బావిలో పడిన ఏనుగు
గంగవరం : మండలంలోని కీలపట్ల పంచాయతీ గాంధీనగర్ వ్యవసాయ పొలాల్లోని బావిలో ప్రమాదవశాత్తు ఏనుగు పడిపోయింది. బుధవారం రాత్రి పొలాల్లోకి వచ్చిన ఏనుగును గమనించిన రైతులు పెద్దగా కేకలు వేయడంతో పరుగులు తీస్తూ నీరు లేని నేల బావిలోకి జారిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న ఇన్‌చార్జ్ ఎఫ్‌ఆర్‌ఓ కృష్ణప్రసాద్ తమ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. గురువారం ఉదయం జేసీబీతో బావిలోకి దారి చేసేందుకు యత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఏనుగును బంధించి జూ పార్క్‌కు తరలించాలని డిమాండ్ చేశారు.
దీంతో జిల్లా అటవీశాఖ అధికారి సునీల్‌కుమార్‌రెడ్డి గ్రామానికి చేరుకుని స్థానికులతో చర్చించారు. ఏనుగు పొలాల్లోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం రైతుల అనుమతితో బావిలో నుంచి దారి ఏర్పాటు చేశారు. దీంతో ఏనుగు సురక్షితంగా బయటకు వచ్చి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment