![US Man Discovers Stolen Jeep From More Than 30 Years Ago - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/16/usa_Jeep.jpg.webp?itok=4L_OJ6Va)
కొన్న వస్తువులు ఏవేవో కారణాల రీత్యా పోగొట్టుకోవడం జరుగుతుంది. ఎంతగా ప్రయంత్నించినా దొరికే అవకాశం గానీ వాటి ఆచూకీ గానీ కానరాదు. అలాంటి వస్తువు సడెన్‌గా దొరికినా లేదా చాలా ఏళ్లక్రితం మిస్ అయ్యిన వస్తువు అనుకోకుండా మనకు లభించిన లేదా బయటపడ్డ మన ఆనందానికి అవధులే ఉండవు. అలాంటి విచిత్ర ఘటనే యూఎస్‌ఏలో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..యునైటెడ్ స్టేట్స్‌లోని కాన్వాస్‌కు చెందిన 45 ఏళ్ల జాన్ మౌన్స్ ఫాక్స్ అనే వ్యక్తి మంచి చేపలను పట్టుకోవాలనే ఉద్దేశ్యంతో మే 29(మెమోరియల్ డే)న చెనీ సరస్సు వద్దకు వెళ్లాడు. సరస్సు వద్ద అనువైన చోటును వెదుకుతుండగా..ఓ విచిత్రమైన వస్తువు కంట పడింది. మొదట అర్థం కాలేదు. తన వద్ద ఉన్న సోనార్ పరికరాల సాయంతో నీటి అడుగున ఉన్న వస్తువుని నిశితంగా చూశాడు. ఏవో టైర్లు, రోల్‌బార్, స్టీరింగ్ వీల్ వంటి వాటితో కూడిన ఓ జీప్ లాంటి వస్తువును చూశాడు. ఎలాగైనా సరస్సు నుంచి తీయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే క్రేన్‌ల సాయంతో తీసేందుకు అధికారుల అనుమతి తీసుకుని మరీ ఆ వస్తువుని బయటకు తీశాడు. అతను ఊహించినట్లుగానే అది జీప్. 1990ల నాటి ఓల్డ్ జీప్ అని తేలింది. నిజానికి అతను ఏదో పెద్ద చేప ఏమో అనుకున్నాడు. బయటకు తీయాలనే ఆత్రుతలో అదే ఏంటో చూడగా అసలు విషయం బయపడింది. ప్రస్తుతం ఆ జీప్‌ని చూసేందుకు అధికారులు, ప్రజలు అతని ఇంటికి ఎగబడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment