రామేశ్వరం (తమిళనాడు): శ్రీలంక నేవీ అధికారులు భారత్ కి చెందిన 26 జాలర్లను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తమిళనాడులోని రామేశ్వరానికి సమీపాన ఉన్న కోడైకరిలో చేపల వేటకు వెళ్లిన ఈ జాలర్లను శ్రీలంక అధికారులు అరెస్టు చేశారు. నాగపట్నానికి చెందిన 17 మంది జాలర్లు రెండు పడవలలో, కరైకల్కు చెందిన మరో 9 మంది ఓ పడవలో నిన్న చేపల వేటకు సముద్రంలో దిగారు.
చేపల వేటకు సముద్రంలోకి దిగిన జాలర్లతో పాటు వారి పడవలను శ్రీలంకకు తీసుకెళ్లారని కరైకల్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాల్ పేర్కొన్నారు. మన జాలర్లు శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించినందుకు అరెస్టు చేసి ఉండోచ్చునని ఆయన అన్నారు.