Cairo
-
కైరోలో ఇజ్రాయెల్,హమాస్ చర్చలు..వారి విడుదలే కీలకం
గాజా:ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఈజిప్టు రాజధాని కైరోలో శనివారం(నవంబర్30) నిర్వహించే చర్చలకు తమ ప్రతినిధులు హాజరవుతారని హమాస్ వెల్లడించింది. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలపై ఈజిప్టు అధికారులతో వారు చర్చలు జరుపుతారని తెలిపారు.హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమ దేశ పౌరులు విడుదల తర్వాతే కాల్పుల విరమణపై ఆలోచిస్తామని ఇజ్రాయెల్ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే హెజ్బొల్లా,ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. హమాస్ సమస్యకు కూడా త్వరలోనే పరిష్కారం కనుగొంటామని,ఇందుకు ఖతార్,టర్కీ,ఈజిప్టు దేశాల సాయంతో ప్రయత్నిస్తామని అమెరికా ఇప్పటికే పేర్కొనడం గమనార్హం.గతేడాది అక్టోబర్7న హమాస్ ఉగ్రవాదులు ఇజజ్రాయెల్‌పై దాడి చేసి వందల మంది ఆ దేశ పౌరులను చంపడమే కాకుండా కొందరిని తమతో పాటు బందీలుగా తీసుకెళ్లారు.అక్టోబర్ 7 తర్వాత నుంచి గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు పాలస్తానాలో 40వేల మందికిపైగా మరణించారు. -
ఈజిప్టులో పలు వాహనాలు ఢీకొని... 32 మంది మృతి
కైరో: ఈజిప్టులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 32 మంది మృత్యువాతపడ్డారు. కైరో–అలెగ్జిండ్రియా ప్రధాన రహదారిపై బెహీరా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదటగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనాన్ని ఢీకొట్టింది. ఆ వెనుకే వస్తున్న కార్లు ఒకదానినొకటి ఢీకొట్టి, మంటలు చెలరేగాయి. మొత్తం 29 వాహనాలు ప్రమాదంలో చిక్కుకోగా బస్సు సహా ఆరు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనలో 32 మంది వరకు చనిపోగా మరో 63 మంది గాయపడ్డారు. దట్టంగా కురుస్తున్న మంచు కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు అంటున్నారు. -
నిష్కా అగర్వాల్‌కు స్వర్ణం
ఫారోస్ కప్ అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ జిమ్నాస్ట్ నిష్కా అగర్వాల్ స్వర్ణ పతకం నెగ్గింది. కైరోలో జరిగిన ఈ టోర్నీలో నగరంలోని గాడియం స్కూల్ విద్యార్థి అయిన నిష్కా టేబుల్ వాల్ట్ ఈవెంట్లో విజేతగా నిలిచింది. కోచ్ మనోజ్ రాణా వద్ద శిక్షణ తీసుకుంటున్న నిష్కా గత ఏడాది కేరళ ఆతిథ్యమిచ్చిన జాతీయ జూనియర్ పోటీల్లోనూ పసిడి పతకం గెలిచింది. సిఫ్ట్ కౌర్‌కు ఐదో స్థానం బకూ: ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా ఐదో స్థానంలో నిలిచి ంది. దాంతో భారత్‌కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ లభించింది. ఫైనల్లో సిఫ్ట్ కౌర్ 429.1 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. -
PM Modi Egypt Tour: ఇండియా హీరో మోదీ
కైరో: ‘ఇండియా హీరో నరేంద్ర మోదీ’ అంటూ ఈజిప్టులో నివసిస్తున్న ప్రవాస భారతీయులు భారత ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో మోదీ చరిత్రాత్మక ప్రసంగం అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. మోదీ నాయకత్వంలో ఇండియా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అమెరికాలో నాలుగు రోజుల అధికారిక పర్యటన ముగించుకొని శనివారం ఈజిప్టులో అడుగుపెట్టారు. గత 26 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఈజిప్టులో పర్యటిస్తుండడంఇదే మొదటిసారి. రాజధాని కైరోలో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రిట్జ్ కార్ల్టన్ హోటల్లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఇండియా హీరో(కథానాయకుడు) మీరేనంటూ వారు ప్రశంసించగా మోదీ ప్రతిస్పందించారు. అందరికీ హీరో ఇండియా అని బదులిచ్చారు. ప్రజలంతా కష్టపడి పనిచేస్తున్నారని, అందుకే మన దేశం అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. దేశ ప్రగతిలో ప్రవాస భారతీయుల కృషి ఎంతో ఉందని చెప్పారు. దేశ విజయంలో వారికి సైతం వాటా దక్కుతుందన్నారు. అనంతరం దావూదీ బోహ్రా వర్గం ముస్లింలతో నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గుజరాత్‌లోని దావూదీ బోహ్రా ముస్లింలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈజిప్టులో ప్రవాస భారతీయులు తనకు ఘన స్వాగతం పలికారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వారి ఆప్యాయత తన హృదయాన్ని కదిలించిందని పేర్కొన్నారు. ఈజిప్టువాసులు సైతం భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి తనకు స్వాగతం పలికారని వెల్లడించారు. భారత్–ఈజిప్టు దేశాలు సంప్రదాయాలను సైతం పంచుకుంటున్నాయని వివరించారు. అల్–హకీం మసీదు, గ్రేట్ పిరమిడ్ల సందర్శన ఈజిప్టులో 11వ శతాబ్దం నాటి చరిత్రాత్మక అల్–హకీం మసీదును ప్రధాని మోదీ సందర్శించారు. ఈజిప్టులో మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికులు చేసిన ప్రాణత్యాగాలకు గుర్తుగా నిర్మించిన హెలియోపోలిస్ కామన్వెల్త్ వార్ మెమోరియల్‌ను సందర్శించి, ఘనంగా నివాళులరి్పంచారు. ఇక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. ఈజిప్టులో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో 3,799 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన గిజా గ్రేట్ పిరమిడ్లను మోదీ సందర్శించారు. కైరో నగర శివార్లలో గిజా నెక్రోపోలిస్ అనే ప్రాంతంలో ఈ పిరిమిడ్లు ఉన్నాయి. ‘‘కైరో అల్–హకీం మసీదును సందర్శించడం ఆనందంగా ఉంది. ఈజిప్టు ఘనమైన వారసత్వానికి, సంస్కృతికి ఈ మసీదు దర్పణం పడుతోంది’’ అని మోదీ ట్వీట్ చేశారు. అవగాహనా ఒప్పందాలపై సంతకాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకొనే దిశగా భారత్, ఈజిప్టు మరో అడుగు వేశాయి. భారత ప్రధాని మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సీసీ ఆదివారం చర్చలు జరిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఇరువురు నేతలు నాలుగు అవగాహనా ఒప్పందాల(ఎంఓయూ)పై సంతకాలు చేశారని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. ఇందులో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన ఒప్పందం ఉందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ప్రాచీన, పురావస్తు కట్టడాల పరిరక్షణ, ‘కాంపిటీషన్ లా’కు సంబంధించిన మరో మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారని తెలిపారు. మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ద నైలు’ ప్రదానం ఈజిప్టు అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద నైలు’ను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సీసీ ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈజిప్టు సహా ఇప్పటిదాకా 13 దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలతో మోదీని సత్కరించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాలస్తీనా, అఫ్గానిస్తాన్, సౌదీ అరేబియా, మాల్దీవ్స్, రష్యా, బహ్రెయిన్, పపువా న్యూగినియా, ఫిజీ, రిపబ్లిక్ ఆఫ్ పాలౌ, భూటాన్ తదితర దేశాల నుంచి ఆయన ఈ పురస్కారాలు స్వీకరించారు. తనకు ఆర్డర్ ఆఫ్ ద నైలు పురస్కారం ప్రదానం చేసిన ఈజిప్టు ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ పట్ల ఈజిప్టు ప్రజల ఆప్యాయత అనురాగాలకు ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. -
ఈజిప్టు పర్యటన.. గిజా పిరమిడ్‌ను సందర్శించిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఈజిప్టులో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈజిప్టులోని 11వ శతాబ్దపు చరిత్రాత్మక అల్-హకీమ్ మసీదు, కైరోలోని హెలియోపోలిస్ కామన్వెల్త్ వార్ స్మారకాన్ని మోదీ సందర్శించారు. అనంతరం రాజధాని కైరో నగర శివారులో ఉన్న గిజా పిరమిడ్‌ను ప్రధాని సందర్శించారు. పిరమిడ్ ప్రాధాన్యతను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ ఏడు వింతల్లో పిరమిడ్లు కూడా ఒకటి. గిజా పిరమిడ్ ప్రస్తుతం ఉన్న పిరమిడ్లన్నింటిలో అతి పెద్దది. నైలు నది పశ్చిమ ఒడ్డున రాతి పీఠభూమిపై ఉన్న ఈ పిరమిడ్.. ఈజిప్టు పాలకుల్లో నాల్గవ రాజవంశానికి చెందిన ఫారో ఖుఫు సమాధిగా భావిస్తారు. క్రీస్తు పూర్వం 26వ శతాబ్దంలో దాదాపు 27 ఏళ్లపాటు వీటిని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. VIDEO l Prime Minister Narendra Modi visits the Great Pyramid of Giza in Egypt. pic.twitter.com/Tx6DYmrIZl — Press Trust of India (@PTI_News) June 25, 2023 ఈజిప్టు అధ్యక్షుడైన అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ఆహ్వనం మేరకు ఆ దేశ పర్యటనకు వెళ్లారు ప్రధాని మోదీ. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతంపై సమావేశం నిర్వహించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఆచరించాల్సిన ప్రణాళికల గురించి చర్చించారు. తర్వాత ఆ దేశ ప్రభుత్వ పెద్దలతోనూ, అక్కడి ప్రముఖులతోనూ, ప్రవాస భారత సంఘాలతోనూ సమావేశం అయ్యారు. 1997 తర్వాత ఈజిప్టులో భారత్ ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. ఇదీ చదవండి: అమెరికా పర్యటన ముగిసిన నేపథ్యంలో ఈజిప్టుకు ప్రయాణమైన ప్రధాని -
ఈజిప్టుకు చేరుకున్న ప్రధాని మోదీ
కైరో: అమెరికాలో పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ శనివారం ఈజిప్టులో రెండు రోజుల పర్యటనకు గాను కైరో చేరుకున్నారు. కైరో విమానాశ్రయంలో మోదీకి ఈజిప్టు ప్రధానమంత్రి మొస్తాఫా మద్బౌలీ ఆలింగనంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మోదీ సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఆయనకు బస ఏర్పాటు చేసిన హోటల్ వద్ద..భారత సంతతి ప్రజలు త్రివర్ణ పతాకాలు చేబూని, మోదీ..మోదీ.. వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. చీర ధరించిన ఈజిప్టు మహిళ ఒకరు హిందీ సినిమా షోలే లోని ‘యే దోస్తీ హమ్ నహీ ఛోడేంగే’పాట పాడుతూ మోదీకి స్వాగతం పలికారు. ఆ గీతం వినగానే ఆశ్చర్యానికి లోనైన మోదీ ఆమెను ప్రశంసించారు. తనకు హిందీ పెద్దగా తెలియదని, భారత్‌కు ఎప్పుడూ వెళ్లలేదని ఆమె చెప్పారు. మీరు ఈజిప్షియన్ అయినా అచ్చు భారతీయ మహిళ మాదిరిగానే ఉన్నారని మోదీ ప్రశంసించారు. కాగా, భారత ప్రధాని ఒకరు ఈజిప్టులో పర్యటించడం 26 ఏళ్లలో ఇదే ప్రథమం. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు ఆసక్తితో ఎదురు చూస్తున్న వేళ జరుగుతున్న ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం మోదీ ఈజిప్టు అధ్యక్షుడు ఎల్‌సిసితో భేటీ అవుతారు. ప్రధాని మద్బౌలీ కేబినెట్ సభ్యులతో మోదీ రౌండ్‌టేబుల్ సమావేశం ఉంటుంది. ఈజిప్టు గ్రాండ్ ముఫ్తి డాక్టర్ షౌకి ఇబ్రహీం అబ్దెల్ కరీం అల్లాం సహా పలువురు ప్రముఖులతో ప్రధాని చర్చలు జరుపుతారు. ఆదివారం ప్రధాని మోదీ కైరోలోని చారిత్రక అల్–హకీం మసీదును సందర్శిస్తారని ఈజిప్టులో భారత్ రాయబారి అజిత్ గుప్తె తెలిపారు. భారత్‌లోని దావూది బోహ్రా తెగ ముస్లింలు ఈజిప్టుకు చెందిన వారే. 11వ శతాబ్దంలో ఈజిప్టును పాలించిన ఫతిమిద్ వంశస్తులు అల్ హకీం మసీదును నిర్మించారు. బోహ్రా ముస్లింలు, ఈజిప్టు ప్రభుత్వంతో కలిసి చేపట్టిన మసీదు పునరుద్ధరణ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. -
తీవ్ర విషాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
ఇటీవలే గ్రీస్ దేశంలో జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 50కిపైగా మందికి మృతిచెందిన ఘటన మరువక ముందే మరో విషాదం నెలకొంది. ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ప్రమాద ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో 16 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఈజిప్టు దేశంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఈజిప్టులోని కైరో నగరంలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కాగా, నైలు డెల్టాలోని మెనోఫ్ నగరానికి వెళ్లే మార్గంలో కల్యుబ్ నగరంలోని స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుండగా ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ రైలు ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించినట్టు వెల్లడించారు. AFP: Two people were killed and several others injured Tuesday in a #train_accident north of #Cairo, #Egypt's #health_ministry said. A ministry statement said there were "two dead in the train accident at #Qalyub, while the injured are in a stable condition." pic.twitter.com/ILBz8R0xs4 — Usama Farag (@VOAFarag) March 7, 2023 -
Cairo Shooting World Cup: భారత షూటర్ వరుణ్‌కు కాంస్యం
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ కాంస్య పతకంతో బోణీ చేసింది. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 19 ఏళ్ల వరుణ్ తోమర్ మూడో స్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగిన ర్యాంకింగ్ రౌండ్లో నిర్ణీత ఐదు సిరీస్‌ల తర్వాత వరుణ్, సరబ్‌జ్యోత్ సింగ్ 250.6 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. ‘షూట్ ఆఫ్ షాట్’లో వరుణ్ 10.3 పాయింట్లు స్కోరు చేసి కాంస్యం దక్కించుకోగా... సరబ్‌జ్యోత్ 10.1 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. -
ఘోర ప్రమాదం.. 41 మంది సజీవ దహనం!
కైరో: ఈజిప్టు రాజధాని కైరోలోని ఓ చర్చిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 41 మంది సజీవ దహనం అయ్యారు. ఇంబాబా ఏరియాలోని అబు సీఫెన్ చర్చిలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చర్చిలో ఒక్కసారిగా మంటలు చోటు చేసుకున్నాయి. ఈ మంటల్లో చిక్కుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ప్రమాదం సంభవించినట్లు పోలీసులు పాథమిక నిర్థారణకు వచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని 30 అంబులెన్స్‌ల్లో ఆస్పత్రులకు తరలించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
రెండు వేల ఏళ్లనాటి సమాధుల్లో... బంగారపు నాలుక!!
ఇంతవరకు ఈజిప్టులో పిరమిడ్ రూపంలో మమ్మీలుగా పిలిచే సమాధులు ఉన్నాయని మనం విన్నాం. అంతేగాక ఆ సమాధులు రాజ వంశానికి చెందిన వారివి అని, పైగా వారు వాడిన వస్తువులు అన్నింటిని ఆ సమాధిలో భద్రపరిచేవారని విన్నాం. కానీ ఈజిప్టులో ఇంకా కొన్ని సమాధులపై పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతూ....పరిశోధనలు చేస్తూనే ఉంది. అయితే ఆ క్రమంలోనే ఈజిప్టు పురావస్తు శాఖ ప్రస్తుతం ఒక రాజవంశానికి చెందిన రెండు సమాధులు పక్కపక్కనే ఉన్నట్లు గుర్తించడమే కాక బంగారపు అవశేషాలు ఉన్నట్లు గుర్తించింది. (చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!) అసలు విషయంలోకెళ్లితే....కైరోలోని పర్యాటక పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఈజిప్టులోని మిన్యా గవర్నరేట్‌లో రెండు వేల ఏళ్ల క్రితం నాటి సైటే రాజవంశానికి చెందిన రెండు సమాధులు పక్కపక్కనే ఉన్నట్లు గుర్తించినట్లు ప్రకటించింది. పైగా ఈ సమాధులను స్పానిష్ పురావస్తు మిషన్ ద్వారా కనుగొన్నట్లు తెలిపింది. అంతేకాదు బార్సిలోనా విశ్వవిద్యాలయం నుండి వచ్చిన మిషన్ సమాధులలో ఒకదానిలో బంగారు నాలుకలతో ఉన్న ఇద్దరు అపరిచిత వ్యక్తుల అవశేషాలను కనుగొన్నట్లు సుప్రీమ్ కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్ సెక్రటరీ జనరల్ మోస్తఫా వాజిరి వెల్లడించారు. పైగా సమాధి లోపల ఒక మహిళ ఆకారంలో కవర్‌తో కూడిన సున్నపురాయి శవపేటికను గుర్తించినట్లు చెప్పారు. అయితే సమాధి యొక్క ప్రాథమిక అధ్యయనాల్లో ఇది గతంలో పురాతన కాలంలో తెరివడబడినట్లు వాజీరి పేర్కొన్నాడు. ఈ క్రమంలో రెండోవ సమాధి మాత్రం త్రవ్వకాల సమయంలో మిషన్ సాయంతో దానిని మొదటిసారిగా తెరిచినట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు కానోపిక్ కుండలను కలిగి ఉన్న రెండు శవపేటికలతో పాటు, మానవ ముఖంతో ఉన్న సున్నపురాయి శవపేటిక ఏ మాత్రం చెక్కు చెదరకుండా మంచి స్థితిలో రెండవ సమాధిలో ఉన్నట్లు మిషన్ త్రవ్వకాలను పర్యవేక్షించే హసన్ అమెర్ చెప్పారు. అయితే ఒక కుండలో ఫైయన్స్‌తో చేసిన సుమారు 402 ఉషబ్తి బొమ్మలు, చిన్న తాయెత్తులు, ఆకుపచ్చ పూసలు ఉన్నాయని హసన్ చెప్పారు. ఈ మేరకు హసన్ ఇటీవల కాలంలో ఈజిప్టులో ఫారోనిక్ సమాధులు, విగ్రహాలు, శవపేటికలు, మమ్మీలతో సహా అనేక పురావస్తు ఆవిష్కరణలు జరిగాయని అన్నారు. (చదవండి: దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!) -
మద్యధరా సముద్రంలో 130 మంది మృతి!
కైరో: 130 మందితో గురువారం యూరోప్‌కు బయలుదేరిన ఓ రబ్బర్ పడవను అధికారులు లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో గుర్తించారు. అయితే దగ్గరు వెళ్లి చూడగా అందులో ప్రజలెవరూ లేరు. దానికి తోడు చుట్టూ పదికి పైగా శవాలు నీటిలో కనిపించాయి. దీంతో వారంతా మరణించారని భావించారు. అయితే ట్రిపోలికి తూర్పున ఓ రెండు రబ్బర్‌పడవలను గుర్తించినట్లు లిబియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. దీంతో ప్రత్యేక పడవలను అక్కడికి పంపి వాటిలోని 106 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఓ మహిళ, కొందరు పిల్లలు ఉన్నారు. -
సూయజ్‌కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం
‘హోల్డింగ్ అప్ ఏ ట్రైన్’.. అని హెన్రీ కథ ఒకటి ఉంది. అందులో కథానాయకుడు గన్ పాయింట్ లో ట్రైన్ రాబరీ చేస్తుంటే.. బోగీల్లో ఉన్న పురుష ప్రయాణికులు గజగజ వణికి పోతుంటారు. మహిళా ప్రయాణికులు మాత్రం భయమన్నదే లేకుండా.. ‘రైలు దోపిడీ ఇలాగుంటుందా..’ అన్నట్లు కళ్లు టపటపలాడిస్తూ కుతూహలంగా చూస్తుంటారు! మంగళవారం ఉదయం సూయజ్ కెనాల్ లో ఓ భారీ షిప్పు.. కడుపు లో బిడ్డ అడ్డం తిరిగినట్లుగా.. అడ్డంగా నిలిచి పోగానే అటు ఇటు ట్రాఫిక్ జామ్ అయింది. వెనుక షిప్ లలో ఉన్న మగాళ్ల బీపీ పెరిగిపోతోంది. వాళ్లలో ఉన్న జూలియాన్ అనే ఆవిడ మాత్రం ‘ఇట్స్ ఫన్నీ’ అని చిరునవ్వులు చిందిస్తూ తను ఉన్న షిప్ లోంచి, ఆగిపోయిన ఆ భారీ షిప్ ఫొటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే మన స్టోరీ జూలియా పై కాదు. పురుషుల బీపీ మీదా కాదు. సూయజ్ కెనాల్లో ట్రాఫిక్ జామ్ క్లియర్ అయిందా? అసలు అలా ఎలా ఆ షిప్పు ఇరుక్కుపోయింది? సూయజ్ కెనాల్‌కు ఇలాంటి సమస్య ఇదే మొదటిసారా? సూయజ్ లో రోజుకు ఎన్ని షిప్ లు ప్రయాణిస్తాయి? ఆ కెనాల్‌ను ఎందుకు నిర్మించారు? ఎవరు నిర్మించారు? సూయజ్ పై హటాత్తుగా ఇన్ని ప్రశ్నలు రేకెత్తించి, ఇంత ఆసక్తిని కలుగజేసిన జూలియాన్కు ధన్యవాదాలు తెలువుకుంటూ ‘సూయజ్ కాలవ’లో కాసేపు ప్రయాణిద్దాం. కొన్ని జలమార్గాల్లోనే భారీ ఓడలు వెళ్లగలవు. అందుకే పనామా కాలువ నుంచి వెళ్లలేని అల్ట్రా లార్జ్ కంటెయినర్ షిప్.. ‘ఎవర్ గివెన్’ చైనా నుంచి నెదర్లాండ్స్ వెళ్లేందుకు సూయెజ్ కాలువ ను ఎన్నుకుంది. అయితే ఊహించని విధంగా పెను గాలులు వీచడంతో మంగళవారం ఉదయం ఎవర్ గివెన్ నౌక ఒక్కసారిగా కెనాల్‌పై అడ్డంగా తిరిగి, ఉన్నచోటే ఉండిపోయింది. బుధవారం సాయంత్రం వరకు కూడా నౌకను తిరిగి యథాస్థితికి తెచ్చి కాలువపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మార్గానికి రెండువైపులా ఎక్కడి ఓడలు అక్కడే ఆగిపోయాయి! ‘ఎవర్ గివెన్’ తైవాన్‌లో తయారై, పనామాలో రిజిస్టర్ అయిన నౌక. అందులో వందలాదిగా కంటెయినర్లు ఉండిపోయాయి. సూయజ్ కాలువపై రవాణా మొత్తం స్తంభించిపోయింది. ఇక ప్రపంచ వాణిజ్యంలో ప్రతి ఏటా సుమారు 12 శాతం ఈ కాలువ ద్వారానే వ్యాపారం జరుగుతుంది. అంతేకాకుండా 8 శాతం సహజ వాయువు ఈ కాలువ ద్వారా వివిధ దేశాలకు రవాణా జరగుతోంది. ప్రతిరోజూ పది లక్షల బ్యారెల్స్ ఆయిల్ సరఫరా అవుతోంది. ప్రస్తుతం షిప్ చిక్కుకున్న కారణంగా గంటకు సుమారు 3వేల కోట్ల నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 400 మీటర్ల పొడవు, 59 మీటర్ల వెడల్పు ఉన్న ఈ అతి భారీ నౌక సూయజ్ నగర సమీపంలో సూయజ్ కాలువ ముఖద్వారానికి దక్షిణం వైపు నుంచి ఉత్తరానికి 6 కి.మీ. దూరంలో చిక్కుకుపోయింది. ఈ అనూహ్య ఘటనకు సంబంధించి ప్రపంచానికి అందిన తొలి ఫొటో.. జూలియన్ కోనా అనే మహిళ తీసి షేర్ చేసిన ఫొటో. ఎవర్ గివెన్ నౌక వెనక ఉన్న మేరస్క్ డెన్వర్ అనే ఓడలో ఆమె ప్రయాణిస్తున్నారు. తమ ముందున్న నౌక అలా విడ్డూరంగా కాలువకు అడ్డం తిరిగి ఆగిపోవడం ఆమెకు ఫన్నీగా అనిపించి ఫొటో తీసి ఇన్‌స్టాలో పెట్టుకున్నారట. గతంలో ఇలాంటివి జరగలేదని కాదు. జరిగినా ఐదారు గంటల్లో రద్దీని తొలగించ గలిగారు. ఈ సారి 36 గంటలు దాటుతున్నా ఎవర్ గివెన్‌ను కదిలించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. టగ్ బోట్లు, డిగ్గర్ నిర్విరామంగా పని చేస్తున్నాయి. ఆ నౌకను దారిలో పెట్టడానికి బహుశా కొన్ని రోజులు పట్టవచ్చని ఈజిప్టులోని కెనాల్ నిర్వాహకులు ఇప్పటికే ఒక ఆందోళన సంకేతాన్ని విడుదల చేశారు కూడా! రెండు లక్షల 20 వేల టన్నుల బరువైన ఎవర్ గివెన్‌ను కదలిస్తే తప్ప ప్రస్తుతం ఆ మార్గంలో ఆగిపోయి ఉన్న సౌదీ, రష్యన్, ఒమన్, యు.ఎస్. ఇంధన ట్యాంకర్ ఓడలు ముందుకు కదలడానికి వీల్లేని పరిస్థితి. రోజూ కనీసం 50 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో ప్రస్తుతం చిన్న పెద్ద కలిపి వందకు పైగా నౌకలు నిలిచిపోయాయి. జూలియన్ కోలన్కు ఈ ఘటన ఫన్నీగా అనిపించినట్లే.. ట్విటిజెన్‌లు కొందరు ఫన్నీగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ‘‘మున్ముందు టగ్ బోట్లు, డిగ్గర్లలో అనుభవం కలిగిన వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువ కావచ్చు. అందుకని ఫైనాన్స్ కోర్సులు బోర్ కొట్టేసిన విద్యార్థులు ఈ కోర్సులు చేయడం మంచిది’’ అని జే జాకబ్స్ అనే అతడు ట్వీట్ చేశారు. ‘షిప్ కేప్టన్లూ.. దయచేసి మీరు త్రీ పాయింట్ టర్న్‌లను (ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, మళ్లీ ఫార్వర్డ్) మరింతగా ప్రాక్టీస్ చేయండి’ అని జిమ్ ఆర్మిటేజ్ అనే ఆయన ట్వీట్ చేశారు. సమస్యే సానుకూలతల్ని చూపిస్తుంది. అదే సానుకూలత రాగల కొద్ది గంటల్లో సూయజ్‌లోని ఈ తాత్కాలిక అడ్డును తొలగించి, ఎప్పటిలా సందడిగా మార్చవచ్చు. సూయజ్ కాలువ (కృత్రిమ జలమార్గం) ఎక్కడ ఉంది? : ఈజిప్టులో కాలువ పొడవు : 193 కి.మీ. కాలువ లోతు : 78 అడుగులు కాలువ వెడల్పు : నీళ్ల అడుగున 21 మీటర్లు.; ఉపరితలంపై 60 నుంచి 90 అడుగులు) ఎక్కడి నుంచి ఎక్కడికి? : మధ్యదరాసముద్రం నుంచి ఎర్ర సముద్రం వరకు. కట్టింది ఎక్కడ? : సూయెజ్ భూసంధిపై (జలాల మధ్య భూమార్గం) బయల్దేరే రేవు: పోర్ట్ సయెద్ (మధ్యధరా తీరం వెంబడి ఈశాన్య ఈజిప్టు) చేరుకునే రేవు: పోర్ట్ ట్యూఫిక్ (ఎర్ర సముద్రపు పాయను ఆనుకుని ఈశాన్య ఈజిప్టు) నిర్మాణం మొదలైంది : 1859 నిర్మాణం పూర్తయింది : 1869 కెనాల్ ఉపయోగం : ఆసియా ఐరోపాల మధ్య షిప్పింగ్‌కి దగ్గరి దారి. కెనాల్ లేకుంటే? : షిప్పింగ్‌కి ఆఫ్రికా మీదుగా 7 వేల కి.మీ. దూరం చుట్టూ తిరగవలసి వచ్చేది. నౌక ప్రయాణ సమయం : వేగాన్ని బట్టి 11 నుంచి 16 గంటలు నౌక ప్రయాణ వేగం : గంటలకు 15 కి.మీ. (8 నాటికల్ కి.మీ.). చదవండి: సూయజ్ కాలువ బంద్.. ఇంధన ధరలు పెరుగుతాయా! -
సూయజ్ కాలువ బంద్.. ఇంధన ధరలు పెరుగుతాయా!
కైరో: ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే సముద్ర వాణిజ్య మార్గాలలో సూయజ్ కాలువ ఒకటి. ఎర్ర సముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని కలుపుతూ ఈజిప్ట్ భూ భాగంలో సుయాజ్ కాలువను నిర్మించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం కొద్దిరోజులపాటు ఈ మార్గం గుండా రాకపోకలు నిలిచిపోనున్నాయి. దీనికి కారణం, మంగళవారం కాలువలో ఒక భారీ షిప్ చిక్కుకుంది. 400 మీటర్ల పొడవు.. 59 మీటర్ల వెడల్పు ఉన్న ఎవర్ గ్రీన్ కంపెనీ కంటైనర్ షిప్ కాలువకు అడ్డుగా నిలిచింది. ఈ షిప్ ఇసుకలో కూరుకపోయి ఉండవచ్చునని నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం గుండా వెళ్లే సుమారు 100 షిప్‌ల రవాణాకు ఆటంకం ఏర్పడనుంది. కాగా 193 కిలోమీటర్ల పొడవైన సూయజ్ కాలువ ద్వారా, మధ్య ప్రాచ్యం నుంచి యూరప్, ఉత్తర అమెరికాకు ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు సాగుతాయి. ఇక ప్రపంచ వాణిజ్యంలో ప్రతి ఏటా సుమారు 12 శాతం ఈ కాలువ ద్వారానే వ్యాపారం జరుగుతుంది. అంతేకాకుండా 8 శాతం సహజవాయువు ఈ కాలువ ద్వారా వివిధ దేశాలకు రవాణా జరగుతోంది. ప్రతిరోజూ పది లక్షల బ్యారెల్స్ ఆయిల్ సరఫరా అవుతోంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం షిప్ కారణంగా ఈ మార్గం గుండా రాకపోకలు నిలిచిపోవడంతో, ఆయా దేశాల్లో ఇంధన ధరలు పెరగవచ్చని వాణిజ్య నిపుణులు భావిస్తోన్నారు. ఈ షిప్‌ను మళ్లీ సరైన మార్గంలోకి తెచ్చేందుకు ప్రత్యేకమైన పడవలను ఏర్పాటు చేశారు. ఇక్కడ పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేందుకు కొన్ని రోజులు పట్టవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో ఆసియా-యూరప్‌ల మధ్య వాణిజ్యంపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. చదవండి: గాల్లో తేలుతున్న భారీ నౌకలు -
పాములతో బాడీ మసాజ్.. గుండె ధైర్యం ఉంటేనే!
కైరో: అలసటతో నీరసించిపోయిన శరీరాన్ని ఉత్తేజితం చేసుకునేందుకు చాలా మంది స్పాలను ఆశ్రయిస్తారన్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే వివిధ రకాల తైలాలతో మర్ధనా చేస్తూ కస్టమర్లకు ఉపశమనం కలిగించేలా స్పా నిర్వాహకులు సరికొత్త టెక్నిక్‌లు ఉపయోగిస్తుంటారు. అయితే ఈజిప్టులోని కైరోలో గల ఓ స్పా సెంటర్ మాత్రం పాములతో బాడీ మసాజ్ చేస్తూ వినూత్నంగా నిలిచింది. ఈ ప్రక్రియ ద్వారా శారీరకంగానూ, మానసికంగానూ ఉల్లాసంగా ఉండవచ్చంటున్నారు నిర్వాహకులు. తమ స్పాలో కొండచిలువలు సహా వివిధ రకాల విష రహిత పాములను ఉపయోగిస్తూ కస్టమర్లకు సరికొత్త అనుభవాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయం గురించి స్పా యజమాని సఫ్వాట్ సెడికి రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. ‘స్నేక్ మసాజ్’తో కండరాలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చని, దీనితో రక్తప్రసరణ కూడా మెరుగు అవుతుందని పేర్కొన్నారు. ‘‘శారీరకంగా, మానసికంగా ఉల్లాసం అందించడమే ఈ మసాజ్ ముఖ్యోద్దేశం. రక్త ప్రసరణ మెరుగుపరచడం ద్వారా శరీరాన్ని ఉత్తేజితం అవుతుంది. ఎండార్ఫిన్ల విడుదలతో మానసిక సంతోషం కలుగుతుంది. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ఇక సదరు స్పాను సందర్శించిన ఓ కస్టమర్.. ‘‘నా శరీరంపై పాములను వేయగానే తొలుత కాస్త భయం వేసింది. కానీ నెమ్మదిగా భయం, టెన్షన్ మాయమయ్యాయి. చాలా రిలాక్సింగ్‌గా అనిపించింది. నా వీపు మీద పాములు పాకుతూ ఉంటే ఏదో తెలియని ఉత్సాహం’’ అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. ఇక స్నేక్ మసాజ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొంతమంది నెటిజన్లు ఇందుకు సానుకూలంగా స్పందించగా.. చాలా మంది.. ‘‘అమ్మ బాబోయ్.. పాములు మీద పాకితే ఇంకేమైనా ఉందా. భయంతో గుండె ఆగిపోయినా ఆగిపోతుంది’’ అంటూ భయం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రైవేట్ ఫొటోషూట్.. మోడల్ అరెస్టు!
కైరో: పురావస్తు శాఖ నిబంధనలు ఉల్లంఘించిన ఫొటోగ్రాఫర్, మోడల్‌ను ఈజిప్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్కియాలజీ జోన్లో ప్రైవేట్ ఫొటోషూట్ నిర్వహించినందుకు వారిని అరెస్టు చేశారు. మోడల్- డాన్సర్ సల్మా అల్-షిమీ 4700 వందల ఏళ్లనాటి చరిత్ర గల జోసర్ పిరమిడ్ ప్రాంగణంలో ఈజిప్షియన్ల పూర్వకాలం నాటి వస్త్రధారణను తలపించేలా దుస్తులు ధరించి ఫొటోలు దిగారు. వారం రోజుల కిత్రం తన ఇన్‌స్టా అకౌంట్లో వీటిని షేర్ చేశారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో తొలుత ఫొటోగ్రాఫర్‌ను, ఆ తర్వాత షిమీని కూడా అరెస్టు చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. (చదవండి: 2,500 ఏళ్ల తరువాత 'మమ్మీ'ని బయటకు తీశారు) ఈజిప్షియన్ల సంప్రదాయాలను అగౌరవపరిచినందుకు వీరిపై ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. కాగా ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘‘ఆర్కియాలజీ జోన్లో ఫొటోలు తీసుకోవడంపై నిజంగానే నిషేధం ఉందా? లేదా ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేశారా’’అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా అసభ్యతను వ్యాప్తి చేస్తున్నారంటూ సోషల్ మీడియా ఇన్ల్ఫూయర్స్పై ఈజిప్టు ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. (చదవండి: టిక్‌టాక్: కటకటాల వెనక్కు బెల్లీ డ్యాన్సర్) View this post on Instagram A post shared by Salma Elshimy (@salma.elshimy.officiall) -
హోస్నీ ముబారక్ కన్నుమూత
కైరో: ఈజిప్టు మాజీ అధ్యక్షుడు, సుమారు 30 ఏళ్లపాటు మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరతలకు ప్రతీకగా చెప్పుకునే నేత హోస్నీ ముబారక్ (91) మంగళవారం మరణించారు. ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా మరణించినట్లు ఈజిప్టు టెలివిజన్ ప్రకటించింది. అధ్యక్షుడిగా ఉన్నంత కాలం అమెరికాకు సన్నిహితుడిగా మెలిగారు. అయితే 2011లో ఈజిప్టు యువత సుమారు 18 రోజుల పాటు కైరోలోని సెంట్రల్ తహ్రీర్ స్క్వేర్‌లో జరిపిన ఆందోళనల కారణంగా మిలటరీ వర్గాలు హోస్నీ ముబారక్‌తో బలవంతంగా రాజీనామా చేయించాయి. ఈజిప్ట్ చరిత్రలోనే మొదటిసారి ఒక అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడమే కాకుండా జైల్లో పెట్టడం ముబారక్ విషయంలోనే జరిగింది. అరబ్ స్పింగ్ ఆందోళన సమయంలో 900 మంది ఆందోళనకారుల మరణాలను నిలువరించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలపై న్యాయస్థానాలు 2012 జూన్‌లో ముబారక్‌ను దోషిగా నిర్ధారించి యావజ్జీవ జైలుశిక్ష విధించాయి. అయితే ఈజిప్టు ఉన్నత న్యాయస్థానం 2014లో వీరిద్దరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. -
భారీ ఉగ్రకుట్ర భగ్నం
ఈజిప్టులో 10 మంది ఉగ్రవాదుల కాల్చివేత కైరో : ఈజిప్టులో భద్రతా బలగాలు భారీ ఉగ్ర కుట్నను భగ్నం చేశాయి. సెంట్రల్ కైరో సమీపంలోని అర్ద్ ఎల్లేవా జిల్లాలో ఓ అపార్ట్మెంట్లో దాక్కుని ఉన్న 10 మంది ఉగ్రవాదులను ఆదివారం మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో ముగ్గురు అధికారులు సహా ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడినట్లు ఓ ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు. ఉగ్రవాదులు దేశంలో పలుచోట్ల దాడులకు ప్రణాళిక రచిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందిందన్నారు. దీంతో ఉగ్రవాదులు నక్కిన భవంతిని భద్రతా బలగాలు చుట్టుముట్టాయని వెల్లడించారు. వీరి కదలికల్ని గమనించిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారని తెలిపారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో దాదాపు 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించారు. ఈ ఉగ్రవాదులందరూ నిషేధిత ముస్లిం బ్రదర్హుడ్ సంస్థ నుంచి వేరయిన వారిగా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. సంఘటనాస్థలం నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2013లో అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీ ప్రభుత్వాన్ని సైన్యం రద్దుచేసిన అనంతరం ఈజిప్టులో ఆర్మీ, పోలీసులపై ఉగ్ర దాడులు భారీగా పెరిగాయి. -
చర్చి వద్ద బాంబు పేలుడు, 25 మంది మృతి
-
చర్చి వద్ద బాంబు పేలుడు, 25 మంది మృతి
కైరో: ఈజిప్టు రాజధాని కైరోలో ఆదివారం ఓ చర్చి వద్ద సంభవించిన బాంబు పేలుడులో కనీసం 25 మంది మరణించగా, మరో 35 మంది గాయపడ్డారు. కైరోలోనే బాంబు దాడిలో ఆరుగురు పోలీసులు మరణించిన రెండు రోజుల తర్వాత ఈ దాడి జరిగింది. చర్చి గోడ బయటనుంచి ఓ దుండగుడు బాంబు విసిరాడని స్థానిక మీడియా పేర్కొంది. కాగా చర్చి ఆవరణలో అమర్చిన బాంబును పేల్చి ఈ దారుణానికి పాల్పడ్డారని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. బాంబు పేలుడు తర్వాత ఆ ప్రాంతం రక్తసిక్తంగా మారింది. మృతుల్లో మహిళలు ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది ఎవరన్నది ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. ఈజిప్టులో క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ఐసిస్ ఉగ్రవాదులు తరచూ దాడులు చేస్తున్నారు. -
జ్ఞానతృష్ణను తీర్చే ఒయాసిస్సు
నీరున్న చోట, పచ్చదనం ఉన్న చోట జ్ఞానం మొలకెత్తుతుంది. చిగురిస్తుంది. ఆకులు, కొమ్మలు వేస్తుంది. ఊడలు కూడా దిగుతుంది. అది ఎడారి అయినా సరే, జ్ఞానం ఒయాసిస్సై దాహాన్ని తీరుస్తుంది. అలాంటి ఒక విజ్ఞాన ఒయాసిస్సు ఈజిప్టు ఎడారిలో నిర్మాణం కాబోతోంది. ఈజిప్టు పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చేది.... భారీ సైజు పిరమిడ్లు... ఇసుక తిన్నెలతో కూడిన ఎడారి. అంతేనా? మరి... ఇసుక ఎడారి మధ్యలో పచ్చటి ఓ ఒయాసిస్సు ఉంటే? ఈ ఆలోచనకు రూపమిస్తే పక్క ఫొటోల్లో చూపినట్టుగా ఉంటుంది. విషయమేమిటంటే... ఈజిప్టు రాజధాని కైరో సమీపంలో ఓ అత్యాధునిక పరిశోధనశాల, మ్యూజియమ్ ఒకదాన్ని నిర్మించాలని బిబిలోథికా అలెక్సాండ్రినా అనే సంస్థ సంకల్పించింది. కైరోకు పశ్చిమ దిక్కున ఎడారిలో కట్టబోయే ఈ సైన్స్ సిటీ డిజైనింగ్‌కు ఓ పోటీ నిర్వహించింది. దాదాపు 446 సంస్థలు పోటీపడగా... వాటిల్లో వెస్టన్ విలియమ్సన్ ఆర్కిటెక్చర్ సంస్థ ప్రతిపాదించి, పోటీలో విజయం సాధించిన డిజైన్లు ఇవి. జ్ఞానతృష్ణను తీర్చే ఒయాసిస్సు ఇదీ అన్న విధంగా వీరు దీన్ని డిజైన్ చేశారు. మొత్తం 13.49 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నారు. దూరం నుంచి చూస్తే తెల్లటి పైకప్పుల్లా కనిపిస్తున్నాయి చూడండి... వాటిల్లోనే ఓ ప్లానెటోరియం, ఇంకో మ్యూజియమ్, అబ్జర్వేషన్ టవర్లతోపాటు కాన్ఫరెన్స్ సెంటర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సౌకర్యాలు ఉంటాయి. అంతేకాదు... ఈ గుండ్రటి పైకప్పుల ద్వారా వాననీటిని ఒడిసిపట్టడంతోపాటు... సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్తు కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. -
వాహనాన్ని ఢీకొన్న రైలు: 8 మంది మృతి
కైరో : ఈజిప్టులో ప్రయాణికులను తీసుకువెళ్తున్న వాహనాన్ని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం పాలైయ్యారు. మరో ఏనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి గురువారం ఈజిప్టులో వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఉన్నతాధికారులు స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. రైలు అశ్వన్ నుంచి ఈజిప్టు రాజధాని కైరో వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుందని వివరించారు. ప్రపంచంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న టాప్ 10 దేశాల్లో జాబితాలో ఈజిప్టు చోటు సంపాదించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే. -
జైల్లోంచి విడుదల కానున్న ముబారక్!
కైరో: ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ త్వరలో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆయన పదవీచ్యుతుడైన తర్వాత నమోదైన ఈ అవినీతి కేసు విచారణ సరిగా జరగలేదని గుర్తించిన ఆ దేశ ఉన్నత న్యాయస్థానం... దానిపై పునర్విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈజిప్టును మూడు దశాబ్దాల పాటు పాలించిన నియంత హోస్నీ ముబారక్ తన పాలనా సమయంలో దాదాపు రూ. 90 కోట్ల ప్రభుత్వ నిధులను తన అవసరాలకు వాడుకున్నారనే ఆరోపణలపై గత మేలో మూడేళ్ల కారాగార శిక్ష పడింది. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ కేసు పునర్విచారణ నేపథ్యంలో ముబారక్ శనివారం విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. -
భవనం కూలి 15 మంది మృతి
కైరో: ఈజిప్టు రాజధాని కైరోలో భవనం కూలి 15 మంది మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గతంలో నిర్మితమై ఉన్న మతారియా సుబుర్బ్ భవనానికి అదనంగా మరికొన్ని ఫ్లోర్ లను వేయడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రక్షణ దళాలు శిథిలాలను తొలగించే పనిలో ఉన్నాయని కైరో పౌర రక్షణ విభాగం జనరల్ డైరెక్టర్ మామ్ దో అబ్దుల్ ఖాదిర్ స్పష్టం చేశారు. ఆ భవనం శిథిలావస్థకు చేరడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు స్పష్టం చేశారు. అందులో నివాసం ఉన్న వారిని ఖాళీ చేయమని ఇది వరకే హెచ్చరించామని.. అయితే వారు తమ మాటను పెడ చెవిన పెట్టడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. -
ఐటీఎఫ్ గ్రేడ్-2 టోర్నీలో రన్నరప్ గా ప్రాంజల
కైరొ(ఈజిప్టు): వర్థమాన టెన్నిస్ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి యడ్లవల్లి ప్రాంజల ఐటీఎఫ్ గ్రేడ్-2 టెన్నిస్ టోర్నీలో తృటిలో అంతర్జాతీయ టైటిల్ కోల్పోయింది. ఈ టోర్నీలో బాలికల డబుల్స్ విభాగంలో ప్రాంజల- కర్మన్ కౌర్ జోడీ రన్నరప్ గా నిలిచింది. డచ్ దేశానికి చెందిన ఐసోల్ డిజాంగ్, నీనా క్రూజర్ చేతిలో 1-6, 6-3, 4-10 చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో జాస్మిన(పోలెండ్)-వలేరియా(ఈస్తోరియా)పై ప్రాంజల- కర్మన్ కౌర్ జోడీ విజయం సాధించింది. -
సిరియాలో 7,219 మంది మృత్యువాత
కైరో: అంతర్యుద్ధంతో అట్టుకుతున్న సిరియాలో నరమేధం కొనసాగుతోంది. ఒక్క ఆగస్టు నెలలోనే సిరియాలో 7,219 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 2,015 మంది పౌరులు, 281 మంది పిల్లలు, 138 మంది మహిళలు ఉన్నారని మానవ హక్కుల సంస్థ ఒకటి వెల్లడించింది. ఫ్రీ సిరియన్ ఆర్మీ(ఎఫ్ఎస్ఏ), తిరుగుబాటుదారులు, ప్రభుత్వ వ్యతిరేకదళాలను చెందిన 1,448 మంది మృతి చెందారని పేర్కొంది. షుయ్టాట్ గిరిజన తెగకు చెందిన 700 మంది కూడా మృతుల్లో ఉన్నారు. గత మూడేళ్ల నుంచి ఈ దేశంలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. -
ఈజిప్టులో భారీ హింస, 50 మంది మృతి
కైరో: ఈజిప్టులో మరోసారి భారీ హింస చెలరేగింది. 2011లో ఈజిప్టు నియంత హోస్నీ ముబాకర్ను పదవీచ్యుతుడిని చేసి మూడేళ్లవుతున్న సందర్భంగా శనివారం నిర్వహించిన ర్యాలీలు రక్తసిక్తంగా మారాయి. దాదాపు 50 మంది మరణించగా, వందలాదిమంది గాయపడ్డారు. మిలటరీ మద్దతుతో కొనసాగుతున్న ప్రస్తుత ప్రభుత్వం మద్దతుదారులు, వ్యతిరేకులు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు. కాగా పోలీసులు ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై కాల్పులు జరిపినట్టు సమాచారం. ఆ దేశ రాజధాని కైరో, అలెగ్జాండ్రియాలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దేశవ్యాప్తంగా 24 గంటల పాటు అల్లర్లు జరిగాయి. పోలీసులు ప్రభుత్వ వ్యతిరేక నిరసన కారుల్ని అరెస్ట్ చేశారు. ముబాకర్ను పదవీచ్యుతుణ్ని చేశాక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈజిప్టు అధ్యక్షుడు మహ్మద్ మోర్సీని గతేడాది జూలైలో మిలటరీ గద్దెదించింది. -
ఈజిప్ట్ బస్సు బాంబుదాడిలో ఐదుగురికి గాయాలు
కైరో: ఈజిప్ట్ రాజధాని కైరోలో ఓ ప్రజా రవాణా బస్సుపై బాంబుదాడి జరిగింది. ఈ బాంబుదాడిలో భద్రతా అధికారులతో సహా ఐదుగురికి తీవ్ర గాయాలయినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఉత్తర కైరీ సమీప నగరమైన నాసర్ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ బాంబును బస్సులో పెట్టారా ? లేక ఏ దుండగుడు అయినా బస్సుపై బాంబు విసిరిడా ? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇస్లామిస్ట్ అధ్యక్షుడైన మెహ్మద్ మెర్సీ పదవీచ్యుత్తుడైన నాటి నుంచి తీవ్రవాదులు ఈ బాంబు దాడులకు తెగబడుతున్నట్టు సమాచారం. కానీ, తీవ్రవాదులు, జవానులనే తమ ప్రథమ లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులకు పాల్పడుతున్నట్టు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. కాగా, సరిగ్గా రెండు రోజుల క్రితం జరిగిన కారు ఆత్మహుతి దాడిలో కూడా పోలీసులనే లక్ష్యంగా చేసుకున్న తీవ్రవాదులు 15మంది ప్రజలను పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటన నైల్ డెల్టా నగరంలోని ప్రధాన కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. -
సిరియాలో వైమానిక దాడులు; 20 మంది మృతి
సిరియాలో జరిగిన వైమానిక దాడుల్లో కనీసం 20 మంది మరణించారు. అలెప్పొ రాష్ట్రంలోని అల్ బాబ్ నగరంపై ఆదివారం హెలీకాప్టర్లతో దాడులు చేశారు. చనిపోయినవారిలో ఇద్దరు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నట్టు సిరిమా మానవ హక్కుల వేదిక వెల్లడించింది. తిరుగుబాటు దారులను అణిచేందుకు సిరియా సైన్యం దాడి చేసింది. అధ్యక్షుడు బషర్ అల్ అసాద్‌కు చెందిన హెలీకాప్టర్లతో పేలుడు పదార్థాలను నింపిన బారెల్స్‌ను నగరంపై జారవిడిచారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. అల్ బాబ్ నగరంలోనే శనివారం సిరియా సైన్యం జరిపిన దాడుల్లో మరో 20 మంది చనిపోయారు. తిరుగుబాటు దారులు, సైన్యం మధ్య తరచూ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. -
ఈజిప్టులో రైలు ప్రమాదం; 29 మంది మృతి
ఈజిప్టు రాజధాని కైరో సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో 29 మంది మరణించగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెనీ సుయెఫ్ నుంచి గీజాకు వెళ్తున్న సరుకుల రవాణా రైలు పలు వాహనాలను ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. కైరోకు 40 సమీపంలోని డాషుర్ పట్టణం వద్ద రైలు తొలుత ఓ మినీ బస్సును ఢీ కొట్టింది. ఆ తర్వాత ఓ ట్రక్‌ను ఇతర వాహనాలను ఢీ కొంది. దీంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. బాధితుల్ని సమీప ఆస్పత్రికి తరలించారు. రైలు డ్రైవర్, అతని సహాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ట్రక్, మినీ బస్సు ఢీ: 15 మంది మృతి
ఈజిప్టులోని ఇస్మాలియా ప్రాంతంలో ఓ ట్రక్, మినీ బస్సు ఢీ కొన్న ఘటనలో 15 మంది మరణించారని స్థానిక మీడియా ఆదివారం ఇక్కడ వెల్లడించింది. మృతుల్లో 11 మందిని గుర్తించినట్లు తెలిపింది. నిన్న చోటు చేసుకున్న ఆ ఘటనలో మరోకరు తీవ్రంగా గాయపడ్డారని, అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పింది. ఈజిప్టులో ప్రతి ఏడాది వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తారని ఆ మీడియా వివరించింది. జాతీయ రహదారుల నిర్వహాణ, నిర్లక్ష్యం వల్ల ఇటువంటి ఘటనలు ఈజిప్టు దేశంలో నిత్యకృత్యమని స్థానిక మీడియా తెలిపింది. -
మోర్సీ మద్దతుదారులు 40 మంది హతం
ఈజిప్టులో తిరుగుబాటుదారులపై విరుచుకుపడ్డ సైన్యం శిబిరాలు బుల్డోజర్లతో నేలమట్టం కైరో: ఈజిప్టు రాజధాని కైరో బుధవారం బుల్డోజర్ల పదఘట్టనలు, తుపాకీ కాల్పుల మోతలతో దద్ధరిల్లింది. పదవీచ్యుతుడైన ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీకి మద్దతిస్తున్న 40 మంది తిరుగుబాటుదారులను సైన్యం హతమార్చింది. మోర్సీ మద్దతుదారులపై సైన్యం బుల్డోజర్లతో విరుచుకుపడి శిబిరాలను పెకలించింది. ఈ ఘర్షణలో 300 మంది మరణించినట్లు ముస్లిం బ్రదర్హుడ్ నేతలు పేర్కొనగా 40 మంది మృత్యువాత పడినట్లు అల్‌జజీరా చానల్‌ను ఉటంకిస్తూ కొన్ని వర్గాలు వెల్లడించాయి. అధ్యక్ష పీఠం మోర్సీకి తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తున్న తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా సైన్యం సరైన చర్యలు చేపడుతున్నట్లు అంతర్గతశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నాజర్ నగరంలో 200 మందిని, గిజాలో 150 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది. తిరుగుబాటుదారుల్లో ప్రాసిక్యూషన్ చేయాల్సిన వారు మినహా మిగతావారు సురక్షితంగా నిష్ర్కమించేందుకు అవకాశం ఇస్తామని పేర్కొంది. మరోవైపు ముగ్గురు భద్రతా సిబ్బంది సహా తొమ్మిది మంది చనిపోయినట్లు ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.