village Secretary
-
డిసెంబర్ 21న ‘సచివాలయ’ దినోత్సవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి ఒకేసారి 1.34 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతగా.. ఆయన పుట్టినరోజైన డిసెంబర్ 21న గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి తెలిపారు. గతేడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని, ఈసారి మరింత ఉత్సాహంతో వేడుకలు నిర్వహించాలని ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. (చదవండి: అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు) సచివాలయాల సిబ్బంది అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సచివాలయ ఉద్యోగులెవ్వరూ ప్రొబేషన్ డిక్లరేషన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలిచ్చిందని చెప్పారు. కొత్త పీఆర్సీ కూడా వర్తిస్తుందని అధికారులు తెలియజేశారని పేర్కొన్నారు. (చదవండి: పరిశ్రమల ఖిల్లా ఆ జిల్లా.. రెండున్నర ఏళ్లలో ఆరు వేల ఉద్యోగాలు) గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయ వ్యవస్థను సృష్టించి లక్షలాది ఉద్యోగాలు కల్పించడమే కాకుండా.. ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఇస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ఉద్యోగులు రుణపడి ఉంటారన్నారు. చదవండి: AP: అప్రమత్తతే ఆయుధం: సీఎం జగన్ -
AP: సబ్ రిజిస్ట్రార్లుగా గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు
సాక్షి, అమరావతి: గృహ రుణాల నుంచి పేదలను విముక్తి చేసేందుకు తీసుకువచ్చిన వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులు, వార్డు సచివాలయాల్లోని వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులు సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరించి పేదల ఇళ్ల డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేస్తారని గృహ నిర్మాణ శాఖ వెల్లడించింది. సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు వీరికి సహకరిస్తారని తెలిపింది. ఈ పథకం ఒక్క దాని కోసమే వీరు సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేస్తారని వెల్లడించింది. ఇందుకోసం 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 6లో పాక్షిక మార్పులు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. -
విషాదం: విధి నిర్వహణలో.. కూర్చున్న కుర్చీలోనే..
జగ్గంపేట: గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ కార్యదర్శిగా పని చేస్తున్న పాణింగపల్లి జయశంకర్ విధి నిర్వహణలో మృతి చెందారు. మూడు రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన శుక్రవారం విధులకు హాజరయ్యారు. ఉన్నట్టుండి మధ్యాహ్నం కూర్చున్న కుర్చీలోనే వెనక్కి వాలిపోయి మృతి చెందారు. ఆయన మృతదేహానికి వైద్య సిబ్బంది పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. చదవండి: పాపం రెండేళ్ల చిన్నారి.. ఎండలో ఒంటరిగా ఏడుస్తూ... అక్రమ సంబంధమే ప్రాణం తీసింది.. -
‘పేదలకు ఇంగ్లీష్ మీడియం.. సొంత ఇల్లు వద్దా?’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి రాయచోటిలోని ఎన్జీవో హోంలో సోమవారం గ్రామ, వార్డు సచివాలయాల సెక్రటరీలతో ముఖాముఖి నిర్వహించారు. వారికి పలు సూచనలు చేశారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పాలన మరింత సులభతరం అయ్యిందన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికి దక్కాలని.. లబ్దిదారుల పట్ల నిర్లక్ష్యం తగదని తెలిపారు. అర్హులైన వారికి అన్యాయం జరిగితే సచివాలయ సిబ్బందిదే నైతిక బాధ్యత అని హెచ్చరించారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే పై అధికారులకు వెంటనే తెలియజేయాలన్నారు. అనంతరం శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ చేయని విధంగా తమ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం రోజుకు 30వేల పరీక్షలు నిర్వహిస్తోందని తెలిపారు. 10లక్షలకు పైగా పరీక్షలు చేయడం, పెద్ద సంఖ్యలో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, కోవిడ్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలబడిందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనాను ఎదుర్కొంటూనే సంక్షేమం, అభివృద్దిని రెండు కళ్ళలాగ చేసుకోని పనిచేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ప్రశంసించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాదిరి సంక్షేమాల షెడ్యూల్ ఇచ్చిన సీఎంలను గతంలో ఎప్పుడు చుసిందిలేదన్నారు శ్రీకాంత్ రెడ్డి. ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమం కోసం పేదలంతా కళ్ళల్లో వత్తులు వేసుకోని ఎదురు చూస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తలపెట్టిన అన్ని అభివృద్ది కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డుపడుతున్నదని విమర్శించారు. పేద ప్రజల సామాజిక, సంక్షేమ అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. పేదవారు ఇంగ్లీష్‌లో చదవకుడదా.. పేదలకు స్వంతిల్లు వద్దా.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేందడం ఇష్టం లేదా అంటూ శ్రీకాంత్ రెడ్డి వరుస ప్రశ్నలు కురిపించారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడుగడుగునా అడ్డుపడటం తెలుగుదేశానికే చేల్లిందన్నారు. పేద ప్రజలకు మంచిచేసే విషయంలో జోక్యమేందుకని స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ప్రశ్నించారని తెలిపారు. పేద ప్రజలకు మంచి జరిగితే తెలుగుదేశం పార్టీ నాయకులకు వచ్చిన నష్టమేంటి అని ఆయన ప్రశ్నించారు. పేద ప్రజలకు మంచి జరగకుడదనే ఉద్దేశంతోనే తెలుగుదేశం స్టేలు తీసుకువస్తుందని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రతి వాలంటీర్‌కు 50 ఇళ్ల కేటాయింపుతో మ్యాపింగ్ చేయాలి
-
సచివాలయ ఉద్యోగాలకు రేపు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 15,971 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. పాత పద్ధతి, మార్గదర్శకాల ప్రకారమే భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగాలు ఉండగా, వాటిలో ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న వివరాలను ఆయా శాఖల నుంచి పంచాయతీరాజ్ శాఖ బుధవారం తెప్పించుకుంది. వీటిలో అత్యధికంగా 6,916 పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గ్రామ ఉద్యాన అసిస్టెంట్ పోస్టులు 1,746, విలేజీ సర్వేయర్ పోస్టులు 1,234, పంచాయతీ డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు 1,122 చొప్పున ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. గత ఏడాది ఆగస్ట్–సెప్టెంబర్ మధ్య జరిగిన నియామక ప్రక్రియలో దాదాపు 15,971 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోగా, ఆ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 3 వేలకు పైగా పోస్టులు అదనం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రామ సచివాలయాలకు అదనంగా మరో 300 నూతన సచివాలయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో మరో 3 వేలకు పైగా సచివాలయ ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. వాటిని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
వారి బాధ్యత మహిళా సంరక్షణ కార్యదర్శులదే: డీజీపీ
సాక్షి, విజయవాడ : గ్రామ సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులు గ్రామంలోని మహిళల భద్రత పట్ల బాధ్యతగా వ్యవహరించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. గురువారం డీజీపీ మాట్లాడుతూ.. మహిళలు, బాలికల సమస్యలు తీర్చే బాధ్యత మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో మహిళలకు, బాలికలకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉన్నాయని, వీటిని అధిగమించడానికి మహిళా సంరక్షణ కార్యదర్శులు తోడ్పాటుగా ఉండాలని సూచించారు. మహిళా సంరక్షణ కార్యదర్శుల వల్ల సమాజంలో సమాజంలో పెను మార్పులు తీసుకురావలని పిలుపునిచ్చారు. మొత్తం రాష్ట్రంలో 14967 మంది కార్యదర్శులు ఉన్నారని వీరికి ఆరు నెలల్లో 10 బ్యాచ్‌లుగా 11 సెంటర్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణలో పోలీసులతోపాటు మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు కూడా పాల్గొంటారని తెలిపారు. రెండు వారాల్లో ప్రాక్టికల్ క్లాసులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మహిళా కార్యదర్శులకు ఆత్మ రక్షణ, యోగా వంటి క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. -
‘రాజన్న చదివిస్తే.. జగనన్న ఉద్యోగం ఇచ్చారు’
సాక్షి, విజయవాడ : అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే లక్షన్నర ఉద్యోగాలు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు కొత్తగా ఎంపికైన గ్రామ సచివాలయ ఉద్యోగులు. సోమవారం సీఎం జగన్ చేతుల మీదుగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ.. సీఎం జగన్ చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ఫీజు రియింబర్స్‌మెంట్ వల్ల చదువుకున్నామని, ఇప్పుడు ఆయన తనయుడు జగనన్న తమకు ఉద్యోగాలు ఇచ్చారని ప్రశంసించారు. అవినీతి రహిత పాలనకు గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీయే నిదర్శనమన్నారు. ప్రభుత్వం తమకు అప్పగించిన పనిని సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తామని చెప్పారు. (చదవండి : సేవ చేయడం కోసమే ఉద్యోగం: సీఎం జగన్ ) గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్షల్లో అర్హత సాధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తై ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం జగన్ సోమవారం నియామక పత్రాలు అందజేశారు. విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, తదితరులు హాజరయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రేపే సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు
'సాక్షి, అమరావతి : పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో భాగంగా రేపు ఉదయం 10:30 గంటలకు విజయవాడలోని ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛన ప్రాయంగా నియామక పత్రాలు అందిస్తారు. అనంతరం అక్కడకు వచ్చినవారి నుద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం తిరిగి తన నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఆయన తిరుమల బయల్దేరి వెళ్తారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. రేపు సాయంత్రం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. రేపు రాత్రి తిరుమలలోనే బసచేసి ఎల్లుండి ఉదయం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
బయటపడ్డ ఎల్లో మీడియా బాగోతం
సాక్షి, అనంతపురం : సచివాలయ ఉద్యోగాల ప్రశ్నాపత్రాలపై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్న ఎల్లో మీడియాపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీ ఎదుట ఆంధ్రజ్యోతి పత్రికా ప్రతులను దహనం చేసి నిరసన తెలియజేశాయి. ఎస్కే వర్సిటీలో హార్టికల్చర్ పేపర్ రూపొందించారంటూ ఎల్లో మీడియా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఎస్కే వర్సిటీ సిబ్బంది స్పందించింది. తమ వర్సిటీలో హార్టికల్చర్ విభాగం, ప్రొఫెసర్లు లేనప్పుడు పేపర్ ఎలా రూపొందిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు అసత్య కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపై చర్యలు తీసుకోవాలని ఎస్కే వర్సిటీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ మాట్లాడుతూ..‘ ప్రశ్నాపత్రం తయారు చేయకపోయినా చేసినట్టు చూపారు. ఎస్కే వర్సిటీలో అసలు సచివాలయ ప్రశ్నా పత్రాలు రూపొందించలేదు. ఉద్యోగాల ప్రక్రియలో మాకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు’ అని స్పష్టం చేశారు. ఇక ఆంధ్రజ్యోతి పత్రికపై మండిపడిన విద్యార్థి సంఘాలు.. ఆ పత్రిక ప్రతులను దహనం చేశాయి. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఇటుకలపల్లి పోలీసు స్టేషనులో ఫిర్యాదు నమోదైంది. -
ర్యాంకులతోపాటు మొత్తం మెరిట్ లిస్ట్‌లు..
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాలకు ఎంపికైన వారి మెరిట్ లిస్ట్‌లను రూపొందించినట్లు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు. ఈ జాబితాను అత్యంత పారదర్శకంగా రూపొందించామని, మొత్తం 13 జిల్లాల్లో ఎంపిక అయిన అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను వెబ్సైట్లో పెట్టినట్లు తెలిపారు. ఎంపికైన అభ్యుర్థులు ర్యాంకుతోపాటు మొత్తం మెరిట్ లిస్ట్‌ను చూసుకోవచ్చని, వీటిని అన్ని కేటగిరి ఉద్యోగాలకు సిద్ధం చేశామని గిరిజా శంకర్ అన్నారు. -
'సచివాలయ ఉద్యోగాల మెరిట్ లిస్ట్‌లు సిద్ధం’
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల మెరిట్ లిస్ట్‌లు సిద్ధం చేశామని మున్సిపల్‌శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ తెలిపారు. మెరిట్ లిస్ట్‌ను జిల్లాల కలెక్టర్లకు పంపినట్లు వెల్లడించారు. ఈనెల 21 నుంచి 23 వరకు ఎంపికైనన అభ్యర్థులకు కాల్ లెటర్ పంపిస్తామని, అభ్యర్థులకు ఈ-మెయిల్, ఎస్ఎమ్ఎస్ ద్వారా కూడా సమాచారం అందుతుందని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఆన్లైన్లో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని, ధరఖాస్తులో చెప్పిన అర్హత, కుల ధృవీకరణ, క్రీమిలేయర్, నివాస సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, ఈ నెల 27న అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం 20 బృందాలను ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక ఏ అభ్యర్థి ఎక్కడ ఉద్యోగం చేయాలన్నది నిర్ణయిస్తామని, 60 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. -
సర్టిఫికెట్ల పరిశీలనకు బోర్డులు ఏర్పాటు చేసుకోండి
సాక్షి,కర్నూలు: గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల కోసం మెరిట్ జాబితా సిద్ధమైందని, ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కోసం బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) చైర్మన్ జి.వీరపాండియన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఒక్కో బోర్డులో పది మంది సభ్యులు ఉండాలని, ఒక్కో శాఖ అభ్యర్థుల సంఖ్యను బట్టి ఒకటి నుంచి పది వరకు బోర్డులను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్ రవి పట్టన్‌శెట్టితో కలిసి సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. 9,597 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెరిట్ జాబితా సిద్ధమైందని, ఈ జాబితాలోని ప్రతి అభ్యర్థికి శని, ఆదివారాల్లో కాల్ లెటర్లను ఎస్ఎంఎస్, మెయిల్ లేదా వలంటీర్ల ద్వారా నేరుగా అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థులు ఈ నెల 21, 22 తేదీల్లో సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలని సూచించారు. అర్హత, పుట్టిన తేదీ, రెసిడెన్స్, పీహెచ్, ఎక్స్ సర్వీస్‌మెన్, స్పోర్ట్స్ కోటాలకు సంబంధించిన సర్టిఫికెట్లను కచ్చితంగా అప్లోడ్ చేయాలన్నారు. ఏవైనా సర్టిఫికెట్లు లేకపోతే పరిశీలన సమయంలో అవి ఎక్కడున్నాయో అధికారులు కనుగొని తగు చర్యలు తీసుకుంటారన్నారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, ఆన్లైన్లో అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల ఒరిజినల్స్‌తో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకురావాల్సి ఉంటుందని తెలియజేశారు. ఏ రోజు, ఏ సమయంలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందో అభ్యర్థులకు పంపే కాల్ లెటర్లో పేర్కొని ఉంటుందని, దాని ప్రకారమే పరిశీలనకు హాజరుకావాలని సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులకు 27వ తేదీన రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగా అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇస్తారని, 28, 29 తేదీల్లో కౌన్సెలింగ్ ద్వారా స్థానాల కేటాయింపు ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1వ తేదీల్లో రెండు రోజుల శిక్షణ, అక్టోబర్ 2వ తేదీన ఉద్యోగాల్లో చేరేలా ప్రణాళికలు వేసినట్లు చెప్పారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 14వ తేదీ వరకు వి«ధుల్లో చేరేందుకు అవకాశం ఇస్తామని, ఆ లోపు రాకపోతే ఆ పోస్టును రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థుల సందేహాలు, సలహాల కోసం జెడ్పీలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకే అభ్యర్థికి రెండు, మూడు ఉద్యోగాలు వస్తే అతను చేరే ఉద్యోగాన్ని వదిలి మిగిలిన ఉద్యోగాలను ఖాళీల కింద చూపి తరువాత మెరిట్ ఉన్న అభ్యర్థితో భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు వెల్లడించారు. అక్టోబర్ 2వ తేదీన మండలం/మునిసిపాలిటీల్లో ఒక సచివాలయాన్నైనా అన్ని హంగులతో ప్రారంభిస్తామని, ఇందులో అన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జేసీ–2 ఖాజామొహిద్దీన్, డీపీఓ ప్రభాకరరావు, నగర పాలకసంస్థ కమిషనర్ రవీంద్రబాబు, ఏపీఎంఐపీ పీడీ పుల్లారెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌ఓ నరసింహులు, ఐసీడీఎస్ పీడీ లీలావతి, వ్యవసాయ శాఖ జేడీ విల్సన్, పశుసంవర్ధక శాఖ జేడీ రామచంద్రయ్య పాల్గొన్నారు. -
‘ప్రశ్నాపత్రాలు బయటకు వచ్చే అవకాశమే లేదు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ వస్తోన్న వార్తల్ని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండించారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికే కొంతమంది పనిగట్టుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తలు వాస్తవాలు కాదని ఆయన ఖండించారు. పరీక్షల నిర్వహణను అన్ని మీడియా సంస్థలు ప్రశంసించిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేశారు. ప్రశ్నాప్రతాలు బయటకు వచ్చే అవకాశమే లేదన్నారు. అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురి కావద్దన్నారు. -
కర్నూలు జిల్లా అభ్యర్థులకు అత్యుత్తమ మార్కులు
సాక్షి, కర్నూలు : జిల్లాలో ఉద్యోగాల విప్లవం..ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో కొలువులు..అత్యంత పకడ్బందీగా పరీక్షలు..అనుకున్న సమయానికి ఫలితాల వెల్లడి.. యువతలో నూతనోత్తేజం..విజయోత్సాహంతో వేల కుటుంబాల్లో వెల్లివిరిసిన సంతోషం..గురువారం గ్రామ/వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయడం..అక్టోబర్ 2న విధుల్లో చేరే అవకాశం లభించడంతో విజయం సాధించిన అభ్యర్థుల్లో ఆనందం అంబరాన్ని తాకింది. గ్రామ/వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. 19 రకాల పోస్టులను భర్తీ చేసేందుకు 14 రకాల పరీక్షలను ఈ నెల 1నుంచి 8వ తేదీ వరకు ఆరు రోజుల పాటు పకడ్బందీగా నిర్వహించారు. ఈ ఫలితాల్లో జిల్లాకు చెందిన అభ్యర్థులు రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న 881 సచివాలయాల్లో 9,597 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఒక్కో సచివాలయంలో 11 నుంచి 12 మంది ఉద్యోగులను నియమించనున్నారు. పరీక్షలు నిర్వహించిన పది రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 40 రోజుల్లో సచివాలయ ఉద్యోగాల నియమాక ప్రక్రియను పూర్తి చేయనుండడం సరికొత్త రికార్డు సృష్టించనుంది. ఫలితాలను రాష్ట్ర స్థాయిలో ప్రకటించినా.. ఎంపిక మాత్రం జిల్లా సెలక్షన్ కమిటీలదే. నియమకాల పత్రాలు వారే అందజేయనున్నారు. ఇందు కోసం ఇటీవలే జిల్లా సెలక్షన్ కమిటీలను సైతం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫలితాలకు సంబంధించి మెరిట్ జాబితా శుక్రవారం జిల్లా కమిటీకి చేరనుంది. శనివారం నుంచి మెరిట్ లిస్టులో ఉండే వారు.. వారి విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారి.. జిల్లాలో మొత్తం 9,597 పోస్టులకుగాను 2,01,886 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆరు రోజుల పాటు నిర్వహించిన పరీక్షలకు 1,80,728 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొదటి రోజు జరిగిన పరీక్షలకు 1,33,167 మంది, రెండో రోజు 15,152, మూడో రోజు 4,071, నాల్గో రోజు 1,201, ఐదో రోజు 9,201, ఆరో రోజు 17,936 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. దేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఒకే నోటిఫికేషన్లో 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. పరీక్షలు ముగిసిన 10 రోజుల్లోనే ఏ పరీక్షల ఫలితాలు కూడా విడుదల చేయలేదు. 2008లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. 57 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి రికార్డు సాధించారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి..ప్రస్తుతం రెండింతల పోస్టులను భర్తీ చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించనున్నారని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరీక్షలు రాసిన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కనీస ఉత్తీర్ణత మార్కులను ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 40 శాతం(60 మార్కులు), బీసీలకు 35శాతం(52.5 మార్కులు), ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు 30 శాతం(45 మార్కులు)గా నిర్ణయించారు. (చదవండి : ఫలితాల్లోనూ రికార్డ్) -
‘సెక్రటేరియట్’ ఫలితాలు; పూర్తి వివరాలు
సాక్షి, అమరావతి: లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు గురువారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. రికార్డు స్థాయిలో ఒకే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా 1,26,728 మందిని ఎంపిక చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహించడం విశేషం. ఈ మహోత్తర ప్రక్రియలో కీలక ఘట్టాలు, అంశాలను ప్రభుత్వం ప్రకటన రూపంలోమీడియాకు విడుదల చేసింది. పరీక్ష ఫలితాలను గ్రామ సచివాలయం/ఆర్టీజీఎస్ వెబ్సైట్లో అభ్యర్థి హాల్ టికెట్ నెంబరు, పుట్టిన తేది ఆధారంగా తెలుసుకోవచ్చు http://gramasachivalayam.ap.gov.in/ http://vsws.ap.gov.in/ http://wardsachivalayam.ap.gov.in/ https://www.rtgs.ap.gov.in/ ముఖ్యమైన అంశాలు ► ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రజల గుమ్మం ముంగిటే అందచేయటానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ, గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ► రాష్ట్ర ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకంగా అమలు చేయబడుతున్న "నవరత్నాలు" కార్యక్రమం ద్వారా అందజేసే లబ్ధిని అర్హులైన కుటుంబాలకు చేర్చడానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థల ఏర్పాటు ►ప్రతీసచివాలయంలో 11 నుంచి 12 మంది శాశ్వతప్రభుత్వ ఉద్యోగులను నియమించి, ప్రభుత్వ సేవల్లోనాణ్యత పెంపొందించే నిమిత్తంప్రభుత్వం మొత్తం 1,26,728(95,088 గ్రామీణ ప్రాంతాలలో, 36,410 పట్టణ ప్రాంతాలలో) ఉద్యోగాలనుకొత్తగా సృష్టించి, వాటిని పోటీ పరీక్ష ద్వారా నేరుగా ఎంపిక చేయటానికి 26.7.2019 న కామన్ నోటిఫికేషన్ విడుదల చేసాము ► క్రొత్తగా ఏర్పాటు చేసే గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలుఅక్టోబర్ 2నుండి అమలులోకివస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 11158 గ్రామ సచివాలయాలను, 3786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నాము పరీక్షల నిర్వహణ విజయవంతం ► తేదీ 1.9.2019 నుండి 8.9.2019 వరకు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ఎంపిక పరీక్షలను 6 రోజులపాటు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ► దేశ చరిత్రలోనే ఒకే రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా 1,26,728 మందిని ఎంపిక చేసేందుకు పోటీ పరీక్షలను ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఒక అరుదైన రికార్డు. ► అభ్యర్థుల హాజరు: 19 రకాలయిన పోస్టులను భర్తీకి 14 రకాల పరీక్షలకు మొత్తం 21.69 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 19.50 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు అయినారు. ► పరీక్షలను ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా నిర్వహించడం జరిగింది. సమాధాన పత్రాల మూల్యాంకనం ♦ 19,50,630 మంది అభ్యర్ధులకు చెందిన ఓఎంఆర్ సమాధాన పత్రాలను తేదీ 3.9.2019 నుండి 9.9.2019 వరకూ రికార్డు సమయంలో స్కాన్ పూర్తి చేయటం జరిగింది ♦ స్కానింగ్ పూర్తి అయిన తరువాత వచ్చిన ఫలితాలను, ఈ రంగంలో నిష్ణాతులైన “STATISTICAL TEAM” ద్వారా మరొకసారి సరి చూసుకోవటం కోసం STRATIFIED రాండమ్ శాంప్లింగ్ పద్ధతిలో 10,000 ఓఎంఆర్ సమాధాన పత్రాలనుసరి చూడడం జరిగింది. ముల్యాంకంలో ఎటువంటి తప్పులు దొర్లలేదని ధ్రువీకరించుకోవడం జరిగింది. పరీక్షా ఫలితాలు అభ్యర్ధులను ఎంపిక చేయటానికి కనీస ఉత్తీర్ణతా మార్కులు • ఓపెన్ కేటగిరీ అభ్యర్ధులకు 40% • వెనుక బడిన తరగతులకు చెందిన వారికి 35% • ఎస్సీ /ఎస్టీ /వికలాంగులకు 30% హాజరైన 19,50,630 మంది అభ్యర్ధుల్లో 1,26,728 ఉద్యోగాలకు 198164 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణులయ్యారు • ఓపెన్ కేటగిరి 24583 • బీసీ కేటగిరి 100494 • ఎస్సీ కేటగిరి 63629 • ఎస్టీ కేటగిరి 9458 • పురుషులు 131327 • స్త్రీలు 66835 జరిగిన 14 పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన అభ్యర్ధులు సాధించిన మార్కులు • ఓపెన్ కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు • బి.సి. కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు • ఎస్. సి కేటగిరిలో అత్యధికంగా 114 మార్కులు సాధించారు • ఎస్. టి కేటగిరిలో అత్యధికంగా 108 మార్కులు సాధించారు ♦ మహిళా అభ్యర్థుల్లో గరిష్టంగా 112.5 మార్కులు ♦ పురుష అభ్యర్ధుల్లో గరిష్టంగా 122.5 మార్కులు ♦ ఇన్ సర్వీస్ అభ్యర్ధులకు 10% వెయిటేజ్ మార్కులు విడిగా కలపబడతాయి ఫలితాల ప్రకటన అనంతరం, అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. తరువాత జిల్లా యంత్రాంగం ద్వారా తెలుపబడిన తేదిలలో నిర్ణీత ప్రదేశములకు వెళ్లి వారి సర్టిఫికేట్ లను తనిఖి చేయించుకోవలెను. వెరిఫికేషన్ షెడ్యూలు ఫలితాల విడుదల 19.09.2019 వెబ్సైట్ సర్టిఫికెట్ల అప్లోడ్ 21.09.2019 నుండి కాల్ లెటర్ పంపిణి 21.09.2019 – 22.09.2019 తనిఖి జరిగే తేదీలు 23- 25 సెప్టెంబర్ 2019 నియామక ఉత్తర్వుల జారీ 27.09.2019 అవగాహనా కార్యక్రమం 1&2 అక్టోబర్ 2019 గ్రామ/వార్డు సచివాలయ ప్రారంభం 02.10.2019 -
సచివాలయ ఫలితాలు: కేటగిరీ వారీ ఉత్తీర్ణుల జాబితా
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫలితాలు విడుదల చేశారు. 19 రకాల పోస్టులకుగాను 14 పరీక్షలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం.. కేవలం 10 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలకు మొత్తంగా 19,50,582 మంది హాజరుకాగా... 1,98,164 మంది అర్హత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా(కేటగిరీల వారీగా) -
‘సచివాలయ’ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి : లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను gramasachivalayam.ap.gov.in వెబ్సైట్లో చూడవచ్చు. ఈ నెల ఒకటి నుంచి 8 వ తేదీ వరకూ ఎపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహించింది. 19 రకాల పోస్టులకుగాను 14 పరీక్షలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం.. కేవలం 10 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలకు 19.74 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి అక్టోబర్ 1వరకు శిక్షణ ఇస్తారు. పరీక్ష విడుదల కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. రికార్డు సమయంలో ఈ యజ్ఞాన్ని పూర్తి చేశాం : సీఎం జగన్ ఎన్నికల్లో చెప్పినట్లుగా సచివాలయ ఉద్యోగాలను రికార్డు సమయంలో భర్తి చేశామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 10 రోజుల్లో ఫలితాలు విడుదల చేసేలా కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. ‘ఒకే నోటిఫికేషన్ ద్వారా 1,26,738 శాశ్వత ఉద్యోగాలు కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి. రికార్డు సమయంలో ఈ యజ్ఞాన్ని పూర్తి చేశాం. పరీక్షల్లో విజయం సాధించిన వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంపికైన వారికి మంచి శిక్షణ ఇస్తాం. వీరంతా ప్రజా సేవలో మమేకం కావాలి. అవినీతికి దూరంగా, నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించిన అధికారులకు అభినందనలు. అంకితభావంతో పరీక్షలు నిర్వహించి మంచి పనితీరును కనబరిచారు. అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయి. వర్గాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిటకే సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అందుతాయి’ అని సీఎం జగన్ అన్నారు. -
బిగుసుకుంటున్న ఉచ్చు
గ్రామ/వార్డు సచివాలయాల్లో జూనియర్ లైన్‌మన్ (జేఎల్ఎం) పోస్టుల ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులను ఏమారుస్తున్న దళారుల భరతం పట్టేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. నియామకాలను నిక్కచ్చిగా నిర్వహించాలని పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఈ బాగోతాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో మధ్యవర్తుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఇద్దరిపై చీటింగ్ కేసు పెట్టారు. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేసి దళారీల పనిపట్టమని ఎస్పీని ఆదేశించారు. సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : ఆమదాలవలసకు చెందిన గుండ దుర్గాప్రసాద్ అనే అభ్యర్థి దళారీ గ్యాంగ్‌తో బేరసారాలాడుతూ ఈనెల 7న విద్యుత్ విజిలెన్స్ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన సంగతి జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. సచివాలయ పోస్టుల్లో ఎక్కడా అక్రమాలు లేకుండా, పారదర్శకంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేసింది. అయితే అధికారుల చర్యలను సైతం పక్కదారి పట్టించిన దళారీ గ్యాంగ్.. పోల్ టెస్ట్‌లో పాసైన అభ్యర్థుల వివరాలను ఎప్పటికప్పుడు ఫోన్లోనే తెప్పించుకుని, వారినే టార్గెట్‌గా చేసుకుంటూ.. వసూళ్ల పర్వానికి తెరలేపింది. పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు వచ్చేందుకు ఓ రేటు, వచ్చాక పోల్ క్లైంబింగ్ పరీక్షలో పాసైతే తుది మెరిట్ జాబితాలో పేరుండేందుకు మరో రేటు చొప్పున లక్షల్లో పలువురు అభ్యర్థుల నుంచి వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ పరీక్షలను ఎంతో పారదర్శకంగా నిర్వహించినప్పటికీ.. దళారీల గ్యాంగ్ మాత్రం కొందరు ప్రజాప్రతినిధుల పేర్లు వాడుకుని మరీ వసూళ్లకు పాల్పడినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అలాగే విద్యుత్ శాఖలో పనిచేస్తూనే.. దళారీ అవతారమెత్తిన కొందరి పాత్ర కూడా ఇందులో ఉన్నట్లుగా వార్తలు గుప్పుమంటుండడంతో.. వైఎస్సార్ విద్యుత్ ఉద్యోగుల సంఘంతోపాటు వివిధ విద్యుత్ ఉద్యోగుల సంఘాల నేతలు కూడా దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. నిరుద్యోగుల ఆశలతో ఆడుకోవడంతోపాటు ఈపీడీసీఎల్ సంస్థ పరువుకు సంబంధించిన అంశంగా కూడా దీన్ని పరిగణిస్తూ... దళారీ గ్యాంగ్ ఆటకట్టించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా లైన్‌మన్ ఉద్యోగార్థులు కూడా సోమవారం జిల్లా కలెక్టర్ జె.నివాస్‌ను ‘స్పందన’ కార్యక్రమంలో కలిసి.. దళారీల కారణంగా అర్హులైన వారికి పోస్టులు దక్కే అవకాశాలు తగ్గిపోతున్నాయని, ఆన్లైన్లో పదో తరగతి జీపీఏ పాయింట్ల నమోదులో తప్పుల కారణంగా ఇప్పటికే వందలాదిమంది అభ్యర్థులు పరీక్షలకు అనర్హులయ్యారని విన్నవించుకున్నారు. దీంతో నాలుగు వైపులా దళారీ గ్యాంగ్ టార్గెట్‌గా మారింది. ముమ్మరంగా గాలింపు విద్యుత్ లైన్‌మన్ పోస్టులిప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూళ్లు చేసిన వ్యవహారంలో విద్యుత్ శాఖకు చెందిన పలువురు ఉద్యోగుల పాత్ర కీలకంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై పోలీసులకు విద్యుత్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్న ఆమదాలవలస అభ్యర్థి దుర్గాప్రసాద్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తోపాటు అతడి ఫోన్లో ఉన్న సమాచారం మేరకు పలువురి పాత్రను ప్రాథమికంగా గుర్తించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈమేరకు గోపాలరావు, శ్రీధర్ అనే ఇద్దరిపై టూటౌన్ పోలీసులు 420 చీటింగ్ కేసును నమోదు చేశారు. ఇందులో ఒకరు విద్యుత్ ఉద్యోగి కాగా, మరొకరు వ్యాపారి అని తెలుస్తోంది. ఇదిలావుంటే పోల్ పరీక్షల సమయంలో విద్యుత్ శాఖలో ఉన్నతాధికారులకు ఎటువంటి సమాచారం లేకుండా విధులకు రాని ఉద్యోగుల వివరాలను కూడా పోలీసులు సేకరించారు. పరీక్షలు నిర్వహించిన ఆర్ట్స్ కళాశాలలో ఈమేరకు సీసీ కెమెరాల నుంచి కూడా ఫుటేజిని సేకరించే పనిలో పడ్డారు. దీని ఆధారంగా అనుమానాస్పదంగా ఉన్న అభ్యర్థులు, ఉద్యోగులను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా ఇదే క్రమంలో పలువురి ఇళ్లకు వెళ్లి సోదాలు నిర్వహించి అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ, అప్పటికే ఇంటికి తాళాలు వేసి పరారీలో ఉన్నట్టు గుర్తించారు. జిల్లాలో మొత్తం 679 పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించగా.. పోల్ క్లైంబింగ్ టెస్ట్ అనంతరం 986 మంది అర్హత సాధించినట్టు అధికారులు ప్రకటించారు. తాజా పరిణామాలతో డబ్బులిచ్చిన అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఉద్యోగాల కోసం లక్షలాది రూపాయలు టోకెన్ అడ్వాన్స్‌గా ఇచ్చేయడంతో.. ఇప్పుడు పరిస్థితి ఏంటని ఆందోళన పడుతున్నారు. సమగ్ర దర్యాప్తు చేయాల్సిందే.... లైన్‌మన్ పోస్టుల విషయంలో దళారీల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌గా దర్యాప్తు చేయాలంటూ వైఎస్సార్ విద్యుత్ ఉద్యోగుల సంఘం, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం, తెలుగునాడు, అసిస్టెంట్ ఇంజినీర్ల సంఘ నేతలంతా డిమాండ్ చేశారు. పలు యూనియన్ నేతలంతా కలిసి ప్రత్యేక తీర్మానాన్ని చేశారు. వైఎస్సార్ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కె.వి.కృష్ణారావు, ఆర్.శ్రీనివాస్‌లు మాట్లాడుతూ మెరిట్లో వచ్చిన అభ్యర్థుల పేర్లు తప్పించే ప్రయత్నాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరారు. దళారీల వ్యవహారంపై కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘ నేతలు సనపల వెంకటరావు, చల్లా వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ నిరుద్యోగుల నుంచి పోస్టుల పేరు చెప్పి మోసం చేయడం పెద్ద నేరమని, సొంత శాఖకు చెందిన ఓ యూనియన్ నేత ఇలాంటి నేరాలకు పాల్పడటంతో సంస్థకు చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఎన్నో లక్షలు వసూలు చేశారని, అలాగే ఇప్పుడు మెడికల్ ఇన్వాల్యుయేషన్పై ఆరోగ్యంగా ఉన్న ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులను దండుకుంటున్నారని, దీనిపై కూడా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. తెలుగునాడు సంఘ నేత కె.వైకుంఠరావు మాట్లాడుతూ మెరిట్ లిస్ట్ ఎలా బయటకు వెళ్తుందో.. వారి డాటాను ఎవరు ఎవరికి పంపిస్తున్నారో శాఖాపరంగా విచారణ జరగాలని, రాష్ట్ర ప్రభుత్వం నియామక ప్రక్రియను పారదర్శకంగా చేస్తున్నప్పటికీ... ఇలాంటి ఘటనలు చెడ్డ పేరు తీసుకొస్తాయన్నారు. అసిస్టెంట్ ఇంజినీర్ల సంఘం బ్రాంచ్ సెక్రటరీ జి.వి.సురేష్ మాట్లాడుతూ దళారీ వ్యవస్థకు ఇప్పటికైనా చెక్ పడాలని, ఇంతవరకు ఎంతమంది జీవితాలో ఆవిరయ్యాయని, తాజా పోస్టుల వ్యవహారంలో అర్హులైన వారినే ఎంపిక చేసేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎలాగైనా ఈ వ్యవహారంలో దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. దళారుల పనిపట్టండి.. లైన్‌మన్ పోస్టుల నియామకాల్లో దళారీల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రంగా స్పందించారు. కొందరు దళారులు అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పుకుని డబ్బులు దండుకుంటున్నారని, దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తును చేపట్టాలని జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డికి ఆయన ఆదేశించారు. దళారీ వ్యవహారంలో ఎంతటి వారున్నా ఏమాత్రం క్షమించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సచివాలయ పోస్టులన్నీ పారదర్శకంగానే భర్తీ చేస్తున్నామని, ఇందులో ఎలాంటి అపోహలు వద్దని అన్నారు. దళారీ గ్యాంగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నామని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘సచివాలయ’ పరీక్షలకు 92.77 శాతం హాజరు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు తొలిరోజు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రశాంతంగా మొదలయ్యాయి. 92.77 శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం పరీక్షకు 12,53,974 మంది హాజరు కావాల్సి ఉండగా, 11,62,164 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 2,95,980 మంది హాజరు కావాల్సి ఉండగా, 2,72,420 మంది హాజరయ్యారు. మొత్తం 1,26,728 ఉద్యోగాలకు 21.69 లక్షల మంది పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఆరు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలిరోజు 92.77 శాతం హాజరు నమోదు కావడం అంటే నియామక ప్రక్రియ పూర్తిస్థాయిలో విజయవంతమైనట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పత్తికొండ జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాల్లో ఓఎంఆర్ షీట్లు తారుమారయ్యాయి. వేంపెంట అభ్యర్థులకు పత్తికొండ అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, పత్తికొండ అభ్యర్థులకు వేంపెంట అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు వచ్చాయి. ఈ పొరపాటును గుర్తించిన అధికారులు వెంటనే అదనపు ఓఎంఆర్ షీట్లను సమకూర్చారు. రెండు కేంద్రాల్లో పరీక్ష ఆలస్యంగా ప్రారంభం కావడంతో అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం కేటాయించారు. ఈ ఒక్క సంఘటన మినహా తొలిరోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. అధికారుల ప్రత్యేక చర్యలు మండల కేంద్రాల్లో సైతం పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం హాజరు శాతం అత్యధికంగా నమోదు కావడానికి కారణమని అధికారులు పేర్కొంటున్నారు. ఆదివారం పరీక్షలకు హజరు కావాల్సిన అభ్యర్థుల్లో 16 వేల మంది శనివారం సాయంత్రం వరకు హాల్‌టిక్కెట్ డౌన్లోడ్ చేసుకోలేదు. అధికారులు వారికి ప్రత్యేకంగా మెసేజ్‌లు పంపారు, వాయిస్ కాల్స్ చేశారు. ఇలాంటి ప్రత్యేక చర్యలతో హాజరు శాతం పెరిగిందని అంటున్నారు. ప్రాథమిక ‘కీ’ విడుదల తొలిరోజు జరిగిన రాత పరీక్షల ప్రాథమిక ‘కీ’ని పరీక్షల నిర్వహణ కమిటీ చైర్మన్, కన్వీనర్లు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. దీనిపై మూడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ప్రతి పరీక్ష జరిగిన తేదీకి ఐదు రోజుల అనంతరం తుది ‘కీ’ని విడుదల చేస్తారు. 23–25 తేదీల మధ్య మెరిట్ జాబితాలు రాత పరీక్షల జవాబు పత్రాలైన ఓఎమ్మార్ షీట్లను అన్ని జిల్లాల నుంచి నాగార్జున యూనివర్సిటీకి తరలించే ప్రక్రియ మొదలైంది. ఈ నెల 3వ తేదీ నుంచి ఓఎమ్మార్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ మొదలవుతుందని గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. రోజుకు 4 లక్షల షీట్ల స్కానింగ్ పూర్తవుతుందన్నారు. అన్ని పరీక్షల ఓఎమ్మార్ షీట్లను రెండు విడతల పాటు స్కానింగ్ చేసే ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేస్తామని గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ వెల్లడించారు. ఈ నెల 23–25 తేదీల మధ్య ఉద్యోగాల వారీగా రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల మెరిట్ జాబితాలను ప్రకటించే అవకాశం ఉందన్నారు. గుండెపోటుతో అభ్యర్థి మృతి గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్ష రాస్తూ గుండెపోటుతో ఓ అభ్యర్థి మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన గుడాల నరేష్ (30) పూలపల్లి శ్రీగౌతమి స్కూల్లో పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష ప్రారంభమైన అనంతరం నరేష్‌కు గుండెలో నొప్పి రావడంతో విధుల్లో ఉన్న ఏఎన్ఎం పరీక్షించిన అనంతరం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భీమవరం వర్మ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య సేవలు పొందుతూ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుడాల నరేష్ మరణించాడు. పరీక్ష కోసం వచ్చి బిడ్డకు జన్మనిచ్చింది సచివాలయం ఉద్యోగ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థిని పరీక్ష రాయకుండానే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం బురదగాలి కొత్తపాళేనికి చెందిన ఎర్రబోతు సుప్రియ గూడూరులో గ్రామ సచివాలయ పరీక్ష రాసేందుకు వచ్చింది. నిండుగర్భిణి కావడంతో పరీక్ష సమయానికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే గూడూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టినందుకు సంతోషపడాలో, పరీక్ష రాయలేనందుకు బాధపడాలో అర్థం కావడం లేదని సుప్రియ పేర్కొంది. పరీక్షకు తండ్రి, కుమార్తె, కుమారుడు హాజరు గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షకు తండ్రి, కుమార్తె, కుమారుడు హాజరయ్యారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన చోళ్ల మోహనరావు, ఆయన కుమార్తె ఇందిర, కుమారుడు నరేష్కుమార్ గ్రామ సచివాలయం ఉద్యోగానికి పరీక్ష రాశారు. మోహన్‌రావు శ్రీనివాస కళాశాల, ఇందిర నారాయణ కళాశాల, నరేష్కుమార్ ఆర్కే జూనియర్ కాలేజీలో పరీక్షకు హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా పలాస జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సచివాలయ పరీక్షకు ఓ రిమాండ్ ఖైదీ హాజరయ్యాడు. తొలిరోజు విజయవంతం పటిష్టమైన ప్రణాళిక, జిల్లా కలెక్టర్లు, సిబ్బంది సహకారం, సమన్వయం వల్లే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు విజయవంతంగా మొదలయ్యాయని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరీక్షల తీరును, ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద సంఖ్యలో ఏ ప్రభుత్వ శాఖ పరీక్షలు నిర్వహించలేదన్నారు. పరీక్ష కేంద్రాలను అభ్యర్థులకు అందుబాటులో ఏర్పాటు చేయడం వల్ల హాజరు శాతం పెరిగిందన్నారు. అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్‌లు ఏర్పాటు చేసిందని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్ శాఖ సహకరించిందని చెప్పారు. పరీక్షల నిర్వహణలో లోపాలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లకు సహకారం అందించేందుకు ఒక్కొక్క ప్రత్యేక అధికారిని జిల్లాలకు ముందుగానే పంపినట్టు వివరించారు. వారు పరీక్షల ఏర్పాట్లలో కలెక్టర్లకు పూర్తిగా సహకరించారని, తాము రూపొందించిన ప్రత్యేక బుక్లెట్ ఆధారంగా ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పారు. వచ్చే ఐదు రోజుల్లో నిర్వహించే పరీక్షలకు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోనే పరీక్షా కేంద్రాలు ఉండటం వల్ల అభ్యర్థులు సులువుగా చేరుకోవచ్చన్నారు. గ్రామ సచివాలయాల్లో భర్తీ చేయనున్న పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులన్నీ భర్తీ అయ్యే అవకాశాలు లేవని చెప్పారు. మొత్తం 9,886 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తే 6,265 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. మిగిలిన పోస్టుల్ని భర్తీ చేసే బాధ్యతను ప్రభుత్వం ఆ శాఖకు అప్పగించే అవకాశాలున్నాయని చెప్పారు. కాగా, విజయవాడలోని పలు కేంద్రాలను పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ గుంటూరు, నెల్లూరులోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. అభ్యర్థుల కోసం 1,945 ఆర్టీసీ బస్సులు సచివాలయ పోస్టుల రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ పెద్ద ఎత్తున రవాణా సౌకర్యం ఏర్పాటుచేసినట్లు సంస్థ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. తొలి రోజు ఆదివారం పరీక్షకు హాజరైన అభ్యర్థుల కోసం వారి సమీప జిల్లా కేంద్రాలకు రాష్ట్రవ్యాప్తంగా 1945 బస్సులను నడిపింది. ఈ సందర్భంగా సంస్థ ప్రధాన బస్స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేసింది. పరీక్ష సామగ్రిని జిల్లా కేంద్రాలకు తరలించేందుకు, పరీక్ష కేంద్రాలకు అవసరమైన ఏర్పాట్ల నిమిత్తం సుమారు 16 గూడ్స్ ట్రాన్స్‌పోర్టు వాహనాలను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ నెల 8వ తేదీ వరకు జరగనున్న రాత పరీక్షలకు అభ్యర్థుల రద్దీని బట్టి ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. 470 స్పెషల్ సర్వీసులు వినాయకచవితి వరుస సెలవుల తర్వాత తిరుగు ప్రయాణం అయ్యే ప్రయాణికుల కోసం ఆర్టీసీ సోమవారం సాయంత్రం 470 స్పెషల్ సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఆపరేషన్స్ విభాగం పేర్కొంది. అవసరానికి అనుగుణంగా రద్దీ ఉన్న మార్గాల్లో నడిపేందుకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో మరో 109 బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచామని తెలిపింది. ఈ నెల 4వ తేదీన కూడా అవసరమైన మేరకు స్పెషల్ బస్సులు నడపనున్నట్టు పేర్కొంది. -
‘సచివాలయ’ రాత పరీక్షలకు 4,478 కేంద్రాలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో మొత్తం 4,478 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాలకు 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఒక్కొక్క రకమైన పరీక్షకు ఒక్కో రోజు చొప్పున సెప్టెంబరు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రెండు పూటలా రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన జరిగే వివిధ ఉద్యోగాల రాత పరీక్షకు అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగే మిగిలిన ఉద్యోగాల రాతపరీక్షకు మాత్రం ఏడు జిల్లాల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు 13 జిల్లాల్లో 4,478 కేంద్రాల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 306, విజయనగరంలో 198, విశాఖ జిల్లాలో 406, తూర్పు గోదావరిలో 481, పశ్చిమ గోదావరిలో 311, కృష్ణాలో 374, గుంటూరులో 365, ప్రకాశంలో 231, నెల్లూరులో 323, చిత్తూరులో 380, వైఎస్సార్ జిల్లాలో 270, అనంతపురంలో 389, కర్నూలు జిల్లాలో 444 పరీక్షా కేంద్రాల్లో 15,50,002 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. సెప్టెంబర్ 3, 4, 6, 7, 8 తేదీల్లో జరిగే రాత పరీక్షకు 7 జిల్లాల్లో 536 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 40, విశాఖలో 56, పశ్చిమ గోదావరిలో 38, కృష్ణాలో 90, నెల్లూరులో 85, చిత్తూరులో 120, అనంతపురం జిల్లాలో 107 పరీక్షా కేంద్రాల్లో 6,19,812 మంది పరీక్ష రాయనున్నారు. రాత పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే రాతపరీక్షలు ప్రశాంతంగా, సక్రమంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. పరీక్షల నిర్వాహణపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో కలిపి ఆయన బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రశ్నాపత్రాలను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచి, ప్రత్యేక ఎస్కార్టుతో ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షల తరహాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలను సైతం పకడ్బందీగా నిర్వహించాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. -
వార్డు సచివాలయాల పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలకు భారీ ఎత్తున అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఎలాంటి ప్రభుత్వ సేవలైనా గ్రామం నుంచే పొందేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ సచివాలయాలు ప్రారంభమైతే రెవెన్యూ, పంచాయతీ, పోలీసు, వైద్యం, మత్స్యశాఖ, ఉద్యాన, వ్యవసాయ తదితర శాఖలకు చెందిన సేవలు ఒకేచోట అందనున్నాయి. జిల్లాలో గ్రామ సచివాలయాలు 933, వార్డు సచివాలయాలు 511 కలిసి 11,025 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి 1.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు పరీక్ష రాయనుండడంతో ఆరు రోజుల పాటు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 1, 3, 4, 6, 7, 8 వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా పరీక్షలు నిర్వహించనుంది. మండలానికి దగ్గరలోనే పరీక్ష కేంద్రం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కేంద్రాల చిరునామా విషయంలో ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష నిర్వహణ నిమిత్తం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్, డిగ్రీ, జూనియర్ కళాశాలతో పాటు వివిధ పాఠశాలలను కేంద్రాలుగా గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు 380 కేంద్రాలను అధికారులు గుర్తించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులంతా సొంత మండలాల్లో పరీక్ష రాసే అవకాశం లేదు. ప్రతి అభ్యర్థికి తనకు దగ్గరలో ఉన్న మండలాన్ని గుర్తించి అక్కడే పరీక్ష రాసేలా హాల్ టికెట్ కేటాయించనున్నారు. గూగుల్‌లో లింక్.. సొంత మండలాల్లో పరీక్ష రాసేందుకు అవకాశం లేకపోవడంతో పరీక్ష కేంద్రం చిరునామా విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రతీ పరీక్ష కేంద్రాన్ని ఆన్లైన్ చేస్తున్నారు. అభ్యర్థి తాను పరీక్ష రాయనున్న కేంద్రం పేరు గూగుల్‌లో నమోదు చేస్తే చిరునామాతో పాటు కేంద్రానికి ఎలా చేరుకోవాలో గూగుల్ మ్యాప్‌లో చూపించేలా లింక్ దొరుకుతుంది. దీంతో పరీక్షకు నిర్ణీత సమయంలో చేరుకోవడంతో పాటు, సమయం కలిసొస్తుంది. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు భారీ ఎత్తున నిర్వహిస్తున్న పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. కెమెరాలు అందుబాటులో లేని పక్షంలో వీడియోగ్రాఫర్ల సహాయంతో పరీక్షలను వీడియో తీయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే ఇన్విజిలేటర్లుగా నియమించే అవకాశం ఉంది. ప్రలోభాలకు తావులేదు..! గత కొన్నేళ్లుగా ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన ఖాళీలన్నీ భర్తీ చేస్తుండడాన్ని కొంతమంది అక్రమార్కులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఒక్కో జాబుకు ఒక్కో మొత్తాన్ని ముట్టజెప్పితే ఉద్యోగం ఇప్తిస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించడంతో పాటు ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్ సీట్లు భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద పోలీసులు పట్టిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నారు. డబ్బులిస్తే ఉద్యోగం ఇస్తామని చెబితే నమ్మొద్దని, అలాంటి వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి రెండు సంవత్సరాల పాటు ప్రొబెషనరీ పీరియడ్‌గా పరిగణించి రూ.15 వేలు అందజేయనున్నారు. ఆ తర్వాత శాశ్వత వేతన స్కేలును ప్రభుత్వం వర్తింపజేయనుంది. -
గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంచుతున్నట్లు మున్సిపల్ శాఖ ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. వరదల కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని అభ్యర్థులు గడువు పెంచమని కోరారని అధికారులు తెలిపారు. వారి అభ్యర్థన మేరకు దరఖాస్తుల గడువును ఈ నెల 11 (రేపు ఆదివారం) అర్థరాత్రి 12గంటల వరకు పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో 13 జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆదివారం రాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 1,26,728 ప్రభుత్వోద్యోగాల భర్తీకి నిర్వహించే రాతపరీక్షకు దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. శనివారం సాయంత్రం నాటికి 21 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. మరోక రోజు గడువు పెంచడంతో 22 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 19 రకాల ఉద్యోగాలను నాలుగు రకాలుగా వర్గీకరించి.. వాటికి సెప్టెంబరు 1, 8 తేదీలలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేర్వేరుగా రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకేసారి లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టింది. పూర్తి పారదర్శకంగా, ఎలాంటి సిఫార్సులకు తావు లేకుండా రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాలకు మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. అయితే, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు అభ్యర్థుల దగ్గర నుంచి వసూళ్లు ప్రారంభించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంవో) వర్గాలు తాజాగా స్పష్టం చేశాయి. ఆఖరికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఉద్యోగాలు ఇప్పించలేరని తేల్చిచెప్పాయి. సిఫార్సులకు ఆస్కారం లేకుండా మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇంటర్వ్యూలు పెట్టలేదని వెల్లడించాయి. -
సచివాలయ పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పులు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. అభ్యర్థుల నుంచి వచ్చిన సూచనల మేరకు పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 1, మధ్యాహ్నం నిర్వహించాల్సిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ 2), వార్డుల కనీస సౌకర్యాల కార్యదర్శి (గ్రేడ్ 2) పరీక్షలను సెప్టెంబర్ 7 ఉదయానికి వాయిదా వేశారు. వార్డు శానిటేషన్, పర్యావరణ కార్యదర్శి పరీక్షను సెప్టెంబర్ 8, ఉదయం నుంచి అదే రోజు మధ్యాహ్నానికి మార్చారు. మిగిలిన పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మారిన పరీక్షల షెడ్యూల్ ఇలా.. సెప్టెంబర్ 1, ఉదయం పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, పిల్లల సంరక్షణ సహాయకురాలు, సంక్షేమం, విద్య సహాయకులు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి సెప్టెంబర్ 1, మధ్యాహ్నం గ్రామీణ రెవెన్యూ ఆఫీసర్, గ్రామీణ సర్వేయర్, గ్రామీణ వ్యవసాయ సహాయకులు, గ్రామీణ ఉద్యావన సహాయకులు, గ్రామీణ మత్యశాఖ సహాయకులు, పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సహాయకులు, పశుసంవర్థకశాఖ సహాయకులు, వార్డు ఆరోగ్య కార్యదర్శులు (మహిళలు), గ్రామీణ సెరీకల్చర్ సహాయకులు సెప్టెంబర్ 7, ఉదయం ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డుల కనీస సౌకర్యాల కార్యదర్శి సెప్టెంబర్ 8, ఉదయం వార్డు ప్రణాళిక, నియంత్రణ కార్యదర్శి, వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి సెప్టెంబర్ 8, మధ్యాహ్నం వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వార్డు శానిటేషన్, పర్యావరణ కార్యదర్శి