
సాక్షి, తాడేపల్లి: మదనపల్లె అగ్ని ప్రమాదం కేసును పక్కదారి పట్టించారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసుకుని విచారణ జరుగుతోందన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అక్కడ ఉన్న రికార్డులు కలెక్టర్ ఆఫీసులో కూడా ఉంటాయి. ప్రమాద సమయంలో టీడీపీకి చెందిన వ్యక్తి అక్కడే ఉన్నాడు’’ అని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.
‘‘రెండు నెలలు గడిచినా మేనిఫెస్టో అమలు చేయడం లేదు. తల్లికి వందనం అడ్రెస్ లేదు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 15 వందలు ఇచ్చేదెప్పుడు?. ఏ పథకాన్నీ అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయటం సరికాదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లటమే పనిగా పెట్టుకోవద్దు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొద్దు’’ అంటూ గడికోట శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment