సాక్షి, అమరావతి: సన్న, చిన్న కారు రైతులకు ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకం ద్వారా ఉచిత బోర్ వెల్స్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు గ్రామీణాభివృద్ది శాఖ ప్రకటించింది. నవరత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీని అమలుకు సంబంధించి శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల్లోని వివరాలు ఇలా ఉన్నాయి.
► బోరు డ్రిల్లింగ్ కార్యకలాపాలు చేపట్టే ముందు సంబంధిత రైతు పొలంలో హైడ్రో–జియోలాజికల్, జియోఫిజికల్ సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాతే బోరు బావుల నిర్మాణ ప్రక్రియ మొదలు పెట్టాలి.
► భూగర్భ జల మట్టం ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు గుర్తించిన 1,094 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకాన్ని అమలు చేయరు.
అర్హతలు, విధివిధానాలు..
► రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి ఉండాలి. అంత భూమి లేకపోతే పక్కనున్న రైతులతో కలిసి గ్రూపుగా ఏర్పడవచ్చు. ఒక రైతుకు గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండవచ్చు. ఈ అర్హతలు ఉన్న రైతులు బోరు బావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అంతకు ముందు ఆ భూమిలో ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు.
► అర్హత కలిగిన లబ్ధిదారుడు పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా నేరుగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
► పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం తదుపరి అనుమతికి ఎంపీడీవోకు ఆ దరఖాస్తు వెళుతుంది. జిల్లా మొత్తంలో ఎంపిక చేసిన రైతుల జాబితాలను డ్వామా పీడీలకు ఎంపీడీవోలు అందజేస్తారు.
► బోరు బావి మంజూరు అనంతరం ఆ çసమాచారాన్ని గ్రామ సచివాలయం ద్వారా రైతుకు తెలియజేస్తారు.
2.5 ఎకరాలకు ఒక ఉచిత బోరు
Published Sat, Jul 4 2020 5:18 AM | Last Updated on Sat, Jul 4 2020 5:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment