11.1 లక్షల ఏళ్లనాటి ఏనుగు అస్థిపంజరం గుర్తింపు | Archaeological find: Pre-historic elephant skull discovered near Gujrat | Sakshi
Sakshi News home page

11.1 లక్షల ఏళ్లనాటి ఏనుగు అస్థిపంజరం గుర్తింపు

Published Mon, Sep 21 2015 8:44 AM | Last Updated on Sun, Sep 3 2017 9:44 AM

11.1 లక్షల ఏళ్లనాటి ఏనుగు అస్థిపంజరం గుర్తింపు

11.1 లక్షల ఏళ్లనాటి ఏనుగు అస్థిపంజరం గుర్తింపు

లాహోర్: ప్రస్తుత భారీ సైజు ఏనుగులకు రెండు రెట్లు ఉన్న 11.1 లక్షల ఏళ్ల కిందటి ఏనుగు అస్థిపంజరాన్ని పాకిస్తాన్‌లో గుర్తించారు. పంజాబ్ ప్రావిన్సులోని గుజ్రత్ జిల్లాలో పాకిస్తాన్ యూనివర్సిటీ పరిశోధకులు జరుపుతున్న తవ్వకాల్లో ఇది బయటపడింది. పబ్బిహిల్స్ ప్రాంతంలో  ఏడాదిన్నరగా జరుపుతున్న తవ్వకాల్లో గత వారం ఈ ఆడ ఏనుగు అస్థిపంజరం బయటపడిందని పంజాబ్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ సయ్యద్ అబ్బాస్ తెలిపారు.


ఇది సుమారు 120 కిలోల బరువు, 38 సెం.మీ. పొడవు, 28 సెం.మీ వెడల్పు ఉన్నట్లు చెప్పారు. ఇది ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లలో ఉండే ఏనుగుల జాతికి చెందినదని వెల్లడించారు. ఆ కాలం నాటి ఏనుగుల గురించి తెలుసుకునేందుకు ఈ అస్థి పంజరం ఉపయోగపడుతుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement