Giza pyramids
-
ఈజిప్టు పర్యటన.. గిజా పిరమిడ్‌ను సందర్శించిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఈజిప్టులో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈజిప్టులోని 11వ శతాబ్దపు చరిత్రాత్మక అల్-హకీమ్ మసీదు, కైరోలోని హెలియోపోలిస్ కామన్వెల్త్ వార్ స్మారకాన్ని మోదీ సందర్శించారు. అనంతరం రాజధాని కైరో నగర శివారులో ఉన్న గిజా పిరమిడ్‌ను ప్రధాని సందర్శించారు. పిరమిడ్ ప్రాధాన్యతను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ ఏడు వింతల్లో పిరమిడ్లు కూడా ఒకటి. గిజా పిరమిడ్ ప్రస్తుతం ఉన్న పిరమిడ్లన్నింటిలో అతి పెద్దది. నైలు నది పశ్చిమ ఒడ్డున రాతి పీఠభూమిపై ఉన్న ఈ పిరమిడ్.. ఈజిప్టు పాలకుల్లో నాల్గవ రాజవంశానికి చెందిన ఫారో ఖుఫు సమాధిగా భావిస్తారు. క్రీస్తు పూర్వం 26వ శతాబ్దంలో దాదాపు 27 ఏళ్లపాటు వీటిని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. VIDEO l Prime Minister Narendra Modi visits the Great Pyramid of Giza in Egypt. pic.twitter.com/Tx6DYmrIZl — Press Trust of India (@PTI_News) June 25, 2023 ఈజిప్టు అధ్యక్షుడైన అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ఆహ్వనం మేరకు ఆ దేశ పర్యటనకు వెళ్లారు ప్రధాని మోదీ. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతంపై సమావేశం నిర్వహించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఆచరించాల్సిన ప్రణాళికల గురించి చర్చించారు. తర్వాత ఆ దేశ ప్రభుత్వ పెద్దలతోనూ, అక్కడి ప్రముఖులతోనూ, ప్రవాస భారత సంఘాలతోనూ సమావేశం అయ్యారు. 1997 తర్వాత ఈజిప్టులో భారత్ ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. ఇదీ చదవండి: అమెరికా పర్యటన ముగిసిన నేపథ్యంలో ఈజిప్టుకు ప్రయాణమైన ప్రధాని -
ప్రాచీన పిరమిడ్ సందర్శనకు అనుమతి
కైరో : కొన్ని దశాబ్దాల తర్వాత ఈజిప్టులో అత్యంత ప్రాచీనకాలానికి చెందిన పిరమిడ్ సందర్శనకై పర్యాటకులకు అనుమతి ఇచ్చారు. దీని పేరు బెంట్ పిరమిడ్. ఇది ఈజిప్టు రాజధాని కైరోకు దక్షిణాన 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్రీస్తుపూర్వం 4600 సంవత్సరాల క్రితం దీన్ని ఈజిప్టు నాల్గవ రాజవంశానికి చెందిన కింగ్ స్నెఫేరు కోసం నిర్మించారు. ఈ బెంట్ పిరమిడ్‌ను తెరవడంతో పిరమిడ్ నిర్మాణాలపై పరిశోధనలకు మరింత ఊతం ఇవ్వనుందని పురావస్తు శాస్రవేత్తలు అభిప్రాయపడ్డారు. 101 మీటర్ల ఎత్తుతో అసాధారణంగా ఉన్న ఈ పిరమిడ్ తర్వాత కాలంలో పిరమిడ్ల నిర్మాణానికి అత్యున్నత దశగా పేర్కొనే ప్రఖ్యాత గిజా పిరమిడ్ కట్టడానికి మార్గదర్శి అని తెలిపారు. ఇది తొలిదశలో నిర్మించిన పిరమిడ్లకు, తర్వాత తరంలోని పిరమిడ్లకు మధ్య వారధిలా నిలిచిందని పేర్కొన్నారు. బెంట్ పిరమిడ్‌లో 79 మీటర్లు ఉండే ఇరుకైన సొరంగమార్గం గుండా ప్రధాన చాంబర్‌కు చేరుకోవచ్చు. ఈజిప్టు పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖా మంత్రి ఖలీద్ మాట్లాడుతూ 1965లో దీన్ని మూసివేశామని, బెంట్పిరమిడ్ తో పాటు అల్కాడాగ్మటిక్ అనే మరో పిరమిడ్‌లో కూడా సందర్శకులకు అనుమతి ఇచ్చామన్నారు. బెంట్పిరమిడ్, పిరమిడ్ల నిర్మాణానికి ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. అలాగే సమీప ప్రాంతాన్ని అధ్యయనం చేస్తున్న పురావస్తు శాస్త్రవేత్తలు సుమారు 4,000 సంవత్సరాల నాటి పురాతన అవశేషాలను కనుగొన్నారు. ‘రాయి, బంకమట్టి మరియు చెక్క నిర్మాణాలతో కూడిన మమ్మీపై భాగాలు దొరికాయని, అలాగే కొన్ని మమ్మీలు కనుగొన్నామని ’ పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
40 మంది ముష్కరుల కాల్చివేత
గిజా: ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్ వద్ద బాంబు పేల్చి ముగ్గురు విదేశీయులను బలి తీసుకున్న ఉగ్ర మూకలపై ఈజిప్టు సైన్యం విరుచుకుపడింది. గిజాతోపాటు సినాయ్ ద్వీపకల్పంలోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపి 40 మందిని కాల్చి చంపింది. శుక్రవారం గిజాలో పర్యాటకుల బస్సుపై ఉగ్ర వాదులు జరిపిన బాంబు దాడిలో ముగ్గురు వియత్నాం దేశస్తులతోపాటు ఒక ఈజిప్టు గైడ్ చనిపోగా మరో 10 మంది పర్యాటకులు గాయపడ్డారు. ప్రభుత్వ కీలక ఆర్థిక వనరులు, విదేశీ పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో సైన్యం అప్రమత్తమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం వేకువజామున గిజాలోని రెండు ప్రాంతాలతోపాటు సినాయ్ ప్రావిన్స్‌లో ఉగ్ర స్థావరాలపై బలగాలు ఒక్కసారిగా దాడులు జరిపాయి. ఈ దాడుల్లో మొత్తం 40 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలంపాటు ఈజిప్టును పాలించిన హోస్నీ ముబారక్ 2011లో వైదొలిగాక దేశంలో తీవ్ర అస్థిరత నెలకొంది. దేశంలో సుస్థిర పరిస్థితులు ఇప్పుడిప్పుడే నెలకొంటున్న తరుణంలో జరిగిన తాజా ఉగ్ర దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. -
4,500 ఏళ్ల కిందటి గృహాలు
వాషింగ్టన్: ఈజిప్టులోని గిజా పిరమిడ్ సమీపంలో శాస్త్రవేత్తలు రెండు పురాతన గృహాలను గుర్తించారు. అవి దాదాపు 4,500 సంవత్సరాల కిందటివని తేల్చారు. పిరమిడ్ నిర్మాణానికి పనిచేసిన సిబ్బందికి, సైన్యానికి ఆహార సరఫరాను పర్యవేక్షించే అధికారుల నివాసాలని అమెరికాకు చెందిన ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక భవనంలో నివసించే అధికారులు జంతు మాంసానికి సంబంధించిన బాధ్యతలు చూసుకునేవారని, మరో భవనంలో ‘వాదాత్’లుగా పిలిచే సంస్థల అధిపతులు (సన్యాసులు) నివసించేవారని చెప్పారు. ఈజిప్షియన్ల చరిత్రలో ‘వాదాత్’కు ప్రత్యేక స్థానముందని, వాటి అధిపతులుగా పనిచేసేవారు ప్రభుత్వ ఉన్నత హోదా ర్యాంకును కలిగి ఉండేవారని ప్రముఖ పరిశోధకుడు మార్క్ లెహ్నర్ తెలిపారు. పిరమిడ్ల నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలను కూడా వీరు పర్యవేక్షించినట్లు తమ పరిశోధనలో తేలిందని చెప్పారు. -
గిజా పిరమిడ్ రహస్యం ఇదే..!
ఈజిఫ్ట్ పిరమిడ్లకు ప్రపంచవ్యాప్త ప్రాముఖ్యత ఉంది. అందులోనూ గిజా పరిమిడ్ రహస్యాలను కనుక్కోవాలని.. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా గిజా పిరిమడ్ లోపల నిర్మాణం ఎలా ఉంది? అనే విషయంపై సైంటిస్టులకు అనేక అనుమానాలు ఉన్నాయి. తాజాగా ఈ గిజా పిరిమడ్పై తాజాగా కొందరు ఔత్సాహిక పరిశోధకులు పరిశోధనలు చేశారు. అందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చేశాయి. పిరిమిడ్‌లోని గ్రాండ్ గాలరీ నుంచి 30 మీటర్ల లోతు వరకూ సైంటిస్టులు ‘కాస్మిక్ రే ఇమేజింగ్’ టెక్నాలజీ సాయంతో సైంటిస్టులు పరిశోధనలు చేశారు. గ్రేట్ పిరమిడ్‌లో లోపల రహస్యంగా ఉన్న సొరంగాలు, వంకీ ఆకారంలో ఉన్న నిర్మాణాలను, ఇతర కీలక అంశాలను సైంటిస్టులు దీని ద్వారా గుర్తించారు. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఈజిఫ్ట్ నిర్మాణం ఎలా చేశారన్న అంశంపై ఇప్పటివరకూ సైంటిస్టులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. దీనిని క్రీస్తుపూర్వం 2550లో ఫారో రాజులు నిర్మించారు. తాజాగా సైంటిస్టులు కాస్మిక్ టెక్నాలజీతో చేసిన పరిశోధన వల్ల పిరమిడ్ నిర్మాణం గురించి తెలుసుకోవడంలో పురోగతి సాధించారు. అప్పట్లోనే ఆధునిక భౌతిక శాస్త్రాన్నినిర్మాణశాస్త్రంలో వినియోగించడంపై సైంటిస్టులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గిజా పిరమిడ్ లోపల ఇప్పుడు అనుకుంటున్నట్లుగా.. కాకుండా మరో గ్రాండ్ గాలరీతో పాటు, విభిన్న ఆకృతులతో కూడిన నిర్మాణాలు ఉన్నట్లు తెలిసింది. -
గిజా పిరమిడ్ రహస్యం ఇదే..!
-
బాంబు పేలుడు : తొమ్మిది మంది మృతి
కైరో : ఈజిప్టులోని అత్యంత పురాతనమైన గిజా పిరమిడ్ల వద్ద శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో తొమ్మిది మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతుల్లో నలుగురు పోలీసులు ఉన్నారని చెప్పారు. దేశంలో విప్లవం చోటు చేసుకుని... వచ్చే సోమవారంతో నాలుగేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో పోలీసులు గిజా పిరమిడ్ల ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారని చెప్పారు. ఆ క్రమంలో ఈ బాంబు పేలుడు చోటు చేసుకుందని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.