'సచివాలయ ఉద్యోగాల మెరిట్‌ లిస్ట్‌లు సిద్ధం’ | Merit List Of Grama Sachivalayam Recruitment Prepared | Sakshi
Sakshi News home page

ఈ నెల 23 నుంచి 27 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌

Published Sat, Sep 21 2019 2:00 PM | Last Updated on Sat, Sep 21 2019 2:06 PM

Merit List Of Grama Sachivalayam Recruitment Prepared - Sakshi

సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల మెరిట్‌ లిస్ట్‌లు సిద్ధం చేశామని మున్సిపల్‌శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. మెరిట్‌ లిస్ట్‌ను జిల్లాల కలెక్టర్లకు పంపినట్లు వెల్లడించారు. ఈనెల 21 నుంచి 23 వరకు ఎంపికైనన అభ్యర్థులకు కాల్‌ లెటర్‌ పంపిస్తామని, అభ్యర్థులకు ఈ-మెయిల్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా కూడా సమాచారం అందుతుందని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాలని, ధరఖాస్తులో చెప్పిన అర్హత, కుల ధృవీకరణ, క్రీమిలేయర్‌, నివాస సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.

ఈ నెల 23 నుంచి 25 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని, ఈ నెల 27న అభ్యర్థులకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం 20 బృందాలను ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక ఏ అభ్యర్థి ఎక్కడ ఉద్యోగం చేయాలన్నది నిర్ణయిస్తామని, 60 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేశామని మున్సిపల్‌ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement