కోవిడ్‌ చికిత్సకు హెచ్‌సీక్యూ–ఐజీ | HCQ-IG for covid treatment | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ చికిత్సకు హెచ్‌సీక్యూ–ఐజీ

Published Sat, Apr 11 2020 4:34 AM | Last Updated on Sat, Apr 11 2020 4:37 AM

HCQ-IG for covid treatment - Sakshi

పారిస్‌: కోవిడ్‌–19 చికిత్సలో ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్‌– అజిథ్రోమైసిన్‌’(హెచ్‌సీక్యూ–ఐజీ) కాంబినేషన్‌ ఎలాంటి సానుకూల ఫలితాలు సాధించిందనే వివరాలను వెల్లడించే అధ్యయనం ఒకటి ఫ్రాన్స్‌లో తాజాగా తెరపైకి వచ్చింది. మార్సిలీలోని ఐహెచ్‌యూ, మెడిటెరేన్‌ ఇన్‌ఫెక్షన్‌ కేంద్రంలో ఈ అధ్యయనాన్ని మార్చి– ఏప్రిల్‌ మధ్య నిర్వహించారు. 1061 కరోనా పాజిటివ్‌ పేషెంట్లకు కనీసం మూడు రోజుల పాటు ‘హెచ్‌సీక్యూ–ఐజీ’ ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. వీరిలో 973(91.7%) మంది పది రోజుల్లో ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు.

46(4.6%) మంది పేషెంట్లపై ఈ చికిత్స సరైన ఫలితాలనివ్వలేదు. 10 మంది పేషెంట్లను ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది. వారిలో ఐదుగురు(0.47%) మరణించారు. ఈ ఐదుగురు కూడా 74 నుంచి 95 ఏళ్ల మధ్య వయసువారే కావడం గమనార్హం. 32 మంది పేషెంట్లకు 10 రోజులకు మించి ఆసుపత్రిలో చికిత్స అందించాల్సి వచ్చింది. ఈ చికిత్స పొందిన వారిలో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించలేదు. ఈ అధ్యయన ఫలితాలు కోవిడ్‌–19 చికిత్సలో హెచ్‌సీక్యూ–ఐజీ మెరుగైన ఫలితాలను సాధిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. ‘హెచ్‌సీక్యూ–ఐజీ కాంబినేషన్‌ కోవిడ్‌–19కు సమర్థవంతమైన, సురక్షితమైన చికిత్స. ఈ చికిత్సను కోవిడ్‌–19 నిర్ధారణ కాగానే, ఆలస్యం చేయకుండా, తక్షణమే ప్రారంభించాలి.

ఈ చికిత్సలో మరణశాతం అత్య ల్పం గా 0.5%లోపే ఉంది. మరణించిన వారంతా వృద్ధులే కావడం గమనార్హం. చాలా కేసుల్లో వైరస్‌ వృద్ధిని ఈ కాంబినేషన్‌ సమర్థవంతంగా నిలువరించింది’ అని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. చాలామంది డాక్టర్లు ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌– అజిత్రోమైసిన్‌ కాంబినేషన్‌ కోవిడ్‌–19పై  సమర్థవంతంగా పనిచేస్తోందని భావిస్తున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. అయితే, ఈ విషయాన్ని నిర్ధారించే క్లినికల్‌ ట్రయల్‌ ఒకటి మాత్రమే జరిగింది. అదీ కూడా స్వల్ప శాంపిల్‌తో మాత్రమే. ఎక్కువ శాంపిల్స్‌తో ఫ్రాన్స్‌లో ఈ స్టడీ జరగడం విశేషం.  

అధ్యయనం వివరాలు
ఈ స్టడీ వివరాలను మార్సిలీ(ఫ్రాన్స్‌)లోని ‘ఐహెచ్‌యూ, మెడిటెరేన్‌ ఇన్‌ఫెక్షన్‌’ సంస్థ వెల్లడించింది. ‘మార్చి 3– ఏప్రిల్‌ 9 మధ్య 38,617 మంది పేషెంట్ల నుంచి 59, 655 శాంపిల్స్‌ను పీసీఆర్‌ సేకరించింది. ఆ పేషెంట్లలో కరోనా పాజిటివ్‌గా తేలిన 3,185 మంది పేషెంట్లలో 1,061 మంది మా అధ్యయనానికి సరిపోయారు. వారి సగటు వయసు 43.6 ఏళ్లు. వారిలో పురుషులు 492 మంది. వారికి హైడ్రాక్సీక్లోరోక్విన్‌– అజిథ్రోమైసిన్‌ కాంబినేషన్‌తో చికిత్స జరిపి, ఈ అధ్యయనాన్ని రూపొందించాం’ అని వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement