
సాక్షి, విజయవాడ : అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే లక్షన్నర ఉద్యోగాలు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు కొత్తగా ఎంపికైన గ్రామ సచివాలయ ఉద్యోగులు. సోమవారం సీఎం జగన్ చేతుల మీదుగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ.. సీఎం జగన్ చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్ తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ఫీజు రియింబర్స్‌మెంట్ వల్ల చదువుకున్నామని, ఇప్పుడు ఆయన తనయుడు జగనన్న తమకు ఉద్యోగాలు ఇచ్చారని ప్రశంసించారు. అవినీతి రహిత పాలనకు గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీయే నిదర్శనమన్నారు. ప్రభుత్వం తమకు అప్పగించిన పనిని సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తామని చెప్పారు.
(చదవండి : సేవ చేయడం కోసమే ఉద్యోగం: సీఎం జగన్ )
గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్షల్లో అర్హత సాధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తై ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం జగన్ సోమవారం నియామక పత్రాలు అందజేశారు. విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, తదితరులు హాజరయ్యారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment