బెరైడ్డిపల్లి మండలం వెంగంవారిపల్లి సమీపంలోని అటవీప్రాంతంలో ఏనుగులు దాడి చేసి ఓ వ్యక్తిని చంపేశాయి.
బెరైడ్డిపల్లి మండలం వెంగంవారిపల్లి సమీపంలోని అటవీప్రాంతంలో ఏనుగులు దాడి చేసి ఓ వ్యక్తిని చంపేశాయి. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగినట్లు అనుమానిస్తున్నారు. వెంగంవారిపల్లి గ్రామానికి చెందిన పెరుమాల్(50) మంగళవారం ఉదయం అడవిలోకి వెళ్లాడు. రాత్రి 7 గంటలైనా తిరిగి రాకపోవడంతో బుధవారం ఉదయం గ్రామస్తులు అడవిలోకి వెళ్లి గాలించడంతో ఆయన మృతదేహం లభ్యమైంది. ఏనుగులు తొక్కి చంపేసినట్లుగా గ్రామస్తులు గుర్తించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.