Mediterranean
-
ఈ ప్రాంత ఆహారంతో మీ మెదడు వయస్సు తగ్గిపోతుంది..!
కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ..జంక్ ఫుడ్‌ను తగ్గిస్తే మన మెదడు మెరుగ్గా పనిచేస్తుందని ఎన్నో నివేదికలు తెలిపాయి. కానీ ప్రస్తుతం ఓ నివేదిక మెదడు వయస్సును తగ్గించే విషయాలను వెల్లడించింది. మధ్యదరా ప్రాంతంలోని ఆహారంతో మెదడు వయస్సు తగ్గుతుందని ఇజ్రాయెల్‌లోని నెగేవ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ నివేదిక స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో సాధారణంగా తీసుకునే కూరగాయలు,సీఫుడ్, తృణధాన్యాల కారణంగా శరీరంలో ఒక శాతం కొవ్వు తగ్గడమే కాకుండా మెదడు పనితీరు మెరుగుపడిందని తెలిపారు. మెదడుకు సాధారణంగా ఉండే వయస్సు కంటే తొమ్మిది నెలలు తగ్గుతుందని పరిశోధనలో తేలినట్లు వెల్లడించారు. 102 మందితో 18 నెలలపాటు ఆ ఆహారాన్ని ఇచ్చి శరీర భాగాల పనితీరును పరిశీలించినట్లు నివేదిక పేర్కొంది. ఈ ఆహారంతో కొత్తగా వచ్చి చేరుతున్న కొవ్వు, బాడీ మాస్ ఇండెక్స్, కాలెయ పనితీరును పరిశీలించగా.. మెదడు పనితీరుపై మెరుగైన ఫలితాలు కనిపించినట్లు వెల్లడించారు. శరీర బరువు కూడా 2.3కిలోగ్రాములు తగ్గినట్లు చెప్పారు. ఆరోగ్యకరమైన జీవనవిధానం వల్ల మెదడుపై మెరుగైన ఫలితాలు ఉంటున్నాయని బెన్ గ్యురియన్ యూనివర్సిటీకి చెందిన న్యూరోసైంటిస్టు గిడోన్ లెవకోవ్ తెలిపారు. ప్రాసెసింగ్ ఫుడ్‌ను తగ్గించడం, స్వీట్లు, జంక్ ఫుడ్స్ మెదడు పనితీరును దెబ్బతీయడమే కాకుండా.. బయోలాజికల్ వయస్సును కూడా పెంచుతున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి:భూమి లోతుల్లో మరో అద్భుత ప్రపంచం -
32 ఏళ్లు ఒంటరిగా.. ఆ దీవిలోనే జీవనం.. చివరికి
మనిషి సంఘజీవి సమాజంతో తప్ప ఒంటరిగా బతకలేడు అనే మాటను మనం వినే ఉంటాం. ఇదే మాట ఈ పెద్దాయనకు వర్తించదేమో. ఈ వ్యక్తి ఓ దీవిలో ఏకంగా 32 ఏళ్లు ఒంటరిగా జీవించాడు. అది కూడా ఏ చీకూ చింతలేకుండా ఆనందంగానే కాలం గడిపాడు. తనతో తానే సావాసం చేసుకుంటూ బతుకుబండిని ఇన్నేళ్లు లాగేసాడు. ఎందుకంటే ఆ మధ్యధరా సముద్ర దీవి అంత అందంగా ఉంది మరి. 32 ఏళ్లుగా దీవిలోనే జీవితం ఆ పెద్దాయన పేరు మారో మొరాండీ. వయసు 81. 1989లో దక్షిణ పసిఫిక్ మహా సముద్రానికి వెళ్తుండగా... మధ్యలో బోట్ పాడైంది. దాంతో ఈ దీవికి వచ్చిపడ్డాడు. అనుకోకుండా ఆ ప్రాంతమే అతని ఇల్లు అయిపోయింది. అప్పట్లో ఆ దీవిని మరో పెద్దాయన కేర్ టేకర్‌గా చూసుకుంటున్నాడు. ఆయన రిటైర్ అవుతున్నాడన్న విషయం తెలుసుకున్న మొరాండీ... తరువాత తానే దానికి కేర్ టేకర్‌గా ఉండాలనుకున్నాడు. ఇంకేముంది అనుకున్నదే తడువుగా తన పడవను అమ్మేసి దీవిలోనే ఉండిపోయాడు. అక్కడే ఓ ఇల్లు కూడా కట్టుకున్నాడు. నిజానికి ఆ ఇల్లు ముందే నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి షెల్టర్‌ను ఇల్లుగా చేసుకున్నాడు. దీవి నుంచి వెళ్లాలని లేదు 32 ఏళ్లుగా ఆ దీవిలోనే ఉంటున్న మొరాండీ... అలా జీవించేందుకు నానా కష్టాలు పడ్డాడు. ప్రకృతి విలయాలతో పోరాడాడు. దీవి అందం చెడిపోకుండా కాపాడాడు. ఐతే... 2016లో ఆ దీవిలో అతను ఉన్న విషయం తెలిసింది. ఆ దీవిని అతను ఖాళీ చెయ్యాలంటూ... లా మద్దలేనా ఆర్చిపెలాగో నేషనల్ పార్క్ నోటీస్ పంపింది. దాంతో వారి మధ్య న్యాయపోరాటం మొదలైంది. తాజాగా కోర్టు కూడా ఆ దీవి పార్కుకే చెందుతుందని తీర్పునిచ్చింది. దీంతో అతన్ని ఖాళీ చెయ్యమని చెప్పింది. ఐతే... ఐదేళ్లుగా మొరాండీకి మద్దతుగా చాలా మంది పిటిషన్‌పై సంతకాలు చేశారు. అధికారులు మాత్రం అతను ఖాళీ చెయ్యాల్సిందేనని పట్టుపట్టారు. ‘ఇన్నేళ్ల తర్వాత ఈ దీవిని వదిలి వెళ్లడం బాధగా ఉంది. నేను ఒకప్పుడు మెయిన్ టౌన్‌కి శివార్లలో ఉండేవాణ్ని. ఇప్పుడు అక్కడికే వెళ్లి... షాపింగ్ చేసి బట్టలు కొనుక్కుంటా. నా జీవితాన్ని జీవిస్తా. అయినా నా జీవితంలో పెద్దగా మార్పేమీ రాదు. ఇకపైనా నేను సముద్రాన్ని చూస్తాను’ అని మొరాండీ తెలిపాడు. ( చదవండి: ఇదేం వింత.. చేతి వేళ్లు ఈ రంగులో ఉన్నాయేంటి? ) -
మద్యధరా సముద్రంలో 130 మంది మృతి!
కైరో: 130 మందితో గురువారం యూరోప్‌కు బయలుదేరిన ఓ రబ్బర్ పడవను అధికారులు లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో గుర్తించారు. అయితే దగ్గరు వెళ్లి చూడగా అందులో ప్రజలెవరూ లేరు. దానికి తోడు చుట్టూ పదికి పైగా శవాలు నీటిలో కనిపించాయి. దీంతో వారంతా మరణించారని భావించారు. అయితే ట్రిపోలికి తూర్పున ఓ రెండు రబ్బర్‌పడవలను గుర్తించినట్లు లిబియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. దీంతో ప్రత్యేక పడవలను అక్కడికి పంపి వాటిలోని 106 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఓ మహిళ, కొందరు పిల్లలు ఉన్నారు. -
కోవిడ్ చికిత్సకు హెచ్‌సీక్యూ–ఐజీ
పారిస్: కోవిడ్–19 చికిత్సలో ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్– అజిథ్రోమైసిన్’(హెచ్‌సీక్యూ–ఐజీ) కాంబినేషన్ ఎలాంటి సానుకూల ఫలితాలు సాధించిందనే వివరాలను వెల్లడించే అధ్యయనం ఒకటి ఫ్రాన్స్‌లో తాజాగా తెరపైకి వచ్చింది. మార్సిలీలోని ఐహెచ్‌యూ, మెడిటెరేన్ ఇన్ఫెక్షన్ కేంద్రంలో ఈ అధ్యయనాన్ని మార్చి– ఏప్రిల్ మధ్య నిర్వహించారు. 1061 కరోనా పాజిటివ్ పేషెంట్లకు కనీసం మూడు రోజుల పాటు ‘హెచ్‌సీక్యూ–ఐజీ’ ట్రీట్మెంట్ ఇచ్చారు. వీరిలో 973(91.7%) మంది పది రోజుల్లో ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. 46(4.6%) మంది పేషెంట్లపై ఈ చికిత్స సరైన ఫలితాలనివ్వలేదు. 10 మంది పేషెంట్లను ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది. వారిలో ఐదుగురు(0.47%) మరణించారు. ఈ ఐదుగురు కూడా 74 నుంచి 95 ఏళ్ల మధ్య వయసువారే కావడం గమనార్హం. 32 మంది పేషెంట్లకు 10 రోజులకు మించి ఆసుపత్రిలో చికిత్స అందించాల్సి వచ్చింది. ఈ చికిత్స పొందిన వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు. ఈ అధ్యయన ఫలితాలు కోవిడ్–19 చికిత్సలో హెచ్‌సీక్యూ–ఐజీ మెరుగైన ఫలితాలను సాధిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. ‘హెచ్‌సీక్యూ–ఐజీ కాంబినేషన్ కోవిడ్–19కు సమర్థవంతమైన, సురక్షితమైన చికిత్స. ఈ చికిత్సను కోవిడ్–19 నిర్ధారణ కాగానే, ఆలస్యం చేయకుండా, తక్షణమే ప్రారంభించాలి. ఈ చికిత్సలో మరణశాతం అత్య ల్పం గా 0.5%లోపే ఉంది. మరణించిన వారంతా వృద్ధులే కావడం గమనార్హం. చాలా కేసుల్లో వైరస్ వృద్ధిని ఈ కాంబినేషన్ సమర్థవంతంగా నిలువరించింది’ అని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. చాలామంది డాక్టర్లు ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్– అజిత్రోమైసిన్ కాంబినేషన్ కోవిడ్–19పై సమర్థవంతంగా పనిచేస్తోందని భావిస్తున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. అయితే, ఈ విషయాన్ని నిర్ధారించే క్లినికల్ ట్రయల్ ఒకటి మాత్రమే జరిగింది. అదీ కూడా స్వల్ప శాంపిల్‌తో మాత్రమే. ఎక్కువ శాంపిల్స్‌తో ఫ్రాన్స్‌లో ఈ స్టడీ జరగడం విశేషం. అధ్యయనం వివరాలు ఈ స్టడీ వివరాలను మార్సిలీ(ఫ్రాన్స్)లోని ‘ఐహెచ్‌యూ, మెడిటెరేన్ ఇన్ఫెక్షన్’ సంస్థ వెల్లడించింది. ‘మార్చి 3– ఏప్రిల్ 9 మధ్య 38,617 మంది పేషెంట్ల నుంచి 59, 655 శాంపిల్స్‌ను పీసీఆర్ సేకరించింది. ఆ పేషెంట్లలో కరోనా పాజిటివ్‌గా తేలిన 3,185 మంది పేషెంట్లలో 1,061 మంది మా అధ్యయనానికి సరిపోయారు. వారి సగటు వయసు 43.6 ఏళ్లు. వారిలో పురుషులు 492 మంది. వారికి హైడ్రాక్సీక్లోరోక్విన్– అజిథ్రోమైసిన్ కాంబినేషన్‌తో చికిత్స జరిపి, ఈ అధ్యయనాన్ని రూపొందించాం’ అని వివరించింది. -
బోటు మునక : 64 మంది మృతి
రోమ్ (ఇటలీ) : అక్రమంగా యూరప్‌లోకి ప్రవేశించాలకున్న ఓ బోటు ప్రమాదవశాత్తు మధ్యదరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 64 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్టులు వస్తున్నాయి. మృతులు అందరూ ఆఫ్రికా ఖండానికి చెందిన లిబియా దేశం నుంచి యూరప్‌లోకి ప్రవేశించేందుకు మధ్యదరా సముద్రంలోకి ప్రవేశించినట్లు తెలిసింది. మునిగిపోతున్న పడవను గమనించిన ఇటలీ కోస్ట్ గార్డు 86 మందిని రక్షించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. చిన్న బోటులో 150 మందికి పైగా ప్రయాణించడంతోనే ప్రమాదం జరిగిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది. మధ్యదరా సంద్రంలోకి ప్రవేశించిన ఎనిమిది గంటల తర్వాత బోటుకు చిల్లుపడినట్లు వెల్లడించింది. పడవలోని వారందరూ ఓ వైపునకు వెళ్లారని చెప్పింది. దీంతో బ్యాలెన్స్ కోల్పోయిన బోటు తిరబడిందని పేర్కొంది. -
పాపం.. పసివాడు
పొట్టకూటి కోసం దేశం విడిచి, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని యూరప్‌కు శరణార్థులుగా వెళ్లే ఆఫ్రికా దేశాల ప్రజలకు మధ్యధరా సముద్రం ఓ మృత్యుకూపం వంటిది. సురక్షితం కాని పడవల్లో, విధిలేని పరిస్థితుల్లో సామర్థ్యానికి మించి పడవల్లో ప్రయాణిస్తూ మధ్యధరా సముద్రంలో ప్రమాదంలో చిక్కుకుని వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గతవారం మధ్యధరా సముద్రంలో పడవ మునిగిపోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. గల్లంతయిన వారి ఆచూకీ కనుగొనేందుకు రంగంలోకి దిగిన జర్మనీ సహాయక బృందం లిబియా తీరంలో గత శుక్రవారం ఓ చిన్నారి మృతదేహాన్ని వెలికితీసింది. పాపం.. ఆ చిన్నారి వయసు ఏడాది కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. ముద్దుగా, బొద్దుగా కనిపిస్తున్న ఆ చిన్నారి నిద్రపోతున్నట్టుగా ఉంది. సముద్రంలో పడవపై జర్మన్ సహాయక బృందం సభ్యుడు ఎత్తుకున్న ఈ చిన్నారి మృతదేహం ఫొటో విదారకంగా ఉంది. ఆఫ్రికా దేశాల నుంచి తరలివచ్చే శరణార్థుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకునేలా, వారి దయనీయ స్థితిని యూరప్ దేశాల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ ఫొటోను విడుదల చేశారు. జర్మనీకి చెందిన మానవతావాద సంస్థ సీ వాచ్ ఓ మీడియా ప్రొడక్షన్ కంపెనీ ద్వారా ఈ ఫొటోలను పంపిణీ చేసింది. సముద్రం నీళ్లలో ఓ బొమ్మలాగా ఈ చిన్నారి శరీరం కనిపించిందని సహాయక బృందం సభ్యుడు వెల్లడించాడు. చిన్నారి ప్రాణాలతో ఉంటుందనే ఆశతో చేతుల్లోకి తీసుకుని గాలి, సూర్యరశ్మి తగిలేలా ఉంచానని, అయితే శాశ్వతంగా కళ్లు మూసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఈ చిన్నారి తల్లిదండ్రులు ఎవరన్న విషయం తెలియరాలేదు. ఈ మృతదేహాన్ని ఇటలీ నేవీ సిబ్బందికి అప్పగించారు. మరణించిన చిన్నారి పాప లేక బాలుడా అన్న విషయాన్ని వెల్లడించలేదు. సహాయక బృందాలు మరో 25 మృతదేహాలను వెలికితీసి ఇటలీ నేవీ సిబ్బందికి అప్పగించారు. ఇటలీ నేవీ సిబ్బంది మొత్తం 45 మృతదేహాలను రెగీయో కాలబ్రియా రేవుకు తరలించింది. గతేడాది సిరియా నుంచి శరణార్థులుగా యూరప్‌కు వలస వెళ్తూ సముద్రంలో పడవ మునిగిపోవడంతో మూడేళ్ల బాలుడు ఆయ్లాన్ ప్రాణాలు కోల్పోయి.. ఆ బాలుడి మృతదేహం టర్కీ బీచ్‌కు కొట్టుకువచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ ఫొటో ప్రపంచాన్ని కలచివేసింది. లక్షలాది మంది ప్రజల హృదయాలను కదిలించింది. 2014 నుంచి మధ్యధరా సముద్రంలో 8 వేలమందికిపైగా శరణార్థులు ప్రాణాలు కోల్పోయారు. -
పేలుడు వల్లే ఈజిప్ట్ విమానం కూలిందా?
కైరో: మధ్యధరా సముద్రంలో కుప్పకూలిన ఈజిప్టుఎయిర్ విమానం పేలుడు వల్లే కూలిందా..? దీనికి అవుననే అంటున్నారు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల ఆనవాళ్లను పరీక్షించిన ఫోరెన్సిక్ నిఫుణులు. సముంద్రం నుంచి స్వాధీనం చేసుకున్న మృతదేహాల ఆనవాళ్లను పరీక్షిస్తే ప్రమాదానికి పేలుడే కారణమని తెలుస్తోందని ఈజిప్టు ఫోరెన్సిక్ అధికారి ఒకరు పేర్కొన్నారు. గత వారం ఈజిప్టు ఎయిర్‌కు చెందిన విమానం పారిస్ నుంచి కైరోకు వస్తుండగా సముద్రంలో కుప్పకూలడంతో 66 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈజిప్టు దర్యాప్తు బృందంలో సభ్యుడైన ఫోరెన్సిక్ నిఫుణుడు మృతదేహాల ఆనవాళ్లను పరీక్షించారు. ఘటనా స్థలం నుంచి 80 శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారని, ఇవన్నీ చాలా చిన్నచిన్నగా ఉన్నాయని, పెద్ద భాగం ఒక్కటి కూడా లేదని, దీని వల్లే విమానంలో పేలుడు సంభవించినట్టుగా భావిస్తున్నామని చెప్పారు. అయితే పేలుడుకు కారణం ఏమిటనే దాని గురించి ఇప్పుడు చెప్పలేనన్నారు. మరోవైపు ఈజిప్టు అధికారులు దీనిపై స్పందిస్తూ.. పేలుడుకు ఉగ్రవాద చర్య కారణం కావచ్చని, సాంకేతిక సమస్య కారణం కాకపోవచ్చని పేర్కొన్నారు. అయితే కొందరు ఏవియేషన్ నిఫుణులు మాత్రం బాంబు పేలుడు లేదా కాక్‌పిట్‌లో ప్రమాదం పేలుడుకు కారణం కావచ్చిన విశ్లేషిస్తున్నారు. -
70 మంది జలసమాధి
రోమ్: ఇటలీలో పడవ ప్రమాదం చోటుచేసుకొని 70 మంది జలసమాధి అయినట్లు తెలుస్తోంది. మెడిటెర్రానియన్ సముద్రంలో ఈ రోజు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇటలీ తీర ప్రాంత అధికారులు తెలిపిన ప్రకారం 100 మందికి పైగా వలసదారులతో వస్తున్న ఓ నౌక లిబియా సముద్ర జలాల్లో ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఓ శాటిలైట్ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఆధారంగా ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతానికి వెళ్లిన సహాయక సిబ్బంది 26మందిని మాత్రం రక్షించగలిగారు. రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి. 70మంది గల్లంతయ్యారు. సాధారణంగా ఇలాంటి పడవ 100మందికంటే తక్కువమందితో అస్సలు ప్రయాణించదని.. ఓ 30మంది కనిపించినందున మిగితా వారంతా జలసమాధి అయినట్లు భావిస్తున్నామని ఇటలీ తీర ప్రాంత అధికారులు తెలిపారు. -
గ్రీకులో భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదు
ఏథెన్స్ : గ్రీకు పశ్చిమ భాగంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైందని గ్రీకు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. లెఫ్కడ ద్వీపంలో భూప్రకంపనలు సంభవించాయి. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందా లేదా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. భూకంప కేంద్రం మధ్యధరాసముద్రంలో ఏర్పడి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
సముద్రంలో ప్రమాదం: 40 మంది మృతి
రోమ్ : మెడిటేరియన్ సముద్రంలో ఓ నౌక శనివారం మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 40 మంది మరణించారని ఇటాలియన్ నేవికి చెందిన ఉన్నతాధికారులు రోమ్‌లో వెల్లడించారు. పలువురిని రక్షించినట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే సదరు నౌక మునగ లేదు కానీ నౌకకు ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. దాదాపు 400 మంది శరణార్థులతో వెళ్తున్న ఈ నౌకకు లిబియా తీరంలో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు అందవలసి ఉంది.