చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం
Published Mon, Oct 31 2016 11:42 AM | Last Updated on Tue, Oct 2 2018 6:42 PM
వీకోట: చిత్తూరు జిల్లా వీకోట మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మద్దిమాకులపల్లిలో ఐదు ఏనుగులు సోమవారం తెల్లవారుజామున పంటలపై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. పదిమంది రైతులకు చెందిన సుమారు 15-20 ఎకరాల్లోని వరి మడి, క్యాబేజీ, బీన్స్ పంటలను అవి ధ్వంసం చేశాయి. దీంతో రైతులకు రూ.5 నుంచి రూ.7 లక్షల వరకు నష్టం వాటిల్లింది. అటవీ అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement