సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి రాయచోటిలోని ఎన్జీవో హోంలో సోమవారం గ్రామ, వార్డు సచివాలయాల సెక్రటరీలతో ముఖాముఖి నిర్వహించారు. వారికి పలు సూచనలు చేశారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పాలన మరింత సులభతరం అయ్యిందన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికి దక్కాలని.. లబ్దిదారుల పట్ల నిర్లక్ష్యం తగదని తెలిపారు. అర్హులైన వారికి అన్యాయం జరిగితే సచివాలయ సిబ్బందిదే నైతిక బాధ్యత అని హెచ్చరించారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే పై అధికారులకు వెంటనే తెలియజేయాలన్నారు. అనంతరం శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ చేయని విధంగా తమ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం రోజుకు 30వేల పరీక్షలు నిర్వహిస్తోందని తెలిపారు. 10లక్షలకు పైగా పరీక్షలు చేయడం, పెద్ద సంఖ్యలో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, కోవిడ్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలబడిందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కరోనాను ఎదుర్కొంటూనే సంక్షేమం, అభివృద్దిని రెండు కళ్ళలాగ చేసుకోని పనిచేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ప్రశంసించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాదిరి సంక్షేమాల షెడ్యూల్ ఇచ్చిన సీఎంలను గతంలో ఎప్పుడు చుసిందిలేదన్నారు శ్రీకాంత్ రెడ్డి. ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమం కోసం పేదలంతా కళ్ళల్లో వత్తులు వేసుకోని ఎదురు చూస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తలపెట్టిన అన్ని అభివృద్ది కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డుపడుతున్నదని విమర్శించారు. పేద ప్రజల సామాజిక, సంక్షేమ అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. పేదవారు ఇంగ్లీష్‌లో చదవకుడదా.. పేదలకు స్వంతిల్లు వద్దా.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేందడం ఇష్టం లేదా అంటూ శ్రీకాంత్ రెడ్డి వరుస ప్రశ్నలు కురిపించారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడుగడుగునా అడ్డుపడటం తెలుగుదేశానికే చేల్లిందన్నారు. పేద ప్రజలకు మంచిచేసే విషయంలో జోక్యమేందుకని స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ప్రశ్నించారని తెలిపారు. పేద ప్రజలకు మంచి జరిగితే తెలుగుదేశం పార్టీ నాయకులకు వచ్చిన నష్టమేంటి అని ఆయన ప్రశ్నించారు. పేద ప్రజలకు మంచి జరగకుడదనే ఉద్దేశంతోనే తెలుగుదేశం స్టేలు తీసుకువస్తుందని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment