Coast Guard
-
కోస్ట్‌గార్డ్ రైజింగ్ డే బైక్ ర్యాలీ ప్రారంభం
సింథియా: ఇండియన్ కోస్ట్‌గార్డ్ 49వ రైజింగ్ డే వేడుకల్లో భాగంగా మంగళవారం భారీ బైక్ ర్యాలీని కోస్ట్‌గార్డ్ సిబ్బంది చేపట్టారు. విశాఖపట్నం నుంచి ప్రారంభమై చెన్నై వరకు సాగనున్న ఈ ర్యాలీకి అడిషనల్ డైరెక్టర్ జనరల్ డానీ మైఖేల్, పీటీఎం, టీఎం(జీ) కోస్ట్‌గార్డ్ కమాండర్ జెండా ఊపి ప్రారంభించారు.49 మంది కోస్ట్‌గార్డ్ సిబ్బందితో ఈ బైక్ ర్యాలీ విశాఖలో ప్రారంభమై సుమారు 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఫిబ్రవరి 1న చెన్నైలోని ట్యూటికోరిన్ మెరైన్ బీచ్ వద్ద ముగుస్తుందని నేవీ వర్గాలు తెలిపాయి. ఏపీలో సుమారు 850 కిలోమీటర్ల ప్రయాణంలో కాకినాడ, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్ట్‌లను సందర్శించి రైజింగ్ డేపై అవగాహనతో పాటు రహదారి, సముద్ర భద్రత, రక్షణ విషయాలపై అవగాహన కలిగించనున్నారు. ఈ మోటారు బైక్ ర్యాలీని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. -
కల్లోల కడలి మధ్యలో.. పాపం పసివాడు!
లైఫ్ ఆఫ్ పై సినిమా గుర్తుందా? ఓ బాలుడు పులితో పాటు చిన్న పడవపై సముద్రంలో చిక్కుకుపోతాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి పెద్ద సాహసమే చేస్తాడు. పులి, పడవ లేవు గానీ హవాయి దీవుల్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 17 ఏళ్ల బాలుడు సముద్రంలో చిక్కుకుపోయాడు. చిన్న కయాక్ ఆసరాతో 12 గంటలపాటు ప్రాణాలు కాపాడుకున్నాడు. అతని పేరు కహియావ్. హైస్కూల్ కయాకింగ్ బృందంలో సభ్యుడు. హవాయి దీవుల్లోని వై బోట్ హార్బర్ నుంచి డైమండ్ హెడ్ దాకా మిత్రులతో కలిసి కయాకింగ్ చేశాడు. తిరుగు ప్రయాణంలో కనిపించకుండాపోయాడు. దాంతో సహచరులు అత్యవసర సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే హోనోలులు అగ్నిమాపక శాఖ, అమెరికా కోస్ట్ గార్డ్ సహా 50 మందికి పైగా సిబ్బంది పడవలు, విమానాలతో గాలింపు చేపట్టారు.ఏం జరిగిందంటే... ఇంతకీ జరిగిందేమిటంటే కహియావ్ సముద్రంలో ప్రాక్టీస్ చేస్తూ ప్రమాదవశాత్తు సర్ఫ్ స్కీ నుంచి కింద పడ్డాడు. దాంతో అది కాస్తా మునిగిపోయింది. చూస్తే తనకు లైఫ్ జాకెట్ కూడా లేదు. అలలేమో ఈడ్చి కొడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మరోవైపేమో చీకటి పడుతోంది. కష్టమ్మీద ఈదుతూ ఎలాగోలా తన 20 అడుగుల సర్ఫ్ స్కీ కయాక్‌ను అందుకోగలిగాడు. అయితే ఎటు చూసినా సముద్రం. కటిక చీకటి. కాసేపు కయాక్ మీదే పడుకుంటూ, మరికాసేపు దాని ఆసరాతో నీళ్లలో ఈదుతూ గడిపాడు. సమయం గడుస్తున్న కొద్దీ అతనిలో ఆశలూ సన్నగిల్లుతూ వచ్చాయి. సరిగ్గా అప్పుడే దూరంగా పడవలు కనిపించాయి. కాపాడాలంటూ కేకలు వేసినా దురదృష్టవశాత్తూ వారికి వినిపించలేదు. దాంతో అవి దూరంగా వెళ్లి కనుమరుగయ్యాయి. ఒకానొక దశలో ఇక ఈదలేనని నిర్ధారించుకున్నాడు. ఏదేమైనా సరే ప్రశాంతంగా ఉండాలని, అలల వేగం తగ్గగానే వీలైనంతగా ఈదాలని నిర్ణయించుకున్నాడు. ఎవరో ఒకరు తనను కనిపెట్టేదాకా ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నాడు. గుండె నిబ్బరంతో కొన్ని గంటలపాటు గడిపాడు. చదవండి: బండరాళ్ల తలకిందులుగా ఇరుక్కున్న మహిళ.. ఏం జరిగింది?ఇక తెల్లారుతుందనగా సముద్ర జలాలపై హెలికాప్టర్ల చప్పుడు విని కహియావ్కు ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చింది. కయాక్ సాయంతో సముద్రంలో తేలియాడుతున్న బాలుడిని అమెరికా కోస్ట్ గార్డ్ విమాన సిబ్బంది ఎట్టకేలకు గుర్తించారు. అప్పటికే వెదుకులాటలో ఉన్న కోస్ట్‌గార్డు సిబ్బందికి సమాచారమివ్వడంతో వారొచ్చి కాపాడారు. అలా 8 గంటల ఆపరేషన్ చివరికి సుఖాంతమైంది. ఒంటికి గాయాలతో అతి చల్లని వాతావరణంలో గంటల కొద్దీ గడిపిన అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.జీవితాంతం గుర్తుంచుకుంటా తన భయానక అనుభవాన్ని కహియావ్ మీడియాతో పంచుకున్నాడు. ‘‘నాకు ఏమవుతుందనే బాధ కంటే నా గురించి అమ్మ ఎంత ఆందోళన చెందుతుందోనని ఆవేదన చెందా. బయటపడతానని అనుకోలేదు. ఇదో గొప్ప అనుభవం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొగలననే ధైర్యాన్నిచ్చింది. కయాకింగ్ కొనసాగిస్తా. ఈ అనుభవాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటా’’ అని చెప్పుకొచ్చాడు. బాలునిది మామూలు ధైర్యం కాదని కోస్ట్ గార్డ్ సిబ్బంది అన్నారు. ‘‘అంతటి బలమైన గాలులు, కల్లోలంలో అత్యంత శిక్షణ పొందిన మాకే సముద్రంలో చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది చిన్న కయాక్ సాయంతో 17 ఏళ్ల బాలుడు అంత ధైర్యంగా గడపడం గొప్ప విషయం’’ అంటూ మెచ్చుకున్నారు. -
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
కొచ్చి: ఇరాన్లో చేపలుపట్టే పని చేసేందుకు వెళ్లిన భారతీయులను యజమాని వేధించాడు. సరైన జీవన సౌకర్యాలు కల్పించలేదు. దీంతో యజమాని సయ్యద్ అన్సారీ నుంచి తప్పించుకోవాలని ఆరుగురు కన్యాకుమారికి చెందిన మత్స్యకారులు డిసైడయ్యారు.ఇంకేముంది చేపలు పట్టేందుకు యజమాని ఇచ్చిన బోట్లోనే ఇరాన్ నుంచి పారిపోయి సముద్రంలో ప్రయాణించి భారత్‌లోని కొచ్చి తీరాని వచ్చారు. కొచ్చి తీరానికి వీరి బోట్ చేరుకున్న వెంటనే తీరంలోకి కోస్ట్‌గార్డ్ గుర్తించి అడ్డుకున్నారు. ఆరా తీస్తే ఇరాన్ యజమాని తమను మోసం చేశాడని,అందుకే పారిపోయి వచ్చామని మత్స్యకారులు చెప్పారు. -
విశాఖ: గల్లంతైన మత్స్యకారులు సేఫ్..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ తెలిసింది. అప్పికొండ ప్రాంతంలో మత్స్యకారులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కాగా, అలల ధాటికి బోటు మునిగిపోవడంతో వారంతా అక్కడ ఉన్నట్టు తెలిసింది. వివరాల ప్రకారం.. సోమవారం వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ తెలియడంతో వారి కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు క్షేమంగా అప్పికొండ ప్రాంతంలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కాగా, సముద్రపు అలల ధాటికి వారు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. ఈ క్రమంలో బోటు దెబ్బతినడంతో బోటుపై భాగంలోనే వారు ఆరుగురు ఉండిపోయారు. నిన్న రాత్రంతా వారు సముద్రంలోనే ఉండిపోయారు. అనంతరం, అప్పికొండ తీరానికి చేరుకోగానే గంగపుత్రులు అధికారులకు సమాచారం అందించారు. వారంతా క్షేమంగానే ఉన్నట్టు చెప్పారు. వీరిలో కారి చిన్నారావు (45), కారి నరేంద్ర(18), మైలపల్లి మహేష్ (18), వాసుపల్లి అప్పన్న (35), కారి చినసత్తెయ్య (55), వాసుపల్లి పొడుగు అప్పన్న(32) ఉన్నారు. ఇక, వీరు గల్లంతైన నేపథ్యంలో కోస్టుగార్డుకు చెందిన రెండు నౌకలు, నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ గాలింపు చర్యలు చేపట్టాయి. -
CG Case: కేంద్రానికి సుప్రీం కోర్టు అల్టిమేటం!
న్యూఢిల్లీ: కోస్ట్‌గార్డుకు చెందిన మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌లో చోటు కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. శాశ్వత కమిషన్‌లో చోటు కల్పించాలనే విషయంలో మహిళా అధికారుల అభ్యర్థనను వదిలిపెట్టలేమని మంగళవారం సుప్రీంకోర్టు పేర్కొంది. కోస్ట్‌గార్డుకు చెందిన మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌లో చోటు కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. కోస్ట్ గార్డుకు చెందిన మహిళా అధికారులకు సంబంధించిన శాశ్వత కమిషన్‌ను ఇప్పటికీ ఎందుకు ఏర్పాటు చేయటం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. మీకు(కేంద్ర ప్రభుత్వం) ఏర్పాటు చేయటం చేతకాకపోతే చెప్పండి.. మేం ఏర్పాటు చేస్తాం అని పేర్కొన్నారు. కావున త్వరగా శాశ్వత కమిషన్‌లో మహిళా కోస్ట్ గార్డు అధికారులకు చోటు కల్పించాలని చీఫ్ జస్టిస్.. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణీని ఆదేశించారు. ఈ విషయంలో అఫిడవిట్ దాఖలు చేయవల్సిందిగా కోస్ట్‌గార్డును కోరుతామని అటార్నీ జనరల్.. సుప్రీం కోర్టుకు తెలియజేశారు. అదేవిధంగా నేవి, ఆర్మీతో పోల్చితే కోస్ట్‌గార్డు భిన్నమైనదని అటర్నీ జనరల్ సుప్రీం కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ తదుపరి విచారణను సుప్రీం కోర్టు మార్చి 1కి వాయిదా వేసింది. ఇక.. ఇండియన్ కోస్ట్‌గార్డు అధికారి ప్రియాంక త్యాగి దాఖలు చేసిన పిటిషన్‌పై ఫిబ్రవరి 19 విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘కోస్ట్ గార్డు విషయంలో మహిళా అధికారుల పట్ల ఎందుకు తేడాలు చూపుతున్నారు. మహిళా అధికారులు కోస్ట్ గార్డులో ఎందుకు ఉండకూడదు?. దేశ సరిహద్దుల్లో మహిళలు ప్రహారా కాస్తున్నప్పుడు.. సముద్ర తీరం గస్తీ కాయటంలో తప్పేంటీ?. మీరే(కేంద్ర ప్రభుత్వం) నారీ శక్తి గురించి మాట్లాడుతున్నారు.. దాన్ని ఆచరణలో చూపించండి’ అని కేంద్రాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. -
భారత్‌కు మాల్దీవుల అభ్యర్థన.. ఎందుకో తెలుసా?
మాల్దీవుల-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా భారత్ తాను ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో కూడా మాల్దీవులకు రూ.600 కోట్ల ఆర్థిక సాయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఆ మరోసటి రోజే.. తాజాగా మాల్దీవుల నుంచి భారత్‌కు ఒక అభ్యర్థన వచ్చింది. తమ దేశ సముద్ర ప్రాదేశిక జలాల్లో మూడు మత్స్యకారుల నౌకల్లో ఇండియన్ కోస్ట్‌గార్డు సిబ్బంది ప్రవేశించటంపై భారత్ నుంచి స్పష్టత ఇవ్వాలని కోరింది. శుక్రవారం రాత్రి తమ దేశ మిలిటరీ.. గురువారం విదేశి మిలిటరీ సిబ్బంది మాల్దీవుల మత్స్యకారుల నౌకల్లోకి ప్రవేశించినట్లు సమాచారం అందుకుందని.. అందులో భారత్‌కు చెందిన కోస్ట్ గార్డు సిబ్బంది ఉన్నట్లు గుర్తించినట్లు భారత్‌కు నివేదించింది. అదేవిధంగా మరో రెండు నౌకల్లో కూడా ఇండియన్ కోస్ట్‌గార్డు సిబ్బంది ప్రవేశించారని పేర్కొంది. అయితే వారు ఏం చేశారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మాల్దీవీయన్ ఎక్స్క్లూసివ్ ఎకానమిక్ జోన్లో ప్రయాణిస్తున్న మాల్దీవుల మత్స్యకారుల నౌకల్లోకి ఇండియన్ కోస్ట్ సిబ్బంది ప్రవేశించటంపై భారత్ అధికారికంగా నివేదిక అందించాలని ఈ మేరకు మాల్దీవుల విదేశీ వ్యవహారాల మంత్రి భారత్‌కు అధికారిక విజ్ఞప్తి చేసింది. సంబంధిత అధికారులతో సమన్వయం లేకుండా అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఘటనపై స్పష్టత ఇవ్వాలని ఆ దేశ స్థానిక భాషలోనే భారత్‌ను అభ్యర్థించడం గమనార్హం. ఇక.. మాల్దీవుల- భారత్ మధ్య నెలకొన్నదౌత్యపరమైన ప్రతిష్టంభన నేపథ్యంలో ఇది మొదటి దౌత్యపరమైన అభ్యర్థనగా తెలుస్తోంది. ఇక కీలకమైన హిందూ మహాసముద్రంలో భారత్, చైనా తమ వ్యూహాత్మ ప్రాధాన్యపై దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. మాల్దీవుల మంత్రులు.. లక్షద్వీప్ విషయంలో ప్రధానిమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో చైనా అనుకూల వ్యక్తిగా పేరున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జతో భారత్ దౌత్యపరమైన సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి. చదవండి: US Strikes: యూఎస్ ప్రతీకార దాడులు.. ఆరుగురు ఉగ్రవాదులు మృతి! -
అరేబియా సముద్రంలో భారత్‌కు వస్తున్న నౌకపై డ్రోన్ దాడి..
అరేబియా సముద్రం ద్వారా భారత్ వస్తున్న ఓ వాణిజ్య నౌకపై గుజరాత్ తీరంలో డ్రోన్ దాడి జరిగింది. పోరుబందర్ తీరానికి 401 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించింది. డ్రోన్ దాడి కారణంగా నౌకలోని రసాయన పదార్థాలున్న ట్యాంకర్ పేలి మంటలు చెలరేగాయి. అయితే ఆ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నౌక మాత్రం స్వల్పంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో 20 మంది భారతీయులు నౌకలో ఉన్నారు. ఈ విషయాన్ని బ్రిటన్ సముద్ర మారిటైమ్ ఎజెన్సీ అంబ్రే శనివారం పేర్కొంది. లైబేరియన్ జెండాతో ఉన్న ఈ నౌక.. ఇజ్రాయెల్‌కు చెందిన ఎంవీ కెమ్ ఫ్ల్యూటో అనే వాణిజ్య నౌక. ప్రమాదంపై సమాచారం అందుకున్న భారత నేవీ అధికారులు..‘ఐసీజీఎస్ విక్రమ్’ను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సాయం చేసేందుకు సదరు ప్రాంతంలోని అన్ని నౌకలను విక్రమ్ అలర్ట్ చేసినట్లు నేవీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం భారత కోస్ట్‌గార్డ్‌కు చెందిన గస్తీ నౌక ఐసీజీఎస్ విక్రమ్ ఘటనాస్థలానికి వెళ్లి వాణిజ్య నౌకలో మంటలను ఆర్పివేసింది. కాగా ఈ నౌక సౌదీ అరేబియా ఓడరేవు నుంచి క్రూడాయిల్‌తో మంగళూరుకు వైపు వెళుతోంది. అయితే.. ఆ నౌకపై డ్రోన్ దాడికి బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. చదవండి: Temple Vandalised: భారత్ స్ట్రాంగ్ రియాక్షన్ -
కాకినాడ తీరంలో కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్
సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ తీరంలో సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం జరిగింది. బోటులో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. కోస్ట్ గార్డ్ ఆపరేషన్‌తో 11 మంది మత్స్యకారులను కోస్ట్‌గార్డ్ సిబ్బంది కాపాడారు. -
ఫిలిప్పీన్స్ నౌకలను ఢీకొట్టిన చైనా కోస్ట్‌గార్డ్ షిప్
మనీలా: దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో ఆదివారం ఫిలిప్పీన్స్, చైనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ కోస్ట్ గార్డ్ నౌక, మిలటరీ రవాణా బోటులను చైనా కోస్ట్‌గార్డ్ షిప్, దానితోపాటే వచ్చిన చైనా నౌక ఢీకొట్టాయని ఫిలిప్పీన్స్ అధికారులు తెలిపారు. ఘటనలో తమ సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని, నౌకలకు వాటిల్లిన నష్టంపై అంచనా వేస్తున్నామన్నారు. తమ నౌకలు వేగంగా ప్రయాణించకపోయుంటే చైనా నౌకల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లేదని చెప్పారు. థామస్ షోల్ వద్ద ఉన్న ఫిలిప్పీన్స్ మెరైన్ పోస్టుకు సమీపంలో ఈ నెలలో చోటుచేసుకున్న రెండో ఘటన ఇది అని చెప్పారు. ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ నిబంధలను ఉల్లంఘిస్తూ తమ నౌకల ప్రమాదాలకు కారణమవుతోందని చైనా ఆరోపించింది. -
టైటానిక్ సబ్‌మెరైన్ విషాదం: యూఎస్ కోస్ట్‌గార్డ్ కీలక ప్రకటన
టైటానిక్ సబ్‌మెరైన్‌కు విషాదానికి సంబంధించిన అన్వేషణలోయూఎస్ కోస్ట్‌గార్డ్ కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ ప్రమాదంలో చివరి అవశేషాన్ని స్వాధీనం చేసుకున్నామని కోస్ట్ గార్డ్ వెల్లడించింది. టైటాన్ సబ్మెర్సిబుల్ నుండి మానవ అవశేషాలు భావిస్తున్నవాటితోపాటు, కొన్ని శిథిల భాగాలను సేకరించినట్టు తెలిపింది. అలాగే వీటిని వైద్య నిపుణుల విశ్లేషణ కోసం పంపింది. గత వారం వాటిని స్వాధీనం చేసుకుని కోస్ట్ గార్డ్ అధికారులు యుఎస్ ఓడరేవుకు తరలించినట్లు బీబీసీ రిపోర్ట్ చేసింది. అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ శిధిలాల అన్వేషణకు వెళ్లి మార్గమధ్యలో సబ్‌మెరైన్ పేలిపోయిన ఘటన విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఇప్పటికే కొన్నింటిని సేకరించగా మిగిలిన శిధిలాల చివరి భాగాలను యూఎస్ కోస్ట్ గార్డ్ తాజాగా గుర్తించింది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఓషన్ ఆపరేటర్ అయిన Ocean Gate అప్పటినుండి వ్యాపారాన్ని నిలిపివేసింది. ఈ ఏడాది జూన్ 18న ఉత్తర అట్లాంటిక్ జలాల్లోకి ప్రవేశించినప్పుడు జరిగిన పేలుడులో మరణించిన వారిలో సబ్మెర్సిబుల్ పైలట్, కంపెనీ సీఈవో స్టాక్టన్ రష్ కూడా ఉన్నారు. మిగిలిన నలుగురు ప్రయాణికుల్లో బ్రిటిష్-పాకిస్తానీ వ్యాపారవేత్త షాజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్, బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, పాల్-హెన్రీ నార్గోలెట్, మాజీ ఫ్రెంచ్ నౌకాదళ డైవర్ ఉన్నారు.ఈ విషాదంపై ప్రపంచ వ్యాప్త విచారణ కొనసాగుతోంది. కాగా 1912లో టైటినిక్ షిప్‌ను మొదటిసారిగా ప్రవేశపెట్టినపుడు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయాణనౌకగా పేరు గాంచింది. అయితే ఇంగ్లాండ్‌లోని సౌత్‌హాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు బయలుదేరిన తొలి ప్రయాణంలోనే 1912 ఏప్రిల్ 14న ప్రమాదవశాత్తూ ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయిన ఘటనలో 1517 మంది మృత్యువాత పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదంపై 1997లో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శక నిర్మాత జేమ్స్ కామెరూన్ తీసిన‘ టైటానిక్’ సినిమా భారీ హిట్ అందుకుంది. -
నడి సముద్రంలో చిక్కుకున్న తమిళనాడు మత్స్యకారులు
-
మత్స్యకారులకు తప్పిన పెను ముప్పు
రణస్థలం: చేపల వేట కోసం గుజరాత్‌లోని వీరావల్ తీర ప్రాంతానికి వెళ్లిన రాష్ట్రానికి చెందిన మత్స్యకారులకు పెను ముప్పు తప్పింది. వేట కోసం తీరం నుంచి సముద్రంలోకి ఐదు కిలో మీటర్ల దూరం వెళ్లిన వారి పడవ ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. తోటి మత్స్యకారులు, కోస్ట్‌గార్డ్ సిబ్బంది సకాలంలో స్పందించి పడవలో ఉన్న ఎనిమిది మంది మత్స్యకారులను రక్షించారు. రణస్థలం మత్స్యశాఖ అధికారి గంగాధర్, జీరుపాలెం సర్పంచ్ ఎం.రాముడు తెలిపిన వివరాల ప్రకారం... గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్ ప్రాంతానికి వేట కోసం రాష్ట్రం నుంచి మత్స్యకారులు బృందాలుగా ఏర్పడి వెళుతుంటారు. సుమారు మూడు నెలలు అక్కడ వేట సాగించి తర్వాత స్వగ్రామాలకు వస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం వీరావల్ తీర ప్రాంతంలో ఉంటున్న రణస్థలం మండలంలోని జీరుపాలెం గ్రామానికి చెందిన కేశం కొర్లయ్య (పడవ డ్రైవర్), కేశం పండువాడు, సూరాడ చిన్న, అంబటి రాముడు, పుక్కల్ల అసిరయ్య, ఎచ్చెర్ల మండలం బడివానిపేట గ్రామానికి చెందిన బడి తోటయ్య, కాకినాడకు చెందిన టి.వీరబాబు, విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస బర్రి అప్పన్న వేట కోసం పడవలో గురువారం తెల్లవారుజామున సముద్రంలోకి వెళ్లారు. తీరం నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్లాక బోటు సైడ్లు విరిగిపోయాయి. అనంతరం ఇంజిన్ పాడైపోయింది. క్రమంగా పడవ మునిగిపోతోంది. దీంతో ప్రమాదం గురించి పడవ డ్రైవర్ కేశం కొర్లయ్య తమతోపాటు మరో రెండు పడవల్లో సముద్రంలో వేట సాగిస్తున్న జీరుపాలెం గ్రామానికి చెందిన కేశం అప్పన్న, అమ్మోరు, మైలపల్లి పెద్దయ్యతోపాటు ఇండియన్ కోస్ట్ గార్డు సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. జీరుపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎనిమిది మందిని కాపాడారు. మునిగిపోతున్న పడవలో ఉన్నవారిని తాడు సాయంతో తమ పడవల్లోకి తీసుకువచ్చి రక్షించారు. అదే సమయంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో ప్రమాద స్థలాన్ని గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు. మత్స్యకారులు అందరూ గురువారం సాయంత్రానికి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వారి స్వగ్రామాల్లోని కుటుంబ సభ్యులు, బంధువులు ఊపిరిపీల్చుకున్నారు. -
24 ఏళ్లయ్యింది.. ఇకనైనా తొలగించండి ప్లీజ్..
