మద్యధరా సముద్రంలో 130 మంది మృతి! | IOM Says Up To 130 Dead As Boat Overturns In Mediterranean | Sakshi
Sakshi News home page

మద్యధరా సముద్రంలో 130 మంది మృతి!

Published Sat, Apr 24 2021 2:09 AM | Last Updated on Sat, Apr 24 2021 4:51 AM

IOM Says Up To 130 Dead As Boat Overturns In Mediterranean - Sakshi

కైరో: 130 మందితో గురువారం యూరోప్‌కు బయలుదేరిన ఓ రబ్బర్‌ పడవను అధికారులు లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో గుర్తించారు. అయితే దగ్గరు వెళ్లి చూడగా అందులో ప్రజలెవరూ లేరు. దానికి తోడు చుట్టూ పదికి పైగా శవాలు నీటిలో కనిపించాయి. దీంతో వారంతా మరణించారని భావించారు. అయితే ట్రిపోలికి తూర్పున ఓ రెండు రబ్బర్‌పడవలను గుర్తించినట్లు లిబియన్‌ కోస్ట్‌ గార్డ్‌ తెలిపింది. దీంతో ప్రత్యేక పడవలను అక్కడికి పంపి వాటిలోని 106 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఓ మహిళ, కొందరు పిల్లలు ఉన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement