ప్రధాని మోదీ ఈజిప్టులో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈజిప్టులోని 11వ శతాబ్దపు చరిత్రాత్మక అల్-హకీమ్ మసీదు, కైరోలోని హెలియోపోలిస్ కామన్వెల్త్ వార్ స్మారకాన్ని మోదీ సందర్శించారు. అనంతరం రాజధాని కైరో నగర శివారులో ఉన్న గిజా పిరమిడ్‌ను ప్రధాని సందర్శించారు. పిరమిడ్ ప్రాధాన‍్యతను అడిగి తెలుసుకున్నారు.
ప్రపంచ ఏడు వింతల్లో పిరమిడ్లు కూడా ఒకటి. గిజా పిరమిడ్ ప్రస్తుతం ఉన్న పిరమిడ్లన్నింటిలో అతి పెద్దది. నైలు నది పశ్చిమ ఒడ్డున రాతి పీఠభూమిపై ఉన్న ఈ పిరమిడ్.. ఈజిప్టు పాలకుల్లో నాల్గవ రాజవంశానికి చెందిన ఫారో ఖుఫు సమాధిగా భావిస్తారు. క్రీస్తు పూర్వం 26వ శతాబ్దంలో దాదాపు 27 ఏళ్లపాటు వీటిని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
VIDEO l Prime Minister Narendra Modi visits the Great Pyramid of Giza in Egypt. pic.twitter.com/Tx6DYmrIZl
— Press Trust of India (@PTI_News) June 25, 2023
ఈజిప్టు అధ్యక్షుడైన అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ఆహ్వనం మేరకు ఆ దేశ పర్యటనకు వెళ్లారు ప్రధాని మోదీ. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతంపై సమావేశం నిర్వహించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఆచరించాల్సిన ప్రణాళికల గురించి చర్చించారు. తర్వాత ఆ దేశ ప్రభుత్వ పెద్దలతోనూ, అక్కడి ప్రముఖులతోనూ, ప్రవాస భారత సంఘాలతోనూ సమావేశం అయ్యారు. 1997 తర్వాత ఈజిప్టులో భారత్ ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి.
ఇదీ చదవండి: అమెరికా పర్యటన ముగిసిన నేపథ్యంలో ఈజిప్టుకు ప్రయాణమైన ప్రధాని
Comments
Please login to add a commentAdd a comment