perumal
-
కూతురి పెళ్లి... పెరుమాళ్ కోసం...!
అది తమిళనాడు రాష్ట్రం, రామేశ్వరం దగ్గరున్న ఓ చిన్న పల్లెటూరు. అక్కడ పెయింటింగ్ ని జీవనోపాధిగా చేసుకుని జీవించే ఓ పెయింటర్ ఉండేవాడు. అతడికి పెళ్ళి కావాల్సిన కూతురు ఉండేది. బి.ఏ., డిగ్రీ మాత్రమే చదివిన ఆ అమ్మాయి అందం కూడా అంతంత మాత్రమే. అయినా పెద్ద మొత్తాల్లో జీతం తీస్తున్న ఇంజినీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు పెళ్ళి చేసుకుంటామని ముందుకు వచ్చారు. పెళ్ళి కూతురు, ఆమె తల్లి వచ్చిన సంబంధాల పట్ల ఆసక్తి ప్రదర్శించినా పెయింటర్ ఒప్పుకోలేదు. ‘‘వయసైతోంది, మీరు బిడ్డకి పెళ్ళి చేయాలని ఉన్నారా, లేదా?’’ అని భర్తని గట్టిగా అడిగింది పెయింటర్ భార్య. అతడు నవ్వి ఊరకున్నాడు. వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి పంపించేస్తున్నాడన్న విషయం తెలిసి బంధువులు అతడిని తిట్టిపోశారు. అయినా అతడు పట్టించుకోలేదు. చివరికి మిత్రుల ద్వారా తిరుపతి నుంచి ఓ సంబంధం వచ్చింది. పెళ్ళికుమారుడు చిన్న వ్యాపారి. ఆదాయం అంతంత మాత్రమే. అయినా దానికి వెంటనే అంగీకరించాడు పెయింటర్. ఆశ్చర్యపోయారు పెయింటర్ కుటుంబ సభ్యులు.‘ఇక్కడ పెళ్ళికుమారులు దొరక్కనా, పది గంటలకు పైగా ప్రయాణ దూరమున్న తిరుపతి సంబంధం చేసుకుంటున్నాడు’ అని బంధువులు ముక్కు మీద వేలు వేసుకున్నారు. పెయింటర్ ఎవ్వరి మాటలకీ స్పందించ లేదు. పెళ్ళి పనుల్లో పడ్డాడు. పెళ్ళి కూడా తిరుపతిలోనే పెట్టుకున్నారు. పెళ్ళిరోజు రానే వచ్చింది. అమ్మగారి ఇంటినుంచి వెళ్ళిపోతున్నామనే బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ పెళ్ళికూతురు తండ్రిని ఇలా అడిగింది.‘‘నాన్నా... మన రామేశ్వరం పక్కనే ఎన్నో మంచిమంచి సంబంధాలు వచ్చాయి. వాటికి నువ్వు ఒప్పుకోలేదు. రాష్ట్రం కాని రాష్ట్రం. పరిచయం లేని ప్రాంతం, దూరాభారం. తెలియని భాష. అయినా ఈ కొత్త సంబంధానికి సుముఖత చూపావు, కారణమేమి?’’ అని. ఎదురుగా కనిపిస్తున్న శేషాచలం కొండల్ని చూపిస్తూ ఇలా చెప్పాడు అతడు– ‘‘ఏడాదికి ఒక్కసారైనా, పెరుమాళ్ ని చూడాలని ఉంటుంది నాకు. అయితే... నోట్లోకి నాలుగేళ్ళు పోయే సంపాదన నాది. ఆ సంపాన కోసమే నా సమయమంతా సరిపోయేది. ఉన్న ఊరు వదిలేదానికి కుదిరేది కాదు. స్వామి వారి దర్శనభాగ్యం వాయిదాలు పడేది. కూతురైన నువ్వు తిరుపతిలో ఉంటే నిన్ను చూడాలని అనిపించినప్పుడల్లా తిరుపతి వస్తాము. అలాగైనా అపుడప్పుడూ స్వామి దర్శన భాగ్యం చేసుకోవచ్చని నా ఆశ. అందుకే ఈ సంబంధం ఒప్పుకున్నాను’’అని. తండ్రికి స్వామివారి పట్ల ఉన్న భక్తికి ఆశ్చర్యపోయింది పెళ్ళికూతురు. అక్కడే ఉన్న బంధుమిత్రులందరూ శేషాచలం కొండల వైపు తిరిగి గోవిందలు పలికారు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
‘ఎర్ర’డాన్ పెరుమాల్ అరెస్టు
చిత్తూరు అర్బన్: అంతర్ రాష్ట్ర స్మగ్లర్, తమిళనాడుకు చెందిన ‘ఎర్ర’డాన్ ఎం.పెరుమాల్‌ను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.2.50 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలు, రూ.50 లక్షల విలువైన 4 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఎస్పీ రిషాంత్‌రెడ్డి, ఏఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి బుధవారం చిత్తూరులో మీడియాకు వెల్లడించారు. తిరుపతి–బెంగళూరు బైపాస్‌రోడ్డులోని చెర్లోపల్లె క్రాస్ వద్ద చిత్తూరు తూర్పు సీఐ కె.బాలయ్య, తాలూకా ఎస్ఐ రామకృష్ణ, గుడిపాల ఎస్ఐ రాజశేఖర్ బుధవారం తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో తిరుపతి నుంచి వేలూరు వైపు వస్తున్న మూడు కార్లు, ఓ ఐచర్ వ్యాను ఒక్కసారిగా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. వాహనంలో ఉన్న తమిళనాడులోని ఇరుంబలికి చెందిన పెరుమాల్‌తో పాటు ఆరణికి చెందిన సి.వేలును అరెస్టు చేశారు. మరో 8 మంది పరారయ్యారు. నిందితుల నుంచి నాలుగు వాహనాలతో పాటు రూ.2.50 కోట్ల విలువ చేసే ఎర్రచందనం ఏ–గ్రేడు దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 14 కేసుల్లో నిందితుడు.. 33 ఏళ్ల పెరుమాల్.. 2014 నుంచే శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం చెట్లను కూలీలతో నరికించి స్మగ్లింగ్ చేయడం మొదలుపెట్టాడు. 14 కేసుల్లో నిందితునిగా ఉన్న పెరుమాల్ ఏడేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్నాడు. 2015లో ఎర్రచందనం స్మగ్లింగ్‌లో విబేధాలు రావడంతో చిన్నయప్పన్ అనే వ్యక్తిని పెరుమాల్ హత్య చేశాడు. స్మగ్లింగ్ ద్వారా దాదాపు రూ.300 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆరణిలో రూ.10 కోట్ల విలువైన ఇళ్లు, ఇరుంబలిలో వ్యవసాయ భూములు, కొప్పంలో రూ.20 కోట్ల విలువైన ఇళ్లతో పాటు తిరువన్నామలై జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తులున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి ఆస్తులను అటాచ్ చేయడంతో పాటు పీడీ యాక్టు పెట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. -
ప్రాణం తీసిన చేపల పులుసు
ఐదుగురి పరిస్థితి విషమం కేకే.నగర్: అరుదైన జాతికి చెందిన చేపల పులుసును ఇష్టంగా తిన్న రైతు అస్వస్థతకు గురై మృతి చెందగా మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కడలూరు జిల్లా బన్రుట్టి కుడుమియాన కుప్పం ప్రాంతానికి చెందిన నారాయణ స్వామి(50) రైతు. ఆదివారం రాత్రి నత్తం గ్రామానికి అమ్మకానికి వచ్చిన అరుదైన జాతికి చెందిన చేపలు కొని భార్య పార్వతికి ఇచ్చి పులుసు చేయమని చెప్పాడు. రాత్రి 10 గంటలకు నారాయణ స్వామి అతని భార్య పార్వతి, మామ పెరుమాళ్(70), అత్త నాగామ్మా(65) చెల్లెలు ఇందిర(30). ఆరుగురు చేపల పులుసుతో అన్నం తిన్నారు. తిన్న కొన్ని నిమిషాలకే వారందరూ వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. ఇరుగుపొరుగువారు వారిని అంబులెన్స్ ద్వారా బన్రుట్టి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ముండియపాక్కం ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం పుదుచ్చేరి జిప్మర్లో చేర్పించారు. అక్కడ చికిత్సలు ఫలించక పెరుమాల్ మృతి చెందాడు. మరో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై బన్రుట్టి పుదుచ్చేరి పోలీసులు కేసు నమోదు చేసుకుని నత్తం గ్రామానికి చెందిన చేపల వ్యాపారి వద్ద విచారణ చేస్తున్నారు. -
ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి
బెరైడ్డిపల్లి మండలం వెంగంవారిపల్లి సమీపంలోని అటవీప్రాంతంలో ఏనుగులు దాడి చేసి ఓ వ్యక్తిని చంపేశాయి. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగినట్లు అనుమానిస్తున్నారు. వెంగంవారిపల్లి గ్రామానికి చెందిన పెరుమాల్(50) మంగళవారం ఉదయం అడవిలోకి వెళ్లాడు. రాత్రి 7 గంటలైనా తిరిగి రాకపోవడంతో బుధవారం ఉదయం గ్రామస్తులు అడవిలోకి వెళ్లి గాలించడంతో ఆయన మృతదేహం లభ్యమైంది. ఏనుగులు తొక్కి చంపేసినట్లుగా గ్రామస్తులు గుర్తించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
26 మంది భారత జాలర్ల అరెస్ట్
రామేశ్వరం (తమిళనాడు): శ్రీలంక నేవీ అధికారులు భారత్ కి చెందిన 26 జాలర్లను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తమిళనాడులోని రామేశ్వరానికి సమీపాన ఉన్న కోడైకరిలో చేపల వేటకు వెళ్లిన ఈ జాలర్లను శ్రీలంక అధికారులు అరెస్టు చేశారు. నాగపట్నానికి చెందిన 17 మంది జాలర్లు రెండు పడవలలో, కరైకల్‌కు చెందిన మరో 9 మంది ఓ పడవలో నిన్న చేపల వేటకు సముద్రంలో దిగారు. చేపల వేటకు సముద్రంలోకి దిగిన జాలర్లతో పాటు వారి పడవలను శ్రీలంకకు తీసుకెళ్లారని కరైకల్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాల్ పేర్కొన్నారు. మన జాలర్లు శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించినందుకు అరెస్టు చేసి ఉండోచ్చునని ఆయన అన్నారు.