బీజింగ్: 1999లో చైనా ద్వీప తీరమైన రెనై రీఫ్ కు వచ్చిన ఫిలిప్పీన్స్ యుద్ధనౌక అప్పటి నుండి అక్కడే నిలిచిపోవడంతో అది శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం మనీలా యుద్ధనౌకను మళ్ళీ మరమ్మతులు చేసి పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుండగా దయచేసి దానిని అక్కడి నుంచి తొలగించమని అభ్యర్ధించింది చైనా. చైనా అధికార ప్రతినిధి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ చట్టాలను అతిక్రమిస్తోందని, ఇప్పటికే ASEAN దేశాలు సంయుక్తంగా నిర్దేశించుకున్న నిబంధనలను ఉల్లంఘించిందని అన్నారు. ఫిలిపీన్స్ కోస్ట్ గార్డ్ బృందం యుద్ధ నౌకలో యధాతధంగా కార్యకలాపాలను కొనసాగిస్తోందని దీని వలన శతృ దేశాలకు నీటి మార్గంలో తమను టార్గెట్ చేయడం సులువయ్యే అవకాశముందన్నది అభిప్రాయపడ్డారు. గడిచిన 24 ఏళ్లలో చైనా అనేకమార్లు ఓడను తొలగించమని ఫిలిప్పీన్స్ ను అభ్యర్ధించగా ఫిలిప్పీన్స్ తీర దళాలు తొలగిస్తామని చెబుతూ కాలాన్ని నెట్టుకుంటూ వచ్చాయి. ఇక ఇప్పుడైతే నౌకకు మరమ్మతులు చేసి చైనా తీరంలోనే పాతుకుపోయే ప్రయత్నం చేస్తోందని చైనా తీర దళాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా చైనా కోస్ట్ గార్డ్ బృందం కూడా నిబంధనలను ఉల్లంఘించి ఫిలిపీన్స్ కోస్ట్ గార్డ్ వైపుగా ఒక నౌకను తరలించింది. అది తప్పు కాదా అంటూ ఎదురు ప్రశ్నించింది ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో ఫిలిప్పీన్స్ తీరానికి చేరువగా వస్తోన్న చైనా ఓడ ఫోటోను కూడా పోస్ట్ చేసింది. అంతే కాదు సెకండ్ థామస్ షోల్ వద్ద చైనా అక్రమాలపై 2020 నుంచి ఇప్పటివరకు 400 సార్లకు పైగా మేము మా నిరసన తెలుపుతూనే ఉన్నామని గుర్తుచేసింది ఫిలిప్పీన్స్ విదేశాంగ శాఖ. In China's own words: how it occupied Mischief Reef w/ a few small huts in 1995, then upgraded it to a large building with helipads, guns in 1999. This is why the Philippines placed BRP Sierra Madre on Second Thomas (Ayungin) Shoal to stand watch in 1999. pic.twitter.com/QiyagaetKj — Jay L Batongbacal (@JayBatongbacal) August 8, 2023 ఇది కూడా చదవండి: పురుగులున్న చీకటి గదిలో ఉంచారు, జీవితాంతం జైల్లోనే ఉంటా: ఇమ్రాన్ ఖాన్ -
ఇటలీ తీరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి
మిలాన్: ఇటలీ సముద్ర తీరానికి సమీపంలో రెండు పడవలు నీటమునిగాయి. రెండు పడవల్లో ఒకదాంట్లో 48 మంది మరో దాంట్లో 42 మంది వలసదారులు ప్రయాణిస్తున్నారని వారిలో 57 మందిని కాపాడిన ఇటలీ తీరప్రాంత రక్షణ దళాలు ఓ తల్లీ బిడ్డలను మాత్రం కాపాడలేకపోయామని గల్లంతైన మరో 30 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నామని ఇటలీ కోస్ట్ గార్డులు తెలిపారు. వయా ట్యునీషియా.. స్ఫాక్స్ బీచ్ తీరంలో గత వారం 10 మృతదేహాలను కనుగొన్నామని ట్యునీషియా పోర్టు గుండా ఇటలీకి చేరుకోవడం సులభం కాబట్టి అక్రమ వలసదారులు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నారు స్ఫాక్స్ అధికారులు. తాజాగా ఈ రెండు పడవలు కూడా ట్యునీషియా పోర్టు నుండే ఇటలీ వైపుగా వచ్చాయని అవి లంపెడుసా ద్వీపం దాటగానే ఉరుములు మెరుపులతో సముద్రంలో అలజడి రేగడంతో అలల తాకిడికి అందులో ప్రయాణిస్తున్న 90 మంది వలసదారులతో సహా పడవలు బోల్తా పడ్డాయన్నారు. కోస్ట్ గార్డుల సాహసం.. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఇటలీ తీర రక్షణ దళాలు హుటాహుటిన స్పందించి 57 మందిని రక్షించగలిగామని తెలిపారు స్ఫాక్స్ అధికారులు. కానీ ప్రమాదంలో ఓ తల్లీ బిడ్డలను మాత్రం కాపాడలేకపోయామని. వారి మృతదేహాలు మాత్రం లభ్యమయ్యాయని తెలిపారు. పడవలోని మిగిలిన 30 మంది గల్లంతు కాగా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇలా అయితే ఎలా? ఈ రెండు పడవల్లోని వలసదారులు సహారా-ఆఫ్రికా దేశాలకు చెందిన వారే అయి ఉంటారని, ఎంతగా ప్రయత్నించినా ఆఫ్రికా దేశాల నుండి ఈ అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయలేకున్నామని తెలిపారు ఇటలీ వలసల విచారణాధికారి ఇమ్మానుయేల్ రిసిఫారీ. వారాంతా మెరుగైన జీవితం కోసమే ఇటు వస్తున్నారు. అదేదో చట్టబద్దంగా వస్తే బాగుంటుంది కానీ దొడ్డిదారిన రావడం వల్లనే ఇలా ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు. డిమాండ్ ఎక్కువ.. ఎందరో వలసదారులు చనిపోతున్నారని సముద్రంలో ప్రమాదాలను నివారించడానికి నౌకలను ఏర్పాటు చేయడం కూడా అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్నట్లే ఉంది. పొరుగు దేశానికి వలసలంటే భయపడేవారు కూడా ధైర్యంగా అడుగేసి ఇటు వైపుగా కదులుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ అక్రమ వలసలు రెట్టింపయ్యాయి. 2022లో 42,600 మంది వలస వచ్చినట్లు రికార్డుల్లో నమోదు కాగా ఈ ఏడాది మాత్రం 92,000 మందికిపైగా వలస వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. Migrants rescued from rough seas off Italy. Reports say dozens could still be missing at sea, while more stranded migrants were airlifted from rocks on the island of Lampedusa. Read more: https://t.co/cJMUPoyyWL pic.twitter.com/lbXo28Rbrd — Sky News (@SkyNews) August 7, 2023 ఇది కూడా చదవండి: మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి.. -
దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు
మనీలా: దక్షిణ చైనా సముద్రంపై పెత్తనం తమదేనంటున్న డ్రాగన్ దేశం దుందుడుకు చర్యకు పాల్పడింది. వివాదాస్పద జలాల్లోని ఫిలిప్పీన్స్ కోస్ట్‌గార్డ్ ఓడపైకి చైనా కోస్ట్‌గార్డ్ షిప్ మిలటరీ గ్రేడ్ లేజర్ కిరణాలను ప్రయోగించింది. దీంతో అందులోని తమ సిబ్బందిలో కొందరికి కొద్దిసేపు కళ్లు కనిపించకుండా పోయాయి. ఈ చర్యతో చైనా తమ సార్వభౌమ హక్కులకు తీవ్ర భంగం కలిగించిందని ఫిలిప్పీన్స్ ఆరోపించింది. తమ ఓడ బీఆర్పీ మలపస్కువాను దగ్గరల్లోని రాతి దిబ్బ వైపు వెళ్లకుండా చైనా ఓడ అడ్డుకుందని తెలిపింది. ఈ క్రమంలో ప్రమాదకరంగా 137 మీటర్ల అతి సమీపానికి చేరుకుందని వివరించింది. -
భారత్ జలాల్లోకి పాక్ ఫిషింగ్ బోట్..అప్రమత్తమైన అధికారులు
భారత్ జలాల్లోకి ప్రవేశించిన పాక్ ఫిషింగ్ బోట్‌ను అధికారులు అడ్డుకున్నారు. ఈ మేరకు ఆయుధాలు, పదిమంది సిబ్బందితో వెళ్తున్న పాకిస్తాన్ ఫిషింగ్ బోట్ అల్ సోహెలీని అడ్డుకున్నట్లు భారత్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. అంతేగాదు ఆ పాకిస్తానీ బోట్‌ను అడ్డగించే ఆపరేషన్‌ను గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ లేదా ఏటీఎస్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించినట్లు భారత్ కోస్ట్ గార్డ్ ట్విట్టర్లో తెలిపింది. ఆ బోటులో సుమారు 300 కోట్ల ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తోపాటు దాదాపు 40 కిలోల మాదకద్రవ్యాలను దాచినట్లు అధికారులు గుర్తించారు. తదుపరి విచారణ కోసం బోటును ఓఖాకు తీసుకువస్తున్నట్లు కోస్ట్‌గార్డు పేర్కొంది. (చదవండి: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. కశ్మీర్లో 15 కిలోల ఐఈడీ స్వాధీనం) -
Viral Video: చూస్తుండగానే మునిగిపోయిన వందల కోట్ల 'మై సాగా'
రోమ్: వందల కోట్లు విలువచేసే ఓడ చూస్తుండగానే క్షణాల్లో మునిగిపోయింది. దక్షిణ ఇటలీ సముద్ర తీరంలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఓడలో ఉన్న 9 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు.40 మీటర్ల ఈ ఓడ పేరు 'మై సాగా'. 2007లో ఇటలీలోనే తయారు చేశారు. గల్లిపోలి నుంచి మిలాజోకు వెళ్లే క్రమంలో కెటన్‌జారో మెరీనా తీరంలో ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ముందుగా ఓడ కుడివైపు కొంత భాగం మునిగింది. ఆ తర్వాత క్షణాల్లోనే ఓడ మొత్తం సముద్రంలో మునిగిపోయింది. ఈ దృశ్యాలను ఇటలీ కోస్ట్ గార్డు సిబ్బంది రికార్డు చేశారు. Nei giorni scorsi, la #GuardiaCostiera di #Crotone ha coordinato operazioni di salvataggio di passeggeri ed equipaggio di uno yacht di 40m, affondato a 9 miglia al largo di #CatanzaroMarina. Avviata inchiesta amministrativa per individuarne le cause. #SAR #AlServizioDegliAltri pic.twitter.com/kezuiivqsM — Guardia Costiera (@guardiacostiera) August 22, 2022 అయితే టగ్బోట్తో ఓడను బయటకు తీసుకొచ్చేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నించినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించక అది సాధ్యం కాలేదు. ఓడ మునిగిపోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు విచారణకు ఆదేశించారు. చదవండి: బైడెన్ టీంలో భారత సంతతి వ్యక్తులదే హవా.. 130మందికి కీలక పదవులు -
సముద్రంపై తేలుతున్న ప్యాక్.. విప్పి చూస్తే 7 కోట్ల విలువైన..!!
$1 million worth of cocaine Found Floating on Florida Ocean: నీటిపై తేలియాడుతున్న దాదాపు 7 కోట్ల విలువైన 30 కేజీల కొకైన్‌ను అందజేసిన వ్యక్తిని పోలీసులు ప్రశంసించారు. వివరాల్లోకెళ్తే.. ఫ్లోరిడా కీస్ సమీపంలోని సముద్రంపై తేలియాడుతున్నట్లు కనుగొన్న మిలియన్ డాలర్ల విలువైన కొకైన్‌ను అందజేసిన వ్యక్తిని పోలీసులు ప్రశంసించారు. సముద్రంలో సరదాగా బోటింగ్‌కు వెళ్లిన వ్యక్తికి 30 కిలోల కంటే ఎక్కువ బరువున్న డ్రగ్స్‌ను ప్యాక్ చేసి ఉండటం గమనించాడు. వెంటనే ప్యాకేజీ గురించిన సమాచారాన్ని యూఎస్ బోర్డర్ పెట్రోల్‌కు తెలియజేశాడు. డ్రగ్స్‌ని వెలికి తీయడంలో యూఎస్ కోస్ట్ గార్డ్ సహాయం చేసింది. దీనివిలువ దాదాపు 7 కోట్లు (1 మిలియన్ డాలర్లు) ఉంటుందని అధికారులు తెలిపారు. చీఫ్ పెట్రోల్ ఏజెంట్ థామస్ జి మార్టిన్ 24 ఇటుకల రూపంలో ఉన్న కొకైన్కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ‘వారాంతంలో ఓ సహృదయుడు ఫ్లోరిడా కీస్ సమీపంలో సముద్రంలో తేలుతున్న 1 మిలియన్ డాలర్ల కొకైన్‌ను కనుగొన్నాడని రాసుకొచ్చాడు. ఐతే ఫోరిడాలో గుర్తుతెలియని వ్యక్తులు డ్రగ్స్‌ను భారీ స్థాయిలో రవాణా చేస్తూ దొరికిపోవడం కొత్తేమీ కాదు. ఈ యేడాది ప్రారంభంలో కూడా ఒక స్నార్కెల్లర్ 1.5 మిలియన్ డాలర్ల విలువైన కొకైన్‌ను కనుగొన్నాడు. మరో సంఘటనలో గత ఏడాది ఆగస్టులో ఫ్లోరిడాలోని ఓ బీచ్‌లో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి 30 బిగుతుగా చుట్టిన బ్యాగులు కనిపించాయి. చదవండి: ట్రక్ యాక్సిడెంట్.. 53 మంది దుర్మరణం Over the weekend, a Good Samaritan discovered over 1 million dollars in cocaine floating at sea near the Florida Keys. The package contained nearly 69 lbs. of cocaine. #BorderPatrol agents with support from @USCGSoutheast recovered the drugs. #breakingnews #breaking #monday pic.twitter.com/cC7EKa9lDx — Chief Patrol Agent Thomas G. Martin (@USBPChiefMIP) December 6, 2021 -
విశాఖ చేరిన 'విగ్రహ'
సాక్షి, విశాఖపట్నం: భారతతీర గస్తీ దళం అమ్ముల పొదిలో చేరిన అధునాతన నౌక విశాఖ కేంద్రంగా సేవలందించేందుకు సిద్ధమైంది. అడ్వాన్స్డ్ ఫైర్ పవర్‌తో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐసీజీఎస్ విగ్రహ నౌకని గత నెల 28న చెన్నైలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జాతికి అంకితం చేశారు. అనంతరం కోస్ట్‌గార్డు ఈస్ట్రన్ సీబోర్డు ప్రధాన స్థావరమైన విశాఖ నుంచి కార్యకలాపాలు నిర్వర్తించేందుకు శుక్రవారం ఇక్కడికి చేరుకుంది. విగ్రహ నౌకకు విశాఖలోని కోస్ట్‌గార్డ్ సిబ్బంది.. అధికారులు స్వాగతం పలికారు. కోస్ట్‌గార్డ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్, జిల్లా కమాండర్(ఏపీ) యోగిందర్ ఢాకా నేతృత్వంలోని బృందం విగ్రహ షిప్‌ని ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లోకి స్వాగతించారు. ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసల్ సిరీస్‌లో ఏడో నౌక అయిన దీనిని చెన్నైలోని ఎల్ అండ్ టీ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ సంస్థ తయారుచేసింది. 98 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు, 3.6 మీటర్ల డ్రాట్, 2,200 టన్నుల బరువుతో తయారైన విగ్రహ.. 9,100 కిలోవాట్స్ డీజిల్ సామర్థ్యం ఉన్న రెండు ఇంజిన్లతో 26 నాటికల్ మైళ్ల వేగంతో 5 వేల కి.మీ ప్రయాణించగల సామర్థ్యం సొంతం చేసుకుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాడార్లు, నేవిగేషన్, కమ్యూనికేషన్ పరికరాలు, సెన్సార్లు, సముద్ర స్థితిగతులకు అనుగుణంగా దిశ మార్చుకునే యంత్ర సామర్థ్యంతో దీనిని రూపొందించారు. రెస్క్యూ ఆపరేషన్లకు ఉపయోగపడేలా ఒక ట్విన్ ఇంజిన్ హెలికాఫ్టర్, నాలుగు హైస్పీడ్ బోట్లను తీసుకెళ్లగలదు. షిప్లో 12 మంది అధికారులు, 90 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. తొలి కమాండెంట్‌గా పీఎన్ అనూప్‌కు బాధ్యతలు అప్పగించారు. ఐసీజీఎస్ విగ్రహ చేరికతో కోస్ట్‌గార్డ్ జాబితాలో 157 నౌకలు, 66 విమానాలున్నాయి. -
తీర భద్రతకు ‘విగ్రహ’
సాక్షి, విశాఖపట్నం: భారత తీరగస్తీదళం అమ్ముల పొదిలో మరో అధునాతన నౌక చేరుతోంది. అడ్వాన్స్డ్ ఫైర్ పవర్‌తో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐసీజీఎస్ విగ్రహ నౌకను శనివారం చెన్నైలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాథ్సింగ్ జాతికి అంకితం చేయనున్నారు. ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసల్ సిరీస్‌లో ఏడో నౌక అయిన విగ్రహని చెన్నైలోని ఎల్ అండ్ టీ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. ఈ నౌక కోస్ట్‌గార్డు ఈస్ట్రన్ సీబోర్డు ప్రధాన స్థావరమైన విశాఖపట్నం నుంచి కార్యకలాపాలు నిర్వర్తించనుంది. ఐసీజీఎస్ విగ్రహ చేరడం ద్వారా కోస్ట్‌గార్డ్ జాబితాలో నౌకల సంఖ్య 157కు చేరుతుంది. కోస్ట్‌గార్డ్‌కు 66 విమానాలున్నాయి. అధునాతన సాంకేతికత విగ్రహ నౌకలో అధునాతన సాంకేతిక వసతులున్నాయి. 98 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు, 3.6 మీటర్ల డ్రాట్‌తో ఉంది. దీని బరువు 2,200 టన్నులు. 9,100 కిలోవాట్స్ డీజిల్ సామర్థ్యం ఉన్న రెండు ఇంజిన్లున్నాయి. 26 నాటికల్ మైళ్ల వేగంతో 5 వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాడార్లు, నేవిగేషన్, కమ్యూనికేషన్ పరికరాలు, సెన్సార్లు, సముద్ర స్థితిగతులకు అనుగుణంగా దిశను మార్చుకునే యంత్ర సామర్థ్యం దీని సొంతం. 40/60 బోఫోర్స్ గన్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్‌తో 12.7 మిల్లీమీటర్ల స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్లు రెండు ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్లకు ఉపయోగపడేలా ఒక ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్, నాలుగు హైస్పీడ్ బోట్లు తీసుకెళ్లగలదు. సముద్రంలో చమురుతెట్టు వంటి కాలుష్యాల నియంత్రణకు స్పందించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఈ నౌకలో ఉంది. -
పాకిస్థాన్ డ్రగ్స్‌ను పట్టుకున్న భారత్
చెన్నై: తూత్తుకుడికి దక్షిణ ప్రాంతం నుంచి శ్రీలంక వెళ్తున్న పడవ నుంచి 100 కిలోల హెరాయిన్‌తో సహా మాదకద్రవ్యాలను భారతీయ కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుంది. నిఘా వర్గాల సమాచారం మేరకు, నవంబర్ 17 నుంచి సుదీర్ఘమైన, నిరంతర ప్రయత్నాలు చేసి పట్టుకున్నామని అధికారులు బుధవారం చెప్పారు. కరాచీ నుంచి శ్రీలంకకు మాదకద్రవ్యాలను ఎగుమతి చేసి, అక్కడి నుంచి పాశ్చాత్య దేశాలకు, ఆస్ట్రేలియాకు ఎగుమతి చేస్తున్నారు. పాకిస్తాన్ జిహాద్‌తోపాటు మాదకద్రవ్యాలను కూడా ఎగుమతి చేస్తుంది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికే ఈ ఎగుమతులు చేస్తున్నారని ఒక అధికారి తెలిపారు. 99 ప్యాకెట్ల హెరాయిన్ (100 కేజీలు), 20 చిన్న బాక్సులలో సింథటిక్ డ్రగ్స్, ఐదు 9 ఎంఎం పిస్టల్స్, ఒక తురాయ సెట్‌ను ఖాళీ ఇంధన ట్యాంక్ లోపల ఉంచి ఐసిజి షిప్ ద్వారా ఎగుమతి చేస్తున్నారని మరో అధికారి తెలిపారు. పడవ కెప్టెన్‌తో సహా ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో శ్రీలంక నావికాదళం నుంచి ఒక సందేశం కూడా వచ్చిందని ఒక అధికారి తెలిపారు. ఈ పడవ శ్రీలంకకు పశ్చిమ తీరంలో ఉన్న నెగోంబోలోని అలెన్సు కుట్టిగే సిన్హా దీప్తా సాని ఫెర్నాండోకు చెందినదిగా గుర్తించారు. -
ఆగని వరదలు
న్యూఢిల్లీ/తిరువనంతపురం/బెంగళూరు/ముంబై: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో ఆయా రాష్ట్రాల్లోని వాగులు, వంకలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలు, కొండచరియలు, గోడలు విరిగిపడటం తదితర కారణాలతో ఆదివారం నాటికి కేరళలో 72 మంది చనిపోగా, మధ్యప్రదేశ్‌లో 32 మంది మహారాష్ట్రలో 35 మంది, గుజరాత్లో 31 మంది, కర్ణాటకలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 201కు చేరుకుంది. మరోవైపు సహాయ చర్యలను ముమ్మరం చేసేందుకు వీలుగా ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, కోస్ట్ గార్డ్, నేవీ బృందాలతో పాటు వాయుసేనను(ఐఏఎఫ్) హెలికాప్టర్లను కూడా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. రోడ్డుమార్గాలు ధ్వంసమైన ప్రాంతాల్లో ప్రజలకు అధికారులు హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలు, తాగునీరు అందజేస్తున్నారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపుపొందిన హంపీలోకి వరదనీరు చొచ్చుకురావడంతో అధికారులు పర్యాటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమిత్ షా ఏరియల్ సర్వే.. కర్ణాటకలో ఎడతెరిపిలేని వర్షాలు ప్రజలను భయపెడుతున్నాయి. భారీ వర్షాల కారణంగాఆదివారం నాటికి కర్ణాటకలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కర్ణాటక సీఎం యడియూరప్ప, ఇతర ముఖ్యనేతలతో కలిసి బెళగావి, బాగల్‌కోటే, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం షా స్పందిస్తూ..‘ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు. వర్షాలు కొంచెం తెరిపినిచ్చినప్పటికీ కొండచరియలు విరిగిపడే ప్రమాదముందనీ, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కేరళ సీఎం పినరయి విజయన్ సూచించారు. తన నియోజకవర్గమైన వయనాడ్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ ఓ పునరావాస కేంద్రంలోని బాధితులను పరామర్శించారు. బాధితులకు తక్షణసాయం అందించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం వివక్ష చూపుతోంది: కాంగ్రెస్ వరద ప్రభావిత రాష్ట్రాలకు సాయం విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ విమర్శించింది. పార్టీ ప్రతినిధి జైవీర్ షేర్గిల్ మాట్లాడుతూ..‘వరదలు లేకున్నా ఉత్తరప్రదేశ్‌కు రూ.200 కోట్లు కేటాయించి, వరదలతో అతలాకుతలమైన అస్సాంకు రూ.250 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గతేడాది భారీ వర్షాలు, వరదలతో కేరళకు రూ.10వేల కోట్ల ఆస్తి నష్టం జరిగితే రూ.3 వేల కోట్లు్లమాత్రమే ఇచ్చారు’ అని వ్యాఖ్యానించారు. సూపర్ పోలీస్.. సాక్షి, అమరావతి : గుజరాత్లో వరదలో చిక్కుకున్న చిన్నారులను కాపాడేందుకు ఓ పోలీస్ తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. మోర్బీ జిల్లా కల్యాణ్ పూర్ గ్రామంలోని పాఠశాలలో 43 మంది చిన్నారులు చదువుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాలతో ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఉపాధ్యాయులు, పిల్లలు అక్కడ చిక్కుకుపోయారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ వరద ఉధృతికి బోట్లు ముందుకు కదలకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కానిస్టేబుల్ పృథ్వీరాజ్ జడేజా ఇద్దరు బాలికల్ని భూజాలపై కూర్చోబెట్టుకుని నడుములోతులో ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీటిని దాటారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. -
కొస్ట్‌గార్డ్ అమ్ములపొదిలో అత్యాధునిక నౌక వీర
-
తేజస్ డిఫెన్స్ ఆకాడమీ విద్యార్థుల అద్భుత ప్రతిభ
-
కర్ణాటకలో కర్వార్‌లో ఘోర పడవ బోల్తా
-
పడవ బోల్తా; 8 మంది మృతి
బెంగళూరు: కర్ణాటకలో కర్వార్‌లో సోమవారం ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందారు. గల్లంతైన మరొకరి కోసం గాలింపు చేపట్టారు. ‘ప్రమాద సమయంలో పడవలో 26 మంది ఉన్నారు. 17 మందిని మరో పడవలో ఉన్నవారు కాపాడారు. నేవీ, కోస్ట్‌గార్డ్ సహాయంతో ఎనిమిది మృతదేహాలను వెలికితీశాం. గల్లంతైన మరొకరి కోసం గాలింపు కొనసాగుతుంది. గోవా నుంచి రప్పించిన డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ సహాయంతో సహాయక చర్యలు చేపట్టామ’ని నావికాదళం ఒక ప్రకటనలో తెలిపింది. కర్వార్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న ఆలయానికి వెళ్లి పడవలో తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తన కళ్లెదుటే ఈ దుర్ఘటన చోటే చేసుకుందని స్థానిక ప్రజాప్రతినిధి రూపాలీ నాయక్ తెలిపారు. తాము మరో పడవలో పయాణిస్తున్నట్టు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని రక్షించినట్టు వెల్లడించారు. తర్వాత నావికాదళం రంగంలోకి దిగిందన్నారు. -
కన్నీళ్లు తుడిచేదెవరు?
నిత్యం చేపల వేట హడావుడితో సందడిగా ఉండాల్సిన ఆ పల్లెల్లో ఇప్పుడు శ్మశాన వైరాగ్యం కనిపిస్తోంది. అన్ని ఇళ్లల్లోనూ నిశ్శబ్దం తాండవిస్తోంది. తమవారు ఏడున్నారో... ఎలా ఉన్నారో... ఏం తింటున్నారో... ఎప్పటికి వస్తారో... తెలీక ఆ మత్స్యకార కుటుంబాలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నాయి. కనిపించిన ప్రతీ ఒక్కరినీ కన్నీటితో వేడుకుంటున్నాయి. ఇదీ నాలుగు రోజులుగా పాకిస్తాన్ చెరలో ఇరుక్కున్న మత్స్యకార కుటుంబాల వేదన. సాక్షిప్రతినిధి, విజయనగరం: అసలేం జరుగుతోంది.. నిండు ప్రాణాలు ప్రమాదంలో పడితే కనీసం ఒక్కరంటే ఒక్కరైనా అధికారపార్టీ నేతలు నోరుమెదపడం లేదదెందుకని.? నియోజకవర్గ ప్రజలకు ఇంత కష్టం వస్తే కనీసం వారిని కలిసి ధైర్యం చెప్పడానికి కూడా అధికారపార్టీ ఎమ్మెల్యేకు మనసు రావడం లేదెందుకని? పాకిస్తాన్ చెరనుంచి మన మత్స్యకారులను విడిపిం చే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుం దో, అసలు చేస్తుందో లేదో తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం లేదెందుకని? ఎందుకంటే., జాలరి పల్లెల్లో చీకట్లు ముసిరేలా చేసింది ఈ టీడీపీ ప్రభుత్వమే కాబట్టి. వారి జీవితాలను వలస బాట పట్టించి నరక కూపాల్లోకి నెట్టేసింది వారే కాబట్టి. క్షణమొక యుగంలా:జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం మండలా లతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందినమొత్తం 20 మంది మత్స్యకారులు గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్ నుంచి చేపల వేటకు బయలుదేరి దురదృష్ట వశాత్తూ పాక్ సరిహద్దుల్లో ప్రవేశించి అక్కడి కోస్ట్‌గార్డ్ అధికారులకు చిక్కిన విషయం విదితమే. ఈ దుర్ఘటన జరిగి ఐదు రోజులు గడిచిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంత వరకూ ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. వారిని విడిపించడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి ఎలాంటి సమాచారం అధికారికంగా వెల్లడికావడం లేదు. ఈ నేపథ్యంలో తమ వారికి ఏం జరుగుతుందోనని వారి కుటుంబ సభ్యులు ఇక్కడ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ వారి కోసం క్షణమొక యుగంలా కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కాలుష్యమే కారణం తీరప్రాంత గ్రామాలను ఆనుకొని వున్న రసాయన పరిశ్రమల వ్యర్థజలాలు జీరో డిశ్చార్జ్ చేయకుండానే సముద్రంలోకి వదలడంతో మత్స్యసంపద నాశనమవుతోంది. సముద్రంలో వందల కిలో మీటర్ల దూరం వెళ్లినా మత్స్యసంపద దొరక్క డీజిల్ ఖర్చుకు కూడా వచ్చిన ఆదాయం సరిపడక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితిలో వేట సాగక వలస వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో సుమారు రెండు వేలు పైగానే వలస వెళ్లారు. వలసలు ఆపి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా మత్స్యకారులను చిన్నచూపు చూస్తోంది. స్వయం ఉపాధి ఏదీ? జిల్లాలోని మత్స్యకారులను ఆదుకోవడానికి కలెక్టర్ హరిజవహర్ ఆదేశాల మేరకు కోనాడలో ఆర్డీఓ వెంకటమురళి సమక్షంలో మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అర్హతను బట్టి స్వయం ఉపాధి కల్పిస్తామని అప్పట్లో హడావుడి చేసిన అధికారులు మూడు నెలలు దాటుతున్నా నోరెత్తడం లేదు. తీరప్రాంత గ్రామాల్లో అత్యధికంగా ప్రభుత్వ భూములు వుండటం, చెరువులు లేకపోవడంవంటి కారణాలతో మత్స్యకారులకు ఉపాధిహామీ పథకంలో పనులు కూడా కల్పించడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి తిప్పలవలసకు చెందిన మత్స్యకారులు పాక్‌లో చిక్కుకొని ఐదురోజులు దాటుతున్నా అధికారుల్లో చలనం లేదు. బాధిత కుటుంబాలను కనీసం ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు. తక్షణమే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి సహాయం అందజేసి ఆదుకోవాలి.– వాసుపల్లి అప్పన్న,మాజీ సర్పంచ్, తిప్పలవలస -
న్యాయం జరిగేలా కృషి చేస్తాం: విజయసాయి రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: అరేబియన్ మహా సముద్రంలో పాకిస్తాన్ భద్రతా దళాల(కోస్టు గార్డుల)కు చిక్కి కరాచీ జైలులో మగ్గుతున్న రాష్ట్రానికి చెందిన మత్య్సకారుల విడుదలకు కృషిచేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు. సోమవారం సీతమ్మధార క్యాంప్ కార్యాలయంలో మత్స్యకార కార్మిక సంఘం నేత మూగి గురుమూర్తి, వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి బాధిత కుటుంబాలు విజయసాయిరెడ్డిని కలిసి సమస్యను వివరించి, వినతిపత్రం అందించారు. అరెస్టయిన 22 మంద్రి ఆంధ్ర మత్య్సకారులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. వారంరోజులు గడుస్తున్నా కేంద్ర విదేశాంగ శాఖలో ఎలాంటి చలనం లేకపోవడం బాధాకరమన్నారు. వెంటనే కేంద్రం స్పందించి బందీలైన మత్య్సకారుల విడుదలకు కృషిచేయాలని కోరారు. త్వరలోనే బందీలైన మత్స్యకారుల కుటుంబ సభ్యులతో కలిసి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలవడానికి ఢిల్లీ వెళ్లేందుకు విజయసాయిరెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. -
ఎదురుచూపులు..!
విజయనగరం, పూసపాటిరేగ: బతుకుదెరువు కోసం చేపల వేట చేస్తూ సముద్రంపై వందల కిలోమీటర్ల దూరం వెళ్లి పాక్ భద్రతా దళాలకు చిక్కిన తమవారు ఎప్పుడు వస్తారా అని పూసపాటిరేగ మండలం తిప్పలవలస, భోగాపురం మండలం ముక్కాం గ్రామస్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తమవారి యోగక్షేమాలు ఎప్పుడు తెలుస్తాయోనని క్షణమొక యుగంగా గడుపుతున్నారు. తిప్పలవలస గ్రామానికి చెందిన నక్క పోలమ్మ భర్త నక్క అప్పన్న, కుమారుడు నక్క ధనరాజు పాక్ భద్రతా దళాలకు దొరికిపోయారు. అప్పటి నుంచి పోల మ్మ లబోదోబోమంటోంది. కనీసం భర్త, కుమారుడి యోగక్షేమాలు కూడా తెలియడం లేదని కన్నీటిపర్యంతమైంది. కేంద్ర అధికారులు స్పం దించి తమ వారితో కనీసం మాట్లాడించాలని వేడుకుంటోంది. అలాగే తన కుమారుడు నక్క నర్శింగ్ ఎలాగైనా వచ్చేస్తాడని అతని తల్లి నక్క నరసయ్యమ్మ కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. కుమార్తె పెళ్లి అప్పులు తీర్చడానికి వేటకు వెళ్లి తన భర్త పాక్ బలగాలకు దొరికిపోయాడని బర్రి బవిరీడు భార్య పోలమ్మ చెబు తోంది. అలాగే మైలపల్లి గురువులు భార్య దానయ్యమ్మ కూడా తన భర్త రాక కోసం ఎదురుచూస్తోంది. బందీలుగా ఉన్న మత్స్యకారులను విడిపించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
పాకిస్తాన్ రక్షణ దళాలకు బందీగా మారిన అభాగ్యులు
రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు వారివి. కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న జీవితాలు వారివి. దినదిన గండంగా సాగే వృత్తిపైనే జీవించే కుటుంబాలవి.సముద్రమే సర్వస్వంగా... మృత్యువుకు ఎదురీది... నిత్యం పోరాటమే వారి జీవనం. ఉన్న ఊళ్లో కూడు కరువై... కుటుంబ పరిస్థితులు భారమై... బతుకు తెరువుకోసం పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారు. అక్కడ బోటులో కూలీలుగా మారి కొందరు ప్రకృతి వైపరీత్యాల వల్ల మృత్యువాత పడుతుండగా... మరి కొందరు అనుకోని కష్టంలో చిక్కుకుంటున్నారు. తాజాగా జిల్లాలోని పూసపాటిరేగ మండలం తిప్పలవలస, భోగాపురం మండలం ముక్కాంకు చెందిన మత్స్యకారులు గుజరాత్ రాష్ట్రంలోని హీరావల్లో బోటులో కూలీలుగా చేరి వేట చేస్తూ పాకిస్తాన్ జలాల్లోకి పొరపాటున వెళ్లి అక్కడి కోస్టుగార్డు దళాలకు బందీ అయ్యారు. తమవారిని విడిపిస్తారో లేదో... ఎన్నాళ్లు వారిని చెరలోఉంచుతారో తెలియక ఇక్కడి వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఊళ్లోనే ఉపాధి ఉంటే ఈ సమస్యలు తలెత్తేవా.. అని వారు గగ్గోలు పెడుతున్నారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లాలో తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురానికి చెందినవారే గడచిన నాలుగేళ్లలో జరిగిన ప్రమాదాల్లో చిక్కుకున్నారు. ఈ రెండు మండలాల్లో సుమారు 22 వేల మంది మత్స్యకారులున్నారు. వారిలో వివిధ కారణాల రీత్యా, కుటుంబ పరిస్థితుల కారణంగా సుమారు 2 వేల మందికి పైగా మత్స్యకారులు ఇప్పటికే వలసపోగా సుమారు 3500 మంది వరకు సముద్రంలో వేటకు వెళుతున్నారు. 16,500 మంది పరోక్షంగా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏ పనీ చేయలేని వారు, వృద్ధాప్యం మీద పడిన వారు మాత్రమే తీరప్రాంత గ్రామాల్లో ఉన్నారు తప్ప పనిచేయగలిగే శక్తి ఉన్నవారందరూ చాలా వరకు వలస బాటపట్టారు. పూసపాటిరేగ మండలంలోని తిప్పలవలస, చింతపల్లి, పతివాడ బర్రిపేట, కోనాడ, భోగాపురం మండలంలో ముక్కాం, చేపల కంచేరు, కొండ్రాజుపాలెం తదితర గ్రామాల నుండి మత్స్యకారులు ఎక్కువగా వలసపోతున్నారు. వీరిలో అత్యధికంగా విశాఖపట్నం మంగమారిపేట, గుజరాత్లో సూరత్, వీరావలి వంటి ప్రాంతాలకు వలస పోతున్నారు. కాటేస్తున్న కాలుష్యభూతం తీరప్రాంత గ్రామాలను ఆనుకుని రసాయన పరిశ్రమల వ్యర్థాలు పైపులైన్లు వేసి సముద్రంలోకి విడిచిపెడుతుండటంతో ఇక్కడి మత్స్యసంపద కాస్తా కనుమరుగైపోతోంది. ఇక్కడ చేపలు దొరకక బతువు తెరువు కోసం వలసపోతున్నారు. మత్స్యకారుల జీవన పరిస్థితిలు మెరుగుపరచడానికి ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కూడా వలసలకు కారణంగా చెప్పవచ్చు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు గంగపుత్రులు తమ సమస్యలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎలాంటి ఫలితం లేకపోయింది. చేసేది లేక వలస వెళ్లాల్సి వచ్చింది. పూసపాటిరేగ మండలంలోని ఒక్క తిప్పలవలస నుండే సుమారు వెయ్యిమంది వలస పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నిత్యం ప్రమాదంలోనే... ఉన్న ఊరిలో వేటసాగకపోవడంతో వివిధ రాష్ట్రాల్లో చేపల వేటకు కూలీలుగా మారుతున్నారు. ప్రకృతి ప్రకోపానికి బలై మరణశయ్యపైకి చేరుతున్నారు. కొన్ని ప్రమాదాల్లో మృతదేహాల ఆచూకీ కూడా దొరకట్లేదు. మూడు నెలల క్రితం చింతపల్లికి చెందిన మైలపల్లి శ్రీను పారదీప్‌లో వేట చేసుకొని వస్తుండగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి తీరంలో జరిగిన పడవ ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు. పూసపాటిరేగ మండలం పతివాడ బర్రిపేటకు చెందిన సూరాడ రాము, వాసుపల్లి లక్ష్మణరావు, తమ్మయ్యపాలేనికి చెందిన బడే సత్తియ్య ఒడిశాలోని గంజాం జిల్లా రామయ్యపట్నం రేవులో గల్లంతయ్యారు. తాజాగా పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన నక్క అప్పన్న, బర్రి బవిరీడు, నక్కా నరిసింగు, నక్క ధనరాజు, బోగాపురం మండలం ముక్కాంకు చెందిన మైలపల్లి గురువులు వీరావలినుంచి వేటకు బయలుదేరి పాక్జలాల్లో పొరపాటున ప్రవేశించి అక్కడి రక్షణ దళాలకు బందీలుగా చిక్కారు. పాక్ అదుపులో వున్న ఐదుగురి కుటుంబాలను జిల్లా అధికారులు కనీసం పట్టించుకోలేదు. కనీసం ఆరా తీయలేదు. బందీల పరిస్థితిపై ఇంతవరకూ కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇదీ మత్స్యకారుల ప్రాణాలకు వారిచ్చే విలువ. పాకిస్థాన్ దళాలవద్ద బందీలుగా ఉన్న జిల్లా మత్స్యకారులను విడిపించేందుకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. జీవన పరిస్థితులపై అధ్యయనం చేసి, వారు వలస వెళ్లకుండా చేయాల్సిన ప్రత్యమ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వానికి నివేదిస్తాం. ఇప్పటికే స్వయం ఉపాధిపై మత్స్యకారులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. స్థానికంగా ఉండి చేపల వేట సాగించేందుకు కొత్తగా 120 బోట్లు మంజూరుచేశాం.– మాచర్ల దివాకర్, డిప్యూటీ డైరెక్టర్, మత్స్యశాఖ -
గొల్లుమన్న మత్స్యకార పల్లెలు
పూసపాటిరేగ/భోగాపురం: సముద్రమే వారికి సర్వస్వం. వేటే జీవనాధారం. దానికోసం ఎన్నికష్టాలైనా ఎదురీదుతారు. ఎంత దూరానికైనా పొట్టపోషణకోసం వెళ్లిపోతారు. అలా వెళ్లిన జిల్లాకు చెందిన ఐదుగురు మత్స్యకారులు పాకిస్తాన్ సరిహద్దులోకి వెళ్లిపోవడంతో అక్కడి కోస్టుగార్డులకు చిక్కి బందీలుగా మారారు. విషయం తెలుసుకున్న ఇక్కడి కుటుంబ సభ్యులు ఇప్పుడు గొల్లుమంటున్నారు. ఇక్కడ వేటసాగక.. పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని తీరప్రాంతంలో వేట సరిగ్గా సాగడం లేదు. ఏడాదిలో దాదాపు రెండు నెలలు నిషేధం... మిగిలిన కాలంలో కొన్నాళ్లు రకరకాల తుఫాన్లు, అల్పపీడనాలు తదితర సమయాల్లో నెలల తరబడి వేట సాగడం లేదు. దీంతో జీవనాధారం లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ఎంతోమంది మత్స్యకారులు బతుకు తెరువు కోసం గుజరాత్‌లోని హీరావల్ వెళ్లి అక్కడ కొందరివద్ద వేటపనికి కుదిరి ఇక్కడి కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. ఇలా వెళ్లినవారు అక్కడ వేటకోసం సముద్రంలోకి వెళ్లి రకరకాల చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. ఇక్కడ సక్రమంగా వేట సాగితే ఇక్కడినుంచి వెళ్తే పరిస్థితి ఉండదని స్థానికులు చెబుతున్నారు. అదే విధంగా పూసపాటిరేగ తిప్పలవలస, భోగాపురం మండలం ముక్కాం గ్రామాలకు చెందిన ఐదుగురు ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దులోకి అనుకోకుండా వెళ్లి అక్కడి రక్షక దళాలకు చిక్కారు. రెండు గ్రామాల్లో కలవరం పూసపాటిరేగ మండలం తిప్పలవలస, భోగాపురం మండలం ముక్కాంనకు చెందిన పలువురు మత్స్యకారులు ఆగస్టు 15వ తేదీన గుజరాత్ రాష్ట్రం హీరావల్‌వెళ్లి చేపలవేట నిమిత్తం బోట్లులో కూలీలుగా పనిచేయడానికి కుదిరారు. అక్కడి నుంచి 10 రోజుల క్రితం ఇంజిన్ వున్న స్టేయింగ్ బోటులో సముద్రంలో వేటకు వెళ్లారు. నిబంధనలపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో పాకిస్తాన్ జలాల్లోకి వేటచేస్తూ ప్రవేశించారు. బోర్డర్లో వున్న పాకిస్తాన్ రక్షణ దళాలు మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో తిప్పలవలసకు చెందిన నక్కా అప్పన్న, నక్కా ధనరాజు, నక్కా నరిసింగు, బర్రి బవిరీడు, భోగాపురం మండలం ముక్కాంనకు చెందిన మైలపల్లి గురువులు ఉన్నారు. ఇందులో నక్కా అప్పన్న, నక్కా ధనరాజు తండ్రీకొడుకులు, నక్కా నరిసింగు(18) అప్పన్నకు బంధువు. విడుదలకు కృషి చేయాలి పాకిస్తాన్లో బందీలుగా ఉన్న మత్స్యకారులను తక్షణమే విడుదల చేయడానికి కేంద్రప్రభుత్వం చొరవ చూపాలని బాధిత కటుంబాలు వేడుకొంటున్నాయి. గతంలో పాకిస్తాన్లో చిక్కిన వారిని సంవత్సరాలపాటు జైలులో ఉంచేవారని, బందీలుగా వున్న వారికి భోజన సౌకర్యం కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడిన రోజులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ హరివహర్‌లాల్ స్పందించి ప్రభుత్వానికి నివేదించాలని మత్స్యకారులు కోరుతున్నారు. అయితే మత్స్యకారులు చిక్కుకుని 24 గంటలు గడిచినా స్థానిక అధికారులు కనీసం స్పందించడం లేదని వాపోతున్నారు. చింతపల్లి మెరైన్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు తిప్పలవలసలో బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి సమాచారం మాత్రం సేకరించారు. మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు మాత్రం ఎక్కడా ఆచూకిలేదు. నా పెనిమిటి ఇంటికి వస్తాడా... మైలపల్లి గురువులకు భార్య దానయ్యమ్మ, కొడుకు దాసు, కుమార్తె సత్య ఉన్నారు. ఇద్దరు పిల్లలకీ వివాహాలు అయిపోయాయి. కొడుకు కర్ణాటక రాష్ట్రం మంగుళూరు వద్ద ఉంటూ వేట చేసుకుని జీవిస్తున్నాడు. భార్య గ్రామంలో చేపలు అమ్ముతూ జీవిస్తుంది. గురువులు ఇతర బోట్లలో వేట పనిచేస్తూంటాడు. సమాచారం తెలుసుకున్న గురువులు భార్య కన్నీటి పర్యంతమవుతోంది. తన భర్తకు 64 సంవత్సరాలుంటాయని, వేరే ఆధారం లేక అంత దూరం వెళ్లాల్సి వచ్చిందనీ, ‘నా పెనిమిటిని వేరే దేశపోళ్ళు తీసుకెళ్ళిపోయారంట... నా పరిస్థితి ఏంటి.. నా భర్త సేమంగా తిరిగొస్తాడా బాబూ.. సెప్పండి బాబూ’ అని కనబడినోళ్ళని అడగడం చూస్తే కడుపు తరుక్కుపోయింది. -
దీవి మాయమైంది!
టోక్యో: దీవి మాయమవడం ఏంటని ఏంటని అనుకుంటున్నారా? అవును నిజమే.. తమ దేశానికి చెందిన ఓ చిన్న దీవి కనిపించడం లేదని జపాన్ ఆందోళన చెందుతోంది. ఆ దీవి కొట్టుకుపోయిందా లేక మరేదైనా జరిగిందా అని తెలుసుకోవడానికి సర్వే నిర్వహించాలని భావిస్తోంది. ‘ఇసాంబి హనకిట కోజిమా’ అనే దీవిని 1987లో జపాన్ కోస్ట్‌గార్డ్ గుర్తించింది. అయితే దాని విస్తీర్ణం మాత్రం కనుక్కోలేకపోతున్నారు. ఈ మధ్య అది సముద్ర మట్టానికి 1.4 మీటర్ల మేర పెరగడంతో జపాన్ ఉత్తర హొకైడో దీవి నుంచి కూడా స్పష్టంగా కనిపించేది. కానీ హఠాత్తుగా ఇప్పుడా దీవి కనిపించడం లేదు. అది కొట్టుకుపోయి ఉండొచ్చని కోస్ట్‌గార్డ్ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల జపాన్ ప్రాదేశిక జలాల విస్తీర్ణం కాస్త తగ్గే అవకాశం ఉంది. కచ్చితమైన సర్వే నిర్వహిస్తేనే అది తెలుస్తుంది. పసిఫిక్ సముద్రంలోని మారుమూలల్లో ఉన్న తమ దీవులను రక్షించుకోవడానికి జపాన్ భారీగా ఖర్చు చేస్తోంది. ఇందులో కొన్ని దీవుల విషయంలో పొరుగు దేశాలైన చైనా, దక్షిణ కొరియాతో వివాదాలూ ఉన్నాయి. భారీ భూకంపాలు, సునామీలు సర్వసాధారణమైన జపాన్ తరచూ కొంత భూభాగాన్ని కోల్పోవడమో, కొత్తగా చేర్చుకోవడమో జరుగుతూనే ఉంది. 2015లో ఇలాగే 300 మీటర్ల భూభాగం సముద్రం నుంచి బయటపడి జపాన్‌లోని హొకైడో తీరంలో కలిసింది. -
రెండు రోజులైనా లభ్యం కాని విద్యార్థినుల ఆచూకీ
-
బోటు మునక : 64 మంది మృతి
రోమ్ (ఇటలీ) : అక్రమంగా యూరప్‌లోకి ప్రవేశించాలకున్న ఓ బోటు ప్రమాదవశాత్తు మధ్యదరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 64 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్టులు వస్తున్నాయి. మృతులు అందరూ ఆఫ్రికా ఖండానికి చెందిన లిబియా దేశం నుంచి యూరప్‌లోకి ప్రవేశించేందుకు మధ్యదరా సముద్రంలోకి ప్రవేశించినట్లు తెలిసింది. మునిగిపోతున్న పడవను గమనించిన ఇటలీ కోస్ట్ గార్డు 86 మందిని రక్షించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. చిన్న బోటులో 150 మందికి పైగా ప్రయాణించడంతోనే ప్రమాదం జరిగిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది. మధ్యదరా సంద్రంలోకి ప్రవేశించిన ఎనిమిది గంటల తర్వాత బోటుకు చిల్లుపడినట్లు వెల్లడించింది. పడవలోని వారందరూ ఓ వైపునకు వెళ్లారని చెప్పింది. దీంతో బ్యాలెన్స్ కోల్పోయిన బోటు తిరబడిందని పేర్కొంది. -
ఏపీ తీరానికి ఉగ్ర ముప్పు లేదు..
కోస్ట్‌గార్డు అడిషనల్ డైరెక్టర్ జనరల్ వీఎస్ఆర్ మూర్తి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి ఎలాంటి ఉగ్రముప్పు లేదని కోస్ట్‌గార్డు అడిషనల్ డైరెక్టర్ జనరల్ వీఎస్ఆర్ మూర్తి తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మూర్తి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తమ నౌకలు, విమానాలు ఏపీ తీరప్రాంతాన్ని అనుక్షణం గస్తీ కాస్తుంటాయని తెలిపారు. భారతదేశానికి 7,516 కిలోమీటర్ల విస్తారమైన తీర ప్రాంతముందని, ఇదే మాదక ద్రవ్యాల రవాణాకు ప్రధాన కారణమని చెప్పారు. తీర ప్రాంత రక్షణలో కోస్ట్‌గార్డ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఏపీ తీరప్రాంతానికి ఎలాంటి ఉగ్రముప్పు లేదని, విశాఖ, కాకినాడ, నిజాంపట్నం, కృష్ణపట్నంలో కోస్ట్‌గార్డ్ స్టేషన్లున్నాయని పేర్కొన్నారు. తమ నౌకలు, విమానాలు ఏపీ తీరప్రాంతాన్ని అనుక్షణం గస్తీ కాస్తుంటాయని, విశాఖ సమీపంలోని నౌకాదళ స్థావరాలు, కాకినాడ సమీపంలోని చమురు ఉత్పత్తి, శుద్ధి కేంద్రాలకు రక్షణ చాలా అవసరమని వివరించారు. -
మారిషస్‌కు 3,227 కోట్ల సాయం
-
మారిషస్‌కు 3,227 కోట్ల సాయం
న్యూఢిల్లీ: మారిషస్‌కు 500 మిలియన్ల అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 3,227 కోట్లు) రుణంగా ఇవ్వడానికి భారత్ అంగీకరించింది. సముద్ర తీర భద్రత విషయంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, మారిషస్ నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఈ రుణ సాయం చేసింది. భారత్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఢిల్లీ చేరుకున్న మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఇరు దేశాల ప్రధానులు భేటీ అయ్యారు. దీని ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ భేటీలో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. సముద్ర తీర భద్రతా ఒప్పందంపై సంతకాలు అనంతరం హిందూ మహాసముద్ర తీర భద్రతా ఒప్పందంపై ఇరుదేశాల ప్రధానులు సంతకాలు చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేయడం ద్వారా వ్యాపారం, టూరిజం, డ్రగ్స్ రవాణా, మనుషుల రవాణా, అక్రమంగా చేపలు పట్టడం, సముద్ర వనరుల అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. అందుకే తాను, జగన్నాథ్ సముద్ర తీర భద్రతపై ఒప్పందం చేసుకున్నామని వివరించారు. ఈ ఒప్పందంతో పాటు ఇరుదేశాల మధ్య మరో మూడు ఒప్పందాలు కూడా జరిగాయి. మారిషస్‌లో సివిల్ సర్వీసెస్ కాలేజీ ఏర్పాటు, సముద్ర పరిశోధనలో సహకారం, ఎస్బీఎం మారిషస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ, ఎక్స్పోర్ట్–ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య యూఎస్ డాలర్ క్రెడిట్ లైన్ అంశాలపై ఇరుదేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. సుష్మాతోనూ భేటీ తొలుత మారిషస్ ప్రధాని జగన్నాథ్ భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ అయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులతో పాటు పలు అంశాలపై ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవాలని ఈ సందర్భంగా ఇరువురు చర్చించుకున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే ట్వీటర్ ద్వారా తెలిపారు.పర్యటనలో భాగంగా జగన్నాథ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. ఈ ఏడాది మొదట్లో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. జగన్నాథ్ చేపడుతున్న తొలి అధికారిక పర్యటన ఇదే. -
2020కి 200 కోస్ట్‌గార్డు నౌకలు!
► కోస్ట్‌గార్డు ఐజీ రాజన్ బర్గోత్రా ముత్తుకూరు(సర్వేపల్లి): 2020 సంవత్సరం నాటికి ఇండియన్ కోస్ట్‌గార్డు బలగం 200 నౌకలకు పెరుగుతుందని ఐసీజీఎస్ ఐజీ రాజన్ బర్గోత్రా పేర్కొన్నారు. కృష్ణపట్నం ఇండియన్ కోస్ట్‌గార్డుకు చేరిన 3వ నౌక ‘చార్లీ–423’ను గురువారం ఏపీ డీజీపీ ఎన్ సాంబశివరావు ప్రారంభించారు.వేడుకల్లో బర్గోత్రా ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రస్తుతం కోస్ట్‌గార్డు పరిధిలో 109 నౌకలు దేశం మూడు వైపులా నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నాయన్నారు. ఇవి కాకుండా 16 హెలికాప్టర్లు కూడా కోస్ట్‌గార్డు పరిధిలో విధులు నిర్వహిస్తున్నాయని తెలిపారు. త్వరలో 14 హెవీ హెలికాప్టర్లు రానున్నాయన్నారు. నౌకల తయారీలో భాగంగా ఇండియన్ కోస్టుగార్డు పురోగతిలో ఎల్అండ్టీ సంస్థ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఎల్అండ్టీ ప్రతినిధి, విశ్రాంత కెప్టెన్ క్రిస్ట్ మాట్లాడుతూ ఇండియన్ కోస్ట్ట్గార్డు నౌకలను తమ సంస్థ డిజైన్ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, జిల్లాఎస్పీ విశాల్‌గున్నీ, పోర్టు సీఈఓ అనిల్ ఎండ్లూరి, డీఐజీలు హర్బోలా, శశికుమార్ పాల్గొన్నారు. -
పాక్ బోటు కలకలం.. అదుపులో తొమ్మిదిమంది
అహ్మదాబాద్: భారత సైన్యం జరిపిన దాడుల గురించి సర్వత్రా చర్చ జరుగుతుండగా భారత సముద్ర జలాల్లోకి దూసుకొచ్చి ఓ పాకిస్థాన్ బోటు హల్ చల్ చేసింది. ఆదివారం గుజరాత్ సముద్ర తీరంలో భారత కోస్టు గార్డులు ఓ పాకిస్థాన్ బోటును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో తొమ్మిది మంది వ్యక్తులు ఉన్నారు. ఆదివారం ఉదయం 10.15గంటల ప్రాంతంలో ఐసీజీఎస్ సముద్ర పావక్ పాక్ బోటును గుర్తించిందని, ఆ వెంటనే తమ ఆధీనంలోకి తీసుకున్నారని, ప్రాథమిక సమాచారం మేరకు అందులో ఉన్నవారంతా పాక్ మత్యకారులని తెలుస్తోంది. ఇటీవలె భారత్ సర్జికల్ దాడులు నిర్వహించిన నేపథ్యంలో పాకిస్థాన్ ఏ సమయంలో నైనా ఏ రూపంలోనైనా తిరిగి దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుందని నిఘా వర్గాలు సమాచారం అందించడంతో గస్తీ దళం మరింత అప్రమత్తమైంది. ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్న తొమ్మిదిమంది పాకిస్థాన్ వాస్తవ్యులను పోరుబందర్ లో విచారించనున్నారు. -
నడి సంద్రంలో భయం భయంగా..
- విశాఖ నుంచి పోర్ట్‌బ్లెయిర్ వెళుతూ నిలిచిపోయిన నౌక - స్వల్ప మరమ్మతుల అనంతరం తిరిగి విశాఖకు నౌక సాక్షి, విశాఖపట్నం: విశాఖ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు వెళ్తున్న ప్రయాణికుల నౌక నడిసంద్రంలో దాదాపు 24 గంటల పాటు నిలిచిపోయింది. ఇందులో 506 మంది ప్రయాణికులు, సుమారు 50 మంది సిబ్బంది ఉన్నారు. ఒకరోజంతా సముద్రం లో నిలిచిపోవడంతో ప్రయాణికులు భయాం దోళనలకు గురయ్యారు. నౌక నిలిచిన సమాచారంతో జిల్లా అధికారులు నేవీ, కోస్ట్‌గార్డ్‌లను అప్రమత్తమయ్యారు. స్వల్ప మరమ్మతుల అనంతరం తిరిగి విశాఖ తీరానికి రప్పించేందుకు అధికారులు ఏర్పా ట్లు చేపట్టారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్‌కు వెళ్లేందుకు మంగళవారం మధ్యాహ్నం 1.35 గంటలకు విశాఖ నుంచి 506 మంది ప్రయాణికులతో ఎంవీ హర్షవర్ధన నౌక బయల్దేరింది. ఆరు గంటల ప్రయాణం తర్వాత నౌకలోని ఒక జనరేటర్ పాడైంది. కాసేపటికి అనూహ్యంగా మరో జనరేటర్ కూడా పాడవ్వడంతో ఇంజన్లు పనిచేయడం మానేశాయి. దీంతో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులకు నౌకలోని అధికారులు సమాచారం అందించారు. అక్కడ్నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో తీరం నుంచి 20 నాటికల్ మైళ్ల దూరంలో నౌకను నిలిపివేశారు. మంగళవారం రాత్రి నుంచి సాంకేతిక నిపుణులు జనరేటర్లకు మరమ్మతులు చేస్తూనే ఉన్నారు. బుధవారం రాత్రి వరకు మరమ్మతులు కొనసాగాయి. కాగా, ప్రయాణికుల్లో 150 మంది మహిళలు, 15 మంది పిల్లలున్నట్లు సమాచారం. వీరంతా క్షేమంగా ఉన్నారని, ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు ప్రకటించారు. -
కాలుష్యంతో మత్స్య సంపదకు ముప్పు
కోస్టుగార్డు కమాండెంట్ వేణుమాధవ్ కృష్ణపట్నం తీరంలో కోస్టల్ క్లీనప్ డే ప్రారంభం ముత్తుకూరు : సముద్ర జలాల కాలుష్యంతో మత్స్యసంపదకు ముప్పు ఏర్పడుతుందని ఇండియన్ కోస్టు గార్డు కమాండింగ్ ఆఫీసర్ వేణుమాధవ్ పేర్కొన్నారు. కృష్ణపట్నం తీరంలో ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్‌డేను శనివారం ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ‘స్వచ్ఛసాగర్ అభియాన్ దివాస్’గా ప్రకటించిందని గుర్తు చేశారు. సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలు నాశనం కావని, మత్స్య సంపదకు ఆహారమైన ప్లాంటాన్ల ఉనికికే ముప్పు కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. వినాయక విగ్రహాల నిమజ్జనంతో తీరం పొడవున్నా చెత్త పేరుకుపోయిందని విచారం వ్యక్తం చేశారు. సముద్రతీరం కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ముత్తుకూరు జెడ్పీ ఉన్నత పాఠశాల, ఆర్ఆర్ స్కూల్ విద్యార్థులు తీరంలోని చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఆరాధ్య భరద్వాజ్, పోర్టు మెరైన్ డీజీఎం షఫీ, ట్రీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ సందీప్, తదితరులు పాల్గొన్నారు. -
కోస్టల్ క్లీనప్ డ్రైవ్ ప్రారంభించిన కిరణ్ బేడీ
పుదుచ్చేరిః లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పుదుచ్చేరీలో కోస్టల్ క్లీనప్ డ్రైవ్ ను ప్రారంభించారు. కోస్ట్ గార్డులు, వాలంటీర్లు నిర్వహించిన కార్యక్రమంలో కిరణ్ బేడీ ప్రముఖ అతిథిగా పాల్గొన్నారు. ప్రకృతిని గౌరవించి, బీచ్ లను చెత్తా చెదారంతో నింపడం మానాలని ఆమె ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 31వ ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే సందర్భంగా బీచ్ లలోని చెత్తను తొలగించే కార్యక్రమాన్ని కోస్ట్ గార్డు సిబ్బంది చేపట్టారు. కార్యక్రమానికి ముందు బేడీ సహా స్థానిక పరిపాలనా మంత్రి ఎ నమశ్శివాయం.. ఇండియన్ కోస్ట్ గార్డ్ లో సభ్యులైన ఎన్సీసీ, ఎన్ ఎస్ ఎస్, ఎన్జీవో సభ్యులతో గార్బేజ్ ఫ్రీ బీచెస్ కోసం ప్రతిజ్ఞ చేయించారు. క్లీనప్ డ్రైవ్ లో భాగంగా వాలంటీర్లతో కలసి కిరణ్ బేడీ, మంత్రి నమశ్శివాయం, పలువురు అధికారులు సైతం బీచ్ లలో చెత్తను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. అంతర్జాతీయ డ్రైవ్ లో భాగంగా బీచ్ లను శుభ్రపరిచే కార్యక్రమాన్ని పుదుచ్చేరిలోని అన్ని తీర ప్రాంతాల్లోనూ నిర్వహించనున్నట్లు కమాండర్ ఎస్ సి త్యాగి తెలిపారు. స్థానిక పరిపాలనా విభాగంతో కలసి ఇండియన్ కోస్ట్ గార్డు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. -
ఎక్కడున్నారో.. ఎలా ఉన్నారో!
11 మంది మత్స్యకారుల గల్లంతు వారిలో నలుగురు విశాఖ వాసులు కోస్ట్‌గార్డు గాలింపు చర్యలు మత్స్యకార కుటుంబాల్లో ఆందోళన కాకినాడ క్రైం : సాంకేతిక కారణాలతో బోట్లు సముద్రంలో ఆగిపోవడంతో 11 మంది మత్స్యకారుల ఆచూకీ నేటికీ తెలియలేదు. సముద్రంలో చిక్కుకున్న వారిలో నలుగురు విశాఖవాసులు కాగా మిగిలిన ఏడుగురు కాకినాడకు చెందినవారే. బోట్లు యజమని మత్స్యశాఖ, కోస్ట్‌గార్డు అధికారులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు ముమ్మరం చేశారు. ఆచూకీ లేకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. రెండు బోట్లు యజమానులు తెలిపిన వివరాలిలావున్నాయి. కాకినాడ పర్లోపేటకు చెందిన పంతాడి కామేశ్వరి, ఆమె భర్త పంతాడి కామేశ్వరరావుకు రెండు బోట్లు ఉన్నాయి. వారికి చెందిన ఇండ్-ఏపీ-ఈ2-ఎంఎం-425 నెంబరుగల మెకనైజ్డ్ బోటులో ఈ నెల 10న ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. బోటు డ్రైవర్ అంగాడి తాతీలు కాకినాడ జగన్నాథపురం ఏటిమొగకు చెందినవాడు కాగా అంగాడి ప్రసాద్, పోలప్పడు, శ్రీను, అప్పారావు, కారె రాము, సీహెచ్ రాజు విశాఖ నుంచి వచ్చారు. కాకినాడ తీరానికి 75 మైళ్ల దూరంలో రెండు రోజుల పాటు వల వేసి ఉంచారు. మూడో రోజు బోటు ప్రొఫైలర్ (అడుగున ఉండే ఫ్యాన్) ఆగిపోవడంతో బోటు నిలిచిపోయింది. గమనించిన మత్స్యకారులు బోటులోనే ఉండిపోయారు. ఏటిమొగకు చెందిన పినపోతు శ్రీను బోటు అటుగా వస్తుండడం గమనించి తమ బోటును ఓడ వద్దకు చేర్చాల్సిందిగా కోరారు. అప్పటికే వారి బోటులో మత్స్యసంపద ఉండడంతో అది సాధ్యం కాదని చెప్పి బోటులో ఉన్న కారె రాము, సీహెచ్ రాజులను తమ బోటులో కాకినాడ తీసుకువచ్చారు. వారు వచ్చి విషయాన్ని బోటు యజమానికి చెప్పడంతో ఆమె అధికారులకు ఫిర్యాదు చేశారు. సముద్రంలో 25 మైళ్ల వేగంతో గాలి వీస్తుండడంతో బోటు లోతు జలాల్లోకి పోయి ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, పంతాడి కామేశ్వరరావుకు చెందిన ఇండ్-ఏపీ-ఈ3-ఎంఓ-1707 మోటరైజ్డ్ బోటులో ఆరుగురు మత్స్యకారులు ఈ నెల 13 మధ్యాహ్నం వేటకు వెళ్లారు. బోటు వారం లేదా 9 రోజుల్లో తిరిగి రావాల్సి ఉంది. ఇప్పటి వరకూ దాని ఆచూకీ తెలియకపోవడంతో యజమాని, మత్స్యకారుల కుటుంబ సభ్యులు సందిగ్ధంలో పడ్డారు. దీనిపై కూడా అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. బోటులో కాకినాడ దుమ్ములపేటకు చెందిన పి. అప్పారావు, పర్లోపేటకు చెందిన ఎం. సత్తిబాబు, సీహెచ్ చిన్నప్ప (పరశురామ్), సీహెచ్ రాజయ్య, ఏటిమొగకు చెందిన డి. అంజిబాబు, పి.వెంకటేశ్వర్లు చిక్కుకుపోయారు. రెండు బోట్లు సముద్రంలో చిక్కుకుపోవడంతో పర్లోపేట, దుమ్ములపేట, ఏటిమొగల్లో ఆందోళన నెలకొంది. అటుగా వస్తున్న ఓడలు, బోట్లు గమనించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. -
ప్లాస్టిక్‌తో సముద్రానికి ముప్పు
ప్లాస్టిక్ వ్యర్థాలవల్ల సముద్రానికి తీరని నష్టం వాటిల్లుతోందని కృష్ణపట్నం ఇండియన్ కోస్ట్‌గార్డ్స్ కమాండెంట్ వేణు మాధవ్ తెలిపారు. శనివారం కోస్టల్ క్లీనప్ డే సందర్భంగా కృష్ణపట్నం రేవులోని సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు పెను సవాలుగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమం యుద్ధప్రాతిపదికన చేపట్టామన్నారు. -
కోస్ట్‌గార్డు విమాన శకలాలు లభ్యం
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై కోస్ట్‌గార్డ్ విమానం తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇద్దరు పెలైట్లు, ఒక అసిస్టెంట్ కమాండర్‌ను పొట్టనపెట్టుకుని కుటుంబసభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. చెన్నైలో గత నెల 8వ తేదీన అదృశ్యమైన కోస్ట్‌గార్డ్ విమానం సముద్రంలో కూలిపోయిందని, ముగ్గురు అధికారుల ఎముకలు, విమాన శకలాలు దొరికాయని ఇండియన్ కోస్ట్‌గార్డ్ (తూర్పు) ఐజీ సత్యప్రకాష్ శర్మ సోమవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. అయితే డీఎన్ఏ పరీక్షలు తరువాతనే అధికారులు ప్రాణాలతో ఉన్నారా లేదా అనే అంశాన్ని అధికారికంగా నిర్ధారిస్తామని స్పష్టం చేశారు. కూలిన కోస్ట్‌గార్డ్ విమానానికి చెందిన 80 శాతం శకలాలు లభ్యమైనందున గాలింపును నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. -
ఫిలిప్పీన్స్‌లో పడవ మునిగి 38 మంది మృతి
మనీలా(ఫిలిప్పీన్స్): ఫిలిప్పీన్స్ సముద్ర జలాల్లో ప్రమాదవశాత్తూ పడవ మునిగిపోయిన ఘటనలో 38 మంది మరణించారు. 26 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. ఎం/బీ కిమ్ నిర్వాణ అనే ఈ పడవ ఆర్మాక్ నుంచి కామోట్స్ దీవులకు వెళుతుండగా ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. పోర్టు నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే పడవ ప్రమాదం పాలైంది. బలమైన గాలుల కారణంగా సముద్ర జలాలు అల్లకల్లోలంగా మారడంతో ఇది అదుపుతప్పి తిరగబడినట్టు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో అందులో మొత్తం 189 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో చుట్టుపక్కల ఉన్న ఫిషింగ్ బోట్లలోనివారు, కోస్ట్‌గార్డు సిబ్బంది వెంటనే స్పందించారు. కనీసం 127 మందిని వీరు కాపాడినట్టు కోస్ట్‌గార్డ్ ప్రతినిధి తెలిపారు. -
కోస్టుగార్డు మరింత బలోపేతం
విమానాశ్రయంలో ఐదెకరాల నేవీ స్థలం లీజుకు.. కోస్టుగార్డు విమానాలు, హెలికాప్టర్ స్థావరాలకు ప్రత్యేక సదుపాయాలు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఆమోదం గోపాలపట్నం: తూర్పుతీర ప్రాంతానికి రక్షణగా ఉన్న కోస్టుగార్డు సంస్థను బలోపేతం చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ సంస్థకు ప్రత్యేక సదుపాయాల కల్పనకు నడుంకట్టింది. దీనికోసం విశాఖ విమానాశ్రయంలో నేవీ ఆధీనంలో ఉన్న ఐదెకరాల స్థలాన్ని లీజుకిస్తూ కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇక నుంచి అంతర్గత భద్రతను మరింత పటిష్టం చేయాలని రక్షణ శాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఇతరమార్గాలకంటే జలమార్గంలో విదేశీ చొరబాటుదారుల ప్రవేశానికి ఆస్కారం దేశానికి అత్యంత ప్రమాదకరం. దీనికి అడ్డుకట్ట వేసేందుకు బలమైన శక్తే భారీతీయ కోస్టుగార్డు సంస్థ. ఈ సంస్థ చొరబాటుదారులను రానీయపోవడమే కాకుండా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు వున్న సమయాల్లో నేవీతో పాటు శ్రమించే కేంద్ర రక్షణ విభాగం ఇది. ఢిల్లీ హెడ్క్వార్టర్సుగా చెన్నై రీజియన్‌లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల తీర ప్రాంతాలకు ఆయువుపట్టుగా ఉన్న ఈ సంస్థ బాధ్యత అంతాఇంతా కాదు. నౌకలతో పాటు హెలికాప్టర్లు, యుద్ధవిమానాలు కూడా ఈ సంస్థకు ఉంటాయి. అయితే విమానస్థావరానికి కోస్టుగార్డుకంటూ ప్రత్యేకంగా స్థలం లేదు. విశాఖ విమానాశ్రయంలో నేవీ ఆధీనంలో ఉన్న స్థలాన్ని ఎంతో కాలంగా వినియోగిస్తోంది. కేంద్ర నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ సంస్థ మరింత అప్రమత్తమైంది. దీనికంటూ ప్రత్యేక వైమానిక స్థలాన్ని నిర్దేశించుకోవాలని నిర్ణయింది. అయితే నేవీ ఆధీనంలో వుండడంతో దీనికి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు కుదరలేదు. దీనిపై కేంద్ర రక్షణ శాఖ అధికారులు స్పందించారు. నేవీ ఆధీనంలో ఉన్న ఐదెకరాల స్ధలాన్ని కోస్టుగార్డు సంస్థకు లీజుకివ్వాలని ప్రతిపాదించారు. కొద్దిరోజులక్రితం ప్రధాని మోది అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దీన్ని ఆమోదించారు. విమానాశ్రయంలో రన్‌వే ఉంది. దీనికి సమీపంలో ఈ స్థలం లీజుకు కేటాయించడం వల్ల కోస్టుగార్డు వ్యవస్థ ప్రత్యేక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుందని రక్షణ శాఖ అధికారులు భావిస్తున్నారు. -
బోటు మునిగి 84 మంది గల్లంతు
మనీలా : ఫిలిప్పీన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న బోటు శనివారం సాయంత్రం నీట మునిగింది. ఈ ప్రమాదంలో 84 మంది ప్రయాణికులు గల్లంతయ్యారని ఫిలిప్పీన్స్ కోస్ట్‌గార్డు అధికార ప్రతినిధి వెల్లడించారు. గల్లంతైనవారిలో 56 మంది పెద్దవాళ్లు, 2 చిన్నారులు, 26 మంది బోటు సిబ్బంది ఉన్నారని వివరించారు. గల్లంతైన వారి కోసం బోట్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. అయితే గల్లంతైన వారిలో కొంతమందిని రక్షించామని... ఆ సంఖ్య ఇంత అని మాత్రం ఆ అధికార ప్రతినిధి స్పష్టం చేయలేదు. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్లే ఆ ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు తెలిపారు. -
మరో 'ముంబై ముట్టడి' ఉండచ్చేమో!!
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం మీద 2008లో జరిగిన ఉగ్రదాడి తర్వాత తీరప్రాంత రక్షణను గణనీయంగా బలోపేతం చేసినట్లు కోస్ట్‌గార్డ్ చీఫ్ ఏజీ తప్లియాల్ తెలిపారు. అయితే.. సముద్రమార్గంలో అలాంటి దాడి మరోటి జరిగే అవకాశాలు మాత్రం లేకపోలేవన్నారు. తాము ఒకలా ఆలోచిస్తే ఉగ్రవాదులు మరోలా ఆలోచించి దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. ముంబై తీరానికి చేరుకోడానికి ఉగ్రవాదులు డింగీ అనే చిన్న బోటును ఉపయోగించిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించినప్పుడు.. 20 మీటర్ల కన్నా చిన్న పరిమాణంలో ఉండే బోట్లను కూడా గుర్తించే పరిజ్ఞానాన్ని తాము పెంపొందించుకుంటున్నామన్నారు. మత్స్యకారులను కూడా అప్రమత్తం చేసి, చిన్న బోట్లను గుర్తించేలా తయారుచేస్తున్నామన్నారు. -
సముద్రంలో గస్తీకి ‘రాజ్ ధ్వాజ్’!
భారత సముద్రంలో గస్తీకి ఐసీజీఎస్ రాజ్ధ్వాజ్ నౌక సిద్ధం అయింది. బుధవారం ఈ నౌకను కోస్ట్ గార్డుకు అప్పగించారు. చెన్నై హార్బర్లోని గస్తీ సేవలకు రాజ్ ధ్వాజ్‌ను కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి జికే వాసన్ జెండా ఊపి సాగనంపారు. సాక్షి, చెన్నై: సముద్ర మార్గం ద్వారా సంఘ విద్రోహ శక్తులు భారత్‌లోకి చొరబడుతున్నట్టు ఇటీవలి ముంబై ఘటన ద్వారా తేలింది. దీంతో సముద్ర తీరాల్లో గస్తీని పెంచారు. భారత నావికాదళం, భారత కోస్ట్ గార్డ్, సముద్ర తీర భద్రతా విభాగం, రాష్ట్ర మెరైన్ పోలీసుల నేతృత్వంలో సముద్ర తీరాల్లో నిఘాను పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు అత్యాధునిక నౌకల్ని సైతం ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత కోస్ట్ గార్డ్‌కు సేవలందించేందుకు అత్యాధునిక ఆయుధాలు, వసతులతో కూడిన ఐసీజీఎస్కు చెందిన రాజ్ ధ్వాజ్ నౌక సిద్ధం అయింది. కోల్‌కతాలో రూపుదిద్దుకున్న రాజ్ ధ్వాజ్‌ను చెన్నై హార్బర్‌కు తీసుకొచ్చారు. 31.5 నాటికన్ మైళ్ల వేగంతో దూసుకెళ్లే ఈ నౌకలో అత్యాధునిక తుపాకులు, ఆయుధాలతో కూడిన మోటార్ బోట్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఐదుగురు ఉన్నతాధికారులతో పాటుగా 30 మంది కోస్ట్ గార్డ్ కమాండోలు విధుల్లో ఉంటారు. అంకితం: కోస్టు గార్డు గస్తీ సేవలకు ఈ నౌక బుధవారం అంకితం అయింది. చెన్నై హార్బర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర నౌకాయన శాఖ మంత్రి జికే వాసన్ ఈ నౌకను జెండా ఊపి సాగనంపారు. ముందుగా ఆ నౌకలోని అత్యాధునిక ఆయుధాలు, ఏర్పాట్లను వాసన్ పరిశీలించారు. కోస్టుగార్డు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మీడియాతో వాసన్ మాట్లాడుతూ, భారత సముద్ర తీరాల్లో గస్తీని ముమ్మరం చేశారు. అత్యాధునిక ఆయుధాలు రాజ్ ధ్వాజ్లో ఉన్నాయని వివరించారు. సరిహద్దుల్లోకి చొరబడే అనుమానాస్పద బోట్లను, సంఘ విద్రోహ శక్తుల కదలికల్ని పసిగట్టేందుకు ఇందులో అత్యాధునిక ఏర్పాట్లు ఉన్నాయన్నారు. చెన్నైలోని లైట్ హౌస్ వీక్షణకు సందర్శకుల తాకిడి పెరిగిందన్నారు. ఈ దృష్ట్యా, సమయాన్ని పెంచుతున్నామన్నారు. ఈనెల 20 నుంచి ఉదయం 9.30- సాయంత్రం 5.30 వరకు సందర్శకుల సమయంగా నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో భారత కోస్ట్ గార్డ్ డెరైక్టర్ జనరల్ అడ్మిరల్ అనురాగ్ జీ తాప్లియల్, రీజనల్ కమాండర్ ఎస్పి శర్మ తదితరులు పాల్గొన్నారు. -
లెహర్‌పై అప్రమత్తం
=కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ =అందుబాటులో టోల్‌ఫ్రీ నంబర్ 1800-4250-0002 విశాఖ రూరల్, న్యూస్‌లైన్: లెహర్ తుపాను నేపథ్యంలో జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ప్రత్యేకాధికారులను జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో అన్ని మండలాల ప్రత్యేకాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేకాధికారులు మండల కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు సుమారు 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని, రెండు మీటర్ల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగసిపడవచ్చని చెప్పారు. గుడిసెలు, పెంకుటిళ్లు, నానిన గోడలతో ఉన్న ఇళ్లను గుర్తించి వాటిలో నివసించేవారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. పునరావాస కేంద్రాలకు జనరేటర్ సౌకర్యం కల్పించాలని, ప్రజలను తరలించడానికి ఆర్టీసీ లేదా స్కూల్ బస్సులను వాడాలని కోరారు. నేవీ, ఆర్మీ, కోస్ట్‌గార్డ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అన్ని మండలాల్లో వీఆర్వోలు గ్రామాలకు వెళ్లి ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. స్థానికంగా ఉండే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో చర్చించి ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. గ్రామాల్లో హాస్టల్లో పిల్లల రక్షణ ఏర్పాట్లు, భోజన, మంచినీటి ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలని సూచించారు. శారద, వరాహ, తాండవ రిజర్వాయర్ల పరిసరాల లోతట్టు గ్రామాల ప్రజలను అవసరమైతే ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ ప్రవీణ్‌కుమార్, ఏజేసీ నరసింహారావు, నర్సీపట్నం సబ్‌కలెక్టర్ శ్వేత తవతియా, డీఆర్వో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.