సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి ఒకేసారి 1.34 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతగా.. ఆయన పుట్టినరోజైన డిసెంబర్ 21న గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి తెలిపారు. గతేడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని, ఈసారి మరింత ఉత్సాహంతో వేడుకలు నిర్వహించాలని ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.
(చదవండి: అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు)
సచివాలయాల సిబ్బంది అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సచివాలయ ఉద్యోగులెవ్వరూ ప్రొబేషన్ డిక్లరేషన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలిచ్చిందని చెప్పారు. కొత్త పీఆర్సీ కూడా వర్తిస్తుందని అధికారులు తెలియజేశారని పేర్కొన్నారు.
(చదవండి: పరిశ్రమల ఖిల్లా ఆ జిల్లా.. రెండున్నర ఏళ్లలో ఆరు వేల ఉద్యోగాలు)
గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయ వ్యవస్థను సృష్టించి లక్షలాది ఉద్యోగాలు కల్పించడమే కాకుండా.. ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఇస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ఉద్యోగులు రుణపడి ఉంటారన్నారు.
చదవండి: AP: అప్రమత్తతే ఆయుధం: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment