sriLankan Navy
-
చైనా జిత్తులకు అమెరికా, భారత్ పైఎత్తు!
జిత్తులమారి చైనాకు చెక్ పెట్టేందుకు భారత్, అమెరికాలు సిద్ధమవుతున్నాయి. అభ్యంతరం వ్యక్తం చేసినా శ్రీలంకలో తన ‘గూఢచారి’ నౌకా వ్యవహారాలను యధేచ్ఛగా కొనసాగిస్తున్న చైనాను అడ్డుకునేందుకు పెట్టుబడుల మంత్రమేస్తున్నాయి. పక్కా ప్లాన్‌తో ముందుకొచ్చాయి. అప్పుల ఊబిలో చిక్కుకున్న శ్రీలంకను దోచుకుంటున్న చైనాకు చెక్ పెట్టే దిశగా ముందుకు కదులుతున్నాయి. కొలంబో పోర్ట్‌లో డీప్ వాటర్ షిప్పింగ్ కంటైనర్ టెర్మినల్‌ను నిర్మించడానికి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టనున్నట్లు అమెరికాకు చెందిన బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశానికి చెందిన అదానీ గ్రూప్ ఈ ప్రాజెక్టును కొలంబోలో ముందుకు తీసుకువెళ్లనుంది. దీంతో చైనా ఆటలకు అడ్డుకట్ట పడనుంది. శ్రీలంకకు చైనా భారీగా అప్పులు ఇచ్చి, అందుకు ప్రతిగా శ్రీలంకలోని హంబన్‌టోటా ఓడరేవును 99 సంవత్సరాల ఒప్పందం మేరకు ఆక్రమించింది. ఇదేవిధంగా చైనా తన ‘గూఢచారి’ నౌకను శ్రీలంకకు పంపింది. ఇది పరిశోధనా నౌక అని సమాచారం. చైనా ఈ నౌక సాయంతో భారత్‌పై గూఢచర్యం చేస్తున్నదనే ఆరోపణలున్నాయి. చైనా చేస్తున్న ఈ దుర్మార్గపు ఎత్తుగడను తిప్పికొట్టేందుకు, దాని దురహంకారాన్ని తుదముట్టించేందుకు భారత్, అమెరికాలు ఇప్పుడు రంగంలోకి దిగుతున్నాయి. కొలంబో పోర్ట్ కోసం అమెరికా పెట్టుబడులు పెడుతుండటంతో శ్రీలంకకు ప్రయోజనం చేకూరనుంది. అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్.. కొలంబో పోర్ట్‌ను ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేయనుంది. శ్రీలంకపై అప్పుల భారం తగ్గేందుకు ఇది దోహదపడుతుందని, దీని కారణంగా మిత్రదేశాలకు మేలు జరుగుతుందని అమెరికా చెబుతోంది. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో శ్రీలంకలో అమెరికా పెట్టుబడుల ప్రకటన వెలువడింది. బంగాళాఖాతంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడంలో ఈ కొత్త టెర్మినల్ నిర్మాణం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. కాగా చైనా ఇచ్చిన రుణాన్ని తీర్చలేని శ్రీలంక తమ దేశానికి చెందిన హంబన్‌టోటా పోర్టును చైనాకు 99 ఏళ్ల లీజుకు ఇచ్చింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే చైనా కుయుక్తులతో తన ‘గూఢచారి’ నౌకను కొలంబో పోర్టుకు పంపడంలో విజయం సాధించింది. ఇది కూడా చదవండి: గ్రీన్ టపాసులూ హానికరమే? అధ్యయనంలో ఏం తేలింది? -
భారత్-శ్రీలంకల ‘కచ్చతీవు’ వివాదం ఏమిటి? ఇందిరాగాంధీని ఎందుకు తప్పుబడుతున్నారు?
ఆమధ్య ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో మన దేశానికి దక్షిణాన ఉన్న కచ్చతీవు ద్వీపం గురించి ప్రస్తావించారు. భారత్- శ్రీలంక మధ్య పాక్ జలసంధిలో ఉన్న ఈ ద్వీపం గత కొన్నేళ్లుగా భారతదేశంలో చర్చనీయాంశంగా ఉంది. ఈ ద్వీపం గురించి ప్రధాని మాట్లాడుతూ 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కచ్చతీవును శ్రీలంకకు కానుకగా ఇచ్చారని, అయితే ఈ ద్వీపం భారత్‌లో భాగమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రామేశ్వరంనకు 12 మైళ్ల దూరంలో.. కచ్చతీవు ద్వీపం భారతదేశంలోని రామేశ్వరం- శ్రీలంక ప్రధాన భూభాగం మధ్య పాక్ జలసంధిలో ఉన్న జనావాసాలు లేని ఒక ద్వీపం. ఇక్కడ చుక్క నీరు కూడా దొరకదు. ఈ ద్వీపం బంగాళాఖాతం- అరేబియా సముద్రాలను కలుపుతుంది. కచ్చతీవు భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం నుండి 12 మైళ్ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాలోని నెందురికి 10.5 మైళ్ల దూరంలో ఉంది. 285 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపం 300 మీటర్ల వెడల్పు కలిగివుంది. ఇది కూడా చదవండి: అంతరిక్షంలోకి వెళితే వయసు పెరగదా? ‘నాసా’ పరిశోధనలో ఏమి తేలింది? 14వ శతాబ్దంలో అగ్నిపర్వత విస్ఫోటనం ఈ ద్వీపంలో మత్స్యకారుల ఆరాధనా స్థలం సెయింట్ ఆంథోనీ చర్చి కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఈ చర్చిలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ ఉత్సవాలలో భారత్, శ్రీలంకకు చెందిన మత్స్యకారులు పాల్గొంటారు. ఇక్కడి పగడపు దిబ్బల కారణంగా భారీ ఓడలు ఈ ప్రాంతంలో ప్రయాణించలేవు. 14వ శతాబ్దంలో అగ్నిపర్వత విస్ఫోటనం తర్వాత ఈ ద్వీపం ఏర్పడిందని చెబుతారు. ఈ ద్వీపానికి సంబంధించి భారత్, శ్రీలంకల మధ్య ఎంతో కాలంగా వివాదం నడుస్తోంది. బ్రిటిష్ పాలనా కాలంలో భారత్, శ్రీలంకకు చెందిన మత్స్యకారులు ఈ ద్వీపంలో చేపలు పట్టేవారు. ఈ ద్వీపం రామనాథపురం రాజు ఆధీనంలో ఉండేది. తరువాత భారతదేశంలో బ్రిటిష్ పాలన కొనసాగినప్పుడు ఇది మద్రాసు ప్రెసిడెన్సీలోకి చేరింది. 1974-76లో ఇరు దేశాల మధ్య ఒప్పందం 1921లో ఈ ద్వీపానికి సంబంధించి శ్రీలంక, భారత్‌ల మధ్య ఒప్పందం జరిగినా ఫలితం లేకపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ దీవి గుర్తింపు విషయంలో ఇరు దేశాల మధ్య ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 1970వ దశకంలో, భారతదేశం- శ్రీలంక మధ్య సముద్ర సరిహద్దు నిర్ధారణపై చర్చలు ప్రారంభమైనప్పుడు, 1974-76లో ఇరు దేశాల మధ్య తుది ఒప్పందం కుదిరింది. ఆ సమయంలో ఇందిరాగాంధీ భారత ప్రధానిగా, శ్రీమావో బండారునాయకే శ్రీలంక అధ్యక్షులుగా ఉన్నారు. ఈ ఒప్పందం ప్రకారం కచ్చతీవు ద్వీపం శ్రీలంకకు చెందుతుంది. నాటి ఒప్పందం ప్రకారం భారతీయ మత్స్యకారులు వీసా లేకుండా ఈ ద్వీపంలో విశ్రాంతి తీసుకోవడానికి, వలలు ఆరబెట్టడానికి, సెయింట్ ఆంథోనీ పండుగను జరుపుకోవడానికి అనుమతి ఉంది. అయితే 2010లో ఎల్టీటీఈ తిరుగుబాటు ముగిసిన తరువాత శ్రీలంక మత్స్యకారులు ఈ ప్రాంతంలో చేపలు పట్టడం ప్రారంభించారు. అయితే శ్రీలంక నేవీ ఈ ప్రాంతంలో భారతీయ మత్స్యకారుల రాకను నిలిపివేసింది. దీనిపై వివాదాలు తలెత్తేవి. సుప్రీం కోర్టుకు చేరిన వివాదం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించడంపై చాలాకాలంగా వ్యతిరేకత ఉంది. 1991లో తమిళనాడు శాసనసభలో ద్వీపాన్ని తిరిగి భారతదేశంలో చేర్చాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. 2008లో అప్పటి జయలలిత ప్రభుత్వం ఈ విషయమై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఈ అంశం సుప్రీంకోర్టులో ఇంకా పరిశీలనలో ఉంది. తమిళనాడు డిఎంకె, ఐడిఎంకె పార్టీలు ఈ అంశాన్ని తరచుగా లేవనెత్తుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ కూడా లోక్‌సభలో కచ్చతీవును అంశాన్ని ప్రస్తావించారు. ఈ ద్వీపానికి సంబంధించి ఇందిరా గాంధీ ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా ఉల్లంఘిస్తే, శ్రీలంక భారత్‌ను అంతర్జాతీయ కోర్టుకు లాగుతుందనే వాదన వినిస్తున్నది. కచ్చతీవు విషయంలో ప్రధాని మోదీ ఎలాంటి వైఖరిని అవలంబిస్తారో వేచి చూడాలి. ఇది కూడా చదవండి: లక్షల్లో ఉద్యోగం వదిలేశాడు.. 200కెఫెలు.. రూ. 100 కోట్ల టర్నోవర్! -
పాకిస్థాన్ డ్రగ్స్‌ను పట్టుకున్న భారత్
చెన్నై: తూత్తుకుడికి దక్షిణ ప్రాంతం నుంచి శ్రీలంక వెళ్తున్న పడవ నుంచి 100 కిలోల హెరాయిన్‌తో సహా మాదకద్రవ్యాలను భారతీయ కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుంది. నిఘా వర్గాల సమాచారం మేరకు, నవంబర్ 17 నుంచి సుదీర్ఘమైన, నిరంతర ప్రయత్నాలు చేసి పట్టుకున్నామని అధికారులు బుధవారం చెప్పారు. కరాచీ నుంచి శ్రీలంకకు మాదకద్రవ్యాలను ఎగుమతి చేసి, అక్కడి నుంచి పాశ్చాత్య దేశాలకు, ఆస్ట్రేలియాకు ఎగుమతి చేస్తున్నారు. పాకిస్తాన్ జిహాద్‌తోపాటు మాదకద్రవ్యాలను కూడా ఎగుమతి చేస్తుంది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికే ఈ ఎగుమతులు చేస్తున్నారని ఒక అధికారి తెలిపారు. 99 ప్యాకెట్ల హెరాయిన్ (100 కేజీలు), 20 చిన్న బాక్సులలో సింథటిక్ డ్రగ్స్, ఐదు 9 ఎంఎం పిస్టల్స్, ఒక తురాయ సెట్‌ను ఖాళీ ఇంధన ట్యాంక్ లోపల ఉంచి ఐసిజి షిప్ ద్వారా ఎగుమతి చేస్తున్నారని మరో అధికారి తెలిపారు. పడవ కెప్టెన్‌తో సహా ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో శ్రీలంక నావికాదళం నుంచి ఒక సందేశం కూడా వచ్చిందని ఒక అధికారి తెలిపారు. ఈ పడవ శ్రీలంకకు పశ్చిమ తీరంలో ఉన్న నెగోంబోలోని అలెన్సు కుట్టిగే సిన్హా దీప్తా సాని ఫెర్నాండోకు చెందినదిగా గుర్తించారు. -
26 మంది భారత జాలర్ల అరెస్ట్
రామేశ్వరం (తమిళనాడు): శ్రీలంక నేవీ అధికారులు భారత్ కి చెందిన 26 జాలర్లను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తమిళనాడులోని రామేశ్వరానికి సమీపాన ఉన్న కోడైకరిలో చేపల వేటకు వెళ్లిన ఈ జాలర్లను శ్రీలంక అధికారులు అరెస్టు చేశారు. నాగపట్నానికి చెందిన 17 మంది జాలర్లు రెండు పడవలలో, కరైకల్‌కు చెందిన మరో 9 మంది ఓ పడవలో నిన్న చేపల వేటకు సముద్రంలో దిగారు. చేపల వేటకు సముద్రంలోకి దిగిన జాలర్లతో పాటు వారి పడవలను శ్రీలంకకు తీసుకెళ్లారని కరైకల్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాల్ పేర్కొన్నారు. మన జాలర్లు శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించినందుకు అరెస్టు చేసి ఉండోచ్చునని ఆయన అన్నారు.