Gadikota Srikanth Reddy
-
దేవుడిపై కూడా బాబు రాజకీయాలే: గడికోట శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం స్థాయిలో చంద్రబాబు మాటలు బాధ కలిగించాయని అన్నారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. దేవుడిని కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలను బాబు భయబ్రాంతులకు గురిచేశారని విమర్శలు గుప్పించారు. ప్రతి 6 నెలలకోసారి టెండర్ల ద్వారా నెయ్యి సేకరణ జరుగుతుందని, ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని పరిశీలించిన తర్వాతే వినియోగిస్తారని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం గడికోట మాట్లాడుతూ.. కేవలం రాజకీయం కోసమే చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారని అన్నారు. శ్రీవారిని అడ్డం పెట్టుకొని పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. జులైలో వచ్చిన రిపోర్ట్‌ను సెప్టెంబర్‌లో బయటపెట్టారని, తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం మంచిది కాదని తెలుసుకోవాలని హితవు పలికారు.చదవండి: బాబూ.. భక్తుల మనోభావాలతో ఆడుకుంటావా?: మాజీ మంత్రి కాకాణి‘నెయ్యి ట్యాంకర్లను మూడు దశల్లో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత కూడా లడ్డూ తయారీకి ఎలా పంపించారు?. ఒక కేజీ నెయ్యి తయారు చేయాలంటే 40 లీటర్ల పాలు అవసరం. ప్రతిరోజూ ఇలాంటి నెయ్యి 30 లీటర్లను అభిషేకం చేస్తారు. ఈ పద్ధతిలో 50 టన్నుల నెయ్యి తయారు చేయలేము. నైవేద్యం తయారీకి పవిత్రమైన నెయ్యిని వాడతారు. అభిషేకానికి, నైవేద్యానికి, దీపాలకు పవిత్రమైన నెయ్యిని ఉపయోగిస్తారు.వెన్నతో నవనీత సేవ కోసం కొండపైనే అవులను పెంచి వెన్నను తయారు చేస్తున్నారు. జూన్‌లో వచ్చిన నెయ్యి ని వెనక్కి పంపించకుండా అదే నెయ్యితో లడ్డూ ఎలా తయారు చేయించారు ?తప్పు చంద్రబాబు చేశారు.. డ్రామాలు ఎన్ని రోజులు చేస్తారు?. సెంటిమెంట్ క్రియేట్ చేసి తిరుమలను కలుషితం చేసే కుట్రలు చేస్తున్నారు. ప్రత్యర్థులపై చంద్రబాబు నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. మహానేత రాజశేఖర్ రెడ్డి.. వేద పాఠశాలను ప్రారంభించారు. 2014 - 2019 వరకు దేవాలయాలకు ఎన్ని నిధులు కేటాయించారు? 2019 - 2024 వరకు ఎన్ని నిధులు మంజూరు చేశారు ?. స్టీల్ ప్లాంట్, వరద నష్టం, మెడికల్ కాలేజీ, వంద రోజుల పాలన అంశాలను దృష్టి మళ్లించడానికి.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారునింద వేయడమే మా విధానం అన్నట్లుగా ఉంది చంద్రబాబు తీరు. వైఎస్సార్సీపీని భుజాన వేసుకొని మాట్లాడటానికి రాలేదు. శ్రీవారి భక్తుడిగా మాట్లాడుతున్నా. చిత్తశుద్ధి లోపించినప్పుడు ఇలాంటి పనులు చేస్తారు. సెంటిమెంట్‌కు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి. తాపత్రయ పడి తిరుమలను రోడ్డున పడేయకుండి. అందరూ బాధ్యతగా వ్యవహరించాలి. తిరుమలలో ఏ తప్పూ జరగలేదు. జరిగిన ప్రచారానికి ఇకనైనా ఫుల్‌స్టాఫ్ పెట్టాలి. వాస్తవాలను వక్రీకరించకుండా నిజాలని ప్రజలకు తెలియజేసే విధంగా విచారణ జరపాలి. రాజకీయ కోణంలో చూడొద్దు. తిరుమలలో పూజ విధానం జియ్యర్ల ద్వారానే జరుగుతోంది’ అని గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. -
పెద్దిరెడ్డే టార్గెట్.. మదనపల్లె కేసు పక్కదారి: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: మదనపల్లె అగ్ని ప్రమాదం కేసును పక్కదారి పట్టించారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసుకుని విచారణ జరుగుతోందన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అక్కడ ఉన్న రికార్డులు కలెక్టర్ ఆఫీసులో కూడా ఉంటాయి. ప్రమాద సమయంలో టీడీపీకి చెందిన వ్యక్తి అక్కడే ఉన్నాడు’’ అని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.‘‘రెండు నెలలు గడిచినా మేనిఫెస్టో అమలు చేయడం లేదు. తల్లికి వందనం అడ్రెస్ లేదు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 15 వందలు ఇచ్చేదెప్పుడు?. ఏ పథకాన్నీ అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయటం సరికాదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లటమే పనిగా పెట్టుకోవద్దు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొద్దు’’ అంటూ గడికోట శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు. -
చంద్రబాబు, నారాలోకేష్ పై ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
విభజన హామీలు నెరవేర్చమంటే ఎదురు దాడేంటి?
బద్వేలు అర్బన్: విభజన చట్టంలో పొందుపర్చిన ప్రత్యేక హోదా, దుగరాజపట్నం పోర్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాలను నెరవేర్చమని అడిగితే.. వాటికి సమాధానం చెప్పకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎదురు దాడికి దిగి వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జునతో కలిసి మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన చట్టంలో పొందుపర్చిన అం శాలను నెరవేరిస్తే బీజేపీకి మద్దతు ఇస్తామని, లేనిపక్షంలో క్షమాపణ చెప్పాలని అడిగిన తనకు బీజేపీ నేతల నుంచి సమాధానం వస్తుందని ఆశించానని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. దీనికి సమాధానం చెప్పకుండా వీర్రాజు ఎదురు దాడి చేస్తూ తనపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారన్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు,నాగార్జున మాట్లాడారు. -
అజ్ఞాతంలోకి చంద్రబాబు
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం వైఎస్ జగన్ లేఖ రాసిన రోజు నుంచీ టీడీపీ అధినేత చంద్రబాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని.. అప్పటి నుంచీ ఆయన ఎక్కడున్నాడు? ఏ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు.. ఎవరితో ఏం మాట్లాడుతున్నాడనేది ప్రజలకు అర్ధమవుతూనే ఉందని ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి భూములపై చంద్రబాబు సీబీఐ విచారణను ఎందుకు కోరడంలేదని.. అదంటే ఆయనకు భయమెందుకని ప్రశ్నించారు. అక్కడ తన బినామీ భూముల వ్యవహారం లేకపోతే తండ్రీకొడుకులు సీబీఐ విచారణ కోరవచ్చు కదా? అని అన్నారు. చంద్రబాబు ఇంటిని ముంచేయాలనుకుంటున్నారని వికృత రాతలు రాస్తున్న చంద్రబాబు తోకపత్రికకు శ్రీకాంత్ ఘాటుగా బదులిచ్చారు. బాబు ఇంటి కోసం నీరంతా వదిలేసి, ప్రకాశం బ్యారేజీ ఖాళీగా ఉంచాలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వర్షాలు పుష్కలంగా కురిసి రిజర్వాయర్లన్నీ నిండుగా ఉంటే కడుపు మంటతో ఏడ్చే చంద్రబాబు, లోకేశ్‌ను ఏమనాలి? అని వ్యాఖ్యానించారు. ఒక్క రూపాయి ఇవ్వని చంద్రబాబు చంద్రబాబు హయాంలో 14 లక్షల ఎకరాల పంట నష్టపోయినా ఒక్క రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని.. సీఎం జగన్ వచ్చాక, ఆ బకాయిలన్నింటినీ రైతులకు చెల్లించారని గడికోట గుర్తుచేశారు. గత పదేళ్లలో ఎన్నడూలేని విధంగా రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చి వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. 2009 తర్వాత మళ్లీ ఇప్పుడే పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని.. కృష్ణా నదిలోకి 9 లక్షల క్యూసెక్కుల వరద వస్తోందని.. వైఎస్సార్సీపీ నేతలంతా ప్రజల్లో ఉండి వారికి అండగా నిలబడ్డారని.. కానీ, చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని బురదజల్లుతున్నారని మండిపడ్డారు. -
‘పేదలకు ఇంగ్లీష్ మీడియం.. సొంత ఇల్లు వద్దా?’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి రాయచోటిలోని ఎన్జీవో హోంలో సోమవారం గ్రామ, వార్డు సచివాలయాల సెక్రటరీలతో ముఖాముఖి నిర్వహించారు. వారికి పలు సూచనలు చేశారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పాలన మరింత సులభతరం అయ్యిందన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికి దక్కాలని.. లబ్దిదారుల పట్ల నిర్లక్ష్యం తగదని తెలిపారు. అర్హులైన వారికి అన్యాయం జరిగితే సచివాలయ సిబ్బందిదే నైతిక బాధ్యత అని హెచ్చరించారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే పై అధికారులకు వెంటనే తెలియజేయాలన్నారు. అనంతరం శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ చేయని విధంగా తమ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం రోజుకు 30వేల పరీక్షలు నిర్వహిస్తోందని తెలిపారు. 10లక్షలకు పైగా పరీక్షలు చేయడం, పెద్ద సంఖ్యలో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, కోవిడ్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలబడిందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనాను ఎదుర్కొంటూనే సంక్షేమం, అభివృద్దిని రెండు కళ్ళలాగ చేసుకోని పనిచేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ప్రశంసించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాదిరి సంక్షేమాల షెడ్యూల్ ఇచ్చిన సీఎంలను గతంలో ఎప్పుడు చుసిందిలేదన్నారు శ్రీకాంత్ రెడ్డి. ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమం కోసం పేదలంతా కళ్ళల్లో వత్తులు వేసుకోని ఎదురు చూస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తలపెట్టిన అన్ని అభివృద్ది కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డుపడుతున్నదని విమర్శించారు. పేద ప్రజల సామాజిక, సంక్షేమ అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. పేదవారు ఇంగ్లీష్‌లో చదవకుడదా.. పేదలకు స్వంతిల్లు వద్దా.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేందడం ఇష్టం లేదా అంటూ శ్రీకాంత్ రెడ్డి వరుస ప్రశ్నలు కురిపించారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడుగడుగునా అడ్డుపడటం తెలుగుదేశానికే చేల్లిందన్నారు. పేద ప్రజలకు మంచిచేసే విషయంలో జోక్యమేందుకని స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ప్రశ్నించారని తెలిపారు. పేద ప్రజలకు మంచి జరిగితే తెలుగుదేశం పార్టీ నాయకులకు వచ్చిన నష్టమేంటి అని ఆయన ప్రశ్నించారు. పేద ప్రజలకు మంచి జరగకుడదనే ఉద్దేశంతోనే తెలుగుదేశం స్టేలు తీసుకువస్తుందని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇంద్రభవనంలో విశ్రమించి ఇప్పుడొచ్చారు
సాక్షి, అమరావతి: కోట్లాది రూపాయలతో హైదరాబాద్‌లో నిర్మించుకున్న ఇంద్రభవనంలో రెండు నెలలకుపైగా విశ్రాంతి తీసుకొని చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రంలో అడుగు పెట్టారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీకి రాగానే పూలు జల్లించుకున్న చంద్రబాబు, భౌతిక దూరం పాటించలేదని, టీడీపీ నేతలు మాస్క్‌లు కూడా ధరించలేదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబు మీద ఎన్నికేసులు పెట్టాలని ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఏడాది పాలన బ్రహ్మాండంగా ఉందంటూ దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే సీఎం వైఎస్ జగన్ ఏడాది పాలనపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చర్యలు, ప్రభుత్వం వేగంగా స్పందించిన తీరు, సహాయక కార్యక్రమాలను దేశం మొత్తం ప్రశంసించింది. ► హైదరాబాద్‌లో ఉండి చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లారు. ఇప్పుడు వైజాగ్ వెళ్లి ఏం చేస్తారు. ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖ వెళ్లవచ్చుకదా? కరకట్ట ఇంటికి ఎందుకు వచ్చారు. తాను విశాఖ వెళ్తుంటే ఎయిర్‌పోర్టులు మూసివేశారని దుష్ప్రచారం చేస్తున్నారు. ► ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన జయంతి వేడుకలు ఎలా నిర్వహిస్తారు. ► అందరికీ లబ్ధి చేకూరేలా సీఎం వైఎస్ జగన్ పాలన సాగుతోంది. జగన్‌కు మంచిపేరు వస్తుందనే చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. -
'పచ్చడి మెతుకులు తిని అయినా బతుకుదాం'
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. అష్టకష్టాలు పడుతున్న పరిస్థితిలో సైతం ప్రజల బాగుకోసం రూ. 15 కోట్లు వెచ్చించి ఒక్కొక్క కార్డుకు వెయ్యి రూపాయలు, ఒక నెల వ్యవధిలో మూడు సార్లు ఉచితంగా రేషన్ అందిస్తున్నారు. ప్రజలు కరోనా పట్ల నిర్లక్ష్యం చేయకుండా ఇండ్ల నుంచి బయటికి రావద్దని, ప్రతిరోజు కురగాయలు లేకపోయిన పచ్చడి మెతుకులు అయిన తిని బతుకుదాం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను కూడా ప్రజలు రెండు కాళ్లు పట్టుకొని వేడుకుంటున్నాని తెలిపారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి ఎవరు రావద్దని వెల్లడించారు. పారిశుధ్య కార్మికులు, పోలీసులు, రెవిన్యూ, విద్యుత్ శాఖ సిబ్బంది, వైద్యులు, జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి మీకోసం పోరాడుతున్నారు. ఇటువంటి సమయంలో కులమాతలను బయటికి తీసుకొచ్చి మాట్లాడటం దుర్మార్గం. సామాజిక మాధ్యమాలలో మనోభావాలు దెబ్బతీసేలా తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. (కరోనా : ఇంటింటి సర్వేపై సీఎం జగన్ ఆరా) -
కోడెల మృతికి చంద్రబాబే కారణం
సాక్షి, అమరావతి: బతికున్నప్పుడు హింసించడం, చనిపోయాక శవరాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం అని, అలాంటి నీచ రాజకీయాలు చేయడం వైఎస్సార్సీపీకి చేతకాదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతికి చంద్రబాబే పరోక్ష కారణమని ఆయన దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ కోడెల మృతి బాధాకరమని, వైఎస్సార్సీపీ తరపున ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. కోడెల మరణవార్త విన్నవెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు అందరూ సంతాపం వ్యక్తం చేశారన్నారు. చంద్రబాబు మాత్రం ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కుట్ర చేస్తున్నాడన్నారు. అంత సానుభూతి ఉన్నవ్యక్తే అయితే ఇటీవల కోడెల తీవ్ర అనారోగ్యానికి గురైతే ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. శవం పక్కన నిలబడి రాజకీయమా? కోడెల శివప్రసాద్ మృతి చెందిన తరువాత శవం పక్కన నిలబడి శవరాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాత్రి పగలు తేడా లేకుండా ప్రెస్మీట్లు పెడుతూ అధికార పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కోడెలను మూడు నెలల నుంచి ఒక్కరోజు అయినా పరామర్శించడానికి చంద్రబాబు వెళ్లలేదన్నారు. ఇబ్బందులు ఏమిటని అడగలేదన్నారు. పైగా కోడెలను అవమానించే రీతిలో సత్తెనపల్లి, నరసారావుపేటలో ఆయన వ్యతిరేక గ్రూపును ప్రోత్సహించి పార్టీ కార్యక్రమాలు మీరే చేపట్టండి అని వారికి ఆదేశాలు ఇవ్వడంతోనే కోడెల మానసికంగా కుంగిపోయారని తెలిపారు. కోడెల మృతికి ఒకపక్క ఆయన కొడుకు బాధ్యుడు అయితే.. పరోక్షంగా చంద్రబాబు కారణమన్నారు. కోడెల ఆయన కుమారుడు, కూతురు వల్లే చనిపోయాడని టీడీపీ నేతలే అంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కోడెల విషయమే కాదు.. ఏ అంశంలోనూ తప్పు లేకుండా ఎవరిపై కేసులు పెట్టేందుకు వైఎస్సార్సీపీ ఒప్పుకోదన్నారు. -
జగన్ ఓటు కూడా తీసేయగల సమర్ధుడాయన!
వైఎస్సార్ జిల్లా: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓటు కూడా తీసేయించగల సమర్ధుడు చంద్రబాబు నాయుడని వైఎస్సార్సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం శ్రీకాంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కేవలం వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లనే టార్గెట్ చేసి ఆన్లైన్లో తొలగింపు రిక్వెస్ట్‌లు పెడుతున్నారని వెల్లడించారు. అక్రమాలకు పాల్పడే వారిపై కేసులు పెట్టి విచారిస్తే అది తెలుగు ప్రజలపై దాడి ఎలా అవుతుందో తెలుగు దేశం నేతలు చెప్పాలని ప్రశ్నించారు. నిజంగా ఏపీ ప్రజలకు అన్యాయం జరిగితే మేమూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అక్రమాలకు పాల్పడే వారిని వెనకేసుకు రావడం ఏమిటని ఈ సందర్భంగా సూటిగా అడిగారు. ఈ అక్రమాలపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
‘మహానేత పాలన ఓ స్వర్ణయుగం’
సాక్షి, వైఎస్సార్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ఓ స్వర్ణయుగమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన తనయుడిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి పాలనను మరింత అభివృద్ధి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం వైఎస్సార్ కడప జిల్లా రాయచోటిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్ నవరత్నాల పోస్టర్లను శ్రీకాంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో ప్రతి కుటుంబం ఆనందంగా ఉంటుందని అన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజాసమస్యలు తెలుసుకుని, నవరత్నాలను పొందుపరిచారని తెలిపారు. నవరత్నాలను ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. గత ఎన్నికలలో ఇచ్చిన హమీలు నెరవేర్చని చంద్రబాబును ప్రజలెవ్వరూ నమ్మటంలేదన్నారు. -
‘లోకేష్‌కు కమీషన్లు ఇవ్వలేదని ఆరోగ్యశ్రీని ఆపేశారు’
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగిన ఆరోగ్యశ్రీని ఎందుకు ఆపేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల దగ్గర రేషన్ కార్డ్ ఉంటే చాలు.. ఎక్కడికైనా వెళ్లి వైద్యం చేయించుకోవచ్చనే ధీమా ఉండేదని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా కార్పోరేట్ వైద్యాన్ని పేదల చెంతకు చేర్చిన ఘనత ఆ మహానేతదే అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పొగిడిన ఆరోగ్యశ్రీని ఏ కారణాల వల్ల ఆపేశారంటూ ప్రశ్నించారు. తమకు చెల్లించాల్సిన రూ. 500 కోట్ల బకాయిలను చెల్లించకపోతే.. నేటి నుంచి ఆరోగ్యశ్రీని నిలిపివేస్తామని ప్రైవేట్ ఆస్పత్రులు తేల్చి చెప్తున్నాయన్నారు. ఆయన కొనసాగిస్తూ.. రాష్ట్రంలో 5 లక్షల మంది ఉద్యోగులు, 3 లక్షల మంది పెన్షన్‌దారులు.. వారి కుటుంబసభ్యులు అందరిని కలుపుకుని మొత్తం 35 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారని ఆరోపించారు. వాస్తవానికి ఉద్యోగులు, పెన్షన్‌దారుల ఆరోగ్యశ్రీ కోసం రూ. 200 కోట్లు ఎలాను చెల్లిస్తున్నారు.. ఇక మిగిలిన రూ. 300 కోట్లు చెల్లించలేరా అంటూ ప్రశ్నించారు. చార్టెడ్ ఫ్లైట్లకు, విదేశీ పర్యటనలకు, దొంగ ధర్మపోరాట దీక్షలకు వందల కోట్లు ఖర్చుపెడుతూ.. పేద వారి వైద్యానికి మాత్రం రూ. 500 కోట్లు ఇవ్వలేకపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నబాబుకు కమీషన్లు అందకపోవడం వల్లనే ఆరోగ్యశ్రీని ఇలా నిర్వీర్యం చేస్నున్నారంటూ ఆరోపించారు. 1995 - 2004 వరకూ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నేడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. దోమలపై దండయాత్ర.. ప్రభుత్వ ఆస్పత్రులలో ఎలుకలు పట్టివేత అంటూ ఇలా ప్రతి చోటా కమీషన్లు మెక్కుతున్నారంటూ శ్రీకాంత్ ఎద్దేవా చేశారు. గతంలో రోమ్ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు.. నేడు నారా చక్రవర్తి కూడా రాష్ట్రంలో తుపాన్ వస్తే తూతూమంత్రంగా సమీక్షలు చేసి చెన్నై వెళ్లి రాజకీయాలు చేస్తున్నారంటూ శ్రీకాంత్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా 3 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే ఆరోగ్యశ్రీ వర్తించదనడం దారుణమాన్నారు. ఆరోగ్యశ్రీని నిలిపివేసి.. సీఎం రిలీఫ్ ఫండ్ అంటూ మీ వర్గం ప్రజలకు మేలు చేస్తున్నారంటూ ఆరోపించారు. అందువల్ల నేడు పేదలు జబ్బు చేస్తే ఆస్పత్రికి కాకుండా టీడీపీ ఎమ్మెల్యే, నాయకుల ఇళ్లమందు పడిగాపులు గాస్తున్నారంటూ విమర్శించారు. ధనికలుతో పాటు పేదలు కూడా కార్పోరేట్ ఆస్పత్రులలో వైద్య సేవలు పొందేలా వైఎస్ ఆరోగ్యశ్రీని తీర్చిదిద్దితే.. నేడు చంద్రబాబు నాయుడు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదవాడి జేబులో రూ. 1000 ఉంటే చాలు.. దేశంలో ఏ పట్నంలో అయినా చికిత్స చేయించుకునేలా ఆరోగ్యశ్రీని తీర్చిదిద్దబోతున్నట్లు తెలిపారు. ప్రైవేల్ ఆస్పత్రులు చాలా రోజుల నుంచి తమకు బకాయిలు చెల్లించలేదని హెచ్చరిస్తూనే ఉన్నాయన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆరోగ్యశ్రీ బకాయిలను విడుదల చేయకుంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. -
కరువు తాండవిస్తుంటే పొరుగు రాష్ట్రంలో రాజకీయాలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీలో దోచుకున్న సొమ్మును తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేశారని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఏపీలో ఎలాగూ ఓడిపోతామని గ్రహించిన చంద్రబాబు ముందు జాగ్రత్తగా హైదరాబాద్‌లో శాశ్వతంగా స్థిరపడదామని భావిస్తున్నట్లుగా ఉందన్నారు. రూ. వంద కోట్లు వెచ్చించి హైదరాబాద్‌లో విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారని వ్యాఖ్యానించారు. మంత్రివర్గం భేటీలో కనీసం చర్చించారా? రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్ర కరువు తాండవిస్తోదని, వర్షాభావ పరిస్థితు లు నెలకొన్నాయని, కేంద్ర బృందం కరువును పరిశీలించిందని గడికోట పేర్కొన్నారు. కేంద్రానికి ఇచ్చిన నివేదికలో వర్షపాతానికి సంబంధించి చంద్రబాబు తప్పుడు లెక్కలు చూ పించారని గడికోట విమర్శించారు. మంత్రివర్గ సమావేశంలో కరువు గురించి చర్చించారా? అని గడికోట సూటిగా ప్రశ్నించారు. వృద్ధి రేటు బాగుందంటారా? రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచన లేదని గడికోట దుయ్యబట్టారు. సైబరాబాద్ రూపశిల్పిని తానేనని, శంషాబాద్ విమానాశ్రయాన్ని కట్టింది కూడా తానేనని తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారని గడికోట విమర్శించారు. శంషాబాద్ విమానాశ్రయం, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే, ఔటర్ రింగురోడ్డు లాంటివన్నీ నిర్మించింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని గడికోట గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ అదే పార్టీతో కలిసిపోవడం సిగ్గుచేటన్నారు. -
తెచ్చిన అప్పులు ఏం చేశారు?
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకూ చేసిన అప్పులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేశారో ప్రజలకు నేరుగా సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు దుబారా ఖర్చులతో ప్రజలపై మోయలేని భారం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దుబారాపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రా? లేక రియల్ ఎసేŠట్ట్, స్టాక్ మార్కెట్ ఏజెంటా? అని ప్రశ్నించారు. గతంలో తొమ్మిదేళ్లు పాలించినపుడు చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులతో అస్తవ్యస్తం చేశారని, మళ్లీ ఇప్పుడు అధోగతి పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో రాష్ట్ర అప్పు రూ. 90 వేల కోట్లు ఉంటే నాలుగున్నరేళ్లలో ఆ అప్పును రూ. 2.50 లక్షల కోట్లకు తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన రూ. 3 వేల కోట్లతో తాత్కాలిక భవనాలు కట్టామని చంద్రబాబు చెబుతున్నారని, పోలవరం నిర్మాణానికి రాష్ట్రం ఖర్చు చేసిన రూ. 9 వేల కోట్లు కేంద్ర ఇచ్చామంటోందని, అటువంటప్పుడు చంద్రబాబు రూ. లక్షన్నర కోట్లు అప్పు ఎందుకు చేశారు, దేనికోసం ఖర్చుపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘క్రెడిట్ రేటింగ్స్ రావటం లేదని అందుకే బాండ్స్ కోసం వెళ్లామని కుటుంబరావు ఓ వైపు చెబుతారు.. మరోవైపు బాబును చూసే బాండ్స్ వచ్చాయంటారు. మరి 10.32 శాతం వడ్డీని బాండ్స్‌కు ఎందుకు చెల్లించాల్సి వచ్చిందో చెప్పరు’’ అని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ రూ. 200 కోట్లు 9 శాతం వడ్డీకి తీసుకుందని, చంద్రబాబు ఎక్కువ వడ్డీ ఎందుకు చెల్లిస్తోందని ప్రశ్నించారు. బాండ్లు తీసుకున్న వారి పేర్లను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబు పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ, ఎంపీ, రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి రూ. వేల కోట్లు బ్యాంకుకు ఎగనామం పెట్టారని, ఇటువంటి చరిత్రగల వారిని చంద్రబాబు తన చుట్టూ పెట్టుకోవడంలోనే సీఎం ఉద్దేశం స్పష్టమవుతోందన్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒకవైపు రూ. 4 వేల కోట్లు పైగా బాండ్స్ ద్వారా సేకరిస్తామని చెబుతూ.. రూ. 48 వేల కోట్లకు టెండర్లు పిలుస్తున్నారని, దీని ద్వారా ఏ మెసేజ్ ఇస్తున్నట్లుని ప్రశ్నించారు. అప్పు చేసి చంద్రబాబు తన బినామీలు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పిస్తున్నారని, మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటని నిలదీశారు. గెలవలేమని తెలిసే.. టెండర్లు రాబోయే ఎన్నికల్లో గెలవలేమని తెలిసే ఇప్పుడు చంద్రబాబు హడావుడిగా టెండర్లు పిలిచి కాంట్రక్టర్ల నుంచి కమీషన్లు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఆ భారమంతా ప్రజలపై మోపాలన్నదే ఆయన ఆలోచనగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మేధావులు, విద్యార్థులు ఒక్కసారి చంద్రబాబు చర్యలను గమనించాలని శ్రీకాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్రంలోని అప్పులు తక్కువ, ఆస్తులు ఎక్కువుగా ఉండేవని చెప్పారు. ఆ మహానేత ప్రాజెక్టులు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టారన్నారు. చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు రూ. 30 కోట్లు చొప్పున ఖర్చుచేస్తున్నారని, రాష్ట్రం కష్టాల్లో ఉందని చెబుతూనే దుబాయికి ప్రత్యేక విమానాల్లో వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రలోభాలతో విజయం సాధించారు
అమరావతి: ప్రజల తీర్పుతో గెలిచినటువంటి వాళ్లను అధికార బలంతో ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. సోమవారం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. టీడీపి అక్రమంగా సాధించిన ఈ విజయంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలెవరూ అసంతృప్తికి గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందో బేరీజు వేసుకొని ముందుకెళ్తామని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ధైర్యముంటే వైఎస్ఆర్ సీపీ నుంచి టీడీపీలో చేరిన వారితో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ క్యాంపులు పెట్టి.. పోలీసుల సహాయంతో నాయకులను ఇళ్ల నుంచి తీసుకెళ్లారని ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. చెక్కులు ఇచ్చి మత పెద్దల వద్ద ప్రమాణాలు చేయించుకొని గెలిచారని, అసలు ఇది గెలుపే కాదని ఆయన విమర్శించారు. -
ఆ మరణాలపై విచారణ చేయాలి
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల మరణాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థల్లో విద్యార్థులు చనిపోవడం తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగుల్చుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గుంటూరులో వంశీకృష్ణ అనే విద్యార్థి మరణిస్తే దాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలచి వేస్తోందన్నారు. ఆ ప్రాధాన్యత ఎందుకో? ‘‘రాష్ట్రమంతటా నారాయణ, శ్రీచైతన్య స్కూళ్లే ఉండాలా? సర్కారు ఉచిత విద్యను అందిస్తున్నా విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్ల పైపు మొగ్గు చూపడానికి ప్రభుత్వ విధానాలే కారణం. ప్రభుత్వ పెద్దలకు ఆర్థిక వనరులు చేకూర్చే సంస్థలుగా ప్రైవేటు స్కూళ్లు తయారయ్యాయి. బినామీ పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్ విద్యా సంస్థలు స్వర్గధామంగా మారాయి కాబట్టే ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో భూముల వ్యవహారాలు, పెద్ద వ్యాపారాల్లో ‘ముఖ్య’నేతకు బినామీ ఎవరంటే నారాయణే అని చిన్నపిల్లలు కూడా చెబుతారు. నారాయణ వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉండటంతో వీరంతా ఒక్కటై విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు’’ అని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. విద్యార్థుల మరణాలపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఉద్యమిస్తే వైఎస్సార్సీపీ తోడుగా నిలుస్తుందన్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా లేవనెత్తుతామన్నారు.