వీడియో దృశ్యం
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని ఆంధ్రా-తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో ఏనుగుల గుంపు కలకలం రేపింది. పదుల సంఖ్యలో ఏనుగులు పంట పొలాల్లోకి రావటంతో జనాలు భయభ్రాంతులకు లోనయ్యారు. ఏనుగుల కారణంగా పలు చోట్ల అరటి తోటలు నాశనమయ్యాయి. గంగాధర నెల్లూరు మండలం కోట్రకోనలో అరటి, మామిడి పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగులు తరుచుగా తమ పంటపొలాలపై దాడులు చేస్తుండటంతో బాధిత రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం ఏనుగుల గుంపునకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ( ఏనుగు వస్తే సైరన్ మోగుతుంది!)
ఓ వీడియోలో.. తమిళ గ్రామంలోని ఓ అరటి తోటలో పదుల సంఖ్యలో ఏనుగులు వెళుతున్నాయి. దూరంగా ఉన్న జనం వాటిని చూస్తూ.. ‘‘పరిగెత్తండిరా!.. పరిగెత్తండి!!. శబ్ధం చేయకండయ్యా!.. గమ్మునుండండయ్యా.. ఏయ్ గమ్మునుండండి.. కుత్తు అరటి తోటలో ఏనుగులు పడ్డాయయ్యోయ్!!’’ అంటూ అరుస్తూ ఉన్నారు. 30 సెకన్ల ఈ వీడియోలో భారీ ఏనుగుల గుంపును మనం చూడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment