరీక్షించిన హాకర్ దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీలను ట్విటర్లో షేర్ చేశారు. అయితే ఈ ఫీచర్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం కార్ లోపల స్క్రీన్‌పై లేదు. టెస్లా పూర్తి స్వీయ డ్రైవింగ్ (ఎఫ్ఎస్డీ) అనేది బీటా స్థితిలో పరీక్ష స్థాయిలో ఉన్న అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థ. ప్రస్తుతానికి 15 వేల డాలర్లు అదనంగా చెల్లించిన వారికి ఇది అందుబాటులో ఉంది. కానీ ఎఫ్ఎస్డీ సాఫ్ట్‌వేర్‌పై కస్టమర్ల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చినట్లు గత నెలలో బయటకు పొక్కిన ఓ అంతర్గత నివేదిక ద్వారా తెలిసింది. ఉన్నట్టుండి ఆగిపోవడం, స్పీడ్ పెరిగిపోవడం వంటి లోపాలు ఉన్నట్లు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. చెయ్యి వేయాల్సిన పని లేదు! టెస్లా ఆటోపైలట్ సిస్టమ్ అనేది హైవేల కోసం కంపెనీ రూపొందించిన మొదటి తరం డ్రైవర్ సహాయక వ్యవస్థ. సెల్ఫ్ డ్రైవింగ్ అయినప్పటికీ డ్రైవింగ్ సమయంలో అందులోని వ్యక్తి అప్రమత్తంగా ఉన్నారని నిర్ధారించడానికి స్టీరింగ్ వీల్‌ను అప్పుడప్పుడు తాకాల్సి ఉంటుంది. ఇలా తరచూ చేయాల్సి ఉండటంపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న హ్యాండ్స్ ఆన్ స్టీరింగ్ కన్ఫర్మేషన్తోపాటు సెంటర్ ఇంటీరియర్ కెమెరా డ్రైవర్లు ముందుకు చూస్తున్నారా లేదా అని గమనిస్తాయి. హాకర్ ‘ఎలాన్ మోడ్’లో నిర్వహించిన 600 మైళ్ల పరీక్షలో అలాంటి ఇబ్బందులేవీ ఎదురవ్వలేదని నివేదిక పేర్కొంది. ఈ మోడ్‌లో సిస్టమ్ లేన్లను మార్చడం, హైవేపై నెమ్మదిగా డ్రైవింగ్ ముగించడం గుర్తించినట్లు హాకర్ ట్విటర్లో వివరించారు. 2017తో పోల్చితే టెస్లా సాఫ్ట్వేర్ మరింత సురక్షితమైనదని చెప్పుకొచ్చాడు. కాగా నాజ్ఫ్రీ డ్రైవింగ్ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు గత డిసెంబర్లోనే మస్క్ హింట్ ఇచ్చారు. ఇదీ చదవండి: భారత్‌లో మొదటి టెస్లా కార్ ఇతనిదే.. And also when you kill one AP node, you retain some viz now, so now you can actually see which node does what. Node A does road layout/signs Node B does moving object detection as they still display with A dead. Also viz dies at times so you get AP functionality, but empty viz pic.twitter.com/Ldfi7cCPWh — green (@greentheonly) June 17, 2023 -
1990లలో అపహరించిన జీప్ అనూహ్యంగా ఎలా బయటపడిందంటే..
కొన్న వస్తువులు ఏవేవో కారణాల రీత్యా పోగొట్టుకోవడం జరుగుతుంది. ఎంతగా ప్రయంత్నించినా దొరికే అవకాశం గానీ వాటి ఆచూకీ గానీ కానరాదు. అలాంటి వస్తువు సడెన్‌గా దొరికినా లేదా చాలా ఏళ్లక్రితం మిస్ అయ్యిన వస్తువు అనుకోకుండా మనకు లభించిన లేదా బయటపడ్డ మన ఆనందానికి అవధులే ఉండవు. అలాంటి విచిత్ర ఘటనే యూఎస్ఏలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యునైటెడ్ స్టేట్స్‌లోని కాన్వాస్‌కు చెందిన 45 ఏళ్ల జాన్ మౌన్స్ ఫాక్స్ అనే వ్యక్తి మంచి చేపలను పట్టుకోవాలనే ఉద్దేశ్యంతో మే 29(మెమోరియల్ డే)న చెనీ సరస్సు వద్దకు వెళ్లాడు. సరస్సు వద్ద అనువైన చోటును వెదుకుతుండగా..ఓ విచిత్రమైన వస్తువు కంట పడింది. మొదట అర్థం కాలేదు. తన వద్ద ఉన్న సోనార్ పరికరాల సాయంతో నీటి అడుగున ఉన్న వస్తువుని నిశితంగా చూశాడు. ఏవో టైర్లు, రోల్‌బార్, స్టీరింగ్ వీల్ వంటి వాటితో కూడిన ఓ జీప్ లాంటి వస్తువును చూశాడు. ఎలాగైనా సరస్సు నుంచి తీయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే క్రేన్ల సాయంతో తీసేందుకు అధికారుల అనుమతి తీసుకుని మరీ ఆ వస్తువుని బయటకు తీశాడు. అతను ఊహించినట్లుగానే అది జీప్. 1990ల నాటి ఓల్డ్ జీప్ అని తేలింది. నిజానికి అతను ఏదో పెద్ద చేప ఏమో అనుకున్నాడు. బయటకు తీయాలనే ఆత్రుతలో అదే ఏంటో చూడగా అసలు విషయం బయపడింది. ప్రస్తుతం ఆ జీప్ని చూసేందుకు అధికారులు, ప్రజలు అతని ఇంటికి ఎగబడుతున్నారు. (చదవండి: ఖననం చేసే సమయంలో..శవపేటిక నుంచి శబ్దం అంతే..) -
గ్రహ శకలం కనుగొన్న విద్యార్థిని.. అరుదైన రికార్డు సొంతం
నిడదవోలు(తూర్పుగోదావరి జిల్లా): నిడదవోలుకి చెందిన పదో తరగతి విద్యార్థి కుంచాల కైవల్యరెడ్డి మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న ముఖ్యమైన ఆ్రస్టాయిడ్ బెల్ట్‌లో గ్రహ శకలం 2021 సీఎం37ను కనుగొన్నది. నాసా భాగస్వామ్య సంస్థ అయిన అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొలాబిరేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన క్యాంపెయిన్‌లో ఈ గ్రహశకలాన్ని కనిపెట్టింది. ఈ మేరకు అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొలాబిరేషన్ సంబంధిత ధ్రువీకరణపత్రాన్ని కైవల్యకు అందజేసింది. చదవండి: మీ కెరీర్ మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్.. నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే.. పాన్‌స్టార్స్ టెలిస్కోప్ సాయంతో తీసిన అంతరిక్ష ఛాయా చిత్రాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి విశ్లేషించడం ద్వారా ఈ గ్రహశకలాన్ని గుర్తించినట్లు కైవల్య తెలిపింది. ఢిల్లీకి చెందిన స్వచ్ఛంధ సంస్థ స్పేస్‌పోర్ట్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు సమీర్ సత్యదేవ్ వద్ద కైవల్యరెడ్డి శిక్షణ తీసుకుని ‘గామా’ టీం పేరు తో శకలాన్ని గుర్తించింది. గతంలో కైవల్య 2020 పీఎస్ 24 అనే మెయిన్ బెల్ట్‌లో ఉన్న గ్రహశకలాన్ని కనుగొనడంతో సీఎం వైఎస్ జగన్ ఆమెను అభినందిస్తూ రూ.లక్ష నగదు బహుమతి అందజేసి ప్రోత్సహించారు. రెండో గ్రహశకలం కనుగొన్న కైవల్యని తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి అభినందించారు. -
తవ్వకాల్లో బయటపడ్డ 4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం.. ఎక్కడంటే?
సుమారు 4500 ఏళ్ల క్రితం నాటి సూర్య దేవాలయాన్ని బయట పడింది. ఈ విషయన్ని ఈజిప్ట్ పురావస్తుశాఖ అధికారులు ధృవీకరించారు. 4,500 సంవత్సరాల క్రితం 25వ శతాబ్దం బీసీఈ మధ్యకాలం నాటి పురాతన సూర్య దేవాలయమని అధికారులు విశ్వసిస్తున్నారు. కాగా ఈజిప్ట్‌ను ఒకప్పుడు ఫారోహ్ అనే రాజులు పాలించేవారు. వాళ్ల హయాంలోనే ఈజిప్ట్‌లో మొత్తం ఆరు దేవాలయాలను నిర్మించారు. దీనిపై పురావస్తుశాఖ అధికారి మాట్లాడుతూ.. కనిపించకుండా పోయిన ఆరు ఫారో సూర్య దేవాలయంలో ఇది ఒకటని, తాము తవ్వి తీస్తున్నామని చెప్పడానికి బలమైన రుజువు తమకు దొరికిందని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం, అబూ ఘురాబ్‌లోని మరొక ఆలయంలో ఖననం చేయబడిన అవశేషాలను ఆ బృందం కనుగొంది. పురావస్తుశాఖ అధికారులు జరిపిన పరిశోధనలో ఇది మూడవ సూర్య దేవాలయమని, గత 50 సంవత్సరాలలో ఇదే మొదటిదని తెలిపారు. ఫారోలు సజీవంగా ఉన్నప్పుడే ఆరు సూర్య దేవాలయాలను నిర్మించారని, ఇప్పటి వరకు ఆరు దేవాలయాలలో రెండు మాత్రమే కనుగొన్నారు. సూర్య దేవాలయం అవశేషాల క్రింద త్రవ్వినప్పుడు మట్టి ఇటుకలతో చేసిన పాత స్థావరంతో పాటు మరొక భవనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 1898 లో ఒకసారి సూర్యదేవాలయాన్ని అధికారులు కనిపెట్టగా.. తాజాగా రెండో సూర్యదేవాలయాన్ని గుర్తించారు. చదవండి: నిప్పుతో చెలగాటలొద్దు! బైడెన్‌కు వార్నింగ్ ఇచ్చిన జిన్‌పింగ్.. -
మనుషుల్ని గోళ్లతో చీల్చి చంపేసే భయంకరమైన పక్షి గురించి తెలుసా?
కోట్ల ఏళ్ల కిందటి శిలాజం ఒకటి.. కోట్ల ఏళ్లనాటి జీవికి ప్రతిరూపం ఇంకోటి. రెండూ డేంజరే. ఒకదాని ఆనవాళ్లను ఇప్పుడే కొత్తగా కనుగొనగా.. మరోటి ఎప్పట్నుంచో మన మధ్యే ఉన్నా దానికి సంబంధించిన కొత్త సంగతులు ఇప్పుడే బయటపడ్డాయి. ఇందులో ఒకటి ‘సెరాటోసుచోప్స్ ఇన్ఫెరోడియోస్’ అనే రాక్షసబల్లికాగా.. మరోటి ఆ రాక్షస బల్లుల వారసత్వంగా మిగిలిన ‘కాస్సోవరీ’ అనే పక్షి. మరి ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? రెండు కొత్త డైనోసార్లు ఖడ్గమృగం లాంటి కొమ్ము.. మొసలిలాంటి తల..పది మీటర్ల పొడవు.. శత్రువులను చీల్చేసే బలమైన కోరలు.. ఓ భయంకరమైన కొత్త డైనోసార్ రూపమిది. ఇటీవలే యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ శాస్త్రవేత్తలు ఇంగ్లండ్ పరిధిలోని ‘ఐసిల్ ఆఫ్ వెయిట్’ ద్వీపంలో దీని శిలాజాలను గుర్తించారు. దానికి ‘సెరాటోసుచోప్స్ ఇన్ఫెరోడియోస్’ అని పేరుపెట్టారు. దీనికితోడుగా కనిపెట్టిన మరో కొత్త డైనోసార్‌కు ‘రిపరోవెనటార్ మిల్నెరీ’ అని పేరుపెట్టారు. 12.5 కోట్ల ఏళ్ల కింద ఇవి తిరుగాయని.. వీటిలో సెరాటోసుచోప్స్ భయంకరమైనదని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త క్రిస్ బార్కర్ తెలిపారు. వీటి పొడవు 29 అడుగుల వరకు ఉంటుందని, అందులో తల పొడవే 3 అడుగుల (మీటర్) వరకు ఉంటుందని వివరించారు. హెరోన్గా పిలిచే ఓ కొంగ వంటి పక్షి తరహాలో ఈ రెండు డైనోసార్లు కూడా చేపలను, ఇతర జంతువులను వేటాడి ఉంటాయని తెలిపారు. ఈ ‘ఐసిల్’లో ఎన్నో వింతలు ఇంగ్లండ్ పరిధిలోని ఐసిల్ ఆఫ్ వెయిట్ ద్వీపం ఎన్నో పురాతన శిలాజాలకు, వింతలకు నిలయం. ఇక్కడ కోట్ల ఏళ్లనాటి శిలాజాలను ఎన్నింటినో గుర్తించారు. మనం చెరువుల్లో, నదుల్లో నత్తలను చూస్తుం టాం. వాటి పరిమాణం మహా అయితే నాలుగైదు అంగుళాల వరకు ఉంటుంది. కానీ ఐసిల్ ద్వీపంలో కోట్ల ఏళ్లనాటి భారీ అమ్మోనైట్ (నత్త గుల్ల వంటి జీవి) శిలాజాన్ని 2020లో గుర్తించారు. 20 అంగుళాలు ఉన్న ఈ శిలాజం 95 కిలోలకుపైగా బరువు ఉండటం గమనార్హం. ఈ ద్వీపంలో నీయోవెనటర్, టెరోసార్ వంటి డైనోసార్లు, సూపర్టెరోసార్గా పిలిచే భారీ డైనోసార్ పక్షి, కాకి అంత పరిమాణంలో ఉండే మరో చిన్న డైనోసార్ పక్షి, కోట్ల ఏళ్ల నాటి మొసళ్లు, ఇతర జీవుల శిలాజాలను ఇప్పటికే గుర్తించారు. వాటన్నింటితో ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. డైనోసార్లను మరిపించేలా.. డైనోసార్లకు ఉండేలా తలపై పెద్ద ముట్టె.. పొడవైన ముక్కు.. రెండు కాళ్లకు కత్తుల్లాంటి పొడవాటి పదునైన గోళ్లు.. చూడగానే కాస్త డైనోసార్ల పోలికలు.. ‘కాస్సోవరీ’గా పిలిచే ఈ పక్షిని అత్యంత ప్రమాదకరమైన పక్షిగా పరిగణిస్తారు. ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తుంది. మనుషులు మొదట్లో పెంచుకున్నది కోళ్లు, బాతులను కాదు.. ఈ ‘కాస్సోవరీ’ పక్షులనేనట. తాజాగా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. ఆది మానవుల నివాస ప్రాంతాలపై అధ్యయనం చేస్తున్న ఈ శాస్త్రవేత్తలకు కొన్ని రకాల గుడ్ల పెంకులు, పక్షుల ఎముకలు లభించాయి. వాటిపై లేజర్ మైక్రోస్కొపీ, ఇతర పద్ధతుల్లో అధ్యయనం చేసి.. కాస్సోవరీ పక్షులకు చెందినవిగా గుర్తించారు. కొన్ని గుడ్లను కాల్చుకుని తిన్నట్టుగా, మరికొన్ని పొదిగి పిల్లలు బయటికి వచి్చనట్టుగా తేల్చారు. సుమారు 18 వేల ఏళ్ల కింద ఆది మానవులు వీటిని మాంసం, ఈకలు, గుడ్ల కోసం పెంచుకుని ఉంటారని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ క్రిస్టినా డగ్లస్ తెలిపారు. గోళ్లతో చీల్చేస్తుంది..! ఏకంగా ఆరు అడుగుల ఎత్తు, 59 కిలోల బరువు వరకు పెరిగే ఈ కాస్సోవరీ పక్షులు ప్రస్తుతం భూమ్మీద ఆస్ట్రిచ్‌ల తర్వాత అతిపెద్ద పక్షిజాతిగా చెప్పవచ్చని డగ్లస్ పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమైన పక్షి అని.. ఇతర పక్షులు, జంతువులతోపాటు మనుషులను కూడా గోళ్లతో చీల్చేసే సామర్థ్యం వీటికి ఉంటుందని తెలిపారు. ఆ్రస్టేలియాలోని న్యూగినియాలో స్థానికులు ఇప్పటికీ ఈ కాస్సోవరీ పక్షుల మాంసం తినడం గమనార్హం. యజమానిని చంపేసింది 2019లో అమెరికాలోని ఫ్లారిడాలో ఒక కాస్సోవరీ పక్షి.. తనను పెంచుకుంటున్న మార్విన్ హజోస్ అనే వ్యక్తిని గోళ్లతో చీల్చి చంపేసింది. విషయం ఏమిటంటే ఆయన ఓ పర్యావరణ ప్రేమికుడు. ఈ పక్షి ఒక్కదాన్నే కాదు.. ఇలాంటి చిత్రమైన మరో వంద రకాల పక్షులు, జంతువులను తన ఎస్టేట్‌లో పెంచేవాడు. ఆయన చనిపోయాక వాటన్నింటినీ వేలం వేశారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
గ్రామాన్నికాపాడిన వారికోసమే.. ఈ గుళ్లు
యాదాద్రి: ఊరిని కాపాడుకోవడానికి ప్రతి గ్రామానికి కొంతమంది వీరులు ఉండేవారని చరిత్ర చెబుతోంది. వారు ఊర్లలోని పిల్లల్ని, స్త్రీలను, సంపదలను కాపాడటానికి దొంగలతో, పరాయి సైనికులతో, క్రూర జంతువులతోనూ పోరాడేవారు. పోరులో అమరులైన ఆ వీరుల పేరిట నిలిపిన స్మారక శిలలే వీరగల్లులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు గ్రామాల్లో ఈ శిలలు దర్శనమిస్తాయి. అయితే వీరగల్లులకు గుడులు కట్టిన విషయం మాత్రం పరిశోధకులకు ఆసక్తి కలిగిస్తోంది. గుర్తించిన చరిత్రకారులు.. శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, పెసరు లింగారెడ్డి, సహాయకుడు నాగరాజుతో కూడిన చరిత్ర బృందం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో పర్యటించినపుడు అక్కడున్న మన్నెవార్ కోట, శైవ, వైష్ణవ దేవాలయాలు, నిజాం కాలం నాటి మెట్లబావితో పాటు విశేషమైన వీరగల్లులను గుర్తించారు. ఎక్కడాలేనట్లు తుర్కపల్లిలో వీరగల్లులకు గుడికట్టిన అవశేషాలు కనిపించాయి. ఊరికి తూర్పున 2 కూలిన కప్పులతో చిన్నగుడుల అవశేషాలు ఉన్నాయి. వీరగల్లులకు గుడులు కట్టిన 4 రాతి స్తంభాలున్నాయి. భూమిలో మునిగినవి కొన్ని, సగం బయటపడినవి కొన్ని కనిపించాయి. మూడింటిలో 2 ప్రత్యేక వీరగల్లులు ఉన్నాయి. వీరగల్లుల శిల మొదటి వీరగల్లులో రెండవ అంతస్తులో పైన సూర్యచంద్రులు వాటికింద ఒక ఎద్దు, దానికెదురుగా పడ గెత్తిన నాగుపాము ఉన్నాయి. కింది అంతస్తులో దనుర్ధారి సైనికుడున్నాడు. పాము నుండి ఎద్దును కాపాడే క్రమంలో పోరాడి మరణించిన వీరుని స్మారకశిలగా భావిస్తు న్నారు. ఇంతవరకు తెలంగాణలో లభించిన వీరగల్లులలో ఇటువంటి వీరగల్లు ఇదే మొదటిది. రెండవ వీరగల్లులో పెద్దపులులతో పోరాడుతున్న వీరుడు అగుపిస్తున్నా డు. ఓ పులి మరణించి ఉంది. రెండో పులిని వీరుడు శూలంతో పొడుస్తున్నాడు. మూడో పులి పారిపోతున్నది. పులులతో పోరాడి అమరుడైన వీరయోధుని వీరశిల ఇది. తెలంగాణలో వీరులు పెద్దపులులతో పోరాడే దృశ్యాలున్న వీరగల్లులు కూడా ఐదులోపునే లభించాయి. మూడవ వీరగల్లులో వీరుని తలమీద సూర్యచంద్రులున్నా రు. ఇలా వీరగల్లులపై లోతుగా పరిశీలన చేస్తే విలువైన సమాచారం లభించవచ్చు. -
10 బిలియన్ ఏళ్ల రాతి గ్రహం.. మండుతున్న గోళంలా..
భూమిని పోలిసి ఓ రాతి గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది భూమి కంటే 50 శాతం, మూడు రెట్ల ద్రవ్యరాశిని కలిగి ఉన్న అత్యంత వేడి, రాతి గ్రహంగా నాసా టెస్ మిషన్(ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్) కనుగొంది. అయితే ఇది భూమికి సమాన సాంద్రతలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనికి TOI-561b అని పేరు పెట్టారు. మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్నందున దీనిని ఎక్స్ప్లానెట్గా నాసా సైంటిస్టులు పేర్కొన్నారు. సూపర్ ఎర్త్‌గా పలిచే ఈ గ్రహం సూర్యునిలా ఎర్రగా, మండిపోతున్న గోళంలా కనిపిస్తోంది. మన పాలపుంతలో ఈ కొత్త గ్రహం ఈ నాటిది కాదని, ఎన్నో బిలియన్ల సంవత్సరాల క్రితం గ్రహంగా నాసా పేర్కొంది. అంటే.. ఈ గ్రహం వయస్సు దాదాపు 1000 కోట్ల సంవత్సరాలు ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. మన భూమికి 280 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ పురాతన గ్రహం (TOI-561b) రాతి ప్రపంచంలో ఉంటుందని, ఇది భూమికి మూడంతలు పెద్దదిగా ఉంటుందని పేర్కొన్నారు. కేవలం 24 గంటలకు కంటే ఎక్కువ సమయంలో ఈ గ్రహం స్టార్ కక్ష్యలో తిరుగుతుందట. అందువల్లే దీనిని సూపర్ ఎర్త్‌గా పేర్కొంటున్నట్లు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. నాసా ప్రకారం.. విశ్వంలో చాలా వరకు రాతి గ్రహాలు ఏర్పడి ఉండవచ్చని, ఈ TOI-561b అనేది పురాతన రాతి గ్రహాలలో ఒకటై ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 14 బిలియన్ ఏళ్ల క్రితం విశ్వం ప్రారంభమైనప్పటి నుండి రాతి గ్రహాలు ఉన్నాయని ఈ గ్రహం ఆధారంగా అంచనా వేస్తున్నారు. పాలపుంతలోని ప్రధాన నక్షత్రాలకు మొదటి నుంచే 10 బిలియన్ల ఏళ్ల వయస్సు ఉన్న ఈ గ్రహం ప్రకాశిస్తోందని, సౌర వ్యవస్థ కంటే రెండు రెట్లు పాతదని భావిస్తున్నారు. ఈ పాలపుంత సుమారు 12 బిలియన్ ఏళ్ల నాటి పురాతనమైనదిగా నాసా వివరించింది. -
ఇక లేదనుకున్నారు, కానీ 27 ఏళ్ల తరువాత...
లండన్: బ్రిటన్‌లో అంతరించిపోయిందనుకున్న ఒక సాలీడు జాతిని ఇటీవలే కనుగొన్నారు. యూకేలోని సర్రేలో వైల్డ్‌లైఫ్ ట్రస్ట్‌కు చెందిన ఒక స్పైడర్ జౌత్సాహికుడు మైక్ వైట్ మిలిటరీ సైనిక శిభిరంలో దీనిని కనుగొన్నాడు. ఫాక్స్ స్పైడర్‌గా పిలిచే ఈ జాతి సాలీడులో బ్రిటన్‌లో చివరిసారిగా 1993లో కనిపించాయి. తరువాత ఇప్పటి వరకు ఎక్కడ కనిపించలేదు. ఈ సాలీడు జాతి గురించి చెప్పాలంటే ఇవి చాలా వేగంగా, చురుకుగా ఉంటాయి. ఊసరవెల్లిలాగా తమ పరిసరాలకు అనుగుణంగా రంగులను కూడా మార్చుకోగలవు. ఇది ఒక అరుదైన సాలీడు జాతి. ఇది బ్రిటన్‌లో కేవలం మూడు ప్రాంతాలలోనే కనిపిస్తుంది. దీనికి ఎనిమిది కనులు, స్పష్టమైన కంటిచూపు ఉంటుంది. ఇవి రాత్రి పూట ఆహారం కోసం వేట మొదలు పెడతాయి. రాళ్లను తవ్వి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అంతేకాకుండా ఆహార సేకరణలో ఇవి నక్కలాగా ప్రవర్తిస్తాయి అందుకే వీటిని ఫాక్స్ స్పైడర్స్‌గా వ్యవహరిస్తున్నారు. చాలా అరుదుగా కనిపించే ఈ సాలీడు జాతి 27 ఏళ్ల క్రితం కనిపించి మళ్లీ ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించకపోవడంతో అంతం అయిపోయిందని భావించినట్లు వైట్ తెలిపారు. ఇనాళ్లు మళ్లీ కనుగొనడం ఆనందంగా ఉంది అని హర్షం వ్యక్తం చేశారు. చదవండి: ఇలాంటి స్పైడర్ ఎప్పుడైనా చూశారా.. -
ఆ వ్యాక్సిన్ నేనే కనిపెట్టాను
డాక్టర్ ప్రహ్లాద్ బిస్సీ దగ్గర రెండు రకాలైన మందులు ఉన్నాయి. ఒకటి సంతానప్రాప్తిని కలిగించే మెడిసిన్. ఇంకొకటి కోవిడ్ 19 వ్యాక్సిన్. రెండింటినీ తేలిగ్గా గుర్తుపట్టొచ్చు. సీసాలో మందులు ఉండి, పైన లేబుల్స్ ఉంటాయి. కోవిడ్ రాక ముందు ఒకటే మందు ఉండేది. పని కూడా అతడికి తక్కువగా ఉండేది. ‘పిల్లలు లేరు’ అని ఎవరైనా రాగానే.. కళ్లద్దాల లోంచి ‘ఐ నో ’ అన్నట్లు చూసి ఆ ఉన్న ఒకరకం మందును ఇచ్చి పంపేవాడు. బిస్సీ స్వయంగా చేసి సిద్ధంగా ఉంచే మందు అది. ఇప్పుడీ కోవిడ్ వ్యాక్సిన్నీ తనే తయారు చేసి సీసాల్లో ఉంచి, వెంటనే తీసివ్వడానికి వీలుగా ఆ సీసాలపై పేరు రాసి పెట్టుకున్నాడు. అతడు చేసిన ఇంకో మంచి పని తన కోవిడ్ మందులను అమ్ముకోడానికి లైసెన్సు కోసం జిల్లా వైద్యాధికారులకు మెయిల్ పెట్టడం. ఒడిశాలోని బార్గర్ జిల్లాలో రుసుడా గ్రామంలో ఉంటుంది బిస్సీ క్లినిక్. మెయిల్ అందగానే రిటర్న్ మెయిల్ ఇవ్వకుండా వైద్యాధికారులే నేరుగా అక్కడికి వచ్చేశారు. వాళ్ల వెనకే పోలీసులు! ప్రస్తుతం బిస్సీ పోలీసుల ‘సంరక్షణ’ లో ఉన్నాడు. అతడిని వైద్యాధికారులు ఇంటరాగేట్ చేస్తున్నారు. ఎక్కడిది నీకా కోవిడ్ వ్యాక్సిన్ అని అడుగుతున్నారు. నేనే కనిపెట్టాను అంటున్నాడు. ఎలా కనిపెట్టావ్ అని అడుగుతున్నారు. ఒక ఫార్ములా ఉంది అంటున్నాడు. ఏమిటా ఫార్ములా అని అడుగుతున్నారు. టాప్ సీక్రెట్ అంటున్నాడు. ఆ సీక్రెట్‌ను ఛేదించే ప్రయత్నంలో వారికి ఇంకో సీక్రెట్ తెలిసింది. బిస్సీ 7వ తరగతి వరకు చదువుకున్నాడని! ఇంటరాగేషన్ అక్కడితో ఆగిపోకుండా ఉంటే మాత్రం ఇప్పటికి ఇంకా కొనసాగుతూనే ఉండి ఉండాలి. -
మెక్సికన్ గల్ఫ్‌లో అరుదైన షార్క్ చేప..
అమెరికాలోని గల్ఫ్ మెక్సికోలో ఓ కొత్త షార్క్ చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కేవలం 5.5 అంగుళాలు మాత్రమే ఉండి చాలా ప్రకాశవంతంగా కనిపిస్తోంది. గత కొన్నెళ్లుగా షార్క్ చేపలపై, సముద్రాలలోని ప్లాస్టిక్‌పై అధ్యయనం చేస్తున్న తులనే విశ్వవిద్యాలయం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 1979 అనంతరం తొలిసారి అతి చిన్న షార్క్ చేపను గుర్తించినట్టు తెలిపారు. గతంలో 2010, 2013లలో దీనిని గుర్తించామని కానీ తమకు చిక్కలేదన్నారు. ఈ షార్క్ చేప దాని శరీరం నుంచి వచ్చే కాంతితో ఎదుగుతుందని స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ తెలుపుతోంది. దీంతో పాటు ఇతర జీవులను ఆకర్షించడానికి, వీటిపై దాడి చేసేవారిని దూరంగా ఉండమని హెచ్చరిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2010 లో గల్ఫ్ ప్రాంతంలో తిమింగలాలపై అధ్యయనం చేస్తున్నప్పుడు శాస్త్రవేత్తలు కాంతిని ప్రసరించే మగ కైట్ఫిన్ షార్క్ కనుగొన్నారు. ఆ తర్వాత నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ పరిశోధకుడు మార్క్ గ్రేస్ కాంతితో మెరిసే షార్క్ చేపను కనుగొన్నారు. ఎక్కువగా లోతు ఉండే సముద్ర జీవులపై పరిశోధనలు చాలా తక్కువగా జరుగుతున్నాయంటూ.. సముద్ర పైభాగంలోని నీటిలో నివసించే జంతువుల్లో 90 శాతం కాంతిని ప్రసరిస్తాయని ఎన్ఓఏఏ అంచనా వేసింది. -
కొత్త బ్లాక్‌హోల్స్‌కు స్టీఫెన్ హకింగ్ పేరు
న్యూఢిల్లీ: రష్యన్ వ్యోమగాములు ఓ కొత్త బ్లాక్ హోల్(కృష్ణ బిలం)ను కనుగొన్నారు. తన జీవితమంతా అంతరిక్ష పరిశోధనలకు కేటాయించిన ప్రఖ్యాత బ్రిటీష్ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హకింగ్ పేరును బ్లాక్ హోల్‌కు పెట్టారు. కొత్తగా కనిపెట్టిన బ్లాక్ హోల్ ఓఫికస్ నక్షత్రాలు కూటమిలో ఉన్నట్లు కనుగొన్నారు. సరిగ్గా స్టీఫెన్హకింగ్ చనిపోయిన రెండు రోజుల తర్వాత ఈ విషయం కనిపెట్టారు. మాస్కో స్టేట్‌యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొంతకాలంగా నక్షత్రాల కూటమిలో గామా కిరణాల పేలుళ్లను(జీఆర్బీ) పరిశీలిస్తున్నారు. నక్షత్రం కూలిపోవటం వల్లే పేలుడు సంభవించిందని, దాని స్థానంలో బ్లాక్ హోల్ ఏర్పడటానికి పరిస్థితులు దారితీశాయని వెల్లడించారు. గామా-రే ఖగోళ శాస్త్రంలో.. గామా-రే పేలుళ్లు చాలా శక్తివంతమైన పేలుళ్లు అని, సుదూరంలో ఉన్న గెలాక్సీలను కూడా అవి మింగేస్తాయని తెలిపారు. పేలుళ్ల సమయంలో విడుదలయ్యే శక్తిని టెలిస్కోపు ద్వారా బంధించడం కూడా దాదాపు అసాధ్యమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సెకనులోపదో వంతు నుంచి మిల్లీ సెకండ్ సమయంలో మాయమైపోతాయని చెప్పారు. కానీ అదృష్టవశాత్తు రష్యాన్ వ్యోమగాములు ఈ దృశ్యాన్ని బంధింపగలిగారని రష్యన్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ఈ శక్తివంతమైన పేలుళ్లను స్పెయిన్ దేశంలోని టెనెరిఫ్ ఐలాండ్‌లో ఏర్పాటు చేసిన మాస్టర్-ఐఏసీ రోబోటిక్ టెలిస్కోప్ బంధించగలిగిందని తెలిపారు. బ్లాక్ హోల్‌పై పరిశోధనలకు గానూ దీనికి స్టీఫెన్హకింగ్ బ్లాక్ హోల్ అని నామకరణం చేసినట్లు రష్యన్ పరిశోధకులు, ఆస్ట్రోనామర్స్ టెలిగ్రామ్ జర్నల్‌లో పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణను జీఆర్బీ180316ఏ పేరుతో రిజిస్టర్ చేశారు. బ్లాక్ హోల్లో వెళ్లిన ఏ వస్తువులూ తిరిగి రాలేవు. కాంతిని కూడా బ్లాక్ హోల్స్ మింగేస్తాయి. స్టీఫెన్ హకింగ్(76) ఈ నెల 14న అమియోట్రోఫిక్ లాటెరల్ స్ల్కెరోసిస్- ప్రోగ్రెస్సివ్ న్యూరోడీజనరేటివ్ వ్యాధితో మరణించిన సంగతి తెల్సిందే. -
అతి పెద్ద ప్రధాన సంఖ్య!
వాషింగ్టన్: ప్రపంచంలోనే ఇప్పటి వరకు తెలిసిన అతిపెద్ద ప్రధాన సంఖ్యను ఔత్సాహిక శాస్త్రవేత్త కనుగొన్నారు. గతేడాది డిసెంబర్ 26న అమెరికాకు చెందిన జొనాథన్ పేస్ అనే 51 ఏళ్ల ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఈ ఘనత సాధించారు. 2ను 7,72,32,917 సార్లు గుణించి, ఆ తర్వాత అందులో నుంచి ‘1’ ని తీసివేశారు. ఆ వచ్చిన సంఖ్యలో 2,32,49,425 అంకెలున్నాయి. ఇప్పటివరకు తెలిసిన ప్రధాన సంఖ్య కన్నా ఎం77232917 అని పిలుస్తున్న ఈ కొత్త ప్రధాన సంఖ్యలో దాదాపు 10 లక్షల అంకెలు ఎక్కువగా ఉన్నాయి. అత్యంత అరుదుగా ఉండే ఈ ప్రధాన సంఖ్యలను మెర్సెన్నె ప్రధాన సంఖ్యలు అంటారు. 350 ఏళ్ల కిందటే ఈ ప్రధాన సంఖ్యల గురించి అధ్యయనం చేసిన ఫ్రెంచ్ శాస్త్రవేత్త మారిన్ మెర్సెన్నె పేరు వీటికి పెట్టారు. ఈ కొత్త ప్రధాన సంఖ్యను ఆరు రోజుల పాటు ఆగకుండా లెక్కించారు. ఎం77232917 ఇప్పటి వరకు కనుగొన్న 50వ మెర్సెన్నె ప్రధాన సంఖ్య. గ్రేట్ ఇంటర్నెట్ మెర్సెన్నె ప్రైమ్ సెర్చ్ (జీఐఎంపీఎస్) అనే సాఫ్ట్వేర్ సాయంతో ప్రధాన సంఖ్యలు కనుగొనేందుకు వేల మంది వలంటీర్లు నిత్యం ప్రయతిస్తుంటారు. ఈ ప్రధాన సంఖ్యను కనుగొన్న వారికి రూ.50 వేలను పారితోషికంగా అందిస్తారు. జొనాథన్ పేస్ గత 14 ఏళ్లుగా ప్రధాన సంఖ్యను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. -
అండమాన్‌లో బయటపడ్డ.. అరుదైన చీమలు
సాక్షి, న్యూఢిల్లీ : అండమాన్ దీవుల్లో చీమ జాతికి చెందిన అత్యంత అరుదైన రెండు రకాల చీమలను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. అండమాన్ ద్వీప సముదాయంలోని హావ్లాక్ ప్రాంతంలో పరిశోధనలు చేస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (బెంగళూరు), జపాన్‌కు చెందిన ఒకినోవా సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వీటిని గుర్తించారు. కొత్తగా గుర్తించిన ఈ జీవులకు ప్రముఖ శాస్త్రవేత్తలైన కేఎస్, కృష్ణన్, జార్వాల పేర్లు వచ్చేలా.. టెట్రానియం క్రిష్ణాని, టెట్రానియం జార్వా అని నామకరణం చేశారు. అండమాన్ దీవుల్లోని మొక్కలు, అక్కడ పెరిగే ఆకుకూరల మీద పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తొలిసారిగా చీమ జాతులకు చెందిన జీవులను గుర్తించారు. ఇవే కాకుండా ఇప్పటివరకే 50 రకాల చీమల జాతులను ఉనికిని గుర్తించినట్లు శాస్త్రవేత్తల బృందం సభ్యుడు గౌరవ్ అగ్వేకర్ చెప్పారు. భవిష్యత్తులో దేశంలోని అన్ని రకాల చీమ జాతుల సమాచారాన్ని నిక్షిప్తం చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. చీమ జాతుల్లో చాలావాటి గురించిన సమాచారం అందుబాటులో లేదన్నారు. వీటి గురించి సమాచారం నిక్షిప్తం చేస్తే భవిష్యత్‌లో పర్యావరణ, పరిణామ మార్పులకు సంబంధించిన పలు అంశాలకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. -
చంద్రుడిపై మరిన్ని అగాథాలు
వాషింగ్టన్: చందమామపై మరో రెండు అగాథాలను శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. మొదటి దాని వయస్సు 1.6 కోట్ల సంవత్సరాలు, రెండోదాని వయసు 7.5 కోట్ల సంవత్సరాలని నిర్ధారించారు. వీటిని కనుగొనడం వల్ల సౌరవ్యవస్థలో రాపిడుల గురించి మరిన్ని పరిశోధనలు నిర్వహించవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ల్యాంప్, ఎల్ఆర్ఓ అనే ప్రాజెక్టుల్లో భాగంగా చంద్రుడిపై పరిశోధనలు నిర్వహించగా ఈ విషయం వెల్లడయింది. అయితే ఈ అగాథాలపై కాంతి పడకపోవడంతో వీటిపై అధ్యయనం క్లిష్టతరంగా మారిందని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిపై చిన్న చిన్న రాళ్లు, దుమ్ము కనిపించాయి. -
అడవుల్లో అద్భుతాన్ని కనిపెట్టిన బాలుడు!
మెక్సికో: శాటిలెట్ ఫొటోల ఆధారంగా ఓ బాలుడు అద్భుతాన్ని ఆవిష్కరించాడు. దట్టమైన అడవుల్లో నిక్షిప్తమైన, ఎవ్వరికీ కనపడకుండా మరుగున పడిపోయిన మయన్ నగరాన్ని గుర్తించాడు. మాయ నాగరికతకు చెందిన చరిత్ర ఆధారంగా పరిశోధనలు చేశాడు. సెంట్రల్ అమెరికాకు చెందిన మెక్సికన్ పర్వత ప్రాంతంలో వేల ఏళ్ళనాడు మరుగున పడిపోయిన నగరాన్ని 15ఏళ్ళ విలియమ్స్ గడౌరీ గుర్తించాడు. ఇప్పటివరకూ పరిశోధకుల కంట కూడ పడని దట్టమైన అడవులు, కొండలు, గుట్టల్లో దాగి ఉన్న ఆ అద్భుత 'మాయ' నగరాన్ని శాటిలెట్ చిత్రాల ద్వారా గుర్తించిన బాలుడు... ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. ప్రాచీన కళలు, సంస్కృతి ప్రతిబింబించే కట్టడాలు, అద్భుత నిర్మాణాలు ఇప్పుడా నగరంలో బయటపడి, వేల యేళ్ళ చరిత్రకు ఆనవాళ్ళుగా మారాయి. 2014 సంవత్సరంలోనూ పురావస్తు శాఖ వారు రెండు పురాతన పట్టణాలను కనుగొన్నారు. అయితే అప్పట్లో అడవుల్లో దాగి ఉన్న ఈ నగరాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. తాను చదివిన ఓ పుస్తకం ఆధారంగా ఆ అదృశ్య నగరాన్ని గుర్తించినట్లు విలియమ్స్ గడౌరీ చెప్తున్నాడు. మాయ నాగరికత నాటి నిర్మాణాలన్ని మారుమూల ప్రాంతాలు, దట్టమైన అడవులు, పర్వతాల నడుమే ఉన్నట్లు తెలుసుకున్న అతడు... అలా ఎందుకు నిర్మించేవారో తెలుసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ విషయంపై అధ్యయనాలు ప్రారంభించాడు. ఆ కాలంలో ప్రజలు నక్షత్రాలను ఎక్కువగా పూజించేవారని తెలుసుకుని ఆదిశగా అధ్యయనాలను మొదలు పెట్టాడు. నక్షత్రాల ఆధారంగా నగరాలను గుర్తించవచ్చన్న కోణంలో అడుగులు వేశాడు. గడౌరీ అనుకున్నట్లుగానే ఇప్పటిదాకా గుర్తించిన నగరాలన్నీ 22 నక్షత్ర సమూహాల స్థానంలోనే ఉన్నట్లు గుర్తించాడు. కానీ ఇంతకు ముందు పరిశోధకులు గుర్తించిన వాటిలో ఓ నగరం మిస్ అయినట్లు తెలుసుకున్న అతడు.. గూగుల్ ఎర్త్ ఆధారంగా పరిశోధనలు కొనసాగించి, రాడార్ శాట్-2 ఉపగ్రహ చిత్రాలద్వారా అడవుల్లో దాగిఉన్న అద్భుతాన్ని కనుగొన్నట్లు తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మానవమాత్రులు అడుగు పెట్టలేని అ మారుమూల యుకాతాన్ అడవుల్లోని నగరానికి తాను.. కాక్ చి అని గాని, మౌత్ ఆఫ్ ఫైర్ అనిగాని కొత్త పేరు పెట్టాలని కూడ భావిస్తున్నాడు. అయితే ఆ నగరం మానవ నిర్మితంగానే కనిపిస్తోందని, అయితే ప్రపంచం ఈ నంగరం ద్వారా కొత్త ఆవిష్కణను చూసే అవకాశం ఉందని న్యూ బ్రున్స్విక్ విశ్వవిద్యాలయం రిమోట్ సెన్సింగ్ లేబొరేటరీకి చెందిన డాక్టర్ ఆర్మాండ్ లా రాక్యూ చెప్తున్నారు. శాటిలెట్ చిత్రాల్లోని ఒక ఫొటో అక్కడి నిర్మాణాలు చతురస్రాకారంలో పిరమిడ్ ను పోలి ఉన్నట్లుగా తెలుస్తోందని చెప్తున్నారు. విలియమ్స్ కనుగొన్న పద్ధతిలో మాయన్ నగరం ఆధారంగా పురాతత్వవేత్తలు మరిన్ని నగరాలను కూడ గర్తించే అవకాశం ఉందన్నారు. తన కొత్త ఆవిష్కరణలను సైంటిఫిక్ జనరల్ లో ప్రచురించిన విలియమ్స్... 2017 లో జరిగే బ్రెజిల్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించనున్నట్లు కూడ తెలుస్తోంది. -
చిన్నారి చేతుల్లో విలువైన వస్తువు
పాలస్తీన: నెషామా స్పైల్మన్(12) ఇజ్రాయల్ అమ్మాయి అరుదైన వస్తువును కనుగొంది. ఈజిప్టును 3200 ఏళ్ల్ క్రితం పరిపాలించిన థట్ మోస్-3 కు చెందిన (రక్షరేకు) విలువైన వస్తువును ఆమె కనుగొంది. తన కుంటుంబంతో కలిసి టెంపుల్ మౌంట్ ప్రాజెక్టులో పాల్గొన్న ఆమె మౌంట్ జెరూసలెంలో ఈ ఆవిష్కరణ చేసింది. ''నేను ఇక్కడ పరిశోధన చేస్తుండగా భిన్నమైన వస్తువును గుర్తించాను. వేల ఏళ్లకు చెందిన ఈజిప్టు పాలకులకు చెందిన, ఇక్కడి వారు విస్మరించిన వస్తవును కనుకొన్నాను. ఈ సంవత్సరం తన కెంతో ప్రత్యేక మని ఆమె తెలిపింది. పాస్కోవర్ పండుగను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటానని ఆమ చెప్పింది. ఎక్సోడర్ సంస్మరణార్థం జరుపుకునే పస్కోవర్ పండుగ ఇజ్రాయెలీయుల నుంచి ఈజిప్టుకు వచ్చింది. థుట్ మోస్-3 14శతాబ్దంలో కెనాన్ ను కేంద్రంగా చేసుకొని ఇజ్రాయెల్ ను పాలించాడు. 12 years girl,priceless treasure,discovered,12ఏళ్ల అమ్మాయి,విలువైన వస్తువు,ఆవిష్కరణ -
తెల్ల జుట్టు రహస్యం తెలిసిపోయిందోచ్!
జుట్టుకు రంగు వేసుకొని.. వేసుకొని విసిగిపోయారా? ఇక ఆ రంగులకు, బ్రష్‌లకు ప్యాకప్ చెప్పేయొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. అందరినీ వేధిస్తున్న తెల్లజుట్టు బెంగ ఇక అక్కర్లేదట. జుట్టు తెల్లబడటానికి కారణమైన జన్యువును కనుగొన్నామని.. ఇది మరింత విప్లవాత్మక మార్పులకు దారితీయనుందని లండన్ పరిశోధకులు చెబుతున్నారు. ఐఆర్ఎఫ్ 4 అనే జన్యువు వల్లే జుట్టు రంగు మారుతోందని గుర్తించారు. మెలనిన్‌ను నియంత్రిస్తున్న ఈ జన్యువే జుట్టును కూడా తెల్లబరుస్తోందని ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ ఆవిష్కరణతో జట్టు తెల్లబడటాన్ని నిరోధించడం భవిష్యత్తులో సాధ్యమే అంటున్నారు. జుట్టు రంగు, సాంద్రత, ఆకారాన్ని ప్రభావితం చేసే జన్యువులను గుర్తించేందుకు లాటిన్ అమెరికా చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు ఆరువేల మందిపై ఈ పరిశోధన సాగింది. జుట్టు తొందరగా తెల్లబడటానికి కేవలం జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ పరిస్థితులు కాకుండా.. మనిషిలోని జన్యువే ప్రధాన పాత్ర పోషిస్తోందని లండన్ శాస్త్రవేత్తలు తేల్చారు. బట్టతల రావడానికి, జుట్టు రంగును మార్చే జన్యువులను ఇప్పటికే గుర్తించినా, మానవుల్లో జుట్టు తెల్లగా మారడానికి కారణమైన జన్యువును గుర్తించడం ఇదే ప్రథమమని, చాలా కీలకమైందంని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ (యూసీఎల్) కు చెందిన డాక్టర్ కౌస్తుభ్ అధికారి చెప్పారు. ఇది ఇంతకు ముందెన్నడూ జరగని పరిశోధన అని పేర్కొన్నారు. ఇది కాస్మోటింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందంటున్నారు. మానవ వృద్ధాప్య జీవశాస్త్రం అంశాల పరిశోధనలో తమ అధ్యయనం మంచి పరిణామమని ప్రొఫెసర్ ఆండ్రెస్ రూయిజ్- లినారెస్ చెప్పారు. గడ్డం దగ్గర జుట్టు మందం, కనుబొమ్మల మందాన్ని, వైవిధ్యాన్ని నియంత్రించే జన్యువులను కూడా తమ పరిశోధనలో గుర్తించినట్టు తెలిపారు. వేసవిలో మెదడును చల్లగా ఉంచేందుకు ఉంగరాల జుట్టు సహాయపడుతుందని తమ అధ్యయనంలో తేలిందంటున్నారు. ఉత్తర, దక్షిణ ప్రాంత వాసుల జుట్టు స్ట్రయిట్‌గా ఉండటానికి కూడా ఇదే కారణమన్నారు. తీవ్రమైన చలి నుంచి తట్టుకునేందుకు వీలుగా వారి జుట్టు సాదాగా ఎదుగుతుందంట. యూరోపియన్లలో 20 ఏళ్లకు ముందు, తూర్పు ఆసియన్లలో 30లలో, సహారా ఆఫ్రికన్లలో 40లలో జుట్టు తెల్లబడటం మొదలవుతుందని తెలిపారు. భారత సంతతికి చెందిన డాక్టర్ కూడా భాగస్వామిగా ఉన్న ఈ పరిశోధన.. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. -
గలాపగస్ లో మరో భారీ తాబేలు!
తాబేళ్లలో ఇంచుమించుగా అన్నింటి జీవితకాలం వంద ఏళ్లకు పైనే ఉంటుంది. అయితే వాటిల్లో జెయింట్ టార్టాయిస్లు అయితే ఏకంగా రెండు వందల ఏభై ఏళ్లు కూడా బతుకుతాయి. తాజాగా సైంటిస్టులు ఫసిఫిక్ మహా సముద్రంలోని గాలాపగస్ దీవుల్లో ఓ భారీ తాబేలు జాతి ఉన్నట్లుగా గుర్తించారు. నెమ్మదిగా కదిలే సరీసృపాల సమూహాల్లో మరొక రకమైన ఈ తాబేలు.. శాంటా క్రజ్ ద్వీపంలో ఇంతకు ముందున్న తాబేళ్ళ జాతికి భిన్నంగా, వైవిధ్యంగా ఉన్నట్లు గుర్తించారు. వీటి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు జన్యు సమాచారాన్ని సేకరిస్తన్నారు. ఈ ద్వీప సమూహంలో ఉన్న మొత్తం 15 తాబేళ్ళ జాతుల్లో నాలుగు అంతరించిపోగా ఇది 15 వ జాతిగా సైంటిస్టులు చెప్తున్నారు. గాలాపగస్ రిటైర్డ్ పార్క్ రేంజర్... చెలోనాయిడిస్ డాన్ ఫాస్టియో అని ఈ కొత్త జాతికి పేరు పెట్టారు. గాలాపగస్ లో నివసించే భారీ తాబేళ్ళు 250 కేజీల వరకు బరువుండి, వందేళ్ళకంటే ఎక్కువకాలం బతుకుతాయి. అయితే శాంటా క్రూజ్ ద్వీపంలో ఉన్న రెండు అతిపెద్ద తాబేళ్ళు ఒకే జాతికి చెందినవిగా ఉన్నప్పటికీ, అవి జన్యు పరీక్షల్లో తేడాలు ఉన్నట్లు తేలిందని ఈ క్వెడార్ పర్యావరణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్తగా కనుగొన్న జాతులను తూర్పు శాంటా క్రుజ్ తాబేళ్ళుగా పిలుస్తారని, ఇవి ద్వీపంలోని తూర్పువైపు నివపిస్తాయని, అయితే ఇతర ద్వీపాల్లోని అతిపెద్ద తాబేళ్ళతో పోలిస్తే వీటిలో విభిన్నమైన జన్యువులు ఉన్నట్లు గుర్తంచారు. ఈ అతిపెద్ద తాబేలు యొక్క షెల్ ఆకారం మాత్రం ఇతర జాతులకంటే మరింత కుదించినట్లుగా ఉందని, యేల్ విశ్వవిద్యాలయం జీవశాస్త్రవేత్త గిసెల్లా కాక్సియాన్ అన్నారు. 250 దాకా ఉన్న ఈ భారీ తాబేళ్ళ జాతుల పరిరక్షకులు, వీటి జాతులు అంతరించిపోకుండా, వీటికి హాని కలగకుండా పునరుద్ధరించడానికి సహాయపడగలరని వీరు ఆశతో ఉన్నారు. ఇతర తాబేళ్ళకంటే ఎక్కువగా.. రెండువేలకు పైగా అతిపెద్ద తాబేళ్ళ జాతులు ఈద్వీపంలో నివసిస్తున్నట్లు వీరు చెప్తున్నారు. గాలాపగస్ ద్వీపంలో 1830 నాటికే జెయింట్ టార్టాయిస్ ఉన్నట్లు ప్రముఖ బ్రిటిష్ అధ్యయన వేత్త ఛార్లెస్ డార్విన్ అధ్యయనాల వల్ల తెలుస్తోంది. 16వ శతాబ్దం కన్నా ముందు గాలాపాగస్లో తాబేళ్ల సంఖ్య రెండున్నర లక్షల వరకు ఉండేదిట. అయితే 17వ శతాబ్దం నుంచి వీటిని వేటాడి తినే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అంతేకాదు, ఈ దీవుల్లో ఉండే ఒక జాతి ఎలుకలు తాబేళ్ల గుడ్లను తినేస్తుండేవట. ఇటువంటి అనేక కారణాలతో 1970 కల్లా ఈ భారీ తాబేళ్ల సంఖ్య కేవలం 3000కు చేరింది. -
11.1 లక్షల ఏళ్లనాటి ఏనుగు అస్థిపంజరం గుర్తింపు
లాహోర్: ప్రస్తుత భారీ సైజు ఏనుగులకు రెండు రెట్లు ఉన్న 11.1 లక్షల ఏళ్ల కిందటి ఏనుగు అస్థిపంజరాన్ని పాకిస్తాన్లో గుర్తించారు. పంజాబ్ ప్రావిన్సులోని గుజ్రత్ జిల్లాలో పాకిస్తాన్ యూనివర్సిటీ పరిశోధకులు జరుపుతున్న తవ్వకాల్లో ఇది బయటపడింది. పబ్బిహిల్స్ ప్రాంతంలో ఏడాదిన్నరగా జరుపుతున్న తవ్వకాల్లో గత వారం ఈ ఆడ ఏనుగు అస్థిపంజరం బయటపడిందని పంజాబ్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ సయ్యద్ అబ్బాస్ తెలిపారు. ఇది సుమారు 120 కిలోల బరువు, 38 సెం.మీ. పొడవు, 28 సెం.మీ వెడల్పు ఉన్నట్లు చెప్పారు. ఇది ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లలో ఉండే ఏనుగుల జాతికి చెందినదని వెల్లడించారు. ఆ కాలం నాటి ఏనుగుల గురించి తెలుసుకునేందుకు ఈ అస్థి పంజరం ఉపయోగపడుతుందని చెప్పారు. -
కర్నూలులో బయటపడిన గుహ