ఒక కప్పు కాఫీ ఉదయాన్నే సిప్ చేస్తే ఆ ఆనందమే వేరు. అలాంటి కాఫీ స్ట్రాంగ్‌గా రుచిగా తయారు చేసుకోవాలంటే చాల పద్ధతులు ఉన్నాయి. కానీ అవేమీ అవసరం లేకుండా ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయితే ఈజీగా స్ట్రాంగ్ కాఫీ తయారు చేసుకోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. అలాంటి కాఫీ ప్రిపరేషన్‌కి పరిశ్రమలకు మాత్రం కోట్లలో ఖర్చు అవుతుందట!.
చాలామంది స్ట్రాంగ్‌గా ఉండే కాఫీనే ఇష్టపడతారు. మంచి రంగు రుచి సువాసన ఉండాలను కుంటారు. అందుకని కాఫీ గింజలను గ్రైండ్ చేసుకుని మరీ తయారు చేసుకుంటారు. అయితే ఈ డ్రై కాఫీ గింజలు గ్రైండ్ చేసటప్పుడు స్టాటిక్ ఎనర్జీకి గురవ్వుతాయి. దీంతో సరిగా డ్రైండ్ అవ్వవు. అందువల్ల వేస్ట్ కూడా తెలియకుండా వెళ్లిపోతుంది. అంటే కొన్ని సరిగా నలగకపోవడంతో వేస్ట్ రూపంలో వడకట్టినప్పుడు కాఫీ కొంత వేస్ట్‌గా పోయి రుచి తగ్గుతుందట. అలా కాకుండా పూర్తిస్థాయిలో గ్రైండ్ అయ్యి రుచిగా ఉండాలంటే కాస్త నీటిని జోడిస్తే మరింత రుచిగా కాఫీ తయారవ్వుతుందట. దీని వల్ల కాఫీ వేస్టేజ్ కూడా తగ్గుతుంది. మనకు కావాల్సిన రుచి, రంగు సువాసన ఉంటాయని చెబుతున్నారు.
ఇలాంటి స్ట్రాంగ్ డ్రై కాఫీ తయారు చేయాలంటే కాఫీ పరిశ్రమలకు మాత్రం భారీ ఆర్థిక సమస్యలు ఎదురవ్వుతాయని అన్నారు. ఈ స్రాంగ్ డ్రైనెస్ కాఫీ తయారీ నాణ్యతను మెగుపరచడం అనేది కాఫీ పరిశ్రమలకు మాములు నష్టాలను తెచ్చి పెట్టదని కూడా అంచనా వేసి మరీ పరిశోధకులు వెల్లడించారు.
(చదవండి: ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ దందా! జస్ట్ ప్రెగ్నెంట్ చేస్తే చాలు..ఏకంగా లక్షలు ..!)
Comments
Please login to add a commentAdd a comment