
నాసా వారి ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డిస్కవరీ ప్రాజెక్ట్(ఐఏడీపీ)లో ఇద్దరు క్లాస్‌మెట్‌లతో కలిసి పాల్గొన్న 14 సంవత్సరాల దక్ష్ మాలిక్ అంగారక గ్రహం, బృహస్పతిల మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ మధ్య గ్రహశకలాన్ని కనుగొన్నాడు. దీని కోసం ఆస్ట్రోనామికా అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకున్నాడు.
హార్డిన్ సిమన్స్ యూనివర్శిటికి చెందిన డాక్టర్ పాట్రిక్ మిల్లర్ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. తాత్కాలికంగా ఈ గ్రహశకలానికి ‘2023 ఓజీ40’ అని నామకరణం చేశారు. త్వరలో మాలిక్ పెట్టబోయే పేరే ఈ గ్రహశకలానికి శాశ్వతంగా ఉండిపోతుంది. గ్రహశకలానికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ధ్రువీకరించడానికి నాసాకు నెలల సమయం పడుతుంది. ఆ తరువాత దానికి పేరు పెడతారు.
ఇదీ చదవండి: Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన మాలిక్ ‘శివనాడర్ స్కూల్’లో 9వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి మాలిక్‌కు అంతరిక్షం అంటే ఇష్టం. గ్రహాలు, సౌరకుటుంబం గురించి నేషనల్ జియోగ్రాఫిక్‌లో వచ్చిన డాక్యుమెంటరీలన్నీ చూసేవాడు. ఐఏడీపీలో ప్రతి సంవత్సరం ఆరువేలమందికి పైగాపాల్గొంటారు. వారిలో కొందరు కొత్త గ్రహశకలాలని కనుక్కోవడంలో విజయం సాధించారు. ‘ఐఏడీపీ’ వెబ్‌సైట్ ప్రకారం గ్రహశకలాన్ని కనుగొన్న ఆరవ భారతీయ విద్యార్థి దక్ష్ మాలిక్. ‘ఈ అన్వేషణ నాకు సరదాగా అనిపించింది. గ్రహశకలం కోసం వెదుకుతున్నప్పుడు నాసాలో పనిచేస్తున్నట్లు అనిపించింది. నా కల నిజమైంది’ అంటున్నాడు ఆనందంగా దక్ష్ మాలిక్.
చదవండి : కీర్తి సురేష్ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్