
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. అభ్యర్థుల నుంచి వచ్చిన సూచనల మేరకు పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 1, మధ్యాహ్నం నిర్వహించాల్సిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ 2), వార్డుల కనీస సౌకర్యాల కార్యదర్శి (గ్రేడ్ 2) పరీక్షలను సెప్టెంబర్ 7 ఉదయానికి వాయిదా వేశారు. వార్డు శానిటేషన్, పర్యావరణ కార్యదర్శి పరీక్షను సెప్టెంబర్ 8, ఉదయం నుంచి అదే రోజు మధ్యాహ్నానికి మార్చారు. మిగిలిన పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మారిన పరీక్షల షెడ్యూల్ ఇలా..
సెప్టెంబర్ 1, ఉదయం పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, పిల్లల సంరక్షణ సహాయకురాలు, సంక్షేమం, విద్య సహాయకులు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి
సెప్టెంబర్ 1, మధ్యాహ్నం గ్రామీణ రెవెన్యూ ఆఫీసర్, గ్రామీణ సర్వేయర్, గ్రామీణ వ్యవసాయ సహాయకులు, గ్రామీణ ఉద్యావన సహాయకులు, గ్రామీణ మత్యశాఖ సహాయకులు, పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సహాయకులు, పశుసంవర్థకశాఖ సహాయకులు, వార్డు ఆరోగ్య కార్యదర్శులు (మహిళలు), గ్రామీణ సెరీకల్చర్ సహాయకులు
సెప్టెంబర్ 7, ఉదయం ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డుల కనీస సౌకర్యాల కార్యదర్శి
సెప్టెంబర్ 8, ఉదయం వార్డు ప్రణాళిక, నియంత్రణ కార్యదర్శి, వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి
సెప్టెంబర్ 8, మధ్యాహ్నం వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వార్డు శానిటేషన్, పర్యావరణ కార్యదర్శి