చెన్నై: తూత్తుకుడికి దక్షిణ ప్రాంతం నుంచి శ్రీలంక వెళ్తున్న పడవ నుంచి 100 కిలోల హెరాయిన్‌తో సహా మాదకద్రవ్యాలను భారతీయ కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుంది. నిఘా వర్గాల సమాచారం మేరకు, నవంబర్ 17 నుంచి సుదీర్ఘమైన, నిరంతర ప్రయత్నాలు చేసి పట్టుకున్నామని అధికారులు బుధవారం చెప్పారు. కరాచీ నుంచి శ్రీలంకకు మాదకద్రవ్యాలను ఎగుమతి చేసి, అక్కడి నుంచి పాశ్చాత్య దేశాలకు, ఆస్ట్రేలియాకు ఎగుమతి చేస్తున్నారు. పాకిస్తాన్ జిహాద్‌తోపాటు మాదకద్రవ్యాలను కూడా ఎగుమతి చేస్తుంది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికే ఈ ఎగుమతులు చేస్తున్నారని ఒక అధికారి తెలిపారు.
99 ప్యాకెట్ల హెరాయిన్ (100 కేజీలు), 20 చిన్న బాక్సులలో సింథటిక్ డ్రగ్స్, ఐదు 9 ఎంఎం పిస్టల్స్, ఒక తురాయ సెట్‌ను ఖాళీ ఇంధన ట్యాంక్ లోపల ఉంచి ఐసిజి షిప్ ద్వారా ఎగుమతి చేస్తున్నారని మరో అధికారి తెలిపారు. పడవ కెప్టెన్‌తో సహా ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో శ్రీలంక నావికాదళం నుంచి ఒక సందేశం కూడా వచ్చిందని ఒక అధికారి తెలిపారు. ఈ పడవ శ్రీలంకకు పశ్చిమ తీరంలో ఉన్న నెగోంబోలోని అలెన్సు కుట్టిగే సిన్హా దీప్తా సాని ఫెర్నాండోకు చెందినదిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment