
సుమారు 4500 ఏళ్ల క్రితం నాటి సూర్య దేవాలయాన్ని బయట పడింది. ఈ విషయన్ని ఈజిప్ట్ పురావస్తుశాఖ అధికారులు ధృవీకరించారు. 4,500 సంవత్సరాల క్రితం 25వ శతాబ్దం బీసీఈ మధ్యకాలం నాటి పురాతన సూర్య దేవాలయమని అధికారులు విశ్వసిస్తున్నారు. కాగా ఈజిప్ట్‌ను ఒకప్పుడు ఫారోహ్ అనే రాజులు పాలించేవారు. వాళ్ల హయాంలోనే ఈజిప్ట్‌లో మొత్తం ఆరు దేవాలయాలను నిర్మించారు.
దీనిపై పురావస్తుశాఖ అధికారి మాట్లాడుతూ.. కనిపించకుండా పోయిన ఆరు ఫారో సూర్య దేవాలయంలో ఇది ఒకటని, తాము తవ్వి తీస్తున్నామని చెప్పడానికి బలమైన రుజువు తమకు దొరికిందని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం, అబూ ఘురాబ్‌లోని మరొక ఆలయంలో ఖననం చేయబడిన అవశేషాలను ఆ బృందం కనుగొంది. పురావస్తుశాఖ అధికారులు జరిపిన పరిశోధనలో ఇది మూడవ సూర్య దేవాలయమని, గత 50 సంవత్సరాలలో ఇదే మొదటిదని తెలిపారు.
ఫారోలు సజీవంగా ఉన్నప్పుడే ఆరు సూర్య దేవాలయాలను నిర్మించారని, ఇప్పటి వరకు ఆరు దేవాలయాలలో రెండు మాత్రమే కనుగొన్నారు. సూర్య దేవాలయం అవశేషాల క్రింద త్రవ్వినప్పుడు మట్టి ఇటుకలతో చేసిన పాత స్థావరంతో పాటు మరొక భవనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 1898 లో ఒకసారి సూర్యదేవాలయాన్ని అధికారులు కనిపెట్టగా.. తాజాగా రెండో సూర్యదేవాలయాన్ని గుర్తించారు.
చదవండి: నిప్పుతో చెలగాటలొద్దు! బైడెన్‌కు వార్నింగ్ ఇచ్చిన జిన్‌పింగ్..