వాషింగ్టన్: ఈజిప్టులోని గిజా పిరమిడ్ సమీపంలో శాస్త్రవేత్తలు రెండు పురాతన గృహాలను గుర్తించారు. అవి దాదాపు 4,500 సంవత్సరాల కిందటివని తేల్చారు. పిరమిడ్ నిర్మాణానికి పనిచేసిన సిబ్బందికి, సైన్యానికి ఆహార సరఫరాను పర్యవేక్షించే అధికారుల నివాసాలని అమెరికాకు చెందిన ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక భవనంలో నివసించే అధికారులు జంతు మాంసానికి సంబంధించిన బాధ్యతలు చూసుకునేవారని, మరో భవనంలో ‘వాదాత్’లుగా పిలిచే సంస్థల అధిపతులు (సన్యాసులు) నివసించేవారని చెప్పారు. ఈజిప్షియన్ల చరిత్రలో ‘వాదాత్’కు ప్రత్యేక స్థానముందని, వాటి అధిపతులుగా పనిచేసేవారు ప్రభుత్వ ఉన్నత హోదా ర్యాంకును కలిగి ఉండేవారని ప్రముఖ పరిశోధకుడు మార్క్ లెహ్నర్ తెలిపారు. పిరమిడ్ల నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలను కూడా వీరు పర్యవేక్షించినట్లు తమ పరిశోధనలో తేలిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment