
వైఎస్సార్ జిల్లా: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓటు కూడా తీసేయించగల సమర్ధుడు చంద్రబాబు నాయుడని వైఎస్సార్‌సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం శ్రీకాంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కేవలం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లనే టార్గెట్ చేసి ఆన్‌లైన్‌లో తొలగింపు రిక్వెస్ట్‌లు పెడుతున్నారని వెల్లడించారు.
అక్రమాలకు పాల్పడే వారిపై కేసులు పెట్టి విచారిస్తే అది తెలుగు ప్రజలపై దాడి ఎలా అవుతుందో తెలుగు దేశం నేతలు చెప్పాలని ప్రశ్నించారు. నిజంగా ఏపీ ప్రజలకు అన్యాయం జరిగితే మేమూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అక్రమాలకు పాల్పడే వారిని వెనకేసుకు రావడం ఏమిటని ఈ సందర్భంగా సూటిగా అడిగారు. ఈ అక్రమాలపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment