
సాక్షి, అన్నమయ్య: పుంగనూరులో టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల దాడులకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రేపు చిత్తూరు జిల్లా బంద్‌కు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, పోలీసులపై దాడులకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చింది.
కాగా, పుంగనూరులో శుక్రవారం టీడీపీ శ్రేణులు కర్రలతో, రాళ్లతో దాడికి దిగారు. పథకం ప్రకారమే పోలీసులపై దాడి చేశారు. బీర్ బాటిళ్లు, కర్రలు, రాళ్లతో టీడీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేశారు. టీడీపీ శ్రేణుల రాళ్ల దాడిలో 50 మందికిపైగా గాయపడ్డారు. రెండు పోలీసు వాహనాలను తగలబెట్టారు. ఇక, చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.
టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతూ అగ్నికి మరింత ఆజ్యం పోశారు. పోలీసులపై అసభ్యకర పదజాలం వాడుతూ దూషించారు. టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు, పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: టీడీపీ దాడులపై ఎస్పీ రిషాంత్ సంచలన కామెంట్స్