రోమ్ (ఇటలీ) : అక్రమంగా యూరప్‌లోకి ప్రవేశించాలకున్న ఓ బోటు ప్రమాదవశాత్తు మధ్యదరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 64 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్టులు వస్తున్నాయి. మృతులు అందరూ ఆఫ్రికా ఖండానికి చెందిన లిబియా దేశం నుంచి యూరప్‌లోకి ప్రవేశించేందుకు మధ్యదరా సముద్రంలోకి ప్రవేశించినట్లు తెలిసింది.
మునిగిపోతున్న పడవను గమనించిన ఇటలీ కోస్ట్ గార్డు 86 మందిని రక్షించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. చిన్న బోటులో 150 మందికి పైగా ప్రయాణించడంతోనే ప్రమాదం జరిగిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది.
మధ్యదరా సంద్రంలోకి ప్రవేశించిన ఎనిమిది గంటల తర్వాత బోటుకు చిల్లుపడినట్లు వెల్లడించింది. పడవలోని వారందరూ ఓ వైపునకు వెళ్లారని చెప్పింది. దీంతో బ్యాలెన్స్ కోల్పోయిన బోటు తిరబడిందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment