వి.కోట: చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో ఏనుగుల గుంపు భీభత్సం సృష్టించాయి. మండలంలోని కొత్తకోట, పుదుగుడ్డ, రామకుప్పం, నన్యాల, పొద్దూరులో గురువారం అర్ధరాత్రి నుంచి ఏనుగులు దాడులు చేస్తున్నాయి. వరి, బీన్స్, టమాట, రాగి పంటలపై దాడి చేసి నాశనం చేశాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది. స్థానిక గ్రామాల ప్రజలు ఇళ్ల బయటకు రావడానికి భయపడుతున్నారు. ఏనుగుల దాడులపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.