బాంబు పేలుడు : తొమ్మిది మంది మృతి | 9 killed in explosion near Egypt's Giza pyramids | Sakshi
Sakshi News home page

బాంబు పేలుడు : తొమ్మిది మంది మృతి

Published Fri, Jan 22 2016 9:12 AM | Last Updated on Sun, Sep 3 2017 4:07 PM

బాంబు పేలుడు : తొమ్మిది మంది మృతి

బాంబు పేలుడు : తొమ్మిది మంది మృతి

కైరో : ఈజిప్టులోని అత్యంత పురాతనమైన గిజా పిరమిడ్ల వద్ద శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో తొమ్మిది మంది మృతి చెందారు.  మరో 20 మంది గాయపడ్డారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతుల్లో నలుగురు పోలీసులు ఉన్నారని చెప్పారు. దేశంలో విప్లవం చోటు చేసుకుని... వచ్చే సోమవారంతో నాలుగేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో పోలీసులు గిజా పిరమిడ్ల ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారని చెప్పారు. ఆ క్రమంలో ఈ బాంబు పేలుడు చోటు చేసుకుందని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